ఈ రోజుల్లో కొందరు స్త్రీలు, పురుషులు స్వేచ్చగా కలిసి జీవించటాన్ని ఇష్టపడుతున్నారు.
అంటే ఇక్కడ చెబుతున్నది.. జీవితాంతం కలిసి జీవించటం కాకుండా, ఇష్టం ఉన్నంతవరకు మాత్రమే కలిసి జీవించటం ,...ఇష్టం పోయినప్పుడు ఎవరికి వారు విడిపోవటమనే పద్దతి.
మరి పెద్దవాళ్లు తమ ఇష్టం వచ్చినప్పుడు విడిపోయినప్పుడు, వాళ్ళకు జన్మించిన సంతానం సంగతేమిటి ?
బాధ్యతలు వద్దంటూ వివాహబంధానికే కట్టుబడని వాళ్లు సంతానం యొక్క బాధ్యతను తీసుకుంటారా ? తీసుకోరా?
సంతానాన్ని రోడ్దుమీదో లేక అనాధశరణాయంలోనో వదిలివెళ్లిపోతే ఆ పిల్లల కష్టాలకు ఎవరు బాధ్యులు ?
కొన్నిదేశాలలో అయితే, ఇలాంటి వాళ్లకు జన్మించిన పిల్లల బాధ్యతను ప్రభుత్వాలే తీసుకుంటాయట. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రభుత్వ సంరక్షణలో పెరుగుతారు.
ప్రభుత్వాలే పిల్లల్ని పెంచాలి..అంటే ఇక ప్రజలు ఏం చేస్తారు? పిల్లల్ని కని సమాజం మీద వదిలేస్తారా? ఇలాంటి వాళ్లు పిల్లల్ని కనకుండా ఉంటే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.
కుటుంబ సంబంధాలు లేని ఇలాంటి జీవనవిధానం నాగరికత అవుతుందా ? స్వేచ్చ అంటే ఇదేనా ?
అంటే ఇక్కడ చెబుతున్నది.. జీవితాంతం కలిసి జీవించటం కాకుండా, ఇష్టం ఉన్నంతవరకు మాత్రమే కలిసి జీవించటం ,...ఇష్టం పోయినప్పుడు ఎవరికి వారు విడిపోవటమనే పద్దతి.
మరి పెద్దవాళ్లు తమ ఇష్టం వచ్చినప్పుడు విడిపోయినప్పుడు, వాళ్ళకు జన్మించిన సంతానం సంగతేమిటి ?
బాధ్యతలు వద్దంటూ వివాహబంధానికే కట్టుబడని వాళ్లు సంతానం యొక్క బాధ్యతను తీసుకుంటారా ? తీసుకోరా?
సంతానాన్ని రోడ్దుమీదో లేక అనాధశరణాయంలోనో వదిలివెళ్లిపోతే ఆ పిల్లల కష్టాలకు ఎవరు బాధ్యులు ?
కొన్నిదేశాలలో అయితే, ఇలాంటి వాళ్లకు జన్మించిన పిల్లల బాధ్యతను ప్రభుత్వాలే తీసుకుంటాయట. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రభుత్వ సంరక్షణలో పెరుగుతారు.
ప్రభుత్వాలే పిల్లల్ని పెంచాలి..అంటే ఇక ప్రజలు ఏం చేస్తారు? పిల్లల్ని కని సమాజం మీద వదిలేస్తారా? ఇలాంటి వాళ్లు పిల్లల్ని కనకుండా ఉంటే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.
వివాహం కుటుంబం, బాధ్యతలు అక్కరలేని లైంగిక జీవితమే నాగరికత అంటున్నారు, యువత కొంతమంది దానికే ఆకర్షితులూ అవుతున్నారు, కాలం లో మార్పు తప్పదు, చూసి బాధ పడటం మినహా చేయగలదీ ఉండదు, కాని ఆగలేక, చూడలేక చెప్పడమూ అవహేళన కు గురికావడమూ జరుగుతూ ఉంటుంది. నదీనాం సాగరో గతిః. ఆకాశంబందుండి శంభునిశిరంబందుండి...........వివేక భ్రష్ట సంపాతముల్....
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteసమాజం లో జరుగుతున్న ఎన్నో విషయాలు బాధను కలిగిస్తున్నాయి. మన అభిప్రాయాలను చెప్పటంలో తప్పేమీ లేదండి.