koodali

Tuesday, January 24, 2017

ఇలాంటి నీరు వాడితే...


 
ఈ రోజుల్లో చాలా ప్రాంతాలలో నీరు ఆరోగ్యానికి హానిచేసే విధంగా ఉంటోంది.

కొన్ని సంవత్సరాల క్రితం వరకూ కూడా పల్లెటూళ్ళలో చెరువు వద్ద నూతిలోనుండి నీటిని తెచ్చుకుని వాడుకునేవారు.


ఈ రోజుల్లో శుభ్రమైన త్రాగు నీరు లభించక నీటిని శుద్ధిచేసే యంత్రాన్ని ఇంట్లో అమర్చుకుంటున్నారు.
కొందరు మంచినీటి కాన్లు కొనుక్కుని శుద్ధిచేసిన నీటిని వంటకు, త్రాగటానికి వాడుతునారు.

అయితే, బోరు నీళ్ళు మరియు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో శుద్ధిచేయని కఠిన జలాన్ని శరీరాన్ని శుభ్త్రం చేసుకోవటానికి వాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


 ఉదా..గాఢమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీరు కంట్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి.
 బోరు నీరు మరియు   ఫ్లోరైడ్ నీటితో కళ్ళు శుభ్రం చేసుకోకూడదు.


కొన్నిసార్లు శుద్ధిచేసిన నీటిలో కూడా శరీరానికి హానిచేసే పదార్ధాలు మిగిలే ఉంటున్నాయేమో? అనే సందేహమొస్తోంది.


మీ  ఇంట్లో నీటిని పరిశీలించండి . .. 

 త్రాగునీటిని ఒక గ్లాసులో పోసి రెండురోజులు అట్టేపెట్టేస్తే గ్లాసు అడుగు భాగంలో వేలితో టచ్ చేస్తే బరకలా (స్కేలింగ్)ఏర్పడటం గమనించవచ్చు.
 
ఇలాంటి నీరు త్రాగితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదముంది.
ఇలాంటి నీటితో కళ్లు కడుక్కుంటే కళ్ళు పాడయ్యే అవకాశముంది.

 కడిగిన గిన్నెలు  బోర్లించకుండా కొన్నిరోజులు ఉంచితే  గిన్నె లో తెల్లటి మరకలు ఉండటం కూడా జరుగుతుంది.


ఇలాంటి నీళ్ళు నింపే బకెట్లకు పైన తెల్లటి పొర ఏర్పడి రంగు మారిపోతుంటాయి.


 టాయ్లెట్స్ కూడా యాసిడ్ వేసి శుభ్రం చేయవలసి ఉంటుంది. మరి, ఇలాంటి నీళ్ళు వాడితే ఆరోగ్యం ఏమవుతుంది?


ఇంతకుముందు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉండేది.
ఇప్పుడు నదుల ప్రక్కన ఉండే జిల్లాలలో కూడా నీటి తీరులో మార్పులు వస్తున్నాయి.

ఎన్నో కారణాల వల్ల భూగర్భంలో మంచినీరు ఉప్పగా మారటం, మంచినీటి స్థానంలో సముద్రపు నీరు చొచ్చుకు రావటం జరుగుతోందంటున్నారు.


భూమిలో , నీటిలో కలుస్తున్న కాలుష్యాలు, బోర్లు విపరీతంగా త్రవ్వి భూగర్భజలాన్ని బాగా వాడేయటం.. వంటి చర్యల వల్ల భూగర్భ జలం త్రాగటానికి పనికిరాని విధంగా మారుతోంది.
ఇందువల్ల, అందరూ పర్యావరణం పాడుకాకుండా కాపాడుకోవాలి.



Saturday, January 21, 2017

ఆహారం విషయంలో...


 
మన పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని అందించారు.

 ఆయుర్వేదం ద్వారా ఎన్నో అద్భుతమైన  మూలికల గురించి  తెలియజేసారు..



 సరస్వతి ఆకు, అశ్వగంధ, పునర్నవ ..వంటివి ఎంతో శక్తివంతమైన ఔషధాలు. 
 

వీటిని కొన్ని గ్రాములు వరకూ మాత్రమే అంటే సుమారు 2 లేక 3 గ్రాములు..ఔషధంగా  తీసుకోవాలంటున్నారు. 
 

వీటిని ఎంత మోతాదులో , ఎన్ని రోజులు వాడాలనేది ఆయుర్వేద నిపుణుల సలహా ప్రకారం వాడటం మంచిది.


ఉసిరి, కరక్కాయ, పిప్పళ్లు.. వంటివి ఎంతో  విలువైనవి. 


ఇంకా  చక్కటి ఆహారవిధానాన్ని తెలియజేసారు. నవధాన్యాలను గురించి తెలియజేసారు.


  ఆహారంలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, అల్లం, శొంఠి, వాము.. ..వంటి ఎన్నో విలువైన వాటిని  వంటలో చేర్చి వండే విధానాలను నేర్పించారు. ఇందువల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.


అయితే, ఈ రోజులలో సాంప్రదాయ ఆహారాన్ని తీసుకోవటం తగ్గించి.. ఫాస్ట్ ఫుడ్  ఎక్కువగా తినటం వల్ల కూడా అనారోగ్యాలు వస్తున్నాయి.


ఈ మధ్య సోయా తింటే మంచిదంటూ విపరీతంగా వాడుతున్నారు.


సోయా మంచిదే కానీ , ఎక్కువగా తింటే మంచిది కాదని అంటున్నారు.


అందువల్ల ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


 ప్రాచీనులు తెలియజేసిన .. తరతరాలనుండి పెద్దవాళ్ళు అలవాటుచేసిన ఆహారపు అలవాట్లను వదిలి వేసి ... జంక్ ఫుడ్ కు అలవాటు పడటం మంచిది కాదు.


ఈ రోజుల్లో విదేశాల వాళ్లు కూడా భారతీయ ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు . మన వంటలను ఇష్టపడుతున్నారు.



Wednesday, January 18, 2017

కొన్ని విషయాలు...


ఈ రోజుల్లో మన దేశంలో చాలామంది.. కొన్ని విషయాలలో విదేశాల వారిని అనుకరించటానికి బాగా ప్రయత్నిస్తున్నారు.

 ఇతరులలో ఉన్న మంచిని  మనం గ్రహించాలి.  చాలామంది మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు ఉన్నవారు ఉంటారు.

****************
 రసాయనిక పురుగుమందులను విదేశీయులే కనుగొన్నారు.

అయినా,  వాటివల్ల కలిగే నష్టాలను గుర్తించి .....  రసాయన పురుగుమందులను వాడని ఆహారాన్ని తీసుకోవటానికి వాళ్ళు  ప్రాముఖ్యత ఇస్తున్నారు.

భారతదేశం నుంచి ఎగుమతి అయిన కొన్ని పంటల ఉత్పత్తులను పురుగుమందుల అవశేషాలు ఉన్నాయనే కారణంతో విదేశాల వాళ్ళు తిరస్కరించటం కూడా జరిగింది.

అయినా మనలో చాలామంది రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతూనే ఉన్నారు.... భారతీయులు  తిరిగి మన సేంద్రియవ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది.

ఉదా.సుభాష్ పాలేకర్ గారు తెలియచేస్తున్న సేంద్రియ వ్యవసాయం చేయాలి.

***********
ఇంకో విషయం ఏమిటంటే,  ఎందరో విదేశాల వాళ్ళు  తమ విద్యుత్ అవసరాల కోసం  సోలార్ విద్యుత్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

అపారంగా సూర్యరశ్మి లభించే మనదేశం వాళ్ళేమో సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యత ఇస్తూనే, ఇంకా ధర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించటం కోసం తాపత్రయపడుతున్నారు.

***********
ఎంతో గొప్ప విలువలు, విజ్ఞానం వారసత్వంగా కలిగినది భారతదేశం.

అయితే, మన దేశంలోనే  కొందరు .. భారతీయ విధానాలను తక్కువచేసి మాట్లాడుతుంటే ఎందరో విదేశాల వాళ్ళు యోగా, ధ్యానం, భారతీయ ఆయుర్వేద పద్ధతులు.. మొదలైన విషయాల గురించి ఆసక్తి చూపటం  ఆశ్చర్యకరమైన విషయం.
..........................
 
* క్రింద విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలా కాలం తరువాత వ్రాసి, ఇక్కడ ప్రచురించటం జరిగిందండి.
.............

లోకంలో కొందరు బలవంతులు బలహీనమైన జీవులపట్ల పెత్తనం చేస్తుంటారు. కొందరుమగవాళ్లు స్త్రీలపట్ల పెత్తనం చేస్తారు.కొందరుస్త్రీలు కూడా సాటి  స్త్రీల పై పెత్తనం చేస్తారు. కొందరుస్త్రీలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తారు.  కొందరుమనుషులు జంతువులను చంపుతారు.  అలా కాకుండా బలమైన మంచివాళ్ళు, తమ బలాన్ని, తెలివితేటలను బలహీనులకు సాయపడటానికి ఉపయోగించాలి. మనుషులు మానవత్వంతో జీవించాలి.

***************
జన్మ ఎత్తాక ఎవరికీ వందశాతం అంతా సుఖమే ఉండకపోవచ్చు. సమాజంలో ఎవరి కష్టసుఖాలు వారికున్నాయి.

బ్రాహ్మణులు చాలా నియమాలను పాటించాలి. వేదవిద్య నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు చాలా కష్టపడాలి.ఎంత చేసినా తగినంత ధనం లభిస్తుందో లేదో తెలియదు. క్షత్రియులు, సైనికులు యుద్ధవిద్యలు నేర్చుకోవాలి.వాళ్లు యుద్ధానికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తారో రారో? తెలియదు.వైశ్యులకు వ్యాపారం కొంత ఫరవాలేదు కానీ, వాళ్లు అధికలాభాలను తీసుకోకుండా, ధర్మంప్రకారం మాత్రమే వ్యాపారంలో లాభాలను పొందాలి.శూద్రులకు బ్రాహ్మణులకులా చాలా నియమాలు లేకుండా, కొంత సడలింపులు ఉంటాయి.కొంత స్వేచ్చ ఉంటుంది.ఈ రోజుల్లో ఎందరో గొప్పగా భావిస్తున్న ఇంజనీరింగ్ ఉద్యోగాలు కూడా శూద్రులు చేసే వృత్తివిద్యలే.
 
 
ప్రాచీనకాలంలో కొందరు విదేశీయాత్రికులు తమ గ్రంధాలలో భారతదేశంలో పేదరికం లేదని వ్రాసారు. అంటే, అన్ని వృత్తులవారు చక్కగానే ఉన్నారనే కదా అర్ధం.
 
 అయితే, కాలక్రమేణా  కొందరు స్వార్ధపరులు ప్రజల మధ్య ఎక్కువతక్కువ తారతమ్యాలు మొదలుపెట్టటం, మూఢనమ్మకాలు ప్రవేశపెట్టడం వల్ల సమాజానికి నష్టం జరిగింది.

...................................
భారతదేశం ఎంతో గొప్పది. సనాతనధర్మము ఎంతో గొప్పది.  
ఇక్కడ ఎందరో గొప్పవారున్నారు. అయినా కూడా, భారతదేశం కొంతకాలం విదేశీపాలనలో ఉండటం, విదేశీమతాలు ఇక్కడ ప్రవేశించటం, దేశవిభజన సమయంలో జరిగిన హింస ఎవరూ ఆపలేకపోవటం ఏమిటో మరి?అనే సందేహాలు కలుగుతాయి.

ఇక్కడి ప్రజలలో ఐకమత్యం లేకపోవటం, దేశంలోని కొందరు చేసిన తప్పులు, పొరపాట్ల వల్ల,  కొందరు ప్రజలు నమ్మిన కొన్ని మూఢనమ్మకాల వల్ల కొందరు బాధలుపడటం..వంటి కారణాల వల్ల కూడా అలా జరిగి  ఉండవచ్చు.. అనిపిస్తుంది.

 కొన్ని గ్రంధాలలో కొన్ని మూఢనమ్మకాల గురించి వ్రాసిన విషయాలు బాధగా అనిపిస్తాయి...ఇలాంటివి ప్రక్షిప్తాలని నా అభిప్రాయం. 
.....................
 
పాతకాలంలో కొందరిపట్ల కొంత వివక్ష ఉన్నమాటనిజం. అలాగని చాలా వివక్ష ఉందనటం సరైనదికాదు, అసలు వివక్షే లేదనటమూ సరైనది కాదు.

udaa..నాకు తెలిసినంతలో, ఒక కులానికి చెందిన మహాభక్తుని పట్ల దేవాలయ ప్రవేశాన్ని నిరాకరిస్తే, దైవమే ఆ భక్తుని కరుణించి దర్శనాన్ని అనుగ్రహించిన సంఘటన, కధ ద్వారా తెలిసే ఉంటుంది. ఈ విషయాలను గమనిస్తే, కొందరి పట్ల వివక్షతో ప్రవర్తించారని అర్ధమవుతోంది కదా.. 

మాంసాహారాన్ని తినకూడదని వేదములలో ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. 
 
హిందువుల్లోనే కొందరు దైవానికి బలులు అని ఇచ్చి, ఆ మాంసాన్ని తింటారు.  ఏమిటో? 
 
 నాకు ఏమనిపిస్తుందంటే, పశుపక్ష్యాదులను కష్టపెట్టి,  దైవానికి మాంసాహారాన్ని సమర్పించటం ఎంతవరకు సరైనది? దేవుని పేరుచెప్పి ఇంత హింస ఏమిటో?

 పాతకాలంలో కొన్నిచోట్ల జోగినివ్యవస్థ పేరుతో స్త్రీలపట్ల అన్యాయాలు జరిగినప్పుడు, అలాంటివి ఆపాలి కదా..
   
సమాజం కొరకు ఎన్నో చక్కటి విషయాలను గ్రంధాల ద్వారా తెలియజేసిన ప్రాచీనులు, మూఢత్వంతో ప్రవర్తించమని ఎవరికీ చెప్పరు.
 
 అయితే, కాలక్రమేణా  కొందరు స్వార్ధపరులు ప్రజల మధ్య ఎక్కువతక్కువ తారతమ్యాలు మొదలుపెట్టటం, మూఢనమ్మకాలు ప్రవేశపెట్టడం వల్ల సమాజానికి నష్టం జరిగింది.

 links...
*పెద్దలు చెప్పినది...మనము చేస్తున్నది. 
 
.............

మంచికోసం మతము.  దైవాన్ని మహాశక్తిగా తలచి భక్తిగా దైవాన్ని స్మరించుకోవటం, సాటి జీవులకు నష్టం కలిగించకుండా మంచిగా జీవించటం..వంటివి చేస్తే దైవము కరుణిస్తారు.

మతాలు, ఆధునిక విజ్ఞానం.. మంచికి ఉపయోగపడాలి. అయితే, కొందరు వీటిని కూడా తమకు తగ్గట్లు మార్చి, సమాజంలో సమస్యలు సృష్టించటం అత్యంత బాధాకరం.

 కొందరు తమ కోరికలు, కష్టాలు తీరటం కొరకు,  జీవహింస చేసే విధంగా 
కూడా మతాన్ని ఉపయోగిస్తే ఇక దైవమే దిక్కు.

ఆధునిక విజ్ఞానం అంటూ కొందరు ప్రపంచానికి.. జీవులకు హానిచేసే విధంగా (జీవహింస చేసే విధంగా) 
కూడా  ఉపయోగిస్తే ఇక దైవమే దిక్కు.

ఆధ్యాత్మికమైనా, ఆధునిక విజ్ఞానం అయినా అతి పోకడలు పోతే అనర్ధమే. 

*********************

 మంచివాళ్లు తమపనిని వదిలేస్తే , చెడ్దవాళ్లు విజృంభించి సమాజాన్ని తమ ఇష్టం వచ్చినట్లు బాధపెట్టే పరిస్థితి వచ్చే ప్రమాదముంది. అలా జరగకుండా ఉండాలంటే మంచివాళ్లు తమ స్వధర్మాన్ని చక్కగా పాటించాలి. స్వధర్మాన్ని చక్కగా పాటించటం కూడా దైవపూజయే.

మహాభారతసంగ్రామంలో శ్రీకృష్ణపరమాత్మ.. యుద్ధం చేయలేనని  పలికిన అర్జునునితో స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను గుర్తుచేసారు. అంతేకానీ, జీవితంలో వైరాగ్యమే ముఖ్యం అని, తన స్వధర్మాన్ని మాని, విరాగిగా ఉండమని చెప్పలేదు.మోక్షాన్ని పొందటం జీవితపరమలక్ష్యమే కానీ, చతురాశ్రమాల ప్రకారం చక్కగా జీవించి దైవాన్ని పొందాలి.

జనకమహారాజు నిష్కామకర్మయోగంతో చక్కగా జీవించారంటారు.
 
 

Monday, January 16, 2017

ఈ- వస్తువుల వల్ల కొన్ని సమస్యలు ...



ఈ రోజుల్లో టీవీలు చూడటం, సెల్ఫోన్లు వాడటం, కంప్యూటర్ వాడకం..విపరీతంగా పెరిగింది. 

చాలామందిలో మెడనొప్పులు,వెన్నునొప్పులు, భుజాల నొప్పులు, కంటిచూపు తగ్గటం..వంటివి కూడా బాగా పెరిగాయి.


ఈ- వస్తువుల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు. 


అందువల్ల నిద్ర పోయే ముందు సెల్ ఫోన్ తల వద్ద కాకుండా కనీసం ఆరు అడుగుల దూరంలో ఉంచి పడుకోవాలట.


 కంప్యూటర్, ల్యాప్టాప్ నుండి కూడా రేడియేషన్ సమస్య ఉంటుందట .


కంప్యూటర్ ఎక్కువ సమయం వాడేటప్పుడు మెడ, వెన్ను నొప్పులు , కళ్ళు అలసిపోవటం వంటివి వచ్చే అవకాశముంది.


 టీవీ. . కనీసం ఆరు లేక పది అడుగుల దూరం నుంచి  చూడాలట. 


 నా అభిప్రాయం ప్రకారం ..కళ్ళు పైకెత్తి చూడటం వల్ల ఎక్కువ అలసట అనిపిస్తుంది.


 ఉదా..సినిమా హాల్లో సినిమా చూసినప్పుడు బాల్కనీలో కూర్చుని చూసినప్పుడు ఎక్కువ అలసట అనిపించదు. 


నేలమీద కూర్చుని సినిమా చూసేవాళ్ళు మెడ మరియు కళ్ళు పైకి ఎత్తి చూడటం వల్ల బాగా అలసట అనిపిస్తుంది.


 అందువల్ల కంప్యూటర్  టేబుల్  మరీ ఎత్తుగా లేకుండా ఉంటే మంచిది. 


అంటే మెడ, కళ్ళు పైకెత్తి చూడటం కాకుండా క్రిందకు చూసే విధంగా ఏర్పాటు ఉంటే మంచిది. 


అలాగని కాళ్ళపై ల్యాప్ టాప్ ఉంచి చూడటమూ మంచిది కాదంటున్నారు. 


నేలపై కొద్ది ఎత్తులో స్టాండ్ పై ల్యాప్ టాప్ ఉంచి చూడటం మంచిది.


 నేలపై కూర్చోలేనివాళ్ళు  టేబుల్ మేట్ పై ల్యాప్ టాప్ ఉంచి వాడుకోవచ్చు. 


  టేబుల్ మేట్ తో  మనకు అనువైన విధంగా ఎత్తును సరిచేసుకోవచ్చు.


 కంప్యూటర్ కూడా టేబుల్ మేట్ పై ఉంచి వాడుకుంటే మంచిది. 


 రెండు  టేబుల్ మేట్ లు ఉంటే..


   ఒక టేబుల్  పైన కంప్యూటర్ ఉంచి ...కంప్యూటరుకు దూరంగా మన ముందు ఉన్న టేబుల్  పైన  కీబోర్డు, కర్సర్  ఉంచి వాడుకోవచ్చు.


ఆఫీసుల్లో  టేబుల్స్ మనకు అనువైన ఎత్తులో ఉండకపోవచ్చు.


 అక్కడకు మనకు అనువైన విధంగా ఎత్తును సరిచేసుకునే విధమైన  టేబుల్ మేట్ తీసుకెళ్ళి కంప్యూటర్ వాడుకోవచ్చు.



 ఇలా కొన్ని సర్దుబాట్లు చేసుకోవటం వల్ల మెడ, వెన్ను నొప్పులు, కళ్ళు అలసిపోవటం.. కొంతైనా తగ్గే అవకాశముంది.



కంప్యూటర్ వంటివి వీలైనంతలో తక్కువగా వాడటం మంచిది.



 ఎక్కువసేపు వాడటం  తప్పదు అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.


Thursday, January 12, 2017

ఓం...



ఈ రోజు వివేకానంద జయంతి.


మకర సంక్రాంతి పండుగ.. భోగి, సంక్రాంతి, కనుమ..సందర్భంగా సూర్యారాధన చేస్తారు.
 
గోదా దేవి రంగనాధస్వామి వార్ల కల్యాణం జరుగుతుంది.


శబరిమలై  అయ్యప్పస్వామి మకర జ్యోతి దర్శనం ఉంటుంది .


ఈ విశేషాల సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.



Monday, January 9, 2017

ఓం శ్రీ శనిదేవులు...కొన్ని విషయములు..



శింగణాపూర్ లో శ్రీ శనేశ్వర భగవానులు తాను స్వయంభూ అవతార శిలారూపం నుండి సృష్టినంతా వీక్షిస్తూ జీవుల్ని పాలిస్తున్నారు.

కర్మపాశవిముక్తి దేవత గ్రహసార్వభౌమునికి మానవకృతపీడ,దోషాలు ఆపాదించడము దేవత యెడ మహాపరాధమవుతుంది.

 సకలజీవరాశులయెడ కృపాదృష్టి గల గ్రహదేవత లోకోద్ధరణ కాంక్షించి భూస్థలిపై శిలామూర్తియై అవతరించారు.
...........

 జీవి యొక్క రాశి చక్రములో శనిగ్రహదేవత , జన్మస్థానము నందు,  అష్టమ, ద్వాదశ యందు , అర్ధాష్టు యందు సంచరించునపుడు శోధించి జీవియొక్క గతజన్మల కర్మానుఫలంగా శిక్షకు గురిచేస్తారు. దీన్ని శనిదోషముగా భావించడము దైవము యెడ మహాపరాధము. అని పెద్దవారు తెలియజేసారు.

ఆయా స్థానములలో గ్రహరాజు సంచరించుకాలంలో.. శనిదేవుని పూజ చేయటం మంచిది.
...............
శనిదేవుని గురించి కొన్ని విషయములు ఈ క్రింది లింకుల వద్ద గమనించగలరు.

SHANI DEV KI KATHA - YouTube

                         
shani-6.wmv.flv

Sunday, January 8, 2017

వైకుంఠ ఏకాదశి సందర్భముగా..


ఓం..
విష్ణోః అష్టావింశతినామ స్తోత్రం..

శ్రీ భగవానువాచ:

మత్శ్యం కూర్మం వరాహంచ వామనంచ జనార్దనమ్
గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనమ్
పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధమ్   
గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమమ్
విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిమ్
దామోదరం శ్రీధరంచ వేదాంగం గరుడధ్వజమ్ 
అనంతం కృష్ణగోపాలం జపతోనాస్తి పాతకమ్
గవాం కోటిప్రదానస్య చాశ్వమేధ శతస్య చ.


లక్ష్మ్యష్టకం..

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తు తే.



నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే



సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే



సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోఽస్తు తే.



ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే.



స్తూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవీ మహాలక్ష్మి నమోఽస్తు తే.



పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాత ర్మహాలక్ష్మి నమోఽస్తు తే.



శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే
జగత్సితే జగన్మాత ర్మహాలక్ష్మి నమోఽస్తు తే.



మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠే ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా.



ఏకకాలే పఠే న్నిత్యం మహాపాపవినాశనం
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః

త్రికాలం యః పఠే న్నిత్యం మహాశత్రువినాశనం
మహాలక్ష్మీర్భవే న్నిత్యం ప్రసన్నా వరదా శుభా.



ఇతి ఇంద్రకృత మహాలక్ష్మ్యష్టక స్తవః

వ్రాసిన విషయములలో అచ్చుతప్పులు వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.