koodali

Friday, January 20, 2012

అశ్వమేధ యాగాన్ని గురించి .......మరి కొన్ని విషయాలు.

 

* శ్రీ దేవీభాగవతము గ్రంధములో .... వరాహస్వామి అవతార సందర్భంలో  సర్వకళ్యాణకారకమైన భూదేవీ స్తవం గురించి ఉందండి.


 ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి కలిగే ఫలాలను గురించి చెబుతూ అందులో ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి..అశ్వమేధాలు నూరు చేసిన పుణ్యఫలం లభిస్తుంది . అని కూడా చెప్పారండి. అంటే...ఈ స్తోత్రాన్ని పఠిస్తే చాలు  నూరు అశ్వమేధాలు చేసిన ఫలం లభిస్తుందని పెద్దలే చెప్పటం జరిగింది.

* పెద్దలు ...సూక్ష్మంలో మోక్షంలా.... ఇలా ఎన్నో ఉపాయాలను కూడా మనకు అందించారు. 

* శ్రీ శని దేవుని మహిమలు ............ఈ ప్రోగ్రాం .. మా... చానల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటలకు వస్తోంది. ఈ ప్రోగ్రాంలో పురాణేతిహాసాలలోని ఎన్నో విషయాలను చక్కగా తెలియజేస్తున్నారు.

 వెయ్యి అశ్వమేధ యాగాలు చేస్తే ఎటువంటి ఫలం దక్కుతుందో అంతకంటే ఎక్కువ ఫలాన్ని సత్యనిష్ఠ ఇస్తుంది ........అని పండితులు చెబుతున్నారు. సామాన్యులు ఈ విధంగా పుణ్యాన్ని పొందవచ్చు.

 హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు, వంటి గొప్పవారు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సహించి .... సత్యం యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేశారు. 


  అశ్వమేధ యాగాన్ని గురించి . తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం సార్ వివరించారు . ( ఇంతకు ముందు టపాలో వ్యాఖ్య )  నాకు సంస్కృతం అసలేరాదు. కాబట్టి ఈ విషయాల గురించి అంతగా తెలియదండి. 


అయితే నాకు తెలిసినంతలో ఏమనిపిస్తుందంటే..  అశ్వమేధ యాగాన్ని పూర్వం కొందరు రాజులు తమ రాజ్యం సుభిక్షంగా ఉండాలని ,ఈ యాగాన్ని నిర్వహించిన రాజు అందరి రాజుల కన్నా ఉన్నతస్థాయికి చేరటం వల్ల రాజ్యానికి శత్రువుల తాకిడి ఉండదని  ఇలాంటి కోరికలతో కూడా ఈ యాగాన్ని నిర్వహించేవారట. 


 సరే, కొందరు అంటున్నట్లు పట్టపురాణియే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అనుకుందాము.  అయితే ఈ ప్రక్రియలో అప్పటికే చంపబడిన గుర్రాన్నే ఉపయోగిస్తారట. ఇవన్నీ చెప్పుకోవటానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నా..

 * ప్రాణం లేని గుర్రం ....ప్రాణంలేని వస్తువుతో సమానం కాబట్టి ....రాజ్యం కోసం తప్పనిసరి పరిస్థితిలో వారలా యాగాన్ని నిర్వహించేవారేమో.


* ఇంకా.... చనిపోయిన జంతువుల శరీరభాగాలను అనేక విధాలుగా ఉపయోగిస్తారు. కొందరు వాటి చర్మం వలిచి చెప్పులు ,బ్యాగులు తయారుచేస్తారు.

 కొందరు వాటి ఎముకలు వంటి శరీరభాగాలను పొడిచేసి ఔషధాలుగా తయారుచేసి మానవ శరీరభాగాలకు ఔషధంగా పూస్తారు.( వాడతారు.) మరి ఇవన్నీ తప్పులుగా భావిస్తున్నారా ? 


 మరి ఈ రోజుల్లో చూస్తే, చాలామంది మాంసాహారం తినే వారు జంతువుల యొక్క * అన్ని రకాల శరీర భాగాలను వండి ఇష్టంగా భుజిస్తారు. మరి ఇది మాత్రం ఇబ్బందిగా అనిపించే విషయమేకదా ! ఒక రకంగా ఆలోచిస్తే ఇదీ అసహ్యంగానే అనిపిస్తుంది. కానీ ఇదంతా ఎవరూ మాట్లాడరు. 

*************

అశ్వమేధయాగంలో ఏ పద్ధతులు పాటించేవారో  చెప్పలేం. కొన్ని ఆచారాలలో కొన్ని వింతపద్ధతులు ఉన్నట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది. అయితే, గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయంటారు. ఏ విషయం ప్రక్షిప్తమో? ఏది కాదో? తెలియదు.
*****************


 ఇక అశ్వమేధ యాగంలో జంతుహింస ఒక రకంగా ఆలోచిస్తే తప్పే . అయితే , ఈ రోజుల్లో మనం మాత్రం జంతుహింస చేయటం లేదా ? మాంసాహారుల కోసం రోజూ ఎన్ని వేల జీవులు చంపబడుతున్నాయో అందరికి తెలిసిందే.

 ఇక, పరిశోధనల పేరుతో ఎన్ని జీవులను సజీవంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారో ఈ మధ్య ఒక చానల్లో చూపించారు. పరిశోధనల కోసం మూగజీవులను ఎన్నో పరీక్షలకు గురి చేస్తారు. అవి బ్రతికుండగానే నరకాన్ని అనుభవించి ఇక బాధ భరించలేనప్పుడు చనిపోతాయి.

 ఈ పరిశోధనలన్నీ మానవుల సుఖం కోసమే అంటారు ఇప్పటివాళ్ళు.

అశ్వమేధ యాగం రాజ్యంలోని ప్రజల సుఖం కోసమే అంటారు అప్పటివాళ్ళు. ఎవరి వాదన వారిది. 

* అయితే,అశ్వమేధం ఎప్పుడో తప్ప ఎక్కువసార్లు చెయ్యరు. ఆ మధ్యన సముద్రంలో ఒక నౌకనుంచి ఆయిల్ ఒలికిపోయి ఆ నూనె తెట్టులో చిక్కుకుని ఎన్నో సముద్ర జీవులు కళ్ళలోకి ఆయిల్ వెళ్ళి కళ్ళు కనబడక గిలగిలలాడుతూ చనిపోవటం చూశాము. 

 అంతేకాదు ఈ రోజుల్లో పశువుల పాలు కూడా మనం పశువులకు హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చి మరీ ఆఖరి బొట్టువరకూ పిండుతున్నాము . వాటి దూడలను కూడా పాలు త్రాగనివ్వకుండా మనమే త్రాగేస్తున్నాము. ఇవన్నీ అన్యాయాలు కాదా ? 

మనుషులు రానురానూ మరీ స్వార్ధపరులైపోతున్నారు.

 అశ్వమేధయాగం గురించి నేను టపా వ్రాయవలసివస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. పరిస్థితులు అలా వచ్చాయండి.


2 comments:

  1. నాకు తెలిసినంత వరకు రాజు ఎంతో బలవంతుడై, బలమైన సైన్య వర్గం వుంటే తప్ప ఈ "అశ్వమేధ యాగం" చేసే వారు కాదు.. ఫలానా రాజుగారి గుర్రం అని తెలిసిన వాళ్ళు ఎవరూ ఆ గుర్రం జోలికి వెల్లే వారు కాదు.. ఇక పోతే జంతు బలి అన్నది అన్ని యజ్ఞ, యాగాదులలో జరిగేది.. ఆ రోజుల్లో అది తప్పు లేదు.. దేవతల తృప్తి కోసం జంతువులను, వస్తువలను, విలువైన ధనాన్ని, బంగారాన్ని యజ్ఞ వాటికలో వేసేవారు.. అందుకే గౌతమ బుద్దుడు ఈ యజ్ఞ యాగాదులను, విగ్రహారాధనను తప్పు పట్టేడు.. జంతు బలి నిషేదించాడు.. యజ్ఞం చేసే ఋషులు కూడా జంతు మాంసాన్ని భుజించే వారు.. మనం చరిత్ర గురించి మాట్లాడే టప్పుడు ఆయా కాల మాన పరిస్థితులని కూడా గమనించాలి.. ఈ రోజుల్లో జరుగుతున్న "జలయజ్ఞం, ధన యజ్ఞాల కంటే ఆ యజ్ఞాలు చాలా మంచివి, లోక హితం కొరకు చేసినవి.. అన్ని వర్గాల వారు కలసి చేసేది.. ఒక యజ్ఞం పూర్తి అవ్వాలంటే అన్ని కులాల వారు పాల్గొని ఎవరి వంతు సాయం వారు చేసేవారు..

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      అవునండి మీరన్నట్లు...... రాజు ఎంతో బలవంతుడై, బలమైన సైన్య వర్గం వుంటే తప్ప ఈ "అశ్వమేధ యాగం" చేసే వారు కాదు.

      ఎక్కువమంది రాజులు అశ్వమేధాన్ని చెయ్యలేదనిపిస్తుంది.

      నేను జంతుబలులను ప్రోత్సహించనండి.

      దేవాలయాల్లో ప్రశాంత వాతావరణం ఉండాలని భావిస్తాము. జంతుబలులు వంటివి చూసినప్పుడు సాత్వికులైనవారు, స్త్రీలు, పిల్లలు భయపడే అవకాశం ఉంది.

      సాత్విక పద్ధతిలో దైవాన్ని ఆరాధించి కూడా దైవ కృపను పొందిన వారు చరిత్రలో ఎందరో ఉన్నారు....


      కానీ, ఈ రోజుల్లో కొందరు యజ్ఞయాగాదుల్లో జంతుబలిని విమర్శిస్తారు, కానీ తాము మాంసాహారాన్ని భుజిస్తారు. చికెన్, మటన్ అమ్మే షాప్స్ లో కోళ్ళను, మేకలను చంపినా జీవహింసే. ఇదంతా చిత్రంగా ఉంటుంది...

      కొందరికి జీవహింస ఇష్టముండదు. జీవులను చంపటాన్ని భరించలేరు. కానీ మాంసాహారాన్ని వదులుకోలేరు. దీనికి కారణం కోరికలను, మనసుని అదుపులో పెట్టుకోలేకపోవటమే,

      అందుకే పెద్దలు అంటారు. .ఒక వ్యక్తి విశ్వవిజేత కావచ్చు.......కానీ తనలోని, తనదైన మనస్సును అదుపులో పెట్టుకోవటం అన్నది అత్యంతకష్టసాధ్యమైన పని అని .

      Delete