ఓం,
ఈ రోజు ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి.
దైవం సర్వాంతర్యామి. దైవాన్ని ఏ రూపంతోనయినా, ఏ నామంతోనయినా ఆరాధించుకోవచ్చు.
( నిరాకారంగా కూడా ఆరాధించుకోవచ్చు.)
వినాయకుడు, అమ్మవారుఅయ్యవారు, షిర్డిసాయి. .ఇలా ఏ పేరుతో , ఏ రూపంతో ఆరాధించుకున్నా మన ఆరాధనలు చేరేది సర్వాంతర్యామి అయిన దైవానికే.
**********
పాపవిమోచన పొందుట….
మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుద్ధిని మరలించనప్పుడు , తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వార కూడ ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు………షిర్డి సాయిబాబా వారు ఇలాంటి ఎన్నో అపురూపమైన విషయాలను తెలియజేశారు.
ఈ రోజుల్లో ఎందరో భక్తులు విపరీతమైన కోరికలతో భక్తిమార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. కష్టాలలో ఉన్నప్పుడు లేక కొన్నిసార్లు కోరికలు కోరుకోవటం మానవనైజం.
అయితే తమ పిల్లలు అదేపనిగా స్వార్ధపరమైన కోరికలతో విసిగిస్తే తల్లితండ్రులకైనా విసుగు వస్తుంది కదా !
కోరికలు కోరేముందు అందుకు తగ్గ అర్హతను సంపాదించుకోవాలని ఒక బోధకులు తెలియజేశారు.
అర్హత ఏమీ లేకుండానే తేరగా పెద్దపెద్ద కోరికలు కోరే స్వార్ధపరులైన భక్తుల సంఖ్య ఈ రోజుల్లో బాగా పెరిగిన మాట వాస్తవం.
అయితే మొదట కోరికల కోసం భక్తి మార్గాన్ని ఆశ్రయించినా క్రమంగా కోరికలను తగ్గించుకునే స్థాయికి వచ్చే అవకాశమూ ఉంది.
అంతా దైవం దయ.
ఈ బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి అనేక ధన్యవాదాలండి.

వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
..............................................
..............................................
సాయిబాబా పుట్టుకతో ఏ మతస్తులో ఎవరికీ తెలియదు. సాయిబాబాను గత కొన్ని సంవత్సరాలుగా ఎందరో పూజిస్తున్నారు. కొందరు హిందువులు కూడా బాబా వారి గురించి ప్రజలలో ప్రచారం చేసారు. బాబావారి విధానాలు తేలికగా ఉండి హిందువులను ఆకర్షించాయి.
చాలామంది హిందువులు తమ దేవతలతోపాటు బాబావారినీ ప్రార్ధించుకోవటం జరిగింది. అలాంటప్పుడు బాబాను పూజించకూడదు.. అంటే చాలామందికి ఏంచేయాలో తెలియక ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టసుఖాలలో హిందూ దేవతలతోపాటే బాబాకు కూడా తమ కష్టసుఖాలను చెప్పుకునేవారు.
కొందరు హిందువులలో కూడా చాలా గొడవలున్నాయి. శైవులు, వైష్ణవుల మధ్య అనేక గొడవలు జరిగాయి. శివుడు గొప్ప అంటే కొందరు వైష్ణవులు ఒప్పుకోరు. విష్ణువు గొప్ప అంటే కొందరు శైవులు ఒప్పుకోరు. అమ్మవారు గొప్ప అంటే కొందరు ఒప్పుకోరు.

కొందరు హిందువులు మాత్రం ..అమ్మవారు శివుడు విష్ణువు..అని తేడాలు లేకుండా చక్కగా దైవాన్ని ఆరాధించుకుంటారు.
అయితే, సాయిబాబా విగ్రహం పాదాల వద్ద శివుడు, విష్ణువు వంటి దేవతల విగ్రహాలను పెట్టకూడదు. పక్కన పెట్టుకోవచ్చు. హిందూ దేవాలయాల్లో కూడా ఏ దేవత పాదాల వద్ద కూడా ఇంకో దేవతల విగ్రహాలను పెట్టకూడదు.
అయితే, సాయిబాబా విగ్రహం పాదాల వద్ద శివుడు, విష్ణువు వంటి దేవతల విగ్రహాలను పెట్టకూడదు. పక్కన పెట్టుకోవచ్చు. హిందూ దేవాలయాల్లో కూడా ఏ దేవత పాదాల వద్ద కూడా ఇంకో దేవతల విగ్రహాలను పెట్టకూడదు.
***************
మీరు ఎప్పటికైనా కలెక్టరు అవుతారండి అవుతారు.
ReplyDeleteకన్నీళ్ళు తుడుచుకుంటూ......................
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteనాకు కలెక్టర్ కావాలనే ఇంట్రస్ట్ ఏమీ లేదండి.
బావుంది
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteమరికొన్ని విషయాలను వ్రాయాలనిపించి టపాను వ్రాశానండి.
బీజాక్షరం అంటే ఏమిటో నిర్వచిస్తారా, దయచేసి? అలాగే, కొన్ని బీజాక్షరాలతో కూడిన నామములను ఉదాహరించగలరు.
ReplyDeleteధన్యవాదాలు!
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి,
ReplyDeleteబీజాక్షరముల గురించి నాకు తెలిసింది తక్కువ. తెలిసినంతలో వ్రాయటానికి ప్రయత్నిస్తానండి..
ఈ విషయాల గురించి శ్రీ దేవీ భాగవతము వంటి గ్రంధాలలో వివరములున్నవి.
..............................
మీరు విషయం తెలుసుకోవాలని జిజ్ఞాసతో అడిగినందుకు సంతోషంగా ఉంది.
అయితే, బీజాక్షరములు వంటి విషయముల గురించి నాకు తెలిసినంతలో విషయాలను సరిగ్గా వ్రాయాలన్నా , పబ్లిక్ గా బ్లాగులో వ్రాయటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
( ఇలా వ్రాసానని అపార్ధం చేసుకోవద్దు. దయచేసి క్షమించండి. )
నాకు తెలిసినంతలో, కొన్ని విషయాలను తెలియజేస్తాను.
అన్ని అక్షరములు శక్తివంతమైనవే. స్వచ్చమైన భక్తితో పలికితే ప్రతి అక్షరమూ గొప్ప ఫలితాన్ని అందిస్తుంది.
ఓం అనేది బీజాక్షరమేనంటారు. అలాంటప్పుడు ఓం కారముతో కూడిన దైవ నామము బీజాక్షరముతో కూడిన నామమే అవుతుందనుకుంటున్నాను.
బీజాక్షరం మరియు బీజాక్షరములతో కూడిన నామములను గురించిన వివరములను తెలుసుకున్నప్పుడు , వాటిని జపించాలంటే కొన్ని నియమాలను పాటించాలేమో ? అని నాకు అనిపించిందండి.
ఉదా... శ్రీ మాత్రే నమః, ఓం నమఃశివాయః, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాటి నామములు చెయ్యాలంటే కొన్ని నియమములు పాటించాలేమోనని నాకు అనిపించిందండి.
{ నియమములు పాటించాలో అవసరం లేదో నాకు తెలియదు. }
అలా పాటించటం నావల్ల అవుతుందో ? లేదో ?........... ఎందుకులే అనుకుని , ప్రస్తుతం వీలు కుదిరినప్పుడల్లా ఓంకారం లేకుండా .....సాయిసాయి అనుకుంటున్నాను.
నేను కొంతకాలం క్రితం ఒక నామాన్ని ... తీసుకున్నాను. ( ఈ నామాన్ని మాత్రం వీలు కుదిరినప్పుడు పూజ చేసే సమయాలలో మాత్రం ...అనుకుంటాను. )
అన్ని వేళలా శుచిగా ఉండటం ఎలా కుదురుతుంది ? ( అయితే, మనశ్శుద్ధి కలవారు ఎప్పుడూ శుచిగా ఉన్నట్లే.... )
నాకు వీలు కుదిరినప్పుడల్లా సాయిసాయి అనుకుంటాను.
శుచి మరియు అశుచి ......... ఇలా అన్ని సమయములలోను సాయి నామమునకు ఎటువంటి పట్టింపులు లేవు కదా ...........అని ఇలా చేస్తున్నాను.
షిర్డి సాయి తెలియజేసిన విషయములలో కొన్ని విషయములు...
ఎల్లప్పుడు సాయిసాయి యని నీవు జపించినచో నిన్ను సప్తసముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసించుము. నీవు తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పనిలేదు. షోడశోపచారములు గాని, అష్టాంగ యోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి యున్నచోటనే నా నివాసము...అని తెలియజేశారు.
ప్రాచీన గ్రంధములలో కూడా దైవ నామ స్మరణము యొక్క గొప్పదనము గురించి చెప్పబడినది.
ముఖ్యముగా కలియుగములో దైవకృపను పొందటానికి దైవనామ స్మరణ చక్కటి ఉపాయమని పెద్దలు తెలియజేశారు.
ధన్యవాదములండి.
It is always easier to live in a bubble of contentment than critically examining the basis of your religious beliefs.
ReplyDeleteStay happy!
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఊరు వెళ్ళి వచ్చామండి.
ఈ రోజే మీ వ్యాఖ్యను చూశాను. రిప్లై ఇవ్వటంలో ఆలస్యం జరిగినందుకు దయచేసి క్షమించండి.