భూమిని గురించి శ్రీదేవీ భాగవతము గ్రంధము ద్వారా ఎన్నో విషయములు తెలుసుకోవచ్చు.కొన్ని విషయములు ఏమిటంటే..
ఈ వసుంధరను వరాహస్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మునులూ మనువులూ స్తుతించారు.వీరి కుమారుడు మంగళుడు. ఇతని కుమారుడు కుంభసంభవుడు.
పంచీకరణమార్గంలో మూలప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర వరాహావతార కాలంలో వారాహిగా అర్చింపబడింది.
............
హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూగోళాన్ని ప్రళయజలధి నుంచి ఉద్ధరించడం కోసం శ్రీహరి వరాహావతారం ధరించాడు. తన బంగారుకోరతో భూమిని పైకి లేవనెత్తి నీటిమీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు.
ఈ వసుంధరను వరాహస్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మునులూ మనువులూ స్తుతించారు.
వరాహస్వరూపుడైన విష్ణుమూర్తి భూదేవికి వరాన్ని ఇవ్వటం జరిగింది ...
సర్వాధారా!శుభస్వరూపిణీ! వసుంధరా!ఈ రోజునుంచీ నువ్వు దేవదానవ మానవకోటులందరి చేతా పూజింపబడతావు.శంకుస్థాపనలు చెయ్యాలన్నా గృహప్రవేశాలు జరగాలన్నా వాపీకూపతటాకాదుల్ని నిర్మించాలన్నా వ్యవసాయం మొదలుపెట్టాలన్నా -మానవులందరూ ముందుగా నిన్ను అర్చిస్తారు. అంబువాచీ త్యాగదినాన తప్పక పూజలు అందుకుంటావు.ఇది నా వరం.అర్చించని మూఢులు నరకానికి పోతారు.ఇది నా శాపం.
(ప్రతినెలా ఆర్ద్రా నక్షత్రం నుంచి మూడురోజులు భూదేవికి అంబువాచి అనిపేరు. ఆ మూన్నాళ్లు భూమిని దున్నరాదని నియమం.)
ఈ వరానికి సంతోషించిన వసుధాదేవి వరాహస్వామిని మరొక్క వరం అడిగింది.
నాధా! నీ ఆజ్ఞను శిరసావహించి ఈ చరాచరజగత్తును అంతటినీ నేను భరిస్తాను. కానీ ముత్యము, ఆల్చిప్ప, హరిపూజా ద్రవ్యాలు,శివలింగము, శివామూర్తి, శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞసూత్రము, పుష్పము, పుస్తకము, తులసీదళము, జపమాల, పుష్పమాల, కర్పూరము, బంగారము, గోరోచనము, చందనము, సాలగ్రామము -వీటిని మాత్రము భరించలేను. కాబట్టి వీటిని ఎవ్వరూ సాక్షాత్తుగా నామీద ఉంచకుండా నాకు సమర్పించకుండా కట్టడి చెయ్యమని అభ్యర్ధించింది. శ్రీహరి సమ్మతించాడు.ఈ ద్రవ్యాలను నీకు సమర్పించిన వారూ నీమీద సాక్షాత్తుగా ఉంచినవారూ నరకానికి పోతారని శాసించాడు. ..అటుపైని వసుంధర గర్భిణియై మంగళుడిని ప్రసవించింది.
నారదా! అప్పటినుంచి అందరూ శ్రీహరి ఆజ్ఞ మేరకు కాణ్వశాఖోక్త ప్రకారంగా భూమిపూజ చేస్తున్నారు.
కాణ్వశాఖోక్తమైన స్తవనం కూడా ఒకటి ఉంది.అది కూడా శ్రీహరి ప్రోక్తమే.
నారదా! ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూదానఫలం లభిస్తుంది. భూమిదాన హరణ పాపం నశిస్తుంది.అంబువాచీ భూఖనన పాపమూ అంతరిస్తుంది...అంటూ నారాయణమహర్షి ఎన్నో విషయాలను తెలియజేసారు.
*******************
ఈ విషయాలను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.
భూదేవి పుత్రుడు మంగళుడు.. అనే విషయాన్ని గమనిస్తే భూమికి మంగళగ్రహానికి పోలికలు ఉంటాయనే విషయం తెలుస్తుంది.
ఆధునిక శాస్త్రవేత్తలుకూడా మంగళగ్రహానికి భూమికి పోలికలున్నాయని అంటున్నారు కదా!

ఇంకా....
అంబువాచీ రోజులలో భూమిని త్రవ్వరాదని మరియు ఎన్నో విషయాలు తెలుస్తాయి.
ఆధునిక కాలంలో అనేకకారణాలతో రోజూ భూమిని త్రవ్వుతున్నారు.
అంబువాచీ దినాలలో భూమిని త్రవ్వరాదని నియమాలను పాటించేవారు ఎందరు?
మనుషులు తమ అవసరాలకోసం భూమిని విచ్చలవిడిగా తవ్వటం ఎప్పుడైనా సరైనది కాదు.
No comments:
Post a Comment