యోగాను అందించిన అందరికీ వందనములు.
యోగా అందరికీ అందాలన్నది మంచి ఉద్దేశ్యమే. అయితే, యోగాసనాలు ఎలా పడితే అలా చేయటం కాకుండా , యోగాసనాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వారి వద్ద నేర్చుకుని చేయటం మంచిది.
తెలిసితెలియని వారివద్ద నేర్చుకోవటం లేకపోతే పుస్తకాలు చూసి ఆసనాలను చేయటం వల్ల అంత మంచిఫలితాలు రాకపోగా కొన్నిసార్లు వ్యతిరేక ఫలితాలూ వచ్చే అవకాశం ఉంది.
సరైన విధివిధానాలు తెలిసిన వారి ద్వారా నేర్చుకుని పాటించినప్పుడు తేడాలు రాకుండా చక్కటి ఫలితాలను పొందవచ్చు.
అనారోగ్యం ఉన్న వ్యక్తి మెడికల్ షాపుకు వెళ్లి మందులు వేసుకోవటం కన్నా, వైద్యుని సలహా తో మందులు వేసుకోవటం మరింత మంచిది కదా!
............................
యోగా అన్నది కేవలం శారీరిక ఆరోగ్య పరిరక్షణకు మాత్రమే కాదు ... .యోగా ద్వారా వ్యక్తులు శారీరికంగానూ, మానసికంగానూ కూడా ఉత్తమ వ్యక్తులుగా తయారుకావాలి.
యోగా అంతిమలక్ష్యం.... ఉన్నతమైన వ్యక్తిగా తయారుకావటం..ముక్తిని పొందటం.
అంతేకానీ, ఆసనాలు నేర్చుకుని ఆరోగ్యాన్ని పొంది, ఆ ఆరోగ్యంతో విచ్చలవిడిగా విలాసంగా జీవించటం కోసం యోగా నిర్దేశించబడలేదు.
......................
యోగా అంటే కేవలం ఆసనాలు వేయటం మాత్రమే కాదు. అహింస, సత్యం, ....వంటివీ ఉన్నాయి.
ఈ విషయాలను పాటించటం గురించి ఎక్కువమంది ఎక్కువ ఆసక్తి చూపించటం లేదు కానీ, శారీరికఆరోగ్యం కోసం మాత్రం ఆసనాలను నేర్చుకుంటున్నారు.
యోగా ద్వారా శారీరిక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ పొంది, వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులుగా తయారుకావాలి. నైతికవిలువలు పెంపొందించుకుని మంచి వ్యక్తులుగా ఎదగాలి .
No comments:
Post a Comment