ఈ మధ్య బ్లాగుల్లో, బయట కొందరు .. ఇతరదేశాల వాళ్ళకి కొత్తరకం టెక్నాలజీ తెలియటం వల్లా , క్రొత్తరకం క్షిపణులు తయారుచేయటం వల్లే పూర్వం మనదేశం విదేశీయుల పాలనలోకి వెళ్ళింది అంటున్నారు. ఇంకా, ఇతరదేశాలకంటే మన దేశం వెనకబడిపోయింది అని కూడా అంటున్నారు.
అనంతకాలగమనంలో కొన్ని వందల సంవత్సరాలు అంటే తక్కువ సమయమే. ఒకోసారి మంచివాళ్ళకు కూడా ఇతరుల వల్ల తాత్కాలిక కష్టాలు వస్తాయి. యుద్ధాలలో గెలుపోటములు అనేవి సహజం.
ఒకోసారి ఓడలు బండ్లు అవటం..బండ్లు ఓడలు..అవటం జరిగినా... మరల ఓడలు.. ఓడలు అవటం జరుగుతుంటుంది.
మనదేశం విదేశీ పాలనలోకి వెళ్ళటానికి మనలో ఐకమత్యం లేకపోవటం .. వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
ఇంకా మనలో చాలామందికి.. మనం పేదవాళ్ళం, మనకేమీ తెలియదు వంటి అభిప్రాయాలు ఉండటం కూడా మనం సరిగ్గా అభివృద్ది చెందకపోవటానికి ఒక కారణం.
.......................
ఇక కొందరు ఏమంటారంటే .. మన మతసంస్కృతి వల్లా , మనకు టెక్నాలజీ అంతగా తెలియకపోవటం వల్లే మనం వెనకబడ్డాం అంటారు.
అయితేమరి , ఒకప్పుడు టెక్నాలజీలో ఎంతో దూసుకుపోయిన దేశం, మతవిశ్వాసాలు అంతగా లేని దేశం అయిన రష్యా కూడా ఇప్పుడు కొంచెం వెనకబడింది కదా !
ఎంతో అభివృద్ధిచెందిన టెక్నాలజీని కలిగిఉన్న ఇతరదేశాలు కూడా ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి కదా !
..............................
క్రొత్తరకం క్షిపణులను లేక టెక్నాలజీని కనిపెట్టిన కొత్తలో ఏ దేశానికయినా సంబరంగానే ఉంటుంది. వాటి సహాయంతో ఇతరదేశాలను ఓడించటం .. కధ ఇలా సాగుతుంది.
కానీ, కొంతకాలానికి ఇతరదేశాలు కూడా తమకు ఇష్టమున్నా లేకపోయినా రక్షణకోసం అలాంటి క్షిపణులను , టెక్నాలజీని తయారుచేయటం మొదలుపెడతాయి కదా !.
ఇక అంతులేని కధ మొదలవుతుంది....
వాళ్ళను చూసి వీళ్ళూ...వీళ్ళను చూసి వాళ్ళూ అలా టెక్నాలజీని పెంచుకుంటూ పోతారు . అలా...అలా... ఈ పోటీని మొదలుపెట్టినవాళ్ళకి కూడా ఆపలేని పరిస్థితి ఎదురుకావచ్చు.
ఇక ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా ఇష్టమున్నా లేకపోయినా ఈ పోటీలకే ఎక్కువగా ఖర్చు చెయ్యవలసి వస్తుంది.
దాంతో పేదరిక నిర్మూలనకు , ప్రజాసంక్షేమ కార్యక్రమాలకూ డబ్బు చాలదు.
ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఆర్ధిక ఇబ్బందులు పడటానికి ఇలాంటి పోటీలు కూడా ఒక కారణం.
.......................
మన పూర్వులు యంత్రాలు కనిపెట్టలేదు అంటారు కొందరు .
టెక్నాలజీని ఒక పద్ధతిలో కొంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే బాగుంటుంది. మితిమీరి ఉపయోగిస్తే లాభాలకన్నా.. నష్టాలే ఎక్కువ.
ఉదా.. ప్రతి చిన్న పనికీ యంత్రాలను ఉపయోగించటం కూడా ఈ రోజుల్లో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోవటానికి ఒక కారణం.
వందమంది మనుషులు కొన్ని రోజులు చేసే పనిని ఒక యంత్రం గంటలో చేసేస్తుంటే ఇక మనుషులకు చెయ్యటానికి పని ఎక్కడినుంచి వస్తుంది ?
విపరీతమైన యంత్ర వినియోగం వల్ల సహజవనరులు కూడా వేగంగా తరిగిపోయే ప్రమాదముంది.
ఇవన్నీ ఆలోచించే .. పూర్వులు ఇంతటి యంత్ర వినియోగాన్ని ప్రోత్సహించలేదేమో ..
........................
ఇంకా పేదరికం పెరిగిపోవటానికి పెద్ద కారణం ఏమంటే .. సంపద కొందరు ధనికుల దగ్గర మాత్రమే ప్రోగుపడిపోవటం.. ఎంత టెక్నాలజీ పెంచుకున్నా..లక్షలకోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతుంటే పేదరికం ఎలా పోతుంది ?
కన్నం ఉన్న కుండలో ఎంత నీరు పోసినా ..బయటకు పోయే నీరు పోతుంటే కుండ ఎలా నిండుతుంది ?
ఈ పరిస్థితి చక్కదిద్దాలి గానీ .. టెక్నాలజీ విపరీతంగా పెంచాలని మనము పాపం శాస్త్రవేత్తలను ఎందుకు ఒత్తిడి చెయ్యటం ?
........................
ఇంకా, బోలెడు ఖర్చుపెట్టి నీటి జాడల కోసం ఇతర గ్రహాలపైన వెదకటానికి ముందు .. భూమ్మీది అపారమైన జలసంపదను పొదుపుగా ఎలా వాడుకోవాలో పరిశోధిస్తే మరింత మంచిది కదా ! అని కూడా....
ప్రపంచంలో పేదరికం, ఆర్దికమాంద్యము, కొంచెమైనా తగ్గాలంటే అందరూ ఆలోచించాలి మరి .
లేకపోతే సహజవనరుల తరుగుదల, గ్లోబల్ వార్మింగ్..వంటి వాటితో ప్రపంచమంతా ఇబ్బందులు పడవలసి వస్తుంది .
Well said sir,
ReplyDeleteBut there are machines that creates more jobs, and there are other types that takes away the jobs.
Those were the days with surplus manual labor in the farming, but these are the days where there is a severe shortage, so the need of machinery comes.
Those western countries have less population and so the machines suits them, and the large quantities of goods they produce are making them rich.
To reduce the poverty, India should produce large quantities of exports (material, services..anything),either by employing large machinery, manufacturing hi-tech goods (western method), or take the Chinese path, cottage, small scale industries supplying all over the world.
In either case, machines of some type is needed, India has to take a path.
Why there was no inclination towards machines in ancient India is some question the history experts can answer. definitely not us.
cont....from above comment.
ReplyDeleterussia collapsed due to political reasons.
the current recession was the cause of few banking institutes who were very greedy of material successes.
It has got nothing to do with Science development in those countries. back then, the 1920 recession in US was caused by the FORD's mass production, but then again it was the people's greed that caused it and not the ford's innovative assembly lining technology.
Science explores, that's it!its the man's greed that is causing all sorts of issues out of it. Blame it on the material pursuits of the western people rather than the science itself.
But it is this same material pursuits that differentiate Eastern philosophy and the western, their masses of poverty, morality and every other difference.
అజ్ఞాత గారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteనాకు ఇంగ్లీష్ అంతగా అర్ధం కాదు. మీరు శ్రమ అనుకోకపోతే తెలుగులో మళ్ళీ వ్రాస్తారా ? ఈ యంత్రాల అతి వినియోగం గురించి నేను పాత టపాలలో వ్రాశాను.
ఇంకో విషయం నేను టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. కొన్ని విషయాల్లో టెక్నాలజీ అవసరమే. అది అతి కాకూడదని నా అభిప్రాయం . అంతేనండి.
పాత పోస్టులు, కామెంట్లు చూస్తుంటే ఈ వ్యాఖ్య చూసి మరల వ్యాఖ్యను వ్రాసానండి..
ReplyDeleteఈ రోజుల్లో పనులు చేయటానికి మనుషులు లభించటంలేదని కొందరు అంటారు కానీ, అది నిజంకాదు. ఈరోజుల్లో ఉపాధిలభించని మనుషులు ఎందరో ఉన్నారు. ఉపాధి లేక ఇతరప్రాంతాలకు,దేశాలకు వెళ్తున్నారు. తక్కువ జీతం తీసుకునే వారికొరకు యజమానులు ఎదురుచూస్తారు. యంత్రాలయితే జీతాలు ఇవ్వక్కర్లేదు, సమ్మెలు ఉండవు.. ఎక్కువ ఖర్చు ఉండదు. అందుకని యంత్రాల వాడకం పెరుగుతోంది.
పాతకాలంలో నలుగురు నెలరోజులు చేసేపనిని ఇప్పుడు యంత్రాలు ఒక్క గంటలో చేస్తున్నాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు తగ్గాయి.. అతిగా వస్తువినియోగం పెరిగి పర్యావరణసమస్యలు పెరుగుతున్నాయి....ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలనుండి లక్షలమంది డిగ్రీ తీసుకుని బయటకువస్తున్నారు. ఇంతమందికి ఉద్యోగాలు రావాలంటే ఎన్ని కంపెనీలు ఉండాలి?
యంత్రాలు వద్దని నా అభిప్రాయం కాదు.. కొన్ని కష్టమైనపనులకు యంత్రాలు వాడవచ్చు. అయితే, ప్రతిపనికి యంత్రాలు కాకుండా కొంతవరకు మాత్రం వాడితే మంచిది. సంపదను అందరూ పంచుకుంటే నిరుద్యోగం తగ్గించవచ్చు. కొందరు సంపదను తామే ప్రోగుచేసుకుని దాచుకోవటం కాకుండా, కొంతవరకు సంపాదించుకుని, ఇతరులకు అవకాశమివ్వాలి.
మనుషుల్లో అత్యాశ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. పశుపక్ష్యాదులకు పెద్ద కోరికలు ఉండవు. ఆహారం, చిన్నగూడు.. ఇలాగే అవి జీవిస్తాయి. మనుషులకు కూడా ఆహారం, ఇల్లు, రక్షణ, విద్య, వైద్యం..ఇవే ప్రాధమిక అవసరాలు. వీటికి పెద్ద కష్టపడనక్కరలేదు.
ReplyDeleteప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి. ఎన్నోమొక్కలు, చెట్లునుండి ఎంతోఆహారం..లభిస్తుంది. పాతకాలంలో మట్టితో..సున్నంతో ఇల్లు కట్టుకునేవారు..హరప్పా, మొహంజోదారో నాగరికత ఎంతో గొప్పది. ఆరోజుల్లోనే ఇళ్ళనుండి ఊరిబయటకు పోవటానికి చక్కటి డ్రైనేజ్ వ్యవస్థ ఉండేదని అప్పటి కట్టడాల ద్వారా తెలుస్తోంది. పాతకాలపు దేవాలయాలు ఎన్నో ఇప్పటికీ చక్కగా ఉన్నాయి.
వైద్యం కొరకు ఎన్నో మొక్కలున్నాయి, ఆయుర్వేదం ద్వారా ఎన్నో జబ్బులకు మందులున్నాయి. పాతకాలంలో శస్త్రచికిత్సలు కూడా జరిగేవని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. రక్షణకొరకు ఆయుధాలు వాడేవారు. అంతరిక్షం, ఇంజనీరింగ్.. ఇలా ఎన్నో విషయాల గురించి ప్రాచీనకాలంలో ఎంతో విజ్ఞానం ఉందని గ్రంధాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాలను గత పోస్టులలో వ్రాసాను.
దురదృష్టం ఏమిటంటే, మనదేశంలోని ప్రజలలో చాలామందికి స్వదేశం గురించి చిన్నచూపు ఉంది. భారతదేశం వెనుకబడటానికి ముఖ్యమైన కారణాలాల్లో ఇదొకటి.
ఆధునిక టెక్నాలజీ వల్ల ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే, ఆధునికటెక్నాలజీ వల్ల కొంత మంచి, కొంత చెడు ఉంది. టెక్నాలజీ ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి. పర్యావరణసమస్యలు పెరిగే స్థాయిలో టెక్నాలజీ ఉండకూడదు.
టెక్నాలజీ వల్ల ఓజోన్ పొర దెబ్బతిని అనారోగ్యాలు విపరీతంగా పెరిగే ప్రమాదముందని పరిశోధకులు అంటున్నారు. అణువ్యర్ధాలు, ప్రోగుచేసిన అణ్వాయుధ భయాలు ఉన్నాయి.ఇవన్నీ అందరూ ఆలోచించాలి.