అజ్ఞాత గారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
నేను కూడా ఒకప్పుడు మీలాగే ప్రాచీనగ్రంధాలలోని విషయాలను అపార్ధం చేసుకున్నాను. కానీ అలా అపార్ధం చేసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను.
ఈ అశ్వమేధ యాగం గురించి నేను కూడా విన్నాను. అయితే ఇది ఎంతవరకూ నిజమో మనకు తెలియదు. ఎన్నో తరాల క్రిందటి సంగతి కదా ! చాల విషయాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చేసరికి మనకు తెలియకుండానే కొన్ని విషయాలలో అసలు విషయం మారే అవకాశం కూడా ఉంది.
ఈ విషయంలో అంతరార్ధం మనకు సరిగ్గా తెలియదు.అయితే, ఈ విషయంలో కొందరు అనుకుంటున్నట్లుగా జరిగి ఉండకపోవచ్చు. ఈ విషయంలో కూడా ..... పెద్దల అభిప్రాయాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనుకుంటున్నాను.
పెద్దలు చెప్పే వాటిల్లో అనేక అంతరార్ధాలు ఉంటాయి అంటారు. ఉదా.. గుమ్మానికి పసుపు రాస్తే ఇంటికి లక్ష్మీ దేవి వస్తుంది అంటారు. అంటే గుమ్మం ఏర్పాటు చేసుకుని , గుమ్మానికి పసుపు రాయటం వల్ల బయటనుంచీ వచ్చే దుమ్మూధూళీ ఇంట్లోకి నేరుగా రావటం కొంచెం తగ్గుతుంది. పసుపుతో కూడిన గుమ్మం వల్ల బాక్టీరియా చచ్చిపోతుంది.
ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటే లక్ష్మీదేవి వచ్చినట్లే కదా ! మనమేమో ఇదంతా అర్ధం చేసుకోకుండా పసుపు రంగు గుమ్మాలకు వేసేసి పెద్దలదంతా చాదస్తం అనుకుంటాము.
తెలివితక్కువతనం మనదే కానీ పెద్దలది కాదు.
ఇంకా ఎన్నో విషయాలు సమాజంలో అపార్ధాలకు గురి అయ్యాయి. ఉదా... సతీసహగమనం.
పూర్వీకుల వల్లే ఈ దురాచారం సమాజంలో వ్యాపించిందని పూర్వీకులని తప్పుపడతారు.
నేను కూడా ఒకప్పుడు మీలాగే ప్రాచీనగ్రంధాలలోని విషయాలను అపార్ధం చేసుకున్నాను. కానీ అలా అపార్ధం చేసుకున్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను.
ఈ అశ్వమేధ యాగం గురించి నేను కూడా విన్నాను. అయితే ఇది ఎంతవరకూ నిజమో మనకు తెలియదు. ఎన్నో తరాల క్రిందటి సంగతి కదా ! చాల విషయాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చేసరికి మనకు తెలియకుండానే కొన్ని విషయాలలో అసలు విషయం మారే అవకాశం కూడా ఉంది.
ఈ విషయంలో అంతరార్ధం మనకు సరిగ్గా తెలియదు.అయితే, ఈ విషయంలో కొందరు అనుకుంటున్నట్లుగా జరిగి ఉండకపోవచ్చు. ఈ విషయంలో కూడా ..... పెద్దల అభిప్రాయాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనుకుంటున్నాను.
పెద్దలు చెప్పే వాటిల్లో అనేక అంతరార్ధాలు ఉంటాయి అంటారు. ఉదా.. గుమ్మానికి పసుపు రాస్తే ఇంటికి లక్ష్మీ దేవి వస్తుంది అంటారు. అంటే గుమ్మం ఏర్పాటు చేసుకుని , గుమ్మానికి పసుపు రాయటం వల్ల బయటనుంచీ వచ్చే దుమ్మూధూళీ ఇంట్లోకి నేరుగా రావటం కొంచెం తగ్గుతుంది. పసుపుతో కూడిన గుమ్మం వల్ల బాక్టీరియా చచ్చిపోతుంది.
ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటే లక్ష్మీదేవి వచ్చినట్లే కదా ! మనమేమో ఇదంతా అర్ధం చేసుకోకుండా పసుపు రంగు గుమ్మాలకు వేసేసి పెద్దలదంతా చాదస్తం అనుకుంటాము.
తెలివితక్కువతనం మనదే కానీ పెద్దలది కాదు.
ఇంకా ఎన్నో విషయాలు సమాజంలో అపార్ధాలకు గురి అయ్యాయి. ఉదా... సతీసహగమనం.
పూర్వీకుల వల్లే ఈ దురాచారం సమాజంలో వ్యాపించిందని పూర్వీకులని తప్పుపడతారు.
రామాయణంలో దశరధుని మరణం తరువాత కౌసల్యాదేవీ, సుమిత్రాదేవీ , కైకేయి సహగమనం చెయ్యలేదు కదా !
. భారతంలో ...... శంతనుని మరణం తరువాత సత్యవతీదేవి సహగమనం చెయ్యలేదు. తమ భర్త మరణం తరువాత అంబిక, అంబాలికలు సహగమనం చెయ్యలేదు కదా !
అంటే ఆ రోజుల్లో సతీసహగమనం తప్పనిసరి ఆచారంగా లేదని తెలుస్తోంది.
మాద్రిలాగ కొందరు స్త్రీలు ఇష్టపూర్వకంగా సహగమనం చేయటం చూసి ఇక తరువాతి తరాల వాళ్ళు ఇష్టపూర్వకంగా కొందరు, ఇతరుల బలవంతం వల్ల కొందరు అలా...అలా....సమాజంలో సతీసహగమనం ఒక మూఢాచారంగా పెరిగిపోయి ఉంటుంది.
ఇలాగే చాలా ఆచారాలు పెద్దలు చెప్పిన దానిని అపార్ధం చేసుకుని తరువాతి తరాలవాళ్ళు మూఢాచారాలుగా చేసేసారు. అది పెద్దల తప్పు కాదు. ఇప్పటి వారి తప్పే.
శ్రీ కృష్ణునికి చాలా మంది భార్యలు అని ఎగతాళి చేస్తారు కొందరు. మరి పెద్దలే శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని కూడా చెప్పారు. మరి దీని గురించి మాత్రం ప్రచారం చెయ్యరు.
ఇలాంటి విషయాల గురించి ..... శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరిత్రము గ్రంధంలో వివరించారు. ఇంట్రస్ట్ ఉన్నవారు చదవవచ్చు. ఇలాంటి విషయాల్లో అనేక అంతరార్ధాలు ఉంటాయట.
పురాణేతిహాసాలలోని నాకు తోచిన విషయాల గురించి పాత టపాలలో వ్రాశానండి. ఒక టపా క్రింద ఇస్తున్నాను.తెలుగు అంతగా తెలియని వాళ్ళు దయచేసి నెమ్మదిగా చదివితే బాగా అర్ధం అవుతుంది.
........................
రామాయణం, భారతం ...ముందే ఒక ప్రణాళిక ప్రకారం దైవం ఈ కధలు నడిపించారని పెద్దల ద్వారా తెలుసుకున్నాము.
భూమిపై పాపుల భారం తగ్గించుటకై భారతయుద్ధం జరిగిందని, రావణాసురుని వధ కొరకు రామావతరణం జరిగిందని పెద్దలు చెబుతారు.
రామాయణ, భారత కధలను దైవం ఇలా చాకచక్యంగా నడిపించటానికి ఎన్నో కారణాలున్నాయని అనిపిస్తుంది. ( అవన్నీ నాకు అంతగా తెలియవు . ) తోచినంతలో , ఇలా కూడా ఆలోచించవచ్చేమో అనిపించిందండి .
భూమిపై దుష్టులను సంహరించాలంటే దైవానికి చిటికెలో పని.
దైవం తలచుకుంటే రామాయణంలో సీతాపహరణం .........భారతంలో కురుక్షేత్రం సంగ్రామం జరగవలసిన అవసరం లేదు.
శ్రీరామునికి, శ్రీ కృష్ణునికి కూడా దుష్టులను సంహరించటం పెద్ద పనేమీ కాదు.
రాజ్యవిస్తరణ మిషతో రాములవారు రావణాసురుని చంపవచ్చు.
శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేసి దుష్టులైన రాజులను చంపవచ్చు.
( పరశురాముడు ఒక్కరే ఎందరో క్షత్రియులను చంపటం జరిగింది కదా ! )
కానీ, రామాయణ, భారత కధలను దైవం ఇలా చాకచక్యంగా నడిపించటానికి ఎన్నో కారణాలున్నాయని అనిపిస్తుంది.
( అవన్నీ నాకు అంతగా తెలియవు . )
అయితే, ఇలా కూడా ఆలోచించవచ్చేమో అనిపించిందండి.......
ఈ కధలలోని పాత్రధారుల పూర్వ కర్మలు ఒక కారణం. , ఇంకా ఈ కధల ద్వారా, అందులోని వారి జీవితాల ద్వారా రాబోయే తరాలవాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
విష్ణుమూర్తి భృగు మహర్షి శాపం వల్ల ఎన్నో అవతారాలు ధరించవలసి వచ్చింది . తద్వారా దుష్ట శిక్షణ జరిగింది కూడా. .
ఇంకా , విష్ణుమూర్తి సతీవియోగం అనుభవించాలన్నది కూడా ( కొంతకాలం ) భృగు మహర్షి శాపం.
ఇంకా, మనం ఈ కధల ద్వారా ఎన్నో వైజ్ఞానిక విషయాలు, మనస్తత్వాలకు సంబంధించిన విషయాలు, న్యాయశాస్త్ర సంబంధ విషయాలు కూడా తెలుసుకోవచ్చు.
ఎన్నో ఉపకధల ద్వారా మానవ జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఉదా.శకుంతల కధ.
తెలిసీతెలియని యుక్తవయసులో జాగ్రత్తగా ఉండాలని స్పష్టంగా పిల్లలకు చెప్పటానికి పెద్దలకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.
శకుంతలా దుష్యంతుల వంటి కధల ద్వారా పిల్లలు ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు. .
ఇవేకాక , కొన్ని ప్రత్యేకపరిస్థితుల్లో తప్ప , ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకోవటం వల్ల సుఖాల కన్నా కష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది.
ఉదా... రామాయణంలో కైకేయికి మంధర ప్రబోధం వల్ల రామాయణం ఒక పెద్ద మలుపు తిరిగింది.
భారతంలో సత్యవతీదేవి తండ్రి అయిన దాశరాజు కోరిన కోరికల వల్ల భీష్ముడు రాజ్యాధికారానికి , వివాహానికి దూరంగా ఉండటం భారతంలో ఒక పెద్ద మలుపు.
( శంతనుని భార్య గంగాదేవి ఆయనను వదలి వెళ్ళిన తరువాతే సత్యవతీదేవిని వివాహమాడటానికి నిశ్చయించుకున్నాకూడా .)
.ఇక రామాయణంలో సవతులంటే సుమిత్రాదేవి వంటి మంచి వారూ ఉంటారు. ( కానీ అరుదుగా ఉంటారు. )
లోకంలో మంధర వంటివారి మాటలు విన్న కైకేయి లాంటివారే ఎక్కువగా ఉంటారు.
ఇవన్నీ చూశాక నాకు అనిపించింది. ఒక వివాహంతోనే సంసారంలో ఎన్నో సాధకబాధకాలు ఉంటాయి.
మనలాంటి సామాన్యులు ఒక్క వివాహంతో సరిపెట్టుకుంటే చాలు.
బోలెడు పెళ్ళిళ్ళు చేసుకుని కొత్త సమస్యలు , కొత్త లంపటాలూ సృష్టించుకునేకన్నా , ఉన్న జీవితాన్ని తృప్తిగా గడిపితే చాలు అని కూడా ఈ కధల ద్వారా తెలుసుకోవచ్చు అనిపించింది.
మంచివారైనా, చెడ్డవారైనా , ఎవరికయినా తన జీవితభాగస్వామి ఇంకో వివాహాన్ని చేసుకోవటమనే విషయం అత్యంత బాధను కలిగిస్తుంది.
స్త్రీలకు సవతులు ఉండటం అనే విషయం వైధవ్యాన్ని మించి బాధను కలిగిస్తుందని హయగ్రీవుని చరిత్రలో చెప్పబడింది.
ఇంకా,
ధర్మరాజుకు జూదం ఆడటం వల్ల కష్టాలు వస్తాయని తెలుసు. ( వారు రాజ్యాన్ని కోల్పోయారు కదా !. )
దైవం నడిపించిన వీరి జీవితాల ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చంటే, ఉదా..మనలో కొందరు ఉంటారు.
వాళ్ళకి అన్నీ మంచి అలవాట్లే ఉంటాయి. కానీ ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంటుంది.
ఇక వారు ఏమనుకుంటారంటే ,నాకు ఉన్నది ఒక్క చెడ్డ అలవాటే కదా ! దీనివల్ల నష్టమేమిటి ? అనుకుంటారు.
కానీ ఒక చిన్న చెడ్డ అలవాటు వల్ల కూడా ఎన్ని నష్టాలు జరగవచ్చో ధర్మరాజు పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు.
తెలివి గలవాళ్ళు అలా తెలుసుకుని తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.
వితండవాదులు ధర్మరాజంతటివారే జూదం ఆడగాలేంది నేను ఆడితే తప్పేంటి ? అని జీవితాన్ని నష్టపోతారు.
ఎవరి తలరాతను బట్టి వారి బుద్ధి ఉంటుంది మరి. అంతా దైవం దయ.
ఇంకా,
(ఇక్కడ దేవలోకాలలోని దేవతల గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే, దేవతల ధర్మాలు వేరు. మానవుల ధర్మాలు వేరు. దేవతలకు మానవుల వంటి శరీరాలు ఉండవు. దేవతలకు సంబంధించిన విషయాల్లో పైకి కనిపించేవి కాకుండా అసలైన అంతరార్ధాలు ఎన్నో ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. వారి శరీరాలు మనలా ఉండవు. అయితే, వారు ఎలాంటి రూపమైనా ధరించగలరు. వారు తమ శక్తితో ఎన్నో అద్భుతాలు చెయ్యగలరు. ఒక టపాలో చెప్పుకున్నాము.
వారి విషయాలను మానవసంబంధ దృష్టితో చూసి అపార్ధం చేసుకోవటం తెలివితక్కువతనం.
( ఇంతకుముందు చెప్పుకున్న విషయాల్లో చాలావరకూ భూమిపై మానవులుగా జన్మ ఎత్తినవారి గురించి చెప్పబడ్డాయి. )
ఇంకా,
శ్రీ కృష్ణుల వారు కూడా కొన్ని సాంసారిక కష్టాలను అనుభవించినట్లుగా లోకానికి కనిపిస్తుంది. ( శ్రీ కృష్ణుల వారు విష్ణుమూర్తి అంశావతారం. )
రుక్మిణీదేవికి సంతానం కలిగారు. కానీ జాంబవతికి చాలాకాలం వరకూ సంతానం కలగలేదు.
అందువల్ల తనకీ సంతానం కావాలని ఆమె కోరగా కృష్ణుడు శివుని గురించి తపస్సు చేస్తారు.
అప్పుడు పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు.
అప్పుడు కృష్ణుడు వారితో తన కోరికను వెల్లడించి, తాను లౌకిక కోరికలతో తపస్సు చేసినందుకు బాధపడతారు.
పార్వతీపరమేశ్వరులు ఎన్నో వరాలను ప్రసాదించి ..
ఇంకా, యాదవుల ప్రవర్తన వల్ల ముని శాపం, తద్వారా చాలావరకూ యాదవ వంశ నాశనం, ఇంకా ఎన్నో విషయాలను చెప్పి అంతర్దానమవుతారు.
ఈ టపా వ్రాయటానికి బాగానే గాభరా పడ్డానండి.
సున్నితమైన విషయాలు ఉన్నాయి కదా !
* దైవం దయవల్ల ఈ మాత్రం వ్రాయగలిగానండి. ఎప్పుడయినా నేను వ్రాస్తున్న విషయాల్లో ఒప్పులను దైవం దయగానూ, తప్పులను నావి గానూ పాఠకులు గ్రహించవలసినదిగా కోరుతున్నాను.
ఇందులో పొరపాట్లు ఉన్నచో దైవం క్షమించాలని ప్రార్దిస్తున్నానండి..
ధన్యవాదాలండి. మీరు చెప్పింది యదార్ధం. చాలా చక్కగా వివరించారు. ప్రతిఒక్కరు తెలుసుకోదగ్గ విషయాలను తెలిపారు. అందరూ మీ ఈ పోస్ట్ ను చదివితే, మన భారతీయ సంస్కృతి, ఆచారాల అవగాహన, పురాణ ఇతిహాసాల అంతరార్ధం అర్ధమౌతాయి. ఎంతో ఎంతో ఉపయుక్తమైన విషయాలు తెలియజేసినందులకు మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. అంతా దైవం దయేనండి.
Deletedharmam ante emiti
Deleteఅజ్ణాతలు చేసే కామెంట్లను మనం లెక్క చెయ్యక్కర్లేదు.. ఇలాగే మీకు తెలిసిన మంచి విషయాలు నలుగురికీ పంచి మీరు ఆనందించి, మమ్మల్ని ఆనంద పరచండి.. ..
Deleteఅజ్ఞాత గారూ మీ వ్యాఖ్యను ఇప్పుడే చూశానండి. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. కొంతకాలం క్రిందట ఒకరు ధర్మం గురించి అడిగితే నాకు తోచింది చెప్పాను. ఆ టపా ఇక్కడ ఇస్తున్నాను.
Deleteఅందరికి నా నమస్కారములు అండి. ఇంతకు ముందు రాసిన వ్యాసం గురించి ఒక బ్రదర్ కామెంట్స్ రాస్తూ ధర్మ బధ్ధ సుఖములు అంటే ఏమిటి అని అడిగారండి. నేనేమో నాకేదో పెద్ద పాండిత్యం ఉన్నట్లు దాని గురించి రాస్తూ ...ఇతర ప్రాణులను బాధ పెట్టకుండా మాత్రమే మనము సంతోషాన్ని పొందగలగటం అనేవి ధర్మబధ్ధమైన సుఖములు" అని కూడా రాశానండి. కానీ తరువాత ఆలోచిస్తే నేను రాసినది సరయినదిగా నాకు అనిపించలేదు. మనము ఆహారం కోసం మొక్కలనయినా బాధపెడతాము కదా అనిపించింది. అంటే ధర్మంలో కూడా హింస ఉంటుందా....ఇలా ఎన్నో ఆలోచనలు...
ఈ ఆలోచనలు మీతో చెప్పాలని ఇలా రాస్తున్నానండి . ధర్మం గురించి పెద్దలు అనంతకాలముగా ఎన్నోవిధాలుగా చెబుతూనేఉన్నారు. వర్ణాశ్రమధర్మములు, కులధర్మములు, .... ఇలా ఎన్నోరకముల ధర్మములు ఉన్నాయి. ధర్మము యుగమును బట్టి మారుతుంది. ధర్మం సందర్భమును బట్టికూడా మారుతుంది. ధర్మబధ్ధమైన సుఖములు అంటే పెద్దలు చెప్పిన ధర్మం ప్రకారం కర్మలను చేస్తూ సుఖాలను అనుభవించటం. ఇతరులు ఏపని చేస్తే మనము బాధపడతామో దానిని సాధ్యమయినంతవరకు ఇతరుల పట్ల చెయ్యకపోవటం. ఇతర ప్రాణులను సాద్యమైనంతవరకు బాధపెట్టకుండా మాత్రమే మనము సంతోషాన్ని పొందగలగటం ఇలా ....... ఇందులో ఒక్కోసారి కొంచెము హింస ఉంటుంది. అంటే ఆహార సంపాదన, ,ఇలాంటి కొన్ని సందర్భములలో ..హింస ఉంటుంది..........
..మరి హింస లేకుండా ధర్మం ఉండదా? ఉంటుంది... దాని పేరే పరమధర్మం ...... అంటే పరమాత్మ.
మరి హింస లేని ధర్మబధ్ధ సుఖం ఉండదా....ఉంటుంది దానిపేరే పరమ ధర్మబధ్ధసుఖము ....... అంటే పరమాత్మను పొందటం. .
ఇలాంటిదే ...ఇంద్రుడు,దేవతలు నిజముగా అమరులు కాదట. వారు మానవులు కన్నా అధిక ఆయుఃప్రమాణము కలవారు కాబట్టి మాత్రమే వారిని అమరులు అంటారట. .పరిపూర్ణమైన అమరత్వం లేకపోలేదు....చింతామణి గృహంలో నివసించే శ్రీ మన్మహాదేవుడు శ్రీ మన్మహాదేవి (పరమాత్మ) అమరులు.
ఇంకా ఇలా అనిపించిందండి. ..... ధర్మబధ్ధ సుఖములో హింస ఉండే అవకాశం ఉంది. .
,1. హింస లేని ధర్మం పేరు ......... పరమ ధర్మం ......... అంటే పరమాత్మ.
2. హింస లేని ధర్మబధ్ధసుఖము పేరే...... పరమధర్మబధ్ధసుఖము. ....... అంటే పరమాత్మను పొందటమే ........ పరమ ధర్మబధ్ధ సుఖం. .
పరమాత్మ పరిపూర్ణులు.....పరమాత్మతత్వం పరిపూర్ణతత్వం. ఎవరయినా పరిపూర్ణత్వమును, ఏమాత్రము దుఃఖము లేని పరిపూర్ణసుఖమును పొందాలనుకుంటే మాత్రం ఆ పరమాత్మను పొందటము ద్వారా మాత్రమే అది సాధ్యము. దానినే మోక్షము అంటారేమో. అందుకే మన పెద్దలు మోక్షమునకు అంత ప్రాధాన్యతని ఇచ్చారు...
ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలండి. తల్లి పిల్లలకు ఆడుకోవటానికి బొమ్మలను,. ఇస్తుంది. పిల్లవాడు తోటి పిల్లలతో ఆటలలోపడి తల్లిదండ్రులు పిలిచినా వెళ్ళడు. అలా ఆడగా,ఆడగా తనకే విసుగు కలిగి ఒక్కసారి అన్ని ఆటలను, తోటిపిల్లలను వదిలి అమ్మానాన్నను చేరుతాడు. అలాగే జీవులు కూడా ఎన్నోజన్మలు గడవగా,గడవగా ఒక్కసారి విసుగు పుట్టి ఆ జగన్మాతాపితరులను చేరుకుంటారు. ఆ జగన్మాతాపితరులు తమ బిడ్డలు త్వరగా ఒకజన్మలోనే తమ వద్దకు రావాలని కోరుకుంటారు. కొందరు ఒక్క జన్మలోనే పరమాత్మను పొందుతారు. కొందరికి ఎన్నోజన్మలు పట్టవచ్చు. సరి అయిన దారిలో నడిచిన పిల్లలు త్వరగా ఇల్లు చేరుతారు. దారి తప్పిన పిల్లలు ఆలస్యముగా ఇల్లు చేరుతారు. ఏది ఏమైనా అందరికి ఇల్లు చేరటం తప్పనిసరి..
జగన్మాతాపితరులను అంటే పరమాత్మను పొందటమే అన్ని జీవులకు పరమావధి, పరమధర్మం, పరమధర్మబధ్ధసుఖం. దీనినే మోక్షము అంటారేమో తెలియదండి..
ధర్మబధ్ధజీవితముతో నిష్కామముగా జీవితములను గడిపిన ఎందరో మహానుభావులు చరిత్రలో ఉన్నారు. అందులో గృహస్థులు, సాధువులు, సన్యాసులు ,యోగులు ఇలా అన్ని వర్గములవారు ఉన్నారు. శ్రీశ్రీమహావతార్ బాబాజీ గారు ,శ్రీశ్రీ లాహిరీ మహాశయులను ఆదర్శ గృహస్థ యోగికి నిర్వచనమని తెలిపారు. శ్రీషిర్డి సాయిబాబా గారు గొప్ప మహానుభావులు. ఇంకా హిమాలయములలో ఎందరో యోగులు తపస్సు చేస్తూ ఉంటారంట. వారు తమ తపస్సును లోక కల్యాణానికి కూడా వినియోగిస్తారంట..
.నేను రాసిన చాలా విషయములు భగవంతుని దయవలన, పెద్దల నుండి నేర్చుకున్నవేనండి....
నేను గత రెండు రోజులనుండి కొన్ని కారణముల వల్ల నెట్ కూడా చూడలేదండి. ఈ వ్యాసం రాయటానికి నేను పొందిన కొన్ని అనుభూతులకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవటం తప్ప ఏమి చెయ్యగలను ..... అంతా ఆ భగవంతుని దయ.. .. తప్పులను ఆ భగవంతుడు క్షమించాలని కోరుకుంటున్నాను. ... ఈ సంవత్సరం అమర్ నాధ్ యాత్ర గురించి ప్రకటించారండి. అది అధ్బుతమయిన యాత్ర.......
voleti gaaru మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. అంతా దైవం దయేనండి.
Deleteఆర్యా ! మీరు ప్రస్తావించిన అజ్ఞాత అశ్వమేధయాగంలో ఏ అంశం గుఱించి వ్యాఖ్య చేశారో నాకు తెలియదు. అయినా ఒక సర్వసాధారణ అపోహని ఖండించదల్చుకుని నేనీ వ్యాఖ్య వ్రాస్తున్నాను.
ReplyDeleteఅశ్వమేధయాగంలో చంపబడే మగగుఱ్ఱంతో సంగమించేది మానవరాణి కాదు. గుఱ్ఱాల రాణి. అంటే రాజుగారి గుఱ్ఱాన్ని గుఱ్ఱాల రాజు అంటారు. దాని భార్య అయిన ఆడగుఱ్ఱం గుఱ్ఱాల రాణి (అశ్వమహిషి). ఈ గుఱ్ఱాల రాజు అశ్వమేధయాగంలో దేవతాప్రీతిగా చంపబడనున్నాడు కనుక దానికి సంతానాన్ని పుట్టించుకునే అవకాశం ఇవ్వడం కోసం దాన్ని దాని యొక్క భార్యతో చివఱిసారిగా కలుపుతారు. అక్కడ ఆ సందర్భంలో వాడిన వేదసంస్కృతం అర్థం కాక జనాల్లో అపార్థాలు వ్యాపించాయి. పండితులు కూడ వీటికి లోనయ్యారు.
విషయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.
Deleteనాకు తెలిసినంతలో పూర్వం కొందరు రాజులు రాజ్య విస్తరణలో భాగంగా అశ్వాన్ని ఇతర రాజ్యాలకు పంపటం ... .....ఆ అశ్వాన్ని నిలువరించిన వారితో యుద్ధం చేయటం ...... యాగసంపూర్తి ..... ఇలా జరిగేదనుకుంటాను.
ఇక సామాన్యుల కోసం పెద్దలు సూక్ష్మంలో మోక్షంలా ఇంకా ఎన్నో ఉపాయాలను కూడా మనకు అందించారు.
క్షమించండి. ఇవన్నీ మీకు తెలియవని కాదు. మీ వ్యాఖ్య ద్వారా ఇతరులకు తెలుస్తుందని వ్రాస్తున్నానండి.
శ్రీ దేవీభాగవతము గ్రంధములో .... వరాహస్వామి అవతార సందర్భంలో ...... సర్వకళ్యాణకారకమైన భూదేవీ స్తవం గురించి ఉందండి. ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి కలిగే ఫలాలను గురించి చెబుతూ అందులో ........ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి......అశ్వమేధాలు నూరు చేసిన పుణ్యఫలం లభిస్తుంది . అని కూడా చెప్పారండి.
అంటే...ఈ స్తోత్రాన్ని పఠిస్తే చాలు....నూరు అశ్వమేధాలు చేసిన ఫలం లభిస్తుందని పెద్దలే చెప్పటం జరిగింది.
ఆ అజ్ఞాత ఇంతకుముందు వ్రాసిన టపాలో ఈ విషయం గురించి వ్యాఖ్యానించారండి. ఆ వ్యాఖ్య........Yeah..while the Ashwamedha Yaga in the vedas asked the queen to imitate the copulation with the horse in yaga..and her colleague wives to chant obscene words.........these days people interpret it entirely something else....as if ...mind is like a horse, restless...etc,,,,then, why a wife came into the scene...if it is really so???...
by seeing this kind of rituals only...world has a downgraded view on INDIA!!!! yeah...your own VEDAs!!!
అట్నా కేబులే టవునన్నా? మనకు తేడాగా అర్థమైనాదే...
Deleteఅశ్వమేధం లో ఆ గుఱ్ఱాన్ని తిరగనిచ్చి అది వెల్లినంత దూరం వరకు ఆ చక్రవర్తి కిందకొస్తుంది గదా?
ఎవరైనా ఒప్పుకోకుంటే యుద్ధమే కదా? ఇక్కడ ఆ గుఱ్ఱం రాజుని రిప్రజెంట్ చేస్తాది కద? (రాణి తో సంగమించింది కాబట్టి)
మరి అదెట్టా?
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి .
Deleteఈ సృష్టిలో మనకు అర్ధం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఉదా...2 - 2 = 0. జవాబు అంటారు లెక్కల టీచర్. 0 అనే ఎందుకు అనుకోవాలి ? .2 - 2 = 9 లేక 8 అని .... జవాబుగా ఎందుకు అనుకోకూడదు ?
భూమికి ఒక్క సూర్యుడే ఎందుకు ? ఎలా ? వెలుగునిస్తున్నాడు ?
ప్రళయం ఎప్పుడొస్తుంది ? లేక ప్రళయం ఇప్పుడప్పుడే రాదా ?
ఇలా నాకూ ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇలా ఈ సృష్టిలో మనకు అర్ధం కాని విషయాలు ఎన్నో ఉన్నాయండి..
చెప్పినా అర్థం చేసుకోనివాళ్ళతో ఏం చేయాలి ?
ReplyDeleteగుఱ్ఱాలు మానవస్త్రీలతో సంగమించడం సాధ్యం కాదు. అలా చేయమని ఏ మతమూ చెప్పదు. ఉద్రిక్తస్థితిలో మగగుఱ్ఱాల పురుషాంగాలు మీటర్ పొడవుంటాయి. అందుకు తగ్గ లావుంటాయి. వాటి సంభోగవేగం చాలా చాలా ఎక్కువ. సంభోగం సంగతలా ఉంచి అసలు అవి యోనిప్రవేశానికి ప్రయత్నం చేస్తే చాలు అక్కడిక్కడే మానవస్త్రీలు చచ్చిపోతారు. ఇవన్నీ ఆలోచించకుండా ఊరికే పవిత్రగ్రంథాల మీద నిందలు వేయడం తగదు.
అవునా! మనకంత నాలెడ్జీ లేదన్నా
ReplyDeleteఅద్సరేగానీ, మామూలు యగ్నాల్లో దేవుల్లని ఎంటరుటెయిను చేసేకి, ఆ యగ్నం చేసేటొల్లని మంచె పైకి ఎక్కిస్తారంట? ఆళ్ళకి మొహమాటమైతే, పనోల్ల చేత కత నడిపిస్తారంట?
మరి అదెట్టా?
మీరు ఏ యజ్ఞం గుఱించి మాట్లాడుతున్నారు ? నాకు తెలిసి అలాంటి యజ్ఞమేదీ లేదు. అలాంటి యజ్ఞాలు ఎవఱైనా చేయగా చూడలేదు. వినలేదు.
ReplyDelete"బహుశా ఆయన (బుల్లబ్బాయ్) చెప్తున్నది "ధన యజ్ఞం", "జల యజ్ఞం" "భూ ఆక్రమణ యజ్ఞం", "ఖనిజ యజ్ఞం" లాంటివి అయ్యుండచ్చు..
Deleteఇవి తెలియకనో తెలుసుకుందామనో అడిగేవి కావు తమ అతితెలివితేటలను జనం మీదప్రయోగించిచూసుకునే అహంకారాలు. వాళ్లకు సమాధానం చెప్పటం దండగ. తివిరి ఇసుకన తైలమ్ము...... పద్యం తెలుసుకదా !
ReplyDeleteసాములోరూ మరీ అంత కోపగించుకోకండి.. ఏ తాపీ ధర్మారావ్ శిష్యులో లేదా రంగనాయకమ్మ అభిమానులో సెప్తే ఇన్నట్టు గురుతు.
ReplyDeleteపూర్వపు గ్రంధాలలోని అంతరార్ధాలను సరిగ్గా తెలుసుకోలేకపోవటం వల్లే చాలామంది అపార్ధం చేసుకుంటున్నారు.
Deleteతెలిసినవాళ్ళు చెప్పినా కొందరు వినిపించుకోకపోవటం అందరి దురదృష్టం.
నాకు తెలిసినంతలో ....యజ్ఞాలలో రకరకాలుంటాయట. దేవీ యజ్ఞంలో భేదాలున్నాయట. మానస యజ్ఞం , సాత్విక, రాజస, తామస యజ్ఞాలు. .
ఇతరయజ్ఞాలలో కూడా సాత్విక, రాజస, తామస యజ్ఞాలని ఉంటాయనుకుంటా.
ఉదా ..జనమేజయులవారు చేసిన సర్పయాగం తామస యాగం కోవలోకి వస్తుందనుకుంటున్నాను.వారు అలా చేయటానికి వెనుక అనేక కారణాలున్నాయి.
అయితే, ఆస్తీకుల వారి కోరిక ప్రకారం జనమేజయుల వారు సర్పయాగాన్ని మధ్యలోనే నిలిపివేశారు.
పూర్వం రాక్షసులు కూడా యజ్ఞాలు చేసేవారట. ఉదా.. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు వంటివారు.