koodali

Monday, January 23, 2012

2 + 3 = 5 ఐసు ముక్కలు అని కాదా టిచర్ ?.......4 - 4 = 0 కాదాండీ ?..


ఒక ఉపాధ్యాయదినోత్సవం రోజున సీనియర్ క్లాసుల పిల్లలే టీచర్లుగా జూనియర్లకు పాఠాలు చెబుతున్నారు.

ఆ పాఠశాలలో సందేహాలకు కూడా ఒక పీరియడ్ ఉంటుంది.

టీచర్ క్లాసులో పాఠం చెబుతున్నారు. 2 + 3 = 5 అవుతుంది. అని.
 
ఇంతలో ఒక విద్యార్ధి లేచి టీచర్ 2 + 3 = 5 అనే ఎందుకు అవుతుందండి ?
2 + 3 = 4 ఎందుకు అవకూడదండి ?
అని ప్రశ్నించగా(నా లాగ అన్నమాట.)
 
టీచర్ 5 ఐసు ముక్కలను
తెప్పించారు. అందులో మూడు నీలం రంగు ఐసు ముక్కలు , రెండు పచ్చ రంగు ఐసు ముక్కలు.

ఒక గిన్నెలో మూడు నీలము రంగు ఐసు ముక్కలను పెట్టారు. వేరొక గిన్నెలో రెండు పచ్చ రంగు వాటిని పెట్టారు.

తరువాత పిల్లలకు చూపిస్తూ..... రెండో గిన్నెలోని 
ఐసు ముక్కలను కూడా మొదటి గిన్నెలో పెట్టారు.

( ఇప్పుడు అన్ని ఐసు ముక్కలను కలిపి లెక్కపెడితే 5 ఐసు ముక్కలు అని జవాబు వస్తుంది కదా ! కాబట్టి..2 + 3 = 5. అని చెప్పాలని టీచర్ యొక్క ఉద్దేశం .
)

అప్పుడు మొదటి గిన్నెలో యెన్ని ఐసు ముక్కలు ఉన్నాయో ? పిల్లలను లెక్కపెట్టమని చెప్పబోయేంతలో,
 
క్లాస్ బయట పెద్దగా
కోలాహలం వినిపించింది. అందరూ అటు పరిగెత్తారు.
ఎవరో వచ్చి ఏదో కారణంతో బంద్ అని స్కూల్ మూసివెయ్యాలని గొడవచేస్తున్నారు. వాళ్ళకు సర్ధిచెప్పి పంపేసరికి ఒక అరగంట పైనే పట్టింది.
 
తిరిగి క్లాస్ కు వచ్చి గిన్నెలోకి చూసిన పిల్లలందరూ ఆశ్చర్యపోయారు.
గిన్నెలోకి చూసిన టీచర్ కు....
నాలుగు ఐసు ముక్కలే కనిపించాయి.

అన్ని ఐస్ ముక్కల కన్నా సైజులో చిన్నదయిన ఒక
నీలం రంగు ఐసు ముక్క కరిగి నీరై పోయింది.

ఐసు ముక్క నీరుగా రూపాంతరం చెందింది కాబట్టి ..... దానిని ఇప్పుడు ఐసు ముక్క అనలేము కదా ! అలా లెక్క తప్పిపోయింది అన్నమాట.


అప్పుడు పిల్లలు అడిగారు.

టీచర్ ! 2 ఐస్ ముక్కలు + 3 ఐస్ ముక్కలు = 5 ఐసుముక్కలు అనుకున్నాం కదండి.....
మరి ఇక్కడ చూస్తే 2 + 3 = 4 ....ఐస్ ముక్కలు అని మాత్రమే జవాబు కనిపిస్తోంది....

మరి 2 + 3 = 5
అని కాదా టిచర్ ? అని.
అప్పుడు టీచర్ గంభీరంగా ఇచ్చిన జవాబు......కొన్నిసార్లు 2 + 3 = 5 కాకపోవచ్చు. .
......................
 
టీచర్ మరియు విద్యార్ధులు,మరియు కొందరు పెద్దవాళ్ళు .... సరదాగా నది ఒడ్డున షికారుకు వెళ్ళారు. . వేసవి కాలం వల్ల నదిలో నీళ్ళు ఎక్కువగా లేవు.
ఉదయం స్కూల్ లో ,
లెక్కల టీచర్ .... 4 - 4 = 0 అని చెప్పటం జరిగింది.
 
ఆ విషయం గుర్తొచ్చిన కొందరు సందేహపు విద్యార్ధులు ( నా లాగా అన్నమాట
)
టీచర్ ! 4 - 4 = 0. అనే ఎందుకు అనుకోవాలి ? 3 అనో 5 అనో ఎందుకు అనుకోకూడదండీ ? అని అడగగా..

టీచర్ వారికి వివరంగా చెప్పాలనుకొని..
 
నది వద్ద చిన్న గుంత త్రవ్వి పిల్లల దగ్గరున్న నీళ్ళ సీసాల్లోని నీటిని ఆ గుంతలో పోశారు..
 
అలా 4 సీసాల లోని నీరు ఆ గోతిలో పోసారు.

ఇప్పుడు టీచర్ ఆ గోతిలోని నీటిని మరల సీసాల్లోకి నింపమని పిల్లలతో చెప్పగా ,
పిల్లలు సీసా మూతలతో నీటిని తోడి సీసాల్లో నింపారు. అలా 4 సీసాలు నీటితో నిండిపోయాయి.
 
గోతిలో పోసిన 4 సీసాలలోని నీటిని తిరిగి 4 సీసాల్లోనూ నింపితే గోతిలో నీరు ఉండదు కాబట్టి , 4 - 4 = 0. అని చెప్పాలని టీచర్ ఉద్దేశ్యం.
చిత్రమేమిటంటే ఆ గోతిలో ఇంకా నీళ్ళున్నాయి.
 
సుమారుగా ఇంకో మూడు సీసాలకు సరిపడా నీళ్ళు కనిపిస్తున్నాయి. ( వాళ్ళు త్రవ్విన గోతిలోకి అడుగునుంచి నీరు ఊరాయన్నమాట. )
అది చూసిన పిల్లలు అడిగారు......
 
టీచర్ ! 4 - 4 = 0 అని చెప్పారు కదా ! చూస్తుంటే 4 - 4 = 3 లేక ఇంకా ఎక్కువే జవాబుగా అనుకోవచ్చు అనిపిస్తోందండి. 4 - 4 = 0 కాదాండీ ? అని అడిగారు.
 
అప్పుడు టీచర్ గంభీరంగా ఇచ్చిన జవాబు..కొన్నిసార్లు 4 - 4 = 0 కాకపోవచ్చు .

ఇందుమూలంగా నేను చెప్పదల్చుకున్నదేమంటేనండి..........

ఒక ఐసు గడ్డ అంత త్వరగా కరగక పోయినా, చెలమ నుంచి నీరు అప్పుడే ఊరకపోయినా లెక్కలు వేరేవిధంగా ఉండేవి. అనుకోనివిధంగా లెక్కలను ( పరిస్థితులను ) మార్చటంలో దైవానికి సాటి ఎవరూ ఉండరు.
దైవం తలుచుకుంటే ఏదయినా సాధ్యమే అని. 
 
భౌతిక శాస్త్రం లెక్కలు వేరు..( ఆధ్యాత్మిక )యోగ శాస్త్రం లెక్కలు వేరు అని. .

ఈ విషయం చెప్పటానికి ఇక్కడ
గణితశాస్త్రం యొక్క సహాయాన్ని తీసుకున్నాను. అంతేనండి.. నేను గణితంలో చాలా వీక్ .

వ్రాసినదానిలో తప్పులుంటే పెద్దమనసు చేసి క్షమించెయ్యమని ప్రార్ధిస్తున్నానండి...




8 comments:

  1. చాలా బాగుందండి.. మీరు వివరించిన విధానం...

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      ముందు చెప్పిన ఉదాహరణను మార్చి ....ఐసు ముక్కలతో ఉదాహరణ వ్రాశానండి.

      Delete
  2. its nice to read a useful article for beginner like me. Some of points from this article are very helpful for me as I haven’t considered them yet. I would like to say thank you for sharing this cool article. Bookmarked and sharing for friends.
    Plymouth Grand Fury AC Compressor

    ReplyDelete
    Replies
    1. మీకు హార్దిక స్వాగతం మరియు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  3. abaddalu rendu rakalu okati abaddam rendu lekkalu ani yilantide yedo undandi

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యను ఇప్పుడే చూశానండి. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
      అయితే మీ వ్యాఖ్య నాకు సరిగ్గా అర్ధం కాలేదండి. ఉదా.. ఐస్ ముక్కల ఉదాహరణను .. చూస్తే అబద్ధం ఏముంది ? టీచర్ లెక్క మొదలుపెట్టింది 3 +2 = 5. అని చెప్పటానికి.

      మరి ఒక ఐస్ ముక్క కరిగిపోయాక కళ్ళకు కనిపిస్తోంది 4 ఐస్ ముక్కలే కదండి. మరి 3 + 2 = 5 ఐస్ ముక్కలు అని జవాబు ఎలా అనుకుంటాము ?

      Delete
  4. మేడమ్,

    ధ్యానం చేయడం(పూర్తిగా కొత్తవారికి కూడా అర్ధమయ్యేలా) మీద ఒక పోస్టు రాయగలరా, మీకు వీలైతే.

    దీనిగురించి తెలిసిన పెద్దపెద్ద పండితులులాంటివారు కూడా, బయటకు చెబితే అందరికీ తెలిసిపోతుందని చెప్పడంలేదు...ఎంత అడిగినా కూడా. అందుకని మిమ్ములను అడుగుతున్నాను.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యను ఇప్పుడే చూశానండి.వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
      నాకూ ధ్యానం గురించి అంతగా తెలియదండి. కానీ దైవం దయ వల్ల తెలిసినంతలో వ్రాయటానికి ప్రయత్నిస్తానండి....

      Delete