ఈ రోజుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య బాగా పెరిగింది. కిడ్నీవ్యాధులు రావటానికి ఎన్నో కారణాలుంటాయి.
అయితే, ఉద్దానం వంటి ప్రాంతాలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది.
అక్కడ నీటిలో..సిలికా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయని కొందరు పరిశోధకులు అన్నట్లు వార్తలు వచ్చాయి.
సిలికా కొద్ది మోతాదులో శరీరానికి మంచిదే కానీ, ఎక్కువ మోతాదులో శరీరంలో ప్రవేశిస్తే మాత్రం కిడ్నీలు దెబ్బతినటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు.
ఇలాంటప్పుడు.. ఈ సమస్య ఉన్న ప్రాంతాలలో అయినా కుటుంబానికి కనీసం రోజుకి రెండు బిందెల శుభ్రమయిన నీరు.. త్రాగటానికి, వంటకు అందించగలిగితే నీటి కాలుష్యం వల్ల వచ్చే జబ్బులు తగ్గుతాయి.
అందువల్ల ప్రభుత్వాలు.. కిడ్నీ వ్యాధులు ఎక్కువ వస్తున్న ప్రాంతాలు మరియు ఫ్లోరైడ్ నీరు ఉన్న ప్రాంతాలలో విరివిగా నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలి.
ప్రస్తుతం కిడ్నీ వ్యాధి మొదటి దశలో కనుక్కోవటం కొంచెం కష్టం. అయితే కిడ్నీ వ్యాధి ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో ప్రజలకు తరచూ వైద్య పరీక్షలు చేస్తే వ్యాధి మరీ ముదరకముందే కనుగొని మందులు ఇవ్వవచ్చు.
కిడ్నీలు పాడయినవారికి భవిష్యత్తులో కృత్రిమ కిడ్నీలను అమర్చే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయంటున్నారు.
ఈ పరిశోధనలు ఫలిస్తే కిడ్నీ దాతల కోసం వేచి చూసే సమస్య ఉండకపోవచ్చు.
అయితే, ట్రాన్స్ ప్లాంటేషన్ తరువాత కూడా కొన్ని సమస్యలు ఉంటాయట. అందువల్ల కిడ్నీలు పాడవకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం.
కిడ్నీ వ్యాధికి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయంటున్నారు.
డయాలసిస్ స్థాయిలో కూడా డయాలసిస్ తో పాటూ పునర్నవ వంటి మందులు వాడుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు.
వ్యాధిఉన్నవారు ఒక్కొక్కరికి వివిధ స్థాయిలలో వ్యాధి ఉండవచ్చు.
అయితే, మందులు వాడేటప్పుడు తోచినట్లు వాడటం కాకుండా, తమ అనారోగ్యం పరిస్థితిని బట్టి మందులను ఎంత మోతాదులో, ఎంతకాలం వాడాలో వంటి విషయాలను ఆయుర్వేద నిపుణుల సలహాతో వాడటం మంచిది.
ఆసక్తి ఉన్నవారు ఈ క్రింద ఇచ్చిన లింకులను .. కాపీ..పేస్ట్.. క్లిక్ చేసి చూడగలరు.
nattu vaithiyam telugu part 3 genimi tv
How to Avoid dialysis – Herbal Treatment for Kidney failure
No comments:
Post a Comment