ఈ రోజు వివేకానంద జయంతి.
మకర సంక్రాంతి పండుగ.. భోగి, సంక్రాంతి, కనుమ..సందర్భంగా సూర్యారాధన చేస్తారు.
గోదా దేవి రంగనాధస్వామి వార్ల కల్యాణం జరుగుతుంది.
శబరిమలై అయ్యప్పస్వామి మకర జ్యోతి దర్శనం ఉంటుంది .
ఈ విశేషాల సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.
......................
ఈ మధ్య ఒక సందేహం కలిగింది. వినాయకచవితి పుస్తకంలో, శమంతకమణికధలో..శ్రీకృష్ణులవారికి జాంబవంతుడు ఉయ్యాలలో ఉన్న తన కుమార్తెను వివాహం చేసారని ఉంటుంది. ఉయ్యాలలో చిన్నపిల్ల ..అన్నట్లు నాకు అనిపించింది. అలా చిన్నపిల్లను వివాహం చేయడమేమిటని సందేహం కలిగింది.
అవి యుగాలనాటి విషయాలు. కాలక్రమేణా గ్రంధాలలో ఎన్నోమార్పులుచేర్పులు జరిగి , ఆ కధలో జాంబవతి చిన్నపిల్లలా వ్రాసి ఉండవచ్చనిపించింది.
ఇంకా ఏమనిపించిందంటే, జాంబవతి కొంత పెద్ద అమ్మాయే అనిపిస్తుంది. పెద్దపిల్లలు ఊయల ఊగుతారు కదా..ఆ మణిని ఆ అమ్మాయి ఊయలపైన అలంకారంగా ఉంచారేమో? కొత్తవారిని చూసి జాంబవతి, ఆమె దగ్గర ఉన్నవాళ్లు కొంచెం కంగారుపడి ఉంటారు. అరణ్యంలో ఆమె కొత్తవారిని చూడటం తక్కువకదా..
ఆ యుగంలో అప్పటి జీవుల ఆయుర్దాయం ఎన్నో వందల సంవత్సరాలంటారు, వారి ఆకారాలు భారీగా ఉండేవట.(డైనోసార్లు కూడా ఆకారం భారీగా ఉండేవని అంటారు కదా అలా..) అప్పటి విషయాల గురించి అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు సరిగ్గా అర్ధంకాకపోవచ్చు.
పిల్లలకు సందేహాలు కలిగినా పైకి చెప్పలేరు కాని, లోపల అయోమయపడతారు. అందువల్ల, పిల్లల్ని పురాణేతిహాసాలు చదవమనే కన్నా, అపార్ధాలు రాకుండా పెద్దవాళ్లు సమాధానాలు చెప్పగలగాలి.
.....................................
No comments:
Post a Comment