koodali

Monday, August 11, 2014

ఓం..కొన్ని విషయములు మరియు ఋతుమతి అయిన స్త్రీ..


 నిన్నటితో  ఈ  సంవత్సరపు  అమర్నాధ్  యాత్ర  ముగిసింది. 


శ్రీ 
సువర్చలా దేవి సమేత శ్రీ ఆంజనేయ స్వామి  వారికి అనేక  వందనములు.


.................


పూర్వం  భూమిపై  జనాభా  తక్కువ  ఉండేదని,  అందువల్ల  అప్పటి  ప్రజలు  సంతానం  కోసం  తాపత్రయంతో  ఎలాపడితే  అలా  సంతానాన్ని కనేవారనే  అర్ధం  వచ్చేటట్లు ఒకరు   వ్రాసారు.(ఇలా భావించటం తప్పు. )


జనాభా  విస్ఫోటనం వల్ల  జరిగే పరిణామాల  గురించి పెద్దలు  ఎప్పుడో   తెలియజేసారు.


ఉదా..వీరిణీ దక్షులను  ప్రజా  సృష్టి చెయ్యమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు   కలిగిన  అధిక  సంతానాన్ని  చూసి  నారదుడు పరిహసించాడు. 


వీరిణీ దక్షులారా! భూగోళం  ఏపాటి  ఉందో తెలుసుకోకుండా  మీరు  ఇలా  సంతానాన్ని  వృద్ధిపరిస్తే  ఎలాగ  ? ముందుగా  పృధివీ  ప్రమాణాన్ని  తెలుసుకోండి. అటుపైని  సంతానోత్పత్తి  చేయండి...


ఈ  విధంగా  అధిక  జనాభా  పర్యవసానాల   గురించి  పెద్దలు  ఎప్పుడో   తెలియజేసారు.


........


 తనకు  పుట్టిన  పిల్లలు  తన రక్తం  పంచుకుపుట్టిన  పిల్లలే  అని స్త్రీ  నమ్మకంగా  చెప్పుకోగలదు. ఎందుకంటే , గర్భం  ధరించి  సంతానాన్ని  పొందే  అవకాశం  స్త్రీకే  ఉంది  కదా !  అయితే,  తన  సంతానం  తనకు పుట్టిన వారే  అయ్యుండాలనే  ఆశ   పురుషునికి  కూడా  ఉంటుంది.

 అయితే,  అరటాకు  ముల్లు  సామెత  ప్రకారం  పొరపాటున  స్త్రీ  అత్యాచారానికి  గురై    తద్వారా  గర్భాన్ని  ధరిస్తే ఆ  స్త్రీ  యొక్క  భర్తకు  అన్యాయం  జరుగుతుంది.  ఇవన్నీ  ఆలోచించే   పూర్వీకులు  కుటుంబ రక్షణ  కొరకు  కొన్ని  ఆంక్షలను  విధించారు. 


  అయితే,  పొరపాటున  ఏ  స్త్రీ  అయినా  బలాత్కారానికి  గురైతే  ఆమెను  వెలివేయకుండా  రజస్వలానంతరం  ఆమె  శుద్ధి  అవుతుందనే  వెసులుబాటును  ఏర్పరిచారు. 


అత్యాచారం  జరిగిన  తరువాత  స్త్రీ  ఋతుమతి  అయితే  అత్యాచారం  చేసిన  వ్యక్తి  వల్ల  గర్భం  వచ్చే  ప్రమాదం  ఉండదు. ఆ విధంగా  ఆమె  శుద్ధిని  పొందిందని అనుకోవాలి.


ఈ  ఉద్దేశంతోనే పూర్వపు వాళ్ళు  స్త్రీ  ఋతుమతి  అయితే  శుద్ధి  పొందుతుందని  చెప్పి  ఉంటారు.


అంతేకానీ,  స్త్రీలు  ఎలాపడితే  అలా పరపురుషులతో  తిరిగినా  ఋతుమతి  అయితే  చాలు  శుద్ధి  అయిపోతారు.  అని పెద్దల   ఉద్దేశం  కానేకాదు.


స్త్రీలకు  అన్యాయం  జరగకూడదనే  విశాలహృదయంతో  పెద్దలు  చెప్పిన విషయాన్ని  కొందరు వక్రీకరించటం అత్యంత  విషాదకరం.


...............

    ఇక  ఈ  విషయానికి  కన్యాత్వానికి  సంబంధమే  లేదు.  ఉదా..వివాహం  కాని  వారిని  కన్య  అంటారు.    వివాహం  అయిన  వారిని  కూడా ..
కొన్ని  సార్లు  కన్య  అనే  పద  ప్రయోగంతో  గౌరవిస్తారు.

 కన్యా  ధర్మం,  కన్యాత్వం  అంటే  మాత్రం  పురుషసంబంధం  లేకపోవటమే.
              
కుంతి,  సత్యవతి  విషయంలో  వారికి  కన్యాత్వం  పోకుండా  సంతానాన్ని  పొందటమనే  వరం  ఇవ్వబడింది.  


ఏ స్త్రీ అయినా  ఋతుమతి  అవుతుంది. శుద్ధి  పొందుతుంది.  వారికి  కన్యాత్వం  అనే  వరాన్ని  ప్రత్యేకంగా  ఇవ్వనవసరం  లేదు. 


 సూర్యుడు,  పరాశరుడు  అలా  వరాన్ని  ఇచ్చారంటే  అందులో  ప్రత్యేకత  ఉంటుంది.  కన్యాత్వము   పోకుండా  సంతానాన్ని  ఇవ్వటం  అంటే,  పురుష  కలయిక  లేకుండా  సంతానాన్ని  ఇవ్వటమనే  అర్ధం. 



సత్యవతి చేతిని  పట్టుకోవటం.. వంటి చర్యలు   పరాశరుని  విషయంలో  జరిగినట్లు  అనుకున్నా కూడా ...  కలయిక  జరిగిందని  అనుకోనవసరం  లేదు. 


 పరాశరుడు  సత్యవతికి   కన్యాత్వం  పోకుండా  వరాన్ని  ఇచ్చాడు. ఇచ్చిన మాటను  తప్పలేదు. 


దేవతలు,  గొప్ప  మహర్షులు అద్భుతమైన మహిమలు  గలవారు. 


 స్త్రీపురుష కలయిక  లేకుండానే  సంతానం  కలిగిన   ఉదాహరణలు  గ్రంధాలలో  ఉన్నాయి. ఉదా..వ్యాసునికి  శుకుడు  జన్మించటం. 


 అందువల్ల  కుంతి,  సత్యవతి  విషయంలో   ఏదో   జరిగిపోయిందని  ఇప్పటి వారు  దిగులు  చెందనవసరం  లేదు.  


ఇప్పటి  రోజుల్లో  స్త్రీపురుష  కలయిక లేకుండానే  సంతానాన్ని  పొందే  అవకాశాలు  ఉన్నాయి. ఉదా..టెస్ట్ ట్యూబ్  పద్ధతి. 

  ఇప్పటి  వారికే    ఇలాంటి   పద్ధతులు  తెలిసినప్పుడు  ఎన్నో  మహిమలు  గల  దేవతలకు, రుషులకు  మరెన్నో  విద్యలు  తెలుస్తాయి  కదా  !


..................


స్త్రీలలో  భేదాలను  గురించి  యమధర్మరాజు  సావిత్రికి  తెలియజేసిన  కొన్ని  విశేషాలు...


(  శ్రీ దేవీ  భాగవతము  నుంచి  తెలుసుకున్నవి..  )


పతివ్రతా  చైకపతౌ  ద్వితీయే  కులటాస్మృతా

తృతీయే ధర్షిణీ జ్ఞేయా చతుర్ధే పుంశ్చలీత్యపి
వేశ్యా చ పంచమే షష్ఠే పుంగీ చ సప్తమే2ష్టమే
తత ఊర్ధ్వం మహావేశ్యా సాస్పృశ్యా సర్వ జాతిషు

 ఒకడిని  అగ్నిసాక్షిగా  పరిణయమాడి  త్రికరణశుద్ధిగా  అతడితో  జీవించేది  పతివ్రత. 


రెండవ వాడితో  సంపర్కం  పెట్టుకుంటే  కులట.


 ముగ్గురితోనైతే  ధర్షిణి.


 నలుగురితో  పుంశ్చలి. 


అయిదుగురితో  వేశ్య. 


ఇంకా  ఆపైని  మహా  వేశ్య. 


కులట  నుంచి  మహావేశ్య  వరకు ఎవరిని  పొందినా..నరకానికి  పోవడం  తధ్యం. 

............................ 

ఇంకా,  వివాహసమయంలో  నాతిచరామి  అనిపించటం  ద్వారా ..భార్యను  మీరి  చరించను . అని  వరుని  చేత అనిపిస్తారు.


పై విషయాలను గమనించితే  స్త్రీలు  పురుషులు  తమ ఇష్టం  వచ్చినట్లు  ప్రవర్తించటాన్ని పెద్దలు ఒప్పుకోలేదని  తెలుస్తుంది. 


 ............................... 


పరాశరుడుసత్యవతి కధలో... 


ఒక రోజున మధ్యాహ్నం  ఆ  యమునానది  ఒడ్డున తండ్రికి  భోజనం  వడ్డిస్తోంది. అదే  సమయానికి  అక్కడికి  వచ్చాడు  పరాశర  మహర్షి. ... నావలో  నదిని  దాటించమని  దాశరాజును అడిగాడు. అత్యవసరంగా  వెళ్ళాలని  త్వరపెట్టాడు. 


భోజనం  చేస్తున్న  దాశరాజు మధ్యలో  లేవటం  ఆచారం  కాదు  కనక  మత్శ్య  గంధిని  పురమాయించాడు. అమ్మాయీ! ఆవలి  ఒడ్డుకు  చేర్చిరా.వెళ్ళాలని  తొందర పడుతున్నాడు.  పైగా  తపస్వి. అన్నాడు సరేనంది  మత్శ్యగంధి. 


పరాశరుడు నావ  ఎక్కి  కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేసి  నడుపుతోంది.  ఆమె  నవయౌవనం  పరాశరుణ్ణి  ఆకర్షించింది. చిరునవ్వులూ  వాలుచూపులూ గెడవేసే  సోయగం  మునీశ్వరుణ్ణి  ఉక్కిరిబిక్కిరి  చేశాయి. దైవయోగం  అలా  ఉంది..

తరువాత   పరాశరుడు   తనను  కోరుకోవటం  చూసి   సత్యవతి  భయపడుతుంది.  

పరాశరుడు  సత్యవతికి  మధ్య  జరిగిన సంభాషణలో  కొంత భాగం ...


పరాశరుడు..నీ  కన్యాత్వం  చెడదు. ఇది  నేనిస్తున్న వరం. భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమైనా  ఉంటే  చెప్పు.



సత్యవతి
.. మహా తపస్వీ!  మా తల్లితండ్రులకు  గానీ లోకానికి  గానీ ఈ సంగతి  తెలియకూడదు. నా  కన్యాత్వం  చెడకూడదు.అన్ని  విధాలా  నీ  వంటి  పుత్రుడు  నాకు  కావాలి. ఈ యౌవనం  ఈ పరిమళం  శాశ్వతంగా  ఉండిపోవాలి. 


పరాశరుడు..సుందరీ ! తధాస్తు.విష్ణ్వంశతో కొడుకు  పుడతాడు. ఇదేమిటో వింతగా  ఉంది. ఎందరెందరో అప్సరసల  ఒయ్యారాలను  చూశాను. ఎప్పుడూ  నా  మనస్సు  చలించలేదు. దుర్గంధం  ఉన్నా  నల్లగా  ఉన్నా నిన్ను  చూసి  మనస్సు  పడ్డాను. వింత  కాదూ!..

...............

 ద్రౌపది  గురించి శ్రీ పాద శ్రీ వల్లభస్వామి  సంపూర్ణ  చరితామృతము  గ్రంధము లో  ఎన్నో  వివరములు  ఉన్నాయి.  ఆసక్తి  ఉన్నవారు  చదవవచ్చు.

...................

పెద్దలు  మనకు  కుంతి కధ  ద్వారా  ఎన్నో  పాఠాలను  నేర్పించారు. 


   కుంతి  కధను  ఈ  కాలపు  దృష్టితో  చూస్తే  ,


వివాహానికి  ముందు  తమ   పిల్లలు   తప్పటడుగు  వేయకూడదని   తల్లితండ్రి  తాపత్రయపడతారు.   వివాహానికి  ముందే  సంతానాన్ని  పొందటం  వల్ల  కలిగే  నష్టాలను  తల్లితండ్రులు  పిల్లలకు  చెప్పటానికి  ఇబ్బందిగా  ఫీలవుతారు.


అలాంటప్పుడు  పురాణేతిహాసాల  ద్వారా  కుంతి,  శకుంతల  వంటి  వారి  కధలను  వినిపిస్తే  పిల్లలు  జాగ్రత్తగా  ఉండే  అవకాశం  ఉంది.


అయితే,  కుంతీదేవి  భర్త మరణం వల్ల  కలిగిన కష్టాన్ని  తనలోని  దాచుకుని  ఎంతో  నిబ్బరంగా  పిల్లలను  పెంచుకుంది.

శకుంతల  తనకు  ఎదురైన  కష్టాన్ని  నిబ్బరంగా  ఎదుర్కుని  విజయాన్ని  సాధించింది.
.....................

ఎదిగీఎదగని  వయస్సు  పిల్లలకు  కొన్ని  విషయాలను  అందించకూడదు  అనే   పాఠాన్ని  కూడా  నేర్చుకోవచ్చు. 
 
  చిన్నపిల్ల  కుంతికి  దుర్వాస  మహర్షి  సంతాన  మంత్రాన్ని  ఉపదేశించి వెళ్ళారు.

   ఆ వయస్సుకు  తగ్గ  ఉత్సుకతతో  దుర్వాసముని   ఇచ్చిన  మంత్రాన్ని  పరీక్షించాలనుకుని  కుంతి   మంత్రాన్ని  పఠించింది.



  మంత్రాధీనుడైన  సూర్యుడు  వచ్చి  సంతానాన్ని  ప్రసాదించారు.  కుంతి  జీవితం  చిక్కుల్లో  పడింది. 


కర్ణుడికి  జన్మనిచ్చింది. లోకనిందకు  భయపడి  పిల్లవాడిని  వదిలివేసింది.  కర్ణునికి అన్యాయం  చేసానని  జీవితాంతమూ  కుమిలిపోయింది.


  పిల్లలకు  తెలియనక్కరలేని   ఎన్నో  విషయాలు  ఈ రోజుల్లో   మీడియా  ద్వారా  అందరికీ  అందుబాటులోకి  వచ్చాయి.


  వాళ్ళు  ఉత్సుకతతో  వాటిని  చూస్తారు. వాటి  ప్రభావం  సమాజంపై  చాలా  ఉంటోంది. 

.....................  

ఇక  సత్యవతి పరాశరుల  కధను  ఈ  కాలపు  దృష్టితో  చూస్తే , ( అంటే, పరాశరుడు   ఏ మహిమలూ  లేని  సాధారణ  వ్యక్తి   అనుకుని చూస్తే...)


  స్త్రీ  పురుషుడు  ఒంటరిగా  ఉండే  సమయం   చిక్కితే   కొందరు  గొప్పవారికి  కూడా  మనస్సు  అదుపు తప్పే  అవకాశం  ఉందనే  పాఠాన్ని  ఈ  సంఘటన  ద్వారా  నేర్చుకోవచ్చు.
..................................

     పురాణేతిహాసాలలోని  కధలలో  పైకి  కనిపించే  సామాన్య  అర్ధాలే  కాకుండా  వాటిలో  ఎన్నో  అంతరార్ధాలు  ఉంటాయి. 
 ........................ 

ఈ కధలలో ఉన్న నీతిని  సమాజానికి  అందించితే  మంచిని  చేసిన  వాళ్ళమవుతాము. 


 అంతేకానీ ,  అప్పటి  వాళ్ళను  నెగటివ్ గా  చూపించటానికి  ప్రయత్నిస్తే   సమాజానికి  ద్రోహం  చేసిన  వాళ్ళవుతారు.


పురాణేతిహాసాల  పాత్రల  ద్వారా  ఎన్నో  పాఠాలను పెద్దలు  మనకు  అందించారు.  


  దైవం , ముందే  అనుకున్న  ప్రణాళిక  ప్రకారం  మహా  భారతం  వంటి   జీవిత  కధలను  నడిపించారని  పెద్దలు  తెలియజేసారు. దేవతలు   మరియు  ఎందరో  మహర్షులు   లోకానికి  ధర్మాధర్మాలను  నేర్పే  జగన్నాటకంలో  పాత్రధారులు   అయ్యారు. 

...................... 

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.


Thursday, July 31, 2014

చరిత్ర కాలాన్ని నిర్ణయించటంలో........

  
చరిత్ర  కాలాన్ని  నిర్ణయించటంలో....చరిత్ర   గురించి  తెలుసుకోవటంలో.. 
*******************************************
 
నేటి  పంచాంగకర్తలు,   ఆధునిక  పరికరాల  సహాయం  లేకుండానే  నక్షత్రాలు,  గ్రహాల  స్థితిగతులను  బట్టి,   జ్యోతిష  విజ్ఞానం  ఆధారంగా  లెక్కలుగట్టి ...రాబోయే  గ్రహణాల  గురించి   పంచాంగాలలో  సంవత్సరానికి  ముందే  వివరంగా  చెప్పగలుగుతున్నారు  .  వారు  చెబుతున్న  సమయానికే  గ్రహణాలు  సంభవిస్తున్నాయి.
 
 తిధులు,  నక్షత్రాలు,  గ్రహాలు  ఉన్న  స్థితి  ఆధారంగా    రామాయణ  కాలంలో   జరిగిన  సంఘటనల  యొక్క  వివరాలను  వాల్మీకి  మహర్షి   చక్కగా  పొందుపరిచారంటున్నారు. 

ఆ  వివరాల  ఆధారంగా    ఇప్పటి  వాళ్ళు  రామాయణం   జరిగిన  కాలాన్ని  అంచనా  వేయగలుగుతున్నారు.  

 ఇవన్నీ  గమనిస్తే  ప్రాచీనులు  అందించిన  జ్యోతిషం  ఆధారంగా  చరిత్రకాలాన్ని  కూడా  తెలుసుకోవచ్చని  చక్కగా  తెలుస్తోంది.

........................

ఒకసారి  విక్రమాదిత్యుడు  ధ్యానము చేయగా   అయోధ్యా నగరం  యొక్క  పురాతన  కట్టడాలు   కళ్ళముందు  గోచరించగా  ఆ  ప్రకారం  వారు  ఆ కట్టడాలను ..నిర్మించారని అంటారు.

చరిత్ర   గురించి  తెలుసుకోవాలంటే   ఇలాంటి  అద్భుత  విషయాల  గురించి  కూడా  తెలుసుకోవాలి.

దురదృష్టమేమిటంటే,   కొందరు  ఆధునికులు   ఇలాంటి  విషయాలను  నమ్మము . అంటారు. తమకు  తెలిసిన  కొద్ది  విషయాలే   విజ్ఞానం  తప్ప,....  తమకు  తెలియని  విషయాలు   విజ్ఞానమే  కాదంటారు.

ఆధునికులకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత .... తెలియని  విజ్ఞానం  మరెంతో  ఉంది . అని    గ్రహిస్తే  బాగుంటుంది.


( ఈ విక్రమాదిత్యుని  విషయం  ఓం చానల్  వారు  ప్రసారం  చేసిన  అయోధ్య గురించిన  విశేషాల ద్వారా తెలుసుకున్నది.) 
.................

ఆ మధ్య,  నాసా  వాళ్ళు   తాము  తీసిన   రామసేతు  చిత్రాలను  విడుదల  చేసారు.

ఈ  మధ్యనే   ఇంకో  వార్త  వచ్చింది.  ప్రాచీన  కాలంలో  సముద్రంలో మునిగిపోయిన  ద్వారకా  నగర  ఆనవాళ్ళను  గుర్తించామని  ఆధునిక  శాస్త్రజ్ఞులు  ప్రకటించారు.

కొన్ని  లింక్స్..

NASA Images Find 1,750,000 Year Old Man-Made Bridge


Dwaraka - A LOST CITY RECOVERED - ISKCON Desire Tree

................................

సింధు  నాగరికత  శిధిలాలలో  రధాలు,  గుర్రాలు  మొదలైన  వాటి  ఆనవాళ్ళు  లభించనంత  మాత్రాన  ..రామాయణం, భారతం  వంటివి  సింధు  నాగరికతకు  తరువాతే  జరిగాయి ... అని  ఆధునిక  చరిత్రకారులు  భావించటం  సరికాదనిపిస్తుంది.
.......................

 కొన్ని సింధు లోయ ముద్రలు స్వస్తిక్ గుర్తు కలిగి ఉన్నాయి.  హిందూ మతానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ప్రాచీన హరప్పా సంస్కృతికి ముందు కూడా ఉన్నాయి.  శివలింగాన్ని పోలిన కొన్ని గుర్తులు కూడా హరప్పా శిథిలాల్లో కనిపించాయి.వీరి చిహ్నాలలో ముఖ్యమైనది పద్మాసనం లో కూర్చున్న ఒక బొమ్మ, మరియు దాని చుట్టూ ఉన్న వివిధ జంతువులు. శివుడి రూపమైన పశుపతి విగ్రహంగా దీన్ని భావిస్తున్నారు. 


(  ఈ  పేరాలోని  సింధు  నాగరికతకు  సంబంధించిన  విషయాలు అంతర్జాలం  నుండి  సేకరించినవి... ) 
..........................

చరిత్ర  గురించి  చరిత్రకారులలో  ఎన్నో  బేధాభిప్రాయాలున్నాయి.  చరిత్ర  గురించి  తెలుసుకోవటానికి   ఆధునిక  సైన్స్ ద్వారా  కూడా ప్రయత్నం  చేస్తున్నారు.  

కార్బన్  డేటింగ్   విధానంలో   కొన్నిసార్లు  పొరపాట్లు  జరిగే  అవకాశం  ఉందట.   
..................................

అనేక  కారణాల  వల్ల    చరిత్రను  విశ్లేషించటంలో  పొరపాట్లు  వచ్చే  అవకాశం  ఉంది.

ఇప్పటి  2014  సంవత్సరంలో  కూడా  ప్రపంచంలోని  కొన్ని  తెగలవారికి  ఆధునిక  విజ్ఞానం  గురించి  తెలియదు.  

ఉదా...  10 Tribes That Avoided Modern Civilization..
( The Surma People, Peruvian Tribe .... )  


పట్టణాలకు  కొద్ది  దూరంలో  ఉండే   అడవుల్లో  నివసించే  కొన్ని  ఆటవిక  తెగల  వారికి  కూడా  ఆధునికపరికరాలైన  ఫ్రిజ్,  వాషింగ్ మెషీన్ , కంప్యూటర్..వంటి  వాటి   వాడకం  గురించి  తెలియకపోవచ్చు. 

ఇప్పటికీ    కొందరు   మట్టితో  కట్టుకున్న  ఇళ్ళలో  నివసిస్తూ ...  చెక్కతో  చేసిన  వస్తువులు,  మట్టితో  చేసిన  వస్తువులు  మాత్రమే  వాడుతున్నారు. 


భవిష్యత్తులో  కొన్ని  వేల   సంవత్సరాల  తరువాత  చరిత్రకారులు   భూమిపై  పరిశోధనలు  చేస్తే...?

ఉదా..   ఫ్రిజ్,  వాషింగ్ మెషిన్ ,  కంప్యూటర్.. వంటి వాడకం   తెలీని   ప్రాంతములో  త్రవ్వకాలు  జరిపితే.....

...  ఆ  శిధిలాలలో  ఫ్రిజ్,  వాషింగ్ మెషిన్, కంప్యూటర్..  వంటివి  కాకుండా  చెక్కతో  చేసిన  వస్తువులు, మట్టితో  చేసిన  వస్తువులు  లభించాయనుకోండి,   వాటి  ఆధారంగా   2014  సంవత్సరములో   ప్రపంచంలో  ఫ్రిజ్,  వాషింగ్ మెషిన్ , కంప్యూటర్.. లేవని  చరిత్రకారులు  నిర్ణయించకూడదు కదా  !
...................................

గత కొద్ది  కాలం నుంచి ,  విదేశాల్లో  ఎందరో  భారతీయులు  నివసిస్తున్నారు.  వారిలో  హిందువులూ  ఉంటారు . వారి వద్ద  వేద  సంస్క్రతికి  చెందిన  చిహ్నాలు  ఉంటాయి.

 భవిష్యత్తులో  కొన్ని  వేల   సంవత్సరాల  తరువాత   అక్కడ   భూమిలో  త్రవ్వకాలు  జరిపితే  ?  అక్కడ 
వేద  సంస్క్రతికి  చెందిన  చిహ్నాలు  దొరికాయనుకోండి.

    20 , 21 వ శతాబ్ద  మధ్య కాలంలో   పశ్చిమ దేశాల్లో   హిందూ నాగరికత   వెల్లివిరిసింది . .. అని భవిష్యత్  చరిత్రకారులు భావిస్తే ...అది  కొంత వరకు  మాత్రమే  నిజం . 

....................

కొంతకాలం  క్రిందట  మనదేశంలో  జరిగిన  విదేశీదండయాత్రలలో  ఎన్నో  దేవాలయాలు ,  పురాతన  కట్టడాలు    ధ్వంసం చేయబడ్డాయి. 

 విదేశీ  దండయాత్రలలో  నాశనం  అయిన  ఎన్నో  దేవాలయాలను  అహల్యాబాయ్  హోల్కర్  అనే  ఆమె  పునర్నిర్మింపజేశారంటారు.  

  ఇలా,  కట్టడాల పునర్నిర్మాణం  అంటే ,  ప్రాచీన  కట్టడాలలోని  రాళ్ళు..  + ఆధునిక  వస్తువులు  కూడా  కలిపి  పునర్నిర్మాణం  జరుగుతుంది. 


ఇలాంటి  కట్టడాల  ప్రాచీనతను  గుర్తించవలసివచ్చినప్పుడు   కట్టడము  యొక్క   కాల  నిర్ణయంలో  పొరపాట్లు  జరిగే  అవకాశం  ఉంది.
............................ 

  ఇలా  అనేక  కారణాల  వల్ల  చరిత్రలో  కాలాన్ని  నిర్ణయించటంలో  పొరపాట్లు  జరిగే  అవకాశం  ఉంది.

  చరిత్రకు సంబంధించి  కాలాన్ని  నిర్ణయించటంలో    ప్రాచీనులు  తెలియజేసినట్లు  జ్యోతిష  శాస్త్రాన్ని  కూడా  ఆధారంగా  తీసుకుంటే  చక్కటి ఫలితాలు  వచ్చే  అవకాశం  ఉంది.

***********
 కొందరు పాలకులు తమ పాలన ఎలా ఉన్నా కూడా, అంతా మంచిగా వ్రాయాలని చరిత్రకారులను బెదిరించేవారూ ఉంటారు.

చరిత్రకారులలో కూడా .. ఎవరి రాజకీయాలు, ఎవరి భావాలు వారికి ఉంటాయి. అందుకే చరిత్ర కూడా మనకు కనిపించేది, వినిపించేది..అంతా 100 శాతం నిజం అనుకోనవసరం లేదు.
 

ఆధునికులకు అంతుబట్టని రహస్యాలెన్నో..కొన్ని విషయములు...

 
ఒక  యోగి  ఆత్మ కధ  గ్రంధములో  సైన్స్  గురించి  కూడా   అద్భుతమైన    విషయములు  ఉన్నాయి. 

   ప్రపంచవ్యాప్తంగా  ఎందరో  ఈ  గ్రంధాన్ని  మెచ్చుకున్నారు.

  శ్రీశ్రీ స్వామి శివానంద  గారు .. శ్రీశ్రీ పరమహంస  యోగానంద  గారిని  ఎంతగానో  మెచ్చుకున్న  సంగతి  గ్రంధములో  ఉన్నది.
.........................

ప్రాచీన  విజ్ఞానం  ఎంతో  గొప్పది.  ఆధునికులకు  అంతుబట్టని  రహస్యాలెన్నో  ప్రాచీనులకు  తెలుసు.  

 మనుషులు  ఆహారాన్ని  సరిగ్గా  తీసుకోకుంటే   ఎక్కువకాలం 
ఆరోగ్యంగా  జీవించలేరని  ఆధునిక  సైన్స్  చెబుతుంది.

అయితే,   ఆహారాన్ని   తీసుకోకుండా   దైవ  ధ్యానంలో  ఉంటూ  తపస్సు  చేసిన  కొందరు  మహర్షుల  కధలు  మనకు  తెలుసు.  


ఈ  రోజుల్లో  కూడా   ...ఉత్తర భారతదేశానికి  చెందిన  ఒక దైవ  భక్తుడు   ఎంతో  కాలంగా  సరిగ్గా  ఆహారాన్ని  తీసుకోకపోయినా  చక్కగా 
ఆరోగ్యంగా  జీవిస్తున్నారని  వార్తలలో  వచ్చింది. 

  పరిశోధకులు  ఆ   వ్యక్తిని  ఒక  గదిలో  ఉంచి ,  బయటనుంచి  అతనికి  ఎటువంటి  ఆహారమూ  అందకుండా  గట్టిగా  కట్టుదిట్టం  చేసి,  ఆహారాన్ని  తీసుకోకున్నా  ఆ  వ్యక్తి  ఎలా  ఆరోగ్యంగా  ఉంటున్నాడో  ?  అని  ఎన్నో  పరీక్షలు  చేసారు.  అయినా  పరిశోధకులకు  
 విషయం ఏమీ  అంటుబట్టలేదు. 


.. ఆహారాన్ని  తీసుకోకపోయినా  చక్కగా  జీవించటం  సాధ్యమే  అనే విషయం   గురించి  ఒక  యోగి  ఆత్మ కధ  గ్రంధములో   వివరములు  ఉన్నాయి. 


ఇలాంటి  ఎన్నో  విషయముల  గురించి  ప్రాచీనులకు  తెలుసు.


Friday, July 25, 2014

వింటే వినండి .. .........

 
చరిత్ర   పేరుతో  కొందరు  పురాణేతిహాసాలలోని  పాత్రలను  కించపరిచేటట్లు  వ్రాస్తున్నారు.  ఇది   ఎంతో  బాధాకరం. 

ఒక్క  విషయం  ఏమిటంటే  పూర్వీకులు  ఇప్పటివాళ్ళకన్నా  విజ్ఞానవంతులు. తమ  మహిమలతో  ఎన్నో  అద్భుతాలు  చేయగలిగినవారు.  


 ప్రాచీనుల  విజ్ఞానానికి  ఉదాహరణలుగా  ఇప్పుడు  కూడా  ఎన్నో   విషయాలు  ఆధునిక  విజ్ఞానానికి  అంతుబట్టని  రహస్యాలుగా  మిగిలిఉన్నాయి.
..............................

ఒక విషయం  చెప్పాలనుకుంటున్నాను....నాకు  చరిత్ర  గురించి  కొద్దిగా  తెలుసు.   ఎలాగంటే, నేను   అన్నామలై  యూనివర్సిటీ  ద్వారా  M.A.  చదివాను. దైవం  దయ  వల్ల  పాసయ్యాను.  


 ఇండియా  చరిత్ర,  తమిళనాడు  చరిత్ర,  యూరోప్  చరిత్ర,   అమెరికా  చరిత్ర,  ..ఏదో  బట్టీపట్టీ  చదివి ,   దైవం  దయ  వల్ల  పాసయ్యాను.

అన్నీ  కలిపి  బట్టీపట్టి  చదివేసరికి  ఇప్పుడు  ఏదీ  సరిగ్గా  గుర్తు  లేదు.


 నాకు ,  బట్టీపట్టి    చదివిన  విషయాల  కన్నా,  వార్తాపత్రికలో  ఒక్కసారి  చదివిన  విషయాలు  ఎక్కువకాలం  గుర్తుంటాయి. 

న్యూస్ పేపర్ చదవటం అంటే నాకు  చిన్నప్పట్నించి చాలా ఇష్టం. అందువల్ల ప్రపంచ చరిత్ర గురించి నాకు కొంత తెలుసు. న్యూస్ పేపర్ చదవటం అంటే ఉన్న ఇష్టంతో   న్యూస్ పేపర్లను   ఆసక్తిగా చదవటం వల్ల  ఒక్కసారే  చదివినా  కూడా .. గుర్తుంటాయి. పీజీ డిగ్రీ  కొరకు చదవటం  అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల,  అలా  చదివిన విషయాలు అంతగా గుర్తు ఉండవు .

.................................


ఒక విషయం  చెప్పాలనుకుంటున్నాను. నేను  చిన్నతనంలో  నాస్తికురాలైన  ఒక  టీచర్  మాటలను  విని ,   దేవుడు  లేడని వాదించటం,  దైవ   ప్రసాదాలను  తిరస్కరించటం,  పురాణేతిహాసాలను  ఎగతాళి  చేయటం,   దైవచిత్రాలను  కాలిక్రింద  తొక్కటం కూడా చేసాను. 

అప్పుడు  నేను బాగా  చదివే  స్టూడెంటును.   ఫస్ట్  మార్కులతో   ఎన్నో బహుమతులను  తెచ్చుకున్న  నేను   క్రమంగా  చదువులో  వెనుకబడిపోయాను.

తరువాత   మళ్ళీ  బుద్ధి  వచ్చి    భక్తితో  ఉండటం   మొదలుపెట్టాను.

 కొంతకాలం  క్రిందట  నాకు   కష్టాలు  వచ్చాయి. (కష్టాలంటే,  నా  చేతిలో  లేని  విషయాల  గురించి  అనవసరంగా  ఎక్కువగా  ఆలోచించి  నాకు నేను  తెచ్చుకున్న  కష్టాలు.  )


 ఎంతో  మానసిక  వేదనను  అనుభవించాను.  ఆ  బాధ  ఎలా  ఉంటుందంటే,    మనసును  మెలిపెట్టేసి,   ఈ బాధ  శత్రువుకు  కూడా  వద్దు  బాబోయ్  ! అనుకునేంతగా  అనిపిస్తుంది.

 నాకు  జీవితంలో  అన్నీ  ఉన్నాయి.  మాకు  తెలిసిన  వాళ్ళు  నాది  ఎంతో  అదృష్టమైన  జీవితం  అంటారు.  ఎప్పుడూ  సరైన  దారిలో  నడిపించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

అయితే,  దైవాన్ని  నిందించటం  వల్ల  దైవానికి  కోపం  వచ్చి  మనలను  శిక్షించటం  జరగదు.... దైవం  దయామయులు. దారి  తప్పే  బిడ్దలను  సరైన  దారికి  తీసుకురావటానికి   కొద్దిగా  కష్టాన్ని  కలిగిస్తారు. అదీ  బిడ్ద  మంచికోసమే.   



గొప్పశక్తి  గల  వ్యక్తుల  వద్ద  ఉంటే  మనకు  ఎంతో  ప్రయోజనం  కలుగుతుంది  కదా  ! ఇక  సృష్టిలో  అన్నింటికన్నా  గొప్పశక్తి  అయిన  దైవానికి  దగ్గరయ్యే  వ్యక్తులకు  ఎంతో  మంచి  జరుగుతుంది .



 దైవం  లేరని  చెప్పే  నాస్తికుల  వల్ల  ఎందరో  వ్యక్తులు   దైవానికి  దూరమవుతారు.   అందుకే  దైవాన్ని  నిందించే  వాళ్ళకు  పాపం  తగులుతుంది.


పురాణేతిహాసాల  గురించి  చర్చ  జరగవచ్చు.  అయితే  పురాణేతిహాసాలను  వక్రీకరించటం  తప్పు.  ఇలా  చేయటం  వల్ల  సమాజానికి  కూడా  మంచిదికాదు.
...............................

దైవం  గురించి,  పురాణేతిహాసాలలోని  పాత్రలను  చెడ్దగా  చూపించటానికి   ప్రయత్నించటం  వల్ల  మొదట  సంబరంగానే  ఉండొచ్చు. తరువాత  వాటి  ఫలితాలను  తట్టుకోవటం  మాత్రం  ఎంతో  కష్టంగా  ఉంటుంది. 



 నా  స్వానుభవంతో  చెబుతున్నాను.  దైవనింద,  పురాణేతిహాసాలను   వక్రీకరించి  చెప్పటం..వంటి  చెడ్డ  పనులను  చేయవద్దు.  

వింటే  వినండి .. లేకపోతే  ఎవరి  కర్మకు  వారే  బాధ్యులు.

.............................

కొన్ని   విషయాలపై  నా  అభిప్రాయాలు...   


పరస్త్రీని  తల్లిలా  చూడమని  పెద్దలు  చెప్పిన  సంస్కృతి  మనది.    అయితే  తమ  ఇష్టాలకు  అనుకూలంగా  ధర్మాలను  మార్చి  చెప్పుకునే  స్త్రీలు, పురుషులు  ఆ  కాలంలోనూ  , ఈ  కాలంలోనూ  ఉంటారు.  శర్మిష్ఠ  తనకు  అనుకూలంగా  ఉండేటట్లు  యయాతితో  మాట్లాడి  ఉండవచ్చు. 
...............................

పరాశరుడు ఒక మునే కానీ దైవం  కాకపోవచ్చు.  అయితే  వారికి  అద్భుతమైన  మహిమలు  చేసే  శక్తులు  ఉన్నాయి. జన్మించిన  సంతానం  వెనువెంటనే  పెరిగి పెద్దయ్యే  విధంగా  వరాలను  ఇచ్చే గొప్ప   శక్తులున్న  వారు  పరాశరులు. అప్సరసలను  చూసినా  తొణకని  వ్యక్తి  పరాశరుడు. 



భారత  కధ  ముందే  ఒక  ప్రణాళిక  ప్రకారం  జరపబడిందని  గ్రంధాల  ద్వారా  తెలుస్తోంది. లోక  హితం  కోసం  దైవం  ఈ  కధలను ,  అందులోని  పాత్రధారులను  నడిపించారు. ఈ  పాత్రల  ద్వారా  లోకులు   ఎన్నో  విషయాలను  తెలుసుకోవచ్చు.

.................................


సత్యవతి, కుంతి మధ్య ఎందుకు ఈ తేడా అంటే , కర్ణుని  పాత్ర  శూద్రుల   ఇంట పెరగటం ,  తదనంతరం జరిగిన సంఘటనల  వల్ల  దుర్యోధనుడు   మిత్రుడవటం,  దుర్యోధనుని  పట్ల కృతజ్ఞతతో  కర్ణుడు జీవితాంతమూ  స్నేహధర్మానికి  బంధితుడు  కావటం  జరిగింది.



 సహజపద్ధతిలో  జన్మించిన  పిల్లలకు పుట్టుకతో   సహజ  కవచ కుండలాలు  ఉండవు  కదా  !
 
 ఇక  వ్యాసుని  విషయం  వేరు.   వారు  పుట్టిన  వెంటనే  తపస్సు  చేసుకోవటానికి  వెళ్ళిపోయారు.   వారి  పాత్రకు  తగ్గట్లు  వారి  పాత్రకు  రూపకల్పన  జరిగింది.
.....................


కుంతి  మరియు  సత్యవతి  విషయంలో   కన్యాత్వం  చెడకుండా  సంతానాన్ని  ప్రసాదించటం  జరిగిందనే    గ్రంధాలలో  ఉంది.

 కన్యాత్వం  చెడకుండా  సంతానాన్ని  ప్రసాదించటం  అంటేనే    సహజప్రక్రియ  కాదని  తెలుస్తూనే  ఉంది.  
..................................


  ఇతరుల  విషయాల  పట్ల   అనుమానాలు  కలగటమే  జనం  పని. ఇందులో  ఆశ్చర్యం  ఏమీలేదు. సామాన్య  ప్రజలకు  దుర్వాసుని  శాపం  మొదలైన  విషయాలు  తెలియవు  కదా  ! అందుకే  కుంతీదేవిని   అనుమానించి  ఉంటారు  . 
.............................


సంస్కృత, తెలుగు భారతాల మధ్య తేడా కనిపిస్తుందని  అంటున్నారు.  ఇలా  తేడాలు  కనిపిస్తున్నాయని  అంటేనే , గ్రంధాలలో   ఆధునికులు  మార్పులుచేర్పులు  చేసి  ఉండవచ్చని 
అర్ధమవుతోంది  కదా  !

 ఏవి  ప్రాచీనులు    అందించిన   విషయాలో?  ఏవి  ఆధునికులు  చొప్పించిన  విషయాలో ?   ఎలా  తెలుస్తుంది  ?  


సమాజానికి  చెడును  కలిగించే  విషయాలను  పవిత్ర  గ్రంధాల  ద్వారా  ప్రాచీనులు  అందించరు  కదా  ! అందువల్ల  గ్రంధాలలో  చెడు  సంగతులు  ఏమైనా  ఉంటే ... అవి  ఆధునికులు  చేసిన  మార్పులుచేర్పులే  అయ్యుంటాయి. 

 ఇప్పుడు  చూస్తున్నాము  కదా  !  ప్రాచీన  గ్రంధాల  గురించి   ఎవరికి  తోచినట్లు  వారు  ఊహించి  వ్రాసేస్తున్నారు.  ఇక  ఇంతకుముందు  ఎన్ని  మార్పులుచేర్పులు  జరిగాయో  ?
.................................


 హస్తినాపురం  నేటి  ఉత్తరప్రదేశ్  వద్ద  ఉందని  అంటారు.


పాండవులది  హస్తినాపురం  అయితే ... పాండవులు  విదేశీయులు ..వాళ్ళది   టెబెట్  ప్రాంతమని అనటమేమిటో ?




ఆధునిక చరిత్రకారులు చెబుతున్న కొన్ని విషయాలను గమనించితే....



మానవులు  లిపిని  కనిపెట్టటానికి  ముందు  కాలాన్ని  చరిత్రకు  ముందు  కాలం  అని ,  లిపిని  కనిపెట్టిన  తరువాతి  కాలాన్ని  చారిత్రిక  యుగమనీ  ఆధునిక  చరిత్రకారులు....వర్గీకరించారు.  



  ( సింధు  నాగరికతకు  ముందు  కాలంలో  ప్రపంచంలో  లిపి  అనేది  లేదని  ఆధునిక  చరిత్రకారుల  అభిప్రాయం. 


ఇండస్ స్క్రిప్ట్  (  సింధు  లిపి  ) అర్ధం  చేసుకోవాలని  ఎంతో  ప్రయత్నించినా , ఇప్పటికి  వరకు  ఎవరూ  అర్ధం  చేసుకోలేకపోయారు.  )
 

వేదవ్యాసుడు  మహాభారతాన్ని  గ్రంధస్థం  చేయటానికి  పూనుకున్నప్పుడు    గణపతిని  సాయమడిగారనీ  కొన్ని  షరతులతో  గణపతి  ఒప్పుకున్నారనీ   అంటారు. 




 వినాయకుడు  మహాభారతాన్ని  వ్రాయటం  చిత్రాలలో  కూడా  ఉంటుంది.  వ్రాయటం   అంటే   లిపి  ఉన్నదనే  అర్ధం  కదా  !  
( లిపి  ఎప్పుడూ   ఉంది.)


భారతకాలానికి  ముందే  రామాయణకాలంలో   సేతువు  నిర్మించటానికి  రాళ్ళను  సముద్రంలో  వేస్తుంటే  అవి  మునిగిపోతుంటే    ...కొన్ని  రాళ్ళపై  రామనామాన్ని  లిఖించగా  అవి  మునగకుండా  నీటిపై  తేలాయనీ  అంటారు. 



 రాళ్ళపై  రామనామాన్ని  లిఖించటం   అంటే  అప్పటి  వాళ్ళకు   లిపి  తెలుసనే   అర్ధం  కదా  ! 
 ........................

ఇక  ఇనుము  గురించి  ప్రాచీనులకు  తెలియదని  ఆధునిక  చరిత్రకారులు  అంటారు.  


శ్రీ  దేవీ భాగవతములో  మణిద్వీప  వర్ణనలో  ఇనుము  గురించిన  ప్రస్తావన    ఉన్నది.

..ఒక  మహా  ప్రాకారం.  (  కోటగోడ  ). అది  అయోధాతు  నిర్మితం. ఇనుముతో  ధాతు శిలలతో ధృఢంగా  నిర్మించిన  ప్రాకారం.  దాని  ఎత్తు  సప్త  యోజనాలు...


.. నానావిధ  శస్త్రప్రహారణాలు  ధరించి  నానావిధ  యుద్ధ విశారదులైన  రక్షకభటులు ఆ  ప్రాకారం  మీద  అంతటా  కావలి  తిరుగుతుంతారు. విధినిర్వహణలో  ఆనందిస్తుంటారు...
......................


  ( అయః  ప్రాకారం  అంటే  ఇనుముతో  చెయ్యబడ్డది  అని  అర్ధమట.)


అయః  అంటే  ఇనుము  కాదు  ..  కంచు,  ఇత్తడి, రాగి  ...  అని  కొందరి  అభిప్రాయం. 


 అయితే,  మణిద్వీప వర్ణన లో  అయః  ప్రాకారము తో  పాటు  కంచు, ఇత్తడి , రాగి.. ప్రాకారముల  గురించి  కూడా  వర్ణించారు. 

 అలాంటప్పుడు   అయః   అంటే    కంచు,  ఇత్తడి, రాగి..   కాదనే    కదా !

.....................

   గ్రహాలకు   సంబంధించిన  లోహలలో   ఇనుము  కూడా  ఉందని   అంటారు.
శనిదేవునికి  సంబంధించిన  లోహము  ఇనుము  అని  అనుకుంటున్నాను. 
  ( నాకు  తెలిసినంతలో.. ) .

 ఇవన్నీ  గమనిస్తే  ,  ఇనుము  గురించి   మనవాళ్లకు   ఎప్పుడో  తెలుసని  తెలుస్తోంది.

.........................



చరిత్ర  గురించి  ఆధునిక   చరిత్రకారుల  మధ్య  అనేక  భేదాభిప్రాయములు  ఉన్నవి.

   క్రీస్తుకు  పూర్వం   1600  లేక  1000  సంవత్సరాల  సమీప  కాలం  మాత్రమే  రామాయణము, భారతము  జరిగిన  కాలము ....  అని  కొందరి  అభిప్రాయం .

 కానీ,  మన్వంతరముల  లెక్క  ప్రకారం  గమనిస్తే,    క్రీస్తు  పూర్వం  2000  సంవత్సరాలకు  పూర్వమే  రామాయణము, భారతము  జరిగిన  కాలము ....  అని  ఎక్కువమంది  అభిప్రాయం.

...............................

  శ్రీ పాద శ్రీ వల్లభ  సంపూర్ణ చరితామృతము  గ్రంధము  ద్వారా  ఎన్నో  విషయములను  తెలుసుకోవచ్చు.
 ..........................

ఈ  మధ్యనే  రామసేతు  గురించి,  సముద్రంలో  మునిగిన  ద్వారకా  నగర  శిధిలాలను  గుర్తించామని  ఆధునికులు  చెబుతున్నారు  కదా  !
.............................


పై  విషయాలను  గమనించితే  ఎన్నో  విషయాలు  తెలుస్తాయి.
..................................

ఇక్కడ  కొన్ని  లింక్స్  ఇస్తున్నాను.  

Timeline of MAHABHARATA 3139 B.C | तमसो मा ...


Astronomical Proof of the Mahabharata War and Shri ...