koodali

Wednesday, July 16, 2014

బొడ్దుత్రాడును భద్రపరిచే ఆచారం...


కొంతకాలం  క్రిందట   ఏం  చేసేవారంటే,  పిల్లలు  పుట్టినప్పుడు  వచ్చే  బొడ్డు త్రాడును  ( ఎండిన  తరువాత )  రాగిరేకులో  పెట్టి   దానిని  పిల్లల  భుజానికి  తాయెత్తులా  కడితే  పిల్లలకు  మంచి  జరుగుతుందనే  వారు.


  ( ఈ  విషయాన్ని  మా  పెద్దవాళ్ళు  చెబితే  తెలిసింది. )


  ఈ  రోజుల్లో   స్టెమ్ సెల్స్  కోసం  బొడ్దుత్రాడుకు  ప్రాముఖ్యతను  ఇవ్వటం  చూస్తుంటే ..  పాతకాలపు  ఆచారం  గుర్తుకొస్తోంది. 

స్టెమ్ సెల్సు  అనేవి  బిడ్ద  పుట్టినప్పుడు  బొడ్దుత్రాడు  నుండి    ఎక్కువగా   సేకరించవచ్చట.   ఈ  స్టెమ్సెల్స్  వల్ల  చాలా  ఉపయోగాలున్నాయట. 


ఉదా..ఎవరికైనా  భవిష్యత్తులో  ఏదైనా  అనారోగ్యం  కలిగితే  వారు  దాచుకున్న  బొడ్దుత్రాడునుండి  స్టెమ్ సెల్సు  తీసి  వ్యాధిని  నయం  చేయటానికి  అవకాశం  ఉందట.  


అవయవదానం  కష్టంగా  ఉన్న  ఈ  రోజుల్లో   ఈ  స్టెం సెల్సు  నుంచి    కిడ్నీ  వంటి  శరీరభాగాలను  వృద్ధి  చేయవచ్చు  అంటున్నారు. 

 ( వ్యక్తి  యొక్క  సొంత  స్టెంసెల్స్ నుంచి  వృద్ది  అయిన  కిడ్నీని  వ్యక్తి  శరీరం  తిరస్కరించదు  కదా !  ) 


డెంటల్  రంగంలో  చూస్తే  కొత్తపళ్ళను  వృద్ధి  చేయవచ్చు  అంటున్నారు.
ఇలా  ఎన్నో  ప్రయోగాలు  జరుగుతున్నాయి.


ఇవన్నీ  గమనించి ,  విదేశాల్లో  చాలామంది  తల్లితండ్రులు  తమ  పిల్లలు  పుట్టినప్పుడు ..  లభించే  బొడ్డుత్రాడు   రక్తాన్ని   భద్రపరుస్తున్నారట. అక్కడ  వీటిని  భద్రపరచటానికి   ప్రత్యేకమైన  బ్యాంకులు  ఉన్నాయట . 


ఇవన్నీ  చూస్తుంటే  ఏమనిపిస్తుందంటే , ఈ  మూలకణముల  యొక్క  ప్రాముఖ్యత  గురించి  మన  పూర్వీకులకు  తెలిసి ..  బొడ్దుత్రాడును   రాగిరేకులో  మడిచి  పిల్లల  భుజానికి  రక్షరేకుగా  కట్టమనే  ఆచారంగా  ఏర్పరిచారేమో..అనిపిస్తోంది.  
.................................

ఆధునికులు  చెప్పే మూలకణములు  (  స్టెం  సెల్స్ )  గురించి   ప్రాచీనులకు   తెలుసునని  అనిపిస్తోంది.  ఉదా..... స్టెంసెల్స్ అనబడే   మూలకణముల  ద్వారా   కొత్త  సృష్టిని సృష్టించవచ్చు  అని  నేటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
 విష్ణుమూర్తి  బొడ్డు నుండి  పద్మం  ద్వారా  బ్రహ్మ జన్మించి   సృష్టిని  చేస్తారు   అంటే.. 

బొడ్డుత్రాడు  నుండీ  వచ్చే  బ్రహ్మ  సృష్టిని  సృష్టిస్తారు. ... బొడ్డుత్రాడు  నుండి  లభించే   మూలకణముల  ద్వారా  కొత్త  సృష్టిని  చేయవచ్చు..  అనే  పోలిక  కనిపిస్తోంది    కదా ! 


ఇలా   ఎంతో   విజ్ఞానం  ప్రాచీన  గ్రంధాలలో  ఉన్నదనిపిస్తోంది.



5 comments:

  1. mana india lo kudaa ilanti banks unnaai ippudu

    ReplyDelete
    Replies


    1. మీకు కృతజ్ఞతలండి.

      మన దేశంలో కూడా ఇలాంటి సదుపాయం లభించటం బాగుందండి.

      Delete
  2. మీరు చెప్పినట్టు బొడ్డుతాడుని రాగి రేకులో ఉంచి తాయత్తుగా కట్టే అలవాటు ఇప్పటికి ఉందనుకుంటాను, కాని దానిని ఉపయోగించిన దాఖలాలు కనపదలేదు.

    I feel that our people know about stem cell treatment, but it is lost

    ReplyDelete
    Replies
    1. మీకు కృతజ్ఞతలండి.
      నిజమేనండి, మా ఇంట్లో ఇలా చేయటం నాకు గుర్తుంది.

      అయితే, మీరన్నట్లు మన ప్రాచీనులకు బొడ్డుత్రాడుతో కలిగే ఉపయోగాల గురించి తెలిసి ఉండవచ్చు. కాలక్రమేణా ఈ ఆచారంలోని అంతరార్ధం మరుగునపడిపోయి ఉంటుంది.
      .............
      అయితే, స్టెం సెల్స్ యొక్క ఉపయోగాల గురించి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే .. వాటిగురించి తెలియటానికి కొంత కాలం పడుతుందేమో..

      ప్రాచీనుల విజ్ఞానంలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ....ఆధునిక విజ్ఞానంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అనిపిస్తుంది.

      Delete

  3. పూర్వీకులు గడపలకు రోజూ పసుపు రాస్తే మంచిదని , అందువల్ల లక్ష్మీదేవి కృప లభిస్తుందని చెప్పారు.

    గడపకు పసుపు రాస్తే గాలికి ఇంట్లోకి కొట్టుకొచ్చే దుమ్ముధూళి గడపకు తగిలి ఆగిపోతాయని, గడపకు వ్రాసిన పసుపు వల్ల ఆ బాక్టీరియా చనిపోతుందని పెద్దల ఉద్దేశం కావచ్చు.

    ఇప్పుడు గడపలకు పసుపు బదులు పసుపు రంగును వేసేస్తున్నారు.

    ఇలా పెద్దలు చెప్పిన ఆచారాలలోని అసలు ఉద్దేశాన్ని అర్ధం చేసుకోక , ఆచారంలోని అసలు ఉద్దేశ్యాన్ని మరుగునపడేటట్లు , మనకు సౌకర్యంగా ఉండేటట్లు ఆచారాన్ని మార్చేయటం, లేక ఆచారాన్ని వక్రీకరించటం జరుగుతోంది.

    ఇలా చేస్తూ ... పెద్దలు చెప్పినవి తప్పులు, చాదస్తాలు ..అనీ అంటున్నారు కొందరు.

    ReplyDelete