koodali

Wednesday, July 10, 2013

జగన్నాధ రధయాత్ర .... పురాణేతిహాసాల గురించి కొన్ని విషయములు....

 
ఓం,
ఈ  రోజు  జగన్నాధ  రధయాత్ర......
శ్రీ జగన్నాధస్వామి వారికి, శ్రీ బలభద్ర స్వామివారికి , శ్రీ సుభద్ర అమ్మ వారికి  అనేక  నమస్కారములు....

...................
వేదములు ,పురాణేతిహాసములు  చాలా గొప్పవి. వీటి గురించి మనము అర్ధం చేసుకున్నది చాలా తక్కువ. అని నా అభిప్రాయము.

వాటిలో ఎన్నో అంతుపట్టని ఆథ్యాత్మిక విషయాలు, వైజ్ఞానిక విషయాలు, సామాజిక విషయాలు.. ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.
 

  ప్రాచీనకాలపు పెద్దలు ,  పురాణేతిహాసములలో  ఎన్నో  విషయాలను సంకేతరూపములో ఉంచి ,  భద్రంగా మనకు అందించారని  ఈనాటి పెద్దల అభిప్రాయం. వాటిని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటం మన దురదృష్టం. 

అందులోని కధలను కొంతమంది అపార్ధం చేసుకుంటున్నారు.



పురాణేతిహాసాల ద్వారా పెద్దలు , మనకు  అవసరమైన  అన్ని విషయాలను  తెలియజేసారు. 

 రావణాసురుని  లేదా దుర్యోధనుని   ఇంకా   భూమి మీద రాక్షసులను, చెడ్డ శక్తులను  సంహరించాలంటే దైవానికి   చిటికెలో  పని.

కానీ అలా చంపకుండా .....


రామాయణం, భారతం వంటి ఇతివృత్తాల ద్వారా....ఎన్నో కధలను, అందులో పాత్రధారులను కల్పించి , వారి జీవితాల ద్వారా..వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇంకా ...

ఏది ధర్మం ? ఏది అధర్మం? వంటి ఎన్నో విషయాలను,   ఎంతో  విజ్ఞానాన్ని ...పురాణేతిహాసాల ద్వారా ,  దైవం   లోకానికి అందించటం జరిగిందని  అనిపిస్తుంది.
.......

 పురాణములలో సృష్టి ఎలా జరిగింది..... ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయంట.

నవగ్రహములు  గురించి మనవారికి ఎప్పుడో తెలుసు.  గ్రహాల గురించి విషయాలు, అవి ఎన్ని యోజనముల దూరంలో ఉంటాయి..  వంటి  విషయాలను  ప్రాచీన కాలం నాటి  పెద్దలు తెలియజేసారు కదా !

 పంచాంగం ప్రకారము   రాబోయే  గ్రహణాలను  సరిగ్గా  అంచనా  వేసి,
ఏ యంత్ర  సహాయం  లేకుండానే  సంవత్సరానికి  ముందే  పండితులు చెప్పగలుగుతున్నారు  కదా ! 

 (ఇలా సరిగ్గా చెప్పగలగటం సైన్స్ కాదా ?)
...............

ఇంకా,  పురాణేతిహాసాలలోని  పాత్రల ద్వారా  పెద్దలు మనకు ...... జీవితములో మనము ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు...వంటి విషయాలను  కూడా తెలియచేశారు.

 ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకోసారి  అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తితోపాటు  బంధువులు .. ఆ వ్యక్తి  రాజు అయితే  రాజ్యంలోని  ప్రజలు  కూడా  ఎన్ని కష్టాలను  అనుభవించే   అవకాశాలున్నాయో..వంటి  విషయాల  గురించి  కూడా మనము తెలుసుకోవచ్చు.


....................................................
 దైవం యొక్క ఈ విశ్వ సృష్టిలో ఎన్నో పాలపుంతలు, గ్రహాలు, గొప్పవయిన కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ......... ఇలా మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి.

ఈ అనంత విశ్వంలో మన సూర్యకుటుంబం ఒక భాగం ....... అందులో మన భూమి ఒక భాగం. ఆ భూమిమీది  మానవులం మనమెంత... మన బ్రతుకెంత. .......ఆ దేవుని దయవల్ల ఏ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టకపోబట్టి ఇలా బ్రతుకుతున్నాము.


అంతా  దైవం  దయ.....

3 comments:

  1. మంచి మాటలు చెప్పేరు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.
    అంతా దైవం దయ.

    ReplyDelete
  3. మీకు కృతజ్ఞతలు. .
    అయితే నాకు కంప్యూటర్ గురించి అంతగా తెలియదండి.

    ( తెలుసుకోవటానికి నేనూ అంతగా ప్రయత్నించలేదు. బ్లాగ్ వ్రాయటం వరకు నాకు పని జరుగుతోంది కదా ! అని. )

    మా ఇంట్లో వాళ్ళకు వీలు కుదిరినప్పుడు కంప్యూటర్లో మార్పులుచేర్పులు చేయటానికి నాకు సహాయం చేస్తుంటారు.

    ReplyDelete