koodali

Friday, January 6, 2012

అతిగా కాకుండా అవసరమైనంత వరకు......



పరిణామక్రమము ,దశావతారములు, మనువులు....ఈ విషయాల గురించి వ్రాస్తూ ఆలోచించే కొద్దీ ప్రశ్న తరువాత ప్రశ్న అలా.... అంతులేకుండా వెళ్తున్నట్లు అనిపిస్తోంది. అనేక సందేహాలు కలుగుతున్నాయి.


నేను ఇంతకుముందు టపాల్లో ... అతిగా కాకుండా అవసరమైనంత వరకు
మాత్రమే ఉండాలి.....అన్ని విషయాల్లో అతి పనికి రాదు .... అని అందరికి చెప్పి ... నేను అతిగా ఆలోచిస్తున్నానా ? నావంటి అంతగా పాండిత్యం లేనివాళ్ళు మరీ అతిగా ఆలోచిస్తే పొరపాట్లు వస్తాయేమో ? అనిపించింది.


. శ్రీ
దేవీ భాగవతము గ్రంధములో , సృష్టి గురించి, కశ్యపుని సంతానమైన జీవుల పుట్టుక, మనువుల గురించి ,. నిమి మహారాజు జగన్మాత (జగదీశ్వరి ) నుంచి వరాలు పొందిన తరువాతే మానవులకు, జంతువులకు, పక్షులకు రెప్పపాటు అనేది ఏర్పడిన విషయం ... ఇలా ఎన్నో విషయాలు వర్ణించబడ్డాయి.


( రెప్పపాటు విషయం గురించి ఆలోచిస్తే.... నిమి మహారాజుకు ముందు .జీవులకు దేవతలకు మల్లే రెప్పపాటు లేదేమో ? అనిపిస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తే క్రొత్తక్రొత్త ఆలోచనలు వచ్చి గందరగోళంగా ఉంటుంది నాలాంటి సామాన్యులకు )


శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము . గ్రంధములో .కూడా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఈ విషయాల్లో నాకు ఇప్పటికి అర్ధమయింది సముద్రంలో నీటిబొట్టంత. ఎవరికైనా ప్రాచీన గ్రంధాలలోని విషయాల గురించి సందేహాలు కలిగినప్పుడు ఈ గ్రంధాలను శ్రద్ధగా చదువుతున్న కొద్దీ సందేహాలకు సమాధానాలు లభించవచ్చు అనిపిస్తుంది .


ప్రాచీనులు తెలియజేసిన చాలా విషయాలు అందరికీ స్పష్టంగా అర్ధమయేటట్లుగా ఉండవు అనిపిస్తుంది . ప్రాచీనులు మనకు అందించిన విషయాలు చాలావరకు పైకి ఒక రకంగా కనిపిస్తే అంతరార్ధాలు వేరేగా ఉంటాయట. వారు తమకు తెలిసిన... తాము ముందు తరాలకు అందజేసే విజ్ఞానం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారట. ( లోకానికి హాని కలగకూడదని ).


ఆ విజ్ఞానం విచక్షణ గలవారికి మాత్రమే తెలియాలని వారు భావించేవారనిపిస్తుంది. అందుకే వారు విధ్య నేర్పటానికి శిష్యులకు ఎన్నో పరీక్షలు పెట్టేవారట. ప్రాచీన విజ్ఞానం అర్ధం కాదు కాబట్టి ఈ రోజుల్లో కొందరు ఎగతాళి చేస్తున్నారు.


మనం చంద్రుడు వంటి గ్రహాలను, నక్షత్రాలను కూడా వరాలిచ్చే దేవతలుగా భావించి ఆరాధిస్తాం. కొందరు ఇదంతా చాదస్తమని కొట్టిపారేస్తారు. గ్రహాలు వరాలివ్వటమేమిటి ? అక్కడుండేదంతా రాళ్ళూ, రప్పలూ అంటారు. (అయితే, ఇలాంటి విషయాల గురించి
గ్రంధాలలో తెలియచేశారు.)


మనకు తెలియని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా అర్ధం కానంత మాత్రాన అన్నీ అబద్ధాలు అని ఎందుకు భావించాలి ?

భారతయుద్ధం జరిగినప్పుడు సంజయుడు యుద్ధరంగానికి దూరంలో ఉండి కూడా ఆ యుద్ధరంగంలో జరుగుతున్న విశేషాలను ధృతరాష్ట్రునికి చెప్పటం జరిగింది. ఈ విషయం గురించి మన పూర్వులు కొందరు నమ్మేవారు కాదు.

ఎవరైనా , ఎక్కడో దూరంగా జరిగే సంఘటనలను ఎలా చూడగలరు ? ఎలా వినగలరు ? ఇది సాధ్యం కాని విషయం. పురాణాలలోవన్నీ కల్పితాలు అన్న వారున్నారు.

కానీ ఇప్పుడు టీవీలు, ఫోన్లు వచ్చాక ఎక్కడో దూరంగా జరిగే సంఘటనలను చూడటం, వినటం కూడా సాధ్యమే అని అందరికి తెలిసింది కదా !.

భౌతిక శాస్త్రం ద్వారా తెలుసుకోలేని విషయాలు......భక్తి మార్గం ద్వారా తెలుసుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు.

ఈ రోజుల్లో కూడా ఎందరో భక్తులు తమకు కలిగిన దైవానుభూతులను గురించి చెబుతున్నారు . నాస్తికులు కూడా దైవం యొక్క అనుభూతులు పొందాలంటే వాళ్ళు కూడా ఆధ్యాత్మికమార్గంలోకి వస్తే దైవానుభూతులు పొందుతారు..


ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ..నాకు తెలిసిన విషయాలను కొంతవరకు విశ్లేషించి ఇతరులకు చెప్పటం అవసరమే కానీ, తెలిసీతెలియకుండా మరీ లోతుగా విశ్లేషించటం మంచిది కాదు అనిపించిందండి. ( పొరపాట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి .)


అలాగని నాస్తికులు దైవాన్ని , ప్రాచీన విజ్ఞానాన్ని ఎగతాళి చేస్తుంటే తెలిసిన వాళ్ళు నిర్లిప్తంగా ఉంటే నాస్తికవాదం పెరిగిపోతుంది. అందుకని మనం మనకు తెలిసినంతలో అతి విశ్లేషణలు లేకుండా మన అభిప్రాయాలను గట్టిగా తెలియజేయాలి
అనిపిస్తుంది..



No comments:

Post a Comment