అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండీ. (కులమతాలతో సంబంధం లేకుండా దేశం కోసం అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ...)
..............................................
శ్రీరాముడు శంభూకుని వధించటానికి మనకు తెలియని ఇతరకారణాలు కూడా ఉండవచ్చు. శంభూకుని చరిత్ర మనకు తెలియదు. అతని పూర్వ కర్మ ఎలాంటిదో మనకు తెలియదు.
కష్టాలు తీరటానికి తపస్సులు, పూజలు అన్ని కులాలవారు చేస్తారు.
అయితే, శంభూకుడు బొందితో స్వర్గానికి వెళ్ళాలని తపస్సు చేస్తున్నట్లుగా ఒక దగ్గర చదివాను.
హరిశ్చంద్రుని తండ్రి అయిన త్రిశంకుడంతటి వారినే బొందితో స్వర్గానికి రావటానికి మొదట ఇంద్రుడు అంగీకరించలేదు.
పరిశీలిస్తే ఇక్కడ కులం అన్నది సమస్య కాదనిపిస్తుంది.
..........................
ఆదిశంకరుల వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా అంటరానితనం తప్పు అని తెలిసింది. , రాముల వారు శబరి, గుహుడు మొదలైవారిని చక్కగా ఆదరించారు. ఇవన్నీ చూస్తే .....
పెద్దలే ఇలా స్పష్టంగా తెలియజేస్తుంటే మరి అంటరానితనం పాటించటం అనేది తప్పే. అసలు అందరు మానవులు, పశుపక్షాదులతో సహా కశ్యపుని సంతానమేనట. .
......................................
దైవపూజలు, పాలనలో రాజుకు సలహాలను ఇవ్వటం, వైద్యం ఇవన్నీ చేయటానికి సత్వగుణం ప్రధానంగా అవసరం. ఆహారం ద్వారా గుణాలు అలవడతాయని పెద్దలు చెబుతారు,.
అందుకే .... అధర్మపరులు, తామస గుణం కలిగిన వారి ద్వారా ఆహారాన్ని స్వీకరించేవారు కాదు.
పూర్వం బ్రాహ్మణులు తమ ఆహారాన్ని తామే తయారుచేసుకునేవారు.
అయితే రాములవారు.. శబరి ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించటాన్ని తప్పుగా భావించలేదు.
భీష్ముల వారు..ద్రౌపది అడిగిన ఒక సందేహానికి.. తప్పని పరిస్థితిలో తాను రాజైన దుర్యోధనుని ఆహారాన్ని స్వీకరించటం.. మనిషి ప్రవర్తనపై ఆ వ్యక్తి తీసుకునే ఆహారం యొక్క ప్రభావం ఎంత ఉంటుందో.. అనే విలువైన విషయాన్ని భీష్ముల వారు తెలియజేసారు.
ఇవన్నీ గమనిస్తే ఆహారాన్ని స్వీకరించే విషయంలో కులానికన్నా ఆ వ్యక్తి గుణానికి... ఇంకా ఆ ఆహారం ధర్మబద్ధమయినదా ? లేక అధర్మబద్ధమయినదా ?అనే విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలేమో అనిపిస్తుంది.
( ఇవి తెలియని పరిస్థితిలో దైవం మీద భారం వెయ్యటమే అన్నింటికన్నా ఉత్తమం.)
................................................
ఆ నాటి వృత్తులతో పోల్చుతూ ఈ నాటి వృత్తులను చూద్దాము...సరదాగా...ఈ రోజుల్లో ఎవరైనా ఏ వృత్తినైనా స్వీకరించవచ్చు. ఇది కేవలం ప్రాచీన కాలం నాటి వ్యవస్థతో పోల్చుతూ వ్రాసినది మాత్రమే అని గమనించ ప్రార్ధన.
..............
ఆ రోజుల్లో.. బ్రాహ్మణులు.. వేదవిద్య , దైవపూజలు, ఇతర విద్యలు , వైద్యం, అధ్యయనం, రాజులకు పరిపాలనలో మంత్రులుగా సలహాలను అందించటం, యాత్రలు.. ఇలా....
ఈ రోజుల్లో.. వేదవిద్య, దైవ పూజలు ,ఇతర విద్యలు, వైద్యం, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు,మంత్రులు, పాలనలో భాగంగా అధికారులు, యాత్రలు..travels.. ఇలా చెప్పుకోవచ్చు.
..............
ఆ రోజుల్లో క్షత్రియులు.. రాజులు, రాజ్యాధికారం,రక్షణ రంగాలు,విద్య, ఆర్ధిక వ్యవస్థ, న్యాయం చెప్పటం,ఆయుధరంగం, ఇతరదేశాలతో స్నేహం వంటి విషయాలు.....
ఈ రోజుల్లో .. రాజ్యపాలన, రక్షణ రంగాలు, విద్య, ఆర్ధిక వ్యవస్థ, న్యాయవాదులు, ఆయుధరంగం, ఇతరదేశాలతో స్నేహం వంటి విషయాలు, పాలనా రంగం( పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ )..ఇలా చెప్పుకోవచ్చు.
.........
ఆ రోజుల్లో వైశ్యులు...విద్య, వ్యాపారం, ఆర్ధిక వ్యవస్థ, వ్యవసాయం,......
ఈ రోజుల్లో...విద్య, వ్యాపారం, ఆర్ధిక వ్యవస్థ, వ్యవసాయం..ఇలా చెప్పుకోవచ్చు.
.........
ఆ రోజుల్లో శూద్రులు...వ్యవసాయం,విద్య( ఏ పని చేయటం తెలిసి ఉండటమైనా విద్యే కదా..) ఆయుధాలు తయారు చేసేవారు, చేతివృత్తుల వాళ్ళు, సంగీత పరికరాలు తయారుచేయటం, వస్త్రాల తయారి, పూటకూళ్ళ వాళ్ళు ( హోటల్ ),సమాజానికి కావాల్సిన అన్ని పనిముట్లను తయారు చేయటం మరియు కొత్త పరికరాలను కనిపెట్టటం.. అంటే ఇప్పటి ఇంజనీరింగ్ రంగం లాగా ..
ఈ రోజుల్లో...వ్యవసాయం,విద్య,( ఏ పని చేయటం తెలిసి ఉండటమైనా విద్యే కదా ! ) సైనికులు, ఆయుధాలు తయారు చేసేవారు, చేతివృత్తుల వాళ్ళు, సంగీత పరికరాలు తయారుచేయటం, హోటల్స్ నడపటం, రకరకాల పరిశ్రమల్లో ఉద్యోగాలు చేయటం, ఇంజనీరింగ్ ఉద్యోగాలు, వస్త్రపరిశ్రమ.....ఇలా చెప్పుకోవచ్చు.
.....
ఇవన్నీ గమనిస్తే అప్పుడు ఇప్పుడు కూడా .... అన్ని కులాల వాళ్ళు గౌరవంగానే జీవిస్తున్నారు కదా !
....................
ఇంకా అన్ని కులాల వాళ్ళూ తమ ఇళ్ళల్లో ... దైవ పూజలు చేసుకుంటాము. ఎవరి ఇంటిని వారు సంరక్షించుకుంటాము . అందరమూ ఇంట్లో బడ్జట్ ప్రకారం ఖర్చు, లెక్కలు వేసుకుంటాము. ఇంట్లో అందరం ఇల్లు శుభ్రం చేసుకుంటాము. అన్ని కులాలవాళ్ళం ఇంటిలో కూరగాయల మొక్కలను పెంచుతాము కాబట్టి అందరూ వ్యవసాయదారులే. ఇంట్లో అందరం పెరటి వైద్యం చేస్తాము కాబట్టి , అన్ని కులాల వాళ్ళూ వైద్యులమే..అని పెద్దలు తెలియజేశారు.
..................
ఈ టపాలో ఇప్పటికి తోచింది వ్రాశాను. వృత్తుల గురించి ఎన్నో మార్పులు, చేర్పులు చెయ్యవచ్చు, తప్పులుంటే తెలిసినవారు చెప్పగలరు. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
నేను నాకు తెలిసినంతలో తోచింది వ్రాసాను. అంతేనండి. ఇందులో పొరపాట్లు కూడా ఉండిఉండవచ్చు. . తెలిసిన వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. .
పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని కోరుకుంటున్నానండి....
ఒట్టు ...
ReplyDeleteఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు
మీ వ్యాఖ్యకు కృత్జతలండి.
Deleteఒకేసారి ఎక్కువ విషయాలు వ్రాయటం వల్ల కొంచెం గందరగోళంగానే ఉంది లెండి.
దయచేసి ఇంకోసారి చదవండి. లేకపోతే మీకు ఎక్కడ అర్ధం కాలేదో చెబితే చెప్పటానికి ప్రయత్నిస్తాను.
nenippudu ekkada unnanu :(
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteedisi mokham kadukkunatlu undi.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteఅందరికీ గౌరవం ఉంది కదండి. పూర్వీకులు అందరిని గౌరవించినట్లు తెలుస్తోంది కదా ! ఎందుకు బాధపడుతున్నారు ?
అదీకాక నేను నాకు తెలిసినంతలో తోచింది వ్రాసాను. అంతేనండి. ఇందులో పొరపాట్లు కూడా ఉండిఉండవచ్చు. . తెలిసిన వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. .
గణతంత్ర దినోత్సవం నాడైనా సంతోషంగా ఉండనివ్వరా? మీకు మేమేం పాపం చేశామండి? గణతంత్రమా ఇది రణతంత్రమా... అన్నట్టున్నదండి!
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteఅందరికీ గౌరవం ఉంది కదండి. పూర్వీకులు అందరిని గౌరవించినట్లు తెలుస్తోంది కదా ! ఎందుకు బాధపడుతున్నారు ?
అదీకాక నేను నాకు తెలిసినంతలో తోచింది వ్రాసాను. అంతేనండి. ఇందులో పొరపాట్లు కూడా ఉండిఉండవచ్చు. . తెలిసిన వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. .
మీ విశ్లేషణ బాగుంది
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteవిద్య అన్నది అన్ని కులాలకు ఉంది. శూద్రులకు కూడా. ఏ పనైనా నేర్పుగా చేయగలగటం కూడా విద్యే కదండి. ఇందాక ఈ విషయం వ్రాయటం మర్చిపోయాను.
Thanks for a good post. For the people who argue that Hindu religion preaches untouchability, your observations should give some hint that they are wrong. There are many instances in 'ithihasas' which shows that character is more important than the birth. Unfortunately, today because of improper knowledge or false beliefs people have developed boundaries among themselves based on caste. It should be those people who are to be blamed but not the religion. Everybody should strive for removing those false beliefs i.s.o. doing false finding(randranveshana).
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteభగవంతుని దృష్టిలో అందరూ సమానమేనండి.