koodali

Wednesday, October 22, 2014

మేము సోలార్ ఇన్వెర్టర్ ఏర్పాటుచేసాము..


కొంతకాలం  క్రితం  మేము  సోలార్ ఇన్వెర్టర్  తీసుకున్నాం.

   అంతకుముందు ,   మా  బంధువులు  మరియు  చుట్టుపక్కల  వాళ్ళు  సోలార్ ఇన్వెర్టర్   సరిగ్గా  పనిచేయదని  చెపుతూ , అది  కాకుండా  మామూలు  ఇన్వర్టర్  కొనమని  ఒత్తిడి  చేసారు. 

 సోలార్  ఇన్వెర్టెర్  మాత్రమే  వాడాలని  గట్టి పట్టుదలతో  ఉన్న  మాకు  ఈ సమాచారం  కొంత  ఆందోళనను  కలిగించింది.  

తీరా  కొన్నాక  అది  సరిగ్గా  పనిచేయకపోతే  ఎలా ? అని  సందిగ్ధంలో  పడ్డాము.

మరి  కొంతమందిని  కూడా  సోలార్  గురించి  వివరాలు  కనుక్కున్నాము.

కష్టేఫలే బ్లాగ్  శర్మ  గారు  కూడా  వారి  ఇంటికి  సోలార్  అమర్చినట్లు   వారి  బ్లాగులో  వ్రాసారు.  వారు  వ్రాసిన  విషయాలను  చదివిన  తరువాత  ధైర్యం  వచ్చింది. 

ఎలాగైతేనేం ,  మేము    సోలార్  ఇన్వెర్టెరే  ఏర్పాటుచేసాము.  ఇప్పటివరకూ  అది   చక్కగా  పనిచేస్తూంది.  ఎటువంటి  సమస్యా  రాలేదు.

........................

 సోలార్  విద్యుత్  వల్ల  విద్యుత్  కొరత  తీరటం  సంతోషకరమైన విషయమే.   అయితే , ఈ  విషయాన్ని  ఇంకో  కోణం  నుంచి  ఆలోచిస్తే  విద్యుత్  ఎక్కువగా  లభిస్తే  కొన్ని  నష్టాలూ  ఉన్నాయనిపిస్తుంది. 

ఉదా..  సోలార్  విద్యుత్ ఎక్కువగా  ఉంది  కదా  అని  విపరీతంగా  పరిశ్రమలను  నెలకొల్పితే ,  పర్యావరణ  కాలుష్యం  పెరిగిపోతుంది,  ఖనిజవనరులు  కూడా త్వరగా  అయిపోతాయి.


 ఖనిజవనరులు  ఎంతో   అమూల్యమైనవి. ప్రకృతిలో  ఖనిజవనరులు  ఏర్పడాలంటే  ఎన్నో  వేల , లక్షల   సంవత్సరాలు  పడుతుందట. 

 ఖనిజాలను  త్రవ్వి  వాడేయటానికి  మాత్రం  కొద్ది  సంవత్సరాలు  చాలు.


 కొందరు  ఇతరదేశాల  వాళ్ళు  తమకు  భవిష్యత్తులో  ఖనిజవనరుల  కొరత  రాకుండా ,  ముందుచూపుతో  తమ  దేశంలోని  గనులను  త్రవ్వకుండా ,  పొరుగుదేశాల  నుంచి  ఖనిజాలను  దిగుమతి  చేసుకుంటున్నారట. 

మనమేమో  విచ్చలవిడిగా  గనులను  త్రవ్వి  ఖనిజాలను  వెలికి తీసేస్తున్నాము. 
...................

సోలార్  విద్యుత్  ఉంది  కదా  అని  నిరంతరాయంగా  వాడేస్తూ  ఉంటే  వాతావరణంలోకి  వెలువడే  రేడియేషన్  వల్ల  ఓజోన్  పొర  దెబ్బతింటుంది. 
................

ప్రపంచ  క్షేమం కోసం  విద్యుత్ ను ,  ఖనిజవనరులను  పొదుపుగా  వాడుకోవాలి. అప్పుడు  పర్యావరణం  కాలుష్యం ఎక్కువగా  జరగకుండా ఉంటుంది.  ఖనిజాలూ వెంటనే  తరిగిపోకుండా  ఉంటాయి. 
...............

ఇవన్నీ  వట్టి  భయాలు.   ఖనిజాలు  ఎందుకు  అయిపోతాయిలే ... అని  అనుకుంటే  భవిష్యత్తులో  ఇబ్బందులు  తప్పవు. 

గత  కొన్ని  సంవత్సరాల నుంచి  వాడుతూన్న  పెట్రోల్  వంటి  ఇంధనవనరులు  అయిపోతుండగా...  మరికొన్ని  సంవత్సరాలకు  ఖనిజవనరులు  మాత్రం  అయిపోవా  ఏమిటి. 

 ఖనిజవనరులు అయిపోయినా   ఫర్లేదు,  పర్యావరణం  కాలుష్యం  అయినా   పర్లేదు ..  అంటే  మాత్రం  దానికి  తగ్గ  ఫలితాన్ని  అనుభవించ వలసి  వస్తుంది  మరి. 


4 comments:

  1. అనురాధ గారు,
    మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.
    చాలా మంచి పని చేశారు, నిజంగానే మేము సంవత్సరం నుంచి చాలా సుఖపడుతున్నాం. నిరుడు వేసవిలోనూ, మొన్న తుఫానులోనూ చాలా ఉపయోగపడింది.వివరాలివ్వలేదు కనక చెప్పలేను కాని చక్కహా పని చేస్తుంది. సోలార్ మూలంగా పర్యావరణం చెడదు, మనిషి మూలంగానే చెడుతుంది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా దీపావళి శుభకామనలండి.

    సోలార్ ఇన్వర్టర్ ఏర్పాటుచేసుకున్నప్పటి నుంచి మాకు కూడా బాగుంది.

    ధర్మల్ విద్యుత్, అణు విద్యుత్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. వాటికన్నా సోలార్ విద్యుతే నయం.

    సూర్యుని వేడి తక్కువగా ఉండే దేశాల వాళ్ళే సోలార్ విద్యుత్ కు ప్రాముఖ్యతను ఇస్తున్నారు.

    సూర్యుని వేడి ఎక్కువగా ఉండే మనదేశం , అణు విద్యుత్ కాకుండా సోలార్ విద్యుత్కు ప్రాముఖ్యతను ఇవ్వాలి.

    ReplyDelete
  3. ఇక్కడ అమెరికాలో ఇంట్లో సోలార్ విద్యుత్ మిగిలితే పవర్ కంపెనీ వాళ్ళు కొనుక్కుంటారు. అట్లా ఉందేమో అక్కడ చూడండి. పడిన శ్రమకి ఖర్చుకి డబ్బులు తిరిగి వస్తాయి.
    మాకు దివాలి లేటుగా వస్తుంది. మీకు మా దీపావళి శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

    అమెరికాలోనే చక్కగా సోలార్ విద్యుత్ వాడుతుంటే , సంవత్సరంలో ఎక్కువ భాగం ఎండ కాసే భారత దేశంలో అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటుచేయటం ఎంతో విచారకరం.

    భారత్ లో కూడా సోలార్ విద్యుత్త్ పట్ల ఆసక్తి పెరుగుతోంది.

    ఇక్కడ కూడా మీరు తెలియజేసినటు వంటి సోలార్ విద్యుత్ పరికరాలు లభిస్తున్నాయండి. ఇలాంటి సోలార్ పరికరాలు ఉన్నవారి వద్ద సోలార్ విద్యుత్ మిగిలితే ఇతరులకు కూడా అమ్మవచ్చట.

    అయితే, మా దగ్గర ఉన్న సోలార్ ఇన్వర్టర్ మరీ ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసేటంతటిది కాదండి.

    ReplyDelete