koodali

Friday, June 26, 2015

స్వదేశం..విదేశం..


ఈ మధ్య కాలంలో విదేశాలలో స్థిరపడుతున్నభారతీయుల సంఖ్య పెరిగింది.

చదువుకోసమో లేక ఉద్యోగరిత్యానో కొంతకాలం విదేశాలకు వెళ్లటం అన్నది ఫరవాలేదు. అయితే అక్కడే స్థిరపడిపోవటం అంటే ఎన్నో విషయాలను ఆలోచించుకోవలసి ఉంటుంది.
........................

ఇప్పుడు తెలుగువాళ్ల మధ్య జరుగుతున్న గొడవలు చూస్తున్నాము  కదా!  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కానీ, ఒకప్పుడు  తరతరాలుగా తెలుగువాళ్లు అందరికీ చెందిన ప్రాంతం.

తెలుగువాళ్ళు  సాటి తెలుగువాళ్ళనే భరించలేకపోతున్నారు. మా ప్రాంతంలోకి  వచ్చి మా  ఉద్యోగావకాశాలను తీసుకోవద్దు .. అంటున్నారు.

 ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్యే ఇన్ని గొడవలు ఉన్నప్పుడు, మరి భారతదేశం నుంచి  విదేశాలకు  వెళ్లి  అక్కడ  స్థిరపడే వాళ్ళ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?
........................

విదేశాల్లో స్థానికులకు, వలసవాదుల వల్ల  తమకు ఉపాధీ అవకాశాలు తగ్గుతున్నాయనే  ఆలోచనలు బలపడినప్పుడు అక్కడకు వెళ్లిన స్థిరపడిన భారతీయుల పరిస్థితి ఏమిటి ?

 ( బహుశా వాళ్లు  అక్కడ రెండవతరగతి పౌరులుగా రాజీపడిపోయి బ్రతకవలసి ఉంటుందేమో.)

ఒకే భాష మాట్లాడే ప్రజలే తమలో తాము  సర్దుకుపోలేక  రాష్ట్ర విభజన వరకు పరిస్థితి వెళ్ళినప్పుడు,  విదేశాల వాళ్ళు పరాయి దేశాల వాళ్ళతో ఎందుకు సర్దుకుంటారు ?
...............

  విదేశాల్లో ప్రస్తుతం  అంతా బాగానే ఉన్నట్లు అనిపించవచ్చు.  అయితే, భవిష్యత్తులో పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం. 

విదేశాల్లో కొన్నిసార్లు  అంతర్యుద్ధాలు సంభవించినప్పుడు...  అక్కడి భారతీయులను భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకురావటం జరిగింది . 
......................

ఇంకో విషయం ఏమిటంటే, ఒక దేశానికి ఇంకో దేశానికీ మధ్య ఏమైనా సంఘటన జరిగి స్నేహం చెడిపోయి శత్రుత్వం పెరిగినప్పుడు, అక్కడ స్థిరపడ్ద వలసవాదులను అడ్దుపెట్టుకుని వలసవాదుల మాతృ దేశాన్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలూ ఉన్నాయి.

అలాగని చెప్పి విదేశాల్లో స్థిరపడ్ద కొద్దిమంది కోసం స్వదేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టలేరు . 
.............

విదేశాల వారు తమకు  పనిచేసే వ్యక్తులు అవసరం అయినప్పుడు వలసలను వారే ప్రోత్సహిస్తారు. వలస వచ్చిన వారిని బాగానే ఆదరిస్తారు.

 కాలం గడిచేకొద్దీ  అక్కడి  స్థానికులలో వలసవాదుల పట్ల అసహనం పెరగనూ వచ్చు. ఎక్కడి నుంచో   మా ప్రాంతం వచ్చి , ఆస్తులు కొనుక్కుని సుఖపడుతున్నారని స్థానికులలో అక్కసు పెరిగే అవకాశమూ ఉంది. 
........................

 పరాయి ప్రాంతానికి వెళ్లినప్పుడు  చిన్నపాటి ఉపాధి చూసుకుని బ్రతికితే ఎక్కువ సమస్యలు రాకపోవచ్చు.

 అక్కడ స్థిరపడి, ఆర్ధికంగా పుంజుకుని ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవటం మొదలుపెడితే మాత్రం స్థానికులలో వలసవాదుల పట్ల నిరసన మొదలయ్యే అవకాశం ఉంది.

ఇలాంటప్పుడు..వలసవాదుల సంతతి వాళ్లు తమ పెద్దవాళ్ల మాతృ దేశానికి తిరిగివెళ్లలేక , తాము పుట్టి, పెరిగిన దేశంలో రెండవ తరగతి పౌరులుగా జీవించలేక నలిగిపోతుంటారు. 
 ............

మాతృదేశంలో సౌకర్యాలు లేవని చెప్పి పరాయి దేశం  వెళ్లి అక్కడే స్థిరపడటం కన్నా, ఎవరి దేశాన్ని వాళ్లు చక్కదిద్దుకోవటం సరైన పని.
ఈ నిర్ణయం ..  మన ఇల్లు బాగోలేదని చెప్పి , పొరుగు ఇల్లు చక్కటి సౌకర్యాలతో ఉందని చెప్పి అక్కడే ఉండిపోవాలి...  అనుకోవటం లాంటిది .    
...................

పొరుగువాళ్లకు మనతో అవసరం ఉన్నంతవరకూ మనతో మంచిగా ఉంటారు. 
ఇంకో దేశం నుంచి వచ్చి మా ఉపాధులను లాక్కుంటున్నారు ..అనే అభిప్రాయం పెరిగినప్పుడు వలసవెళ్లిన వాళ్లు అక్కడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులను కూడా వదిలి  కట్టుబట్టలతో స్వదేశానికి తిరిగివచ్చే పరిస్థితి కూడా రావచ్చు.
.........

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు భారతదేశంలో తమకున్న సంబంధాలను కొనసాగిస్తూ ఇక్కడ కూడా ఆస్తిపాస్తులను ఏర్పరుచుకుంటే మంచిది. 

 ఎప్పుడయినా భవిష్యత్తులో విదేశాల్లో  పరిస్థితి తారుమారైతే స్వదేశంలో మన కంటూ ఒక  స్థానం ఉంటుంది కదా!



6 comments:

  1. మీరు చెప్పిన వన్నీ జనరల్ గ కరెక్టే గానీ చాలా వరకు వలస పోయిన దేశం బట్టి ఉంటుంది. అమెరికా దేశం అయితే ఇక్కడ నివసించే వాళ్ళందరూ ఒకప్పుడు వలస వచ్చిన వారే. కాకపోతే జలసీ అంటారా ఏదేశమైనా మాతృ దేశమైనా ఒకటే.

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    స్థానికులు, వలసవాదుల విషయంలో ఏ దేశ ప్రజల భావాలలోనైనా చాలా పోలికలుంటాయి.

    ఒక భాష వారే సర్దుకోలేకపోతున్నప్పుడు వేరే దేశాల వాళ్లు సర్దుకుపోతారా?
    ........
    సమైక్యాంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో ఇప్పుడు ప్రపంచంలో చాలామందికి తెలుసు.

    ఇవన్నీ చూసి మా ఉద్యోగాలు మాకే దక్కాలి.ఇక్కడకు వచ్చి మా ఉపాధి అవకాశాలను దెబ్బదీసి, ఇక్కడ ఆస్తులు సంపాదించుకుంటున్నారు, భారతదేశం నుంచి మా దేశాలకు వలస వచ్చిన వాళ్ళు మీ దేశానికి మీరు వెళ్లిపొండి అన్నా ఆశ్చర్యం లేదు.

    అమెరికా సంగతి ఏమిటంటే, అక్కడి స్థానికులైన రెడ్ ఇండియన్ల పై యూరోప్ దేశాల నుంచి వచ్చిన వారు పై చేయి సాధించారు. వీళ్ళే స్థానికులయ్యారు. వీళ్ళు అమెరికాను ఆధునిక దేశంగా తయారుచేసామని చెపుతారు.

    అలాగని వీళ్ళు ఆసియా నుంచి వచ్చిన వారిని శాశ్వత స్థానికులుగా తమతో కలుపుకుంటారో ? లేదో ? చెప్పలేం.
    ...........

    ఆ మధ్య జరిగిన అందాల పోటీలో భారత సంతతికి చెందిన అమ్మాయి గెలిచినప్పుడు అక్కడి స్థానికులు ఫేస్బుక్ ద్వారా తమ నిరసనను, అక్కసును తెలియజేసారు కదా ! ఇలాంటి మరికొన్ని సంఘటనలూ జరిగాయి.
    .........

    ఎంతైనా మాతృదేశం అంటే మాతృదేశమే. మాతృదేశంలో ఎన్ని జెలసీలు ఉన్నా ఆ స్వాతంత్ర్యము స్వాతంత్ర్యమే.

    భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రోజుల్లో ఎవరూ చెప్పలేరు. మాతృదేశంలో కూడా మనకంటూ కొంత స్థానాన్ని నిలుపుకుంటే లాభమే తప్ప.. నష్టమేమీ ఉండదండి.

    ReplyDelete
  3. మీరు వద్దన్నారు కనుక తెలంగాణా ఆంద్ర విషయాలపై వ్యాఖ్యానించను.

    వలసలు, ముఖ్యంగా విదేశీ వలసలు, ఎందుకు జరుగుతాయన్న విషయానికి వీటితో సంబంధం లేదు కనుక నా అభిప్రాయం చెప్తాను. అఫ్కోర్స్ మీరు ఒప్పుకోవాలా లేదా అని నేను నిర్ణయించలేను.

    1. వలసలకు రెండు ముఖ్య కారణాలు: ప్రతిభకు గుర్తింపు & ఉపాధి అవకాశాలు.

    2. తగు గుర్తింపు రాని అత్యంత ప్రతిభావంతులు (5%) విదేశాలకు వెళ్ళడం వల్ల మనకు తీరని లోటు కలిగింది. దీనికి మన దేశ అహేతుక విధానాలే కారణం. వీటిని మార్చాల్సిన అవసరం ఉంది.

    3. ఉపాధి కోసం వెళ్ళేవారిని కూడా తప్పు పట్టడం కష్టం. ముఖ్యంగా చాలీ చాలని బతుకులు ఈడుస్తున్న వారు (70%) గల్ఫ్ దేశాలలో కొన్నేళ్ళు ఉంటే ఇల్లు, పిల్లల చదువు/పెళ్ళిళ్ళు లాంటి ముఖ్య అవసరాలు తీర్చుకోగలుగుతున్నారు. మన అవసరాలకు సరిపోయే అభివృద్ధి నమూనా లేకపోవడం దీనికి ముఖ్యకారణం. పదో తరగతి చదువుకున్న వారికి ఎన్ని సాఫ్టువేర్ కంపనీలు వచ్చినా లాభం లేదన్న వాస్తవం గుర్తిస్తే తప్ప పరిస్తితి మారదు

    4. వలసలలో అందరికీ కన్పించేది ఎగువ మధ్య తరగతి ఆఫీస్ ఉద్యోగులవి (25%). వీరు చదువుకున్న వారు, కొద్దోగొప్పో ప్రయోజకులు, సమాజంలో మంచి పొసిశన్లొ ఉన్నవారు, మన దేశంలో ఉన్నా తమ కాళ్ళపై తాము నిలబడగలిగిన వారు. వీరి వలసలకు ప్రేరేపణ ఇంకా పైకి (ఉ. పెద్ద ఇల్లు, ఖరీదయిన కార్లు) ఎదగాలన్న కోరిక. దీన్ని కూడా తప్పు ఎంచలేము కానీ వీరు తమ పరిస్తితులను ఎదురుకొనే సమర్తులు కనుక వారే సమస్యలను పరిష్కరించాలని కోరడం సబబు.

    ReplyDelete
  4. వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీరన్నట్లు ప్రతిభకు గుర్తింపు లేక కొందరు, ఉపాధి అవకాశాలు లేక కొందరు, మరింత డబ్బు సంపాదించుకోవటానికి కొందరు విదేశాలకు వెళ్తున్నారు.ఇక్కడి ప్రతిభావంతులు కొందరు తమ ప్రతిభకు గుర్తింపు లేకపోవటం వల్ల విదేశాలకు వెళ్లి అక్కడ తమ ప్రతిభను నిరూపించుకున్న సంఘటనలూ ఉన్నాయి. ప్రతిభావంతులను వదులుకోవటం ఎంతో తప్పు. .
    ................

    మనకేమీ తెలియదు.విదేశాల వారికే అన్నీ తెలుసు.అనే అభిప్రాయం భారతీయులలో ఎక్కువగా ఉంది. భారతీయులు తమ ప్రతిభను తాము గుర్తించాలి. విదేశాల మీద ఆధారపడటం తగ్గించుకోవాలి..
    ................

    విదేశాలకు అసలే వెళ్ళకుండా జరగదు. అక్కడి వాళ్లు ఇక్కడకు, ఇక్కడి వాళ్లు అక్కడకూ వెళ్లిరావచ్చు. అయితే ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం.

    భారతీయులలో ఎంతో మార్పు రావాలన్నది నిజమే. అయితే మన దేశాన్ని బాగు చేసుకోవాలంటే ఎవరో చేయరు కదా ! మన దేశాన్ని మనమే బాగు చేసుకోవాలి. మన ఇంట్లో సమస్యలు ఉంటే ప్రక్కింటి కెళ్లి కూర్చుంటే పొరుగిల్లు మన ఇల్లు అవదు కదా !

    పాతకాలంలో భారతదేశం విదేశాల పాలనలో ఉన్నప్పుడు అప్పటి వాళ్ళు తమ సొంత సుఖాలను కూడా కొంతవరకూ త్యాగం చేసి దేశం కోసం పాటుబడ్దారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది.

    ReplyDelete
    Replies
    1. "మనకేమీ తెలియదు.విదేశాల వారికే అన్నీ తెలుసు.అనే అభిప్రాయం భారతీయులలో ఎక్కువగా ఉంది"

      అక్షరలక్షలు విలువ చేసే మాట చెప్పారు.

      "అయితే ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది"

      నా ఉద్దేశ్యంలో ఒక ముఖ్య కారణం ఇతరులతో పోలికలు చేసుకోవడం. పక్కింటి అబ్బాయి అమెరికా వెళ్ళాడు నేను వెళ్ళకపోతే నలుగురిలో నామోషీ అన్న భావన పోవాలి. తన ప్రతిభను పనితనంతో చూపిస్తే చాలు ఇతరుల మెప్పుకోలు కోసం తపన పడడం అనవసరమని మనవాళ్ళకు అర్ధం కావాలి.

      Delete
  5. అవునండి, ఇతరులతో పోల్చుకోవటం ఎక్కువయ్యింది.
    ...........
    భారతదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా.. కొన్ని కారణాల వల్ల తప్పనిసరి అయిన పరిస్థితిలో కొందరు వెళ్తున్నారు.

    విదేశాలపై మోజుతో ..అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనీ, అక్కడ ఎక్కువ సౌకర్యాలు ఉంటాయనే ఆశతో వెళ్తున్నారు కొందరు.

    తీరా వెళ్లాక అక్కడ పరిస్థితి బాగోలేకపోయినా, తిరిగి ఇండియాకు వస్తే నవ్వుతారేమోననే భయంతో ప్రెస్టేజ్ వల్ల అక్కడే ఉంటారు కొందరు.
    ...........

    పిల్లలకు విదేశాలకు వెళ్లటం ఇష్టం లేకపోయినా .. కొందరు తల్లితండ్రులే తమ పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నారు.

    కొందరు పెద్దవాళ్లకు తమ పిల్లలు విదేశాలకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా.. పిల్లలే వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు.

    కొందరు పిల్లలు ఏమంటారంటే , అక్కడ కొంతకాలం ఉండి డబ్బు సంపాదించి తిరిగి వచ్చేస్తామని అంటారు.
    ( అయితే, అక్కడ జీతాలు ఎక్కువ అయినా.. వస్తువుల ధరలూ ఎక్కువేనట.)

    ఇండియాలో తక్కువ జీతమైనా.. ఇక్కడ వస్తువుల ధరలు విదేశాలతో పోలిస్తే తక్కువే.

    అలాంటప్పుడు, ఇండియాలో తక్కువ జీతమైనా.. విదేశాల్లో ఎక్కువ జీతమైనా ఒకటే కదా!

    ఈ విషయం గురించి మా బంధువులతో .... ఇక్కడ బాగానే ఉన్నాకూడా విదేశాలకు వెళ్ళటం దేనికని అడిగితే...

    ఇక్కడ అత్తా, ఆడబడుచుల బారి నుండి తప్పించుకోవటానికి వెళ్తుంటారని జవాబు చెప్పారు.ఇలా ఎవరి కారణాలు వారు చెబుతున్నారు.

    భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.

    ReplyDelete