విదేశాలకు తరలిపోయిన నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి తీసుకురావటం అనేది ఆచరణలో ఎంతవరకూ నెరవేరుతుందో తెలియదు కానీ,
నల్లధనాన్ని కూడబెట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే....దేశంలోని సంపద నల్లధనంగా మారకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం కూడా ఎంతో అవసరం.
అధికపన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే , పన్నుఎగవేతల ద్వారా ప్రభుత్వానికి వచ్చే నష్టమే ఎక్కువ.
ఇలాంటి చర్యల వలన దేశంలో డబ్బు విదేశాలకు తరలటం తగ్గి, విదేశాలలో దాచుకున్న డబ్బు తిరిగి ఇండియాలో పెట్టుబడిగా మారే అవకాశం ఉందనిపిస్తోంది..
...................
నల్లడబ్బు సమస్య పరిష్కారానికి సామరస్యపూర్వక చర్యలు చేపడుతూనే.. ఎంత చెప్పినా మాట విననివారిపట్ల కఠినంగానూ వ్యవహరించాలి.
స్వచ్చ భారత్ పిలుపు ఇచ్చినట్లే దేశాభివృద్ధిలో భాగం కావాలని ధనవంతులకూ పిలుపునిస్తే బాగుంటుందేమో..
...............
మనదేశంలో పెట్టుబడులు పెట్టాలని ... మనవాళ్ళు విదేశాలకు వెళ్ళి మరీ అక్కడి వాళ్ళను ప్రాధేయపడుతుంటారు.
విదేశాల వాళ్ళు వచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టినా లాభాలను వాళ్ళ దేశాలకు తీసుకు వెళ్ళిపోతారు.
అలా కాకుండా, భారతీయుల వద్ద అపారంగా ఉన్న పెట్టుబడులతో దేశంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి , సంపద దేశంలోనే ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి.
....................
దేశంలో ఎందరో పేదప్రజలున్నారు. పరిస్థితి ఇలా ఉండగా..
మరి కొందరు ప్రజలు దేశాన్ని దోచి తమ తరతరాలకూ సరిపడా సంపదను కూడబెట్టడం అనేది ద్రోహం....ప్రజలలో నైతికవిలువలు నశించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి.
చిన్నతనం నుంచి పెల్లలకు నైతికవిలువలతో కూడిన విద్యను అందించటం ద్వారా.. చక్కటి పౌరులు తయారయినప్పుడు మాత్రమే దేశంలోని ఎన్నో సమస్యలు తగ్గుతాయి.
No comments:
Post a Comment