చరిత్ర పేరుతో కొందరు పురాణేతిహాసాలలోని పాత్రలను కించపరిచేటట్లు వ్రాస్తున్నారు. ఇది ఎంతో బాధాకరం.
ఒక్క విషయం ఏమిటంటే పూర్వీకులు ఇప్పటివాళ్ళకన్నా విజ్ఞానవంతులు. తమ మహిమలతో ఎన్నో అద్భుతాలు చేయగలిగినవారు.
ప్రాచీనుల విజ్ఞానానికి ఉదాహరణలుగా ఇప్పుడు కూడా ఎన్నో విషయాలు ఆధునిక విజ్ఞానానికి అంతుబట్టని రహస్యాలుగా మిగిలిఉన్నాయి.
..............................
ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను....నాకు చరిత్ర గురించి కొద్దిగా తెలుసు. ఎలాగంటే, నేను అన్నామలై యూనివర్సిటీ ద్వారా M.A. చదివాను. దైవం దయ వల్ల పాసయ్యాను.
ఇండియా చరిత్ర, తమిళనాడు చరిత్ర, యూరోప్ చరిత్ర, అమెరికా చరిత్ర, ..ఏదో బట్టీపట్టీ చదివి , దైవం దయ వల్ల పాసయ్యాను.
అన్నీ కలిపి బట్టీపట్టి చదివేసరికి ఇప్పుడు ఏదీ సరిగ్గా గుర్తు లేదు.
నాకు , బట్టీపట్టి చదివిన విషయాల కన్నా, వార్తాపత్రికలో ఒక్కసారి చదివిన విషయాలు ఎక్కువకాలం గుర్తుంటాయి.
ఒక్క విషయం ఏమిటంటే పూర్వీకులు ఇప్పటివాళ్ళకన్నా విజ్ఞానవంతులు. తమ మహిమలతో ఎన్నో అద్భుతాలు చేయగలిగినవారు.
ప్రాచీనుల విజ్ఞానానికి ఉదాహరణలుగా ఇప్పుడు కూడా ఎన్నో విషయాలు ఆధునిక విజ్ఞానానికి అంతుబట్టని రహస్యాలుగా మిగిలిఉన్నాయి.
..............................
ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను....నాకు చరిత్ర గురించి కొద్దిగా తెలుసు. ఎలాగంటే, నేను అన్నామలై యూనివర్సిటీ ద్వారా M.A. చదివాను. దైవం దయ వల్ల పాసయ్యాను.
ఇండియా చరిత్ర, తమిళనాడు చరిత్ర, యూరోప్ చరిత్ర, అమెరికా చరిత్ర, ..ఏదో బట్టీపట్టీ చదివి , దైవం దయ వల్ల పాసయ్యాను.
అన్నీ కలిపి బట్టీపట్టి చదివేసరికి ఇప్పుడు ఏదీ సరిగ్గా గుర్తు లేదు.
నాకు , బట్టీపట్టి చదివిన విషయాల కన్నా, వార్తాపత్రికలో ఒక్కసారి చదివిన విషయాలు ఎక్కువకాలం గుర్తుంటాయి.
న్యూస్ పేపర్ చదవటం అంటే నాకు చిన్నప్పట్నించి చాలా ఇష్టం. అందువల్ల ప్రపంచ చరిత్ర గురించి నాకు కొంత తెలుసు. న్యూస్ పేపర్ చదవటం అంటే ఉన్న ఇష్టంతో న్యూస్ పేపర్లను ఆసక్తిగా చదవటం వల్ల ఒక్కసారే చదివినా కూడా .. గుర్తుంటాయి. పీజీ డిగ్రీ కొరకు చదవటం అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల, అలా చదివిన విషయాలు అంతగా గుర్తు ఉండవు .
.................................
ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చిన్నతనంలో నాస్తికురాలైన ఒక టీచర్ మాటలను విని , దేవుడు లేడని వాదించటం, దైవ ప్రసాదాలను తిరస్కరించటం, పురాణేతిహాసాలను ఎగతాళి చేయటం, దైవచిత్రాలను కాలిక్రింద తొక్కటం కూడా చేసాను.
అప్పుడు నేను బాగా చదివే స్టూడెంటును. ఫస్ట్ మార్కులతో ఎన్నో బహుమతులను తెచ్చుకున్న నేను క్రమంగా చదువులో వెనుకబడిపోయాను.
తరువాత మళ్ళీ బుద్ధి వచ్చి భక్తితో ఉండటం మొదలుపెట్టాను.
కొంతకాలం క్రిందట నాకు కష్టాలు వచ్చాయి. (కష్టాలంటే, నా చేతిలో లేని విషయాల గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచించి నాకు నేను తెచ్చుకున్న కష్టాలు. )
ఎంతో మానసిక వేదనను అనుభవించాను. ఆ బాధ ఎలా ఉంటుందంటే, మనసును మెలిపెట్టేసి, ఈ బాధ శత్రువుకు కూడా వద్దు బాబోయ్ ! అనుకునేంతగా అనిపిస్తుంది.
నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి. మాకు తెలిసిన వాళ్ళు నాది ఎంతో అదృష్టమైన జీవితం అంటారు. ఎప్పుడూ సరైన దారిలో నడిపించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
అయితే, దైవాన్ని నిందించటం వల్ల దైవానికి కోపం వచ్చి మనలను శిక్షించటం జరగదు.... దైవం దయామయులు. దారి తప్పే బిడ్దలను సరైన దారికి తీసుకురావటానికి కొద్దిగా కష్టాన్ని కలిగిస్తారు. అదీ బిడ్ద మంచికోసమే.
గొప్పశక్తి గల వ్యక్తుల వద్ద ఉంటే మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది కదా ! ఇక సృష్టిలో అన్నింటికన్నా గొప్పశక్తి అయిన దైవానికి దగ్గరయ్యే వ్యక్తులకు ఎంతో మంచి జరుగుతుంది .
దైవం లేరని చెప్పే నాస్తికుల వల్ల ఎందరో వ్యక్తులు దైవానికి దూరమవుతారు. అందుకే దైవాన్ని నిందించే వాళ్ళకు పాపం తగులుతుంది.
పురాణేతిహాసాల గురించి చర్చ జరగవచ్చు. అయితే పురాణేతిహాసాలను వక్రీకరించటం తప్పు. ఇలా చేయటం వల్ల సమాజానికి కూడా మంచిదికాదు.
...............................
దైవం గురించి, పురాణేతిహాసాలలోని పాత్రలను చెడ్దగా చూపించటానికి ప్రయత్నించటం వల్ల మొదట సంబరంగానే ఉండొచ్చు. తరువాత వాటి ఫలితాలను తట్టుకోవటం మాత్రం ఎంతో కష్టంగా ఉంటుంది.
నా స్వానుభవంతో చెబుతున్నాను. దైవనింద, పురాణేతిహాసాలను వక్రీకరించి చెప్పటం..వంటి చెడ్డ పనులను చేయవద్దు.
వింటే వినండి .. లేకపోతే ఎవరి కర్మకు వారే బాధ్యులు.
.............................
కొన్ని విషయాలపై నా అభిప్రాయాలు...
పరస్త్రీని తల్లిలా చూడమని పెద్దలు చెప్పిన సంస్కృతి మనది. అయితే తమ ఇష్టాలకు అనుకూలంగా ధర్మాలను మార్చి చెప్పుకునే స్త్రీలు, పురుషులు ఆ కాలంలోనూ , ఈ కాలంలోనూ ఉంటారు. శర్మిష్ఠ తనకు అనుకూలంగా ఉండేటట్లు యయాతితో మాట్లాడి ఉండవచ్చు.
...............................
పరాశరుడు ఒక మునే కానీ దైవం కాకపోవచ్చు. అయితే వారికి అద్భుతమైన మహిమలు చేసే శక్తులు ఉన్నాయి. జన్మించిన సంతానం వెనువెంటనే పెరిగి పెద్దయ్యే విధంగా వరాలను ఇచ్చే గొప్ప శక్తులున్న వారు పరాశరులు. అప్సరసలను చూసినా తొణకని వ్యక్తి పరాశరుడు.
భారత కధ ముందే ఒక ప్రణాళిక ప్రకారం జరపబడిందని గ్రంధాల ద్వారా తెలుస్తోంది. లోక హితం కోసం దైవం ఈ కధలను , అందులోని పాత్రధారులను నడిపించారు. ఈ పాత్రల ద్వారా లోకులు ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.
.................................
సత్యవతి, కుంతి మధ్య ఎందుకు ఈ తేడా అంటే , కర్ణుని పాత్ర శూద్రుల ఇంట పెరగటం , తదనంతరం జరిగిన సంఘటనల వల్ల దుర్యోధనుడు మిత్రుడవటం, దుర్యోధనుని పట్ల కృతజ్ఞతతో కర్ణుడు జీవితాంతమూ స్నేహధర్మానికి బంధితుడు కావటం జరిగింది.
సహజపద్ధతిలో జన్మించిన పిల్లలకు పుట్టుకతో సహజ కవచ కుండలాలు ఉండవు కదా !
ఇక వ్యాసుని విషయం వేరు. వారు పుట్టిన వెంటనే తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయారు. వారి పాత్రకు తగ్గట్లు వారి పాత్రకు రూపకల్పన జరిగింది.
.....................
కుంతి మరియు సత్యవతి విషయంలో కన్యాత్వం చెడకుండా సంతానాన్ని ప్రసాదించటం జరిగిందనే గ్రంధాలలో ఉంది.
కన్యాత్వం చెడకుండా సంతానాన్ని ప్రసాదించటం అంటేనే సహజప్రక్రియ కాదని తెలుస్తూనే ఉంది.
..................................
ఇతరుల విషయాల పట్ల అనుమానాలు కలగటమే జనం పని. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. సామాన్య ప్రజలకు దుర్వాసుని శాపం మొదలైన విషయాలు తెలియవు కదా ! అందుకే కుంతీదేవిని అనుమానించి ఉంటారు .
.............................
సంస్కృత, తెలుగు భారతాల మధ్య తేడా కనిపిస్తుందని అంటున్నారు. ఇలా తేడాలు కనిపిస్తున్నాయని అంటేనే , గ్రంధాలలో ఆధునికులు మార్పులుచేర్పులు చేసి ఉండవచ్చని అర్ధమవుతోంది కదా !
ఏవి ప్రాచీనులు అందించిన విషయాలో? ఏవి ఆధునికులు చొప్పించిన విషయాలో ? ఎలా తెలుస్తుంది ?
సమాజానికి చెడును కలిగించే విషయాలను పవిత్ర గ్రంధాల ద్వారా ప్రాచీనులు అందించరు కదా ! అందువల్ల గ్రంధాలలో చెడు సంగతులు ఏమైనా ఉంటే ... అవి ఆధునికులు చేసిన మార్పులుచేర్పులే అయ్యుంటాయి.
ఇప్పుడు చూస్తున్నాము కదా ! ప్రాచీన గ్రంధాల గురించి ఎవరికి తోచినట్లు వారు ఊహించి వ్రాసేస్తున్నారు. ఇక ఇంతకుముందు ఎన్ని మార్పులుచేర్పులు జరిగాయో ?
.................................
హస్తినాపురం నేటి ఉత్తరప్రదేశ్ వద్ద ఉందని అంటారు.
పాండవులది హస్తినాపురం అయితే ... పాండవులు విదేశీయులు ..వాళ్ళది టెబెట్ ప్రాంతమని అనటమేమిటో ?
No comments:
Post a Comment