koodali

Saturday, July 13, 2013

పురాణేతిహాసాల గురించి మరికొన్ని అభిప్రాయాలు...

 
 జన్మల బంధం నుండి విముక్తి చెందాలంటే   యుక్తవయస్సులోనే  కుమారుడూ, భార్య, కుటుంబం బంధాలు వదలుకోవాలని కృష్ణుడు   బోధించలేదు  .

 కృష్ణుడు తో  సహా  పెద్దలు  ఏం  చెప్పారంటే,   ఒక  క్రమంలో  చతురాశ్రమ  పద్ధతిలో  చక్కగా  జీవించి  మోక్షాన్ని  పొందమన్నారు.  విద్యార్ధి  దశ,  గృహస్థ  దశ,  వానప్రస్తం,  తరువాతే  సన్యాసాశ్రమం  చెప్పారు.

చిన్న  వయస్సులోనే  శుకుల  వారు  సన్యాసాశ్రమం  స్వీకరిస్తానంటే   వ్యాసులవారు  అభ్యంతరం   చెప్పారు. 

....................

" ఒక  యోగి  ఆత్మ  కధ " గ్రంధములో  ఏం  చెప్పారంటే ,  ఈ  రోజుల్లో   అడవులకు  వెళ్ళటం  వంటివి  అందరికి  కుదరవు  .  కాబట్టి,   ఇంట్లోనే  ఉంటూ  కూడా  మోక్షాన్ని  పొందటానికి    నిష్కామయోగాన్ని  చక్కగా   అవలంబించవచ్చు..   అనే  అర్ధం  వచ్చే  విధంగా 
చెప్పారు.  
.......................................

భారతయుద్ధం   జరగటం  ద్వారా  ఎందరో  దుష్టులైన   వారి    పీడ  ప్రజలకు  వదిలింది.

భూమిపై  పాపాత్ములు  పెరిగిపోయారని  భూదేవి  దేవతల  వద్ద  మొరపెట్టుకోగా ,  మహాభారత  యుద్ధం  జరిగి ,  ఆ  యుద్ధంలో  ఎందరో  దుష్టులైన   రాజులు,  ప్రజలు    ప్రాణాలను  కోల్పోయారు.  


భూదేవి   భాదపడటానికి  ముందే,  భూమిపై  పాపాత్ములు  పెరిగిపోవటం  చూసి  భారత  యుద్ధానికి  చక్కటి   ప్రణాళిక  రచించి  అమలుచేయించిన  వారు  ఆదిపరాశక్తి.

భారతయుద్ధం  జరగకపోతే  భూమికి  పాపాత్ముల  భారం  తగ్గదు.  అందువల్ల  భారతయుద్ధం  జరగాలని  ఆ  యుద్ధంలో  ఎందరో  పాపాత్ములు  చనిపోవాలన్నదే   శ్రీ  కృష్ణునితో  సహా  దేవతల  ప్రణాలిక.  


సంధి కి  దుర్యోధనుడు,  జరాసంధుడు,  వంటి   దుష్టులైన    రాజులు  ఒప్పుకోరని  కృష్ణునికి  ముందే  తెలుసు.  
............................


సృష్టిలోని  ఏ  పదార్ధాన్ని,  శక్తిని  సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని  ఆధునిక  శాస్త్రవేత్తలు  కూడా  ఒప్పుకున్నారు.  ఆ  సూత్రం  ప్రకారం  చూసినా  జన్మలు,  పునర్జన్మలు  ఉంటాయి .  


పునర్జన్మలు  ఉన్నాయని  కొందరు  ఆధునిక  శాస్త్రజ్ఞులు  ప్రయోగాల  ద్వారా  నిరూపించారు  కూడా. 

 అయితే  కొందరు  హేతువాదులు  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పే  విషయాలలో  తమ  వాదనకు    అనుకూలమైన  వాటినే  స్వీకరిస్తారు. 
.............................

ఎంతో  పని  వత్తిడిలో  ఈ  వ్యాసాన్ని  వ్రాశాను.  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



2 comments:

  1. అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమె భామినీ అని సినీకవి చెప్పేరు. అన్ని దశలూ దాటి రావాలి అది సహజంగా, నాలు ఆశ్రమాలూ అనుభవించాలి.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    పనివత్తిడి వల్ల ఆలస్యంగా జవాబు వ్రాస్తున్నాను. మన్నించండి.
    మీరన్నది నిజమే,అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమె...

    అయితే, ఆదిశంకరాచార్యుల వంటి కొందరు కారణజన్ములు లోకకళ్యాణం కొరకే భూమిపై జన్మను ధరిస్తారు. అలాంటివారు మాత్రం ఇహలోకబంధాలకు అతీతులు.

    ReplyDelete