koodali

Thursday, December 10, 2015

వ్యాధులు...తెచ్చిపెట్టుకున్న అవయవాలు.. ఆరోగ్యమే మహా భాగ్యమ్..


 
ఈ మధ్యకాలంలో ..కిడ్నీ, లివర్..వంటి వ్యాధుల వలన అవయవాలు పాడయ్యి, మందులపై ఆధారపడి జీవచ్చవంలా బ్రతుకుతున్నవారు ఎందరో ఉన్నారు.  

ఎందరో వ్యాధిగ్రస్తులు అవయవ దాతల  కోసం ఎదురుచూస్తున్నారు. 

 అయితే, అవయవదానం పట్ల కొందరిలో కొన్ని అపోహలున్నాయి. ఈ అపోహలు అవసరం లేదు. 

వ్యక్తుల మరణానంతరం  వారి  అవయవాలను ఇతరులకు అమర్చటం వల్ల ఎందరికో ఉపయోగం కలుగుతుంది.


దధీచి మహర్షి లోకకల్యాణం కొరకు తన శరీరాన్ని దానం చేసారని గ్రంధాల ద్వారా తెలుస్తోంది.

మనుషులు మరణానంతరం తమ అవయవాలను దానం చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది.  


  పశుపక్ష్యాదులశరీరాలు  మరణానంతరం కూడా ఇతరులకు ఉపయోగపడతాయి.  
మనుషుల శరీరం  మరణానంతరం  ఎందుకూ పనికిరాదని కొందరు భావిస్తారు. 


అయితే  మనుషులు కూడా  అవయవదానం చేయటం ద్వారా ... మరణానంతరం  కూడా   ఇతరులకు సహాయాన్ని అందించవచ్చు.
...............

ప్రపంచంలో ..కళ్లు లేనివారు, వికలాంగులు ఎందరో ఉన్నారు. 

  ఆధునిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని చెపుతున్న ఈ రోజుల్లో ఇలాంటి  సమస్యలకు ఏమైనా  పరిష్కారం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 


ఈ మధ్యకాలంలో ..కిడ్నీ, లివర్..వంటి వ్యాధుల వలన అవయవాలు పాడయ్యి, మందులపై ఆధారపడి జీవచ్చవంలా బ్రతుకుతున్నవారు కూడా  ఎందరో ఉన్నారు.


ఇలాంటి వ్యాధిగ్రస్తులు ...ఇతరుల నుంచి  అవయవదానం కోసం ఎదురుచూసే అవసరం లేకుండా .... శాస్త్రవేత్తలు  శరీరావయవాలను పోలిన యంత్రాలను తయారుచేస్తే బాగుంటుందనిపిస్తుంది.

అయితే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.

 కిడ్నీ పాడయిన వారికి కిడ్నీలా పనిచేసే చిన్న యంత్రం తయారుచేసే ప్రయత్నాలు  సఫలీకృతమవుతున్నాయని  ఈ మధ్యనే వార్తలు వచ్చాయి. 


 ఇలాంటి యంత్రాలు తయారుచేస్తే కిడ్నీదాతల కోసం ఎదురుచూస్తున్న ఎందరో రోగులకు   ఉపశమనం కలుగుతుంది. అవయవదాతల కొరకు ఎదురు చూసే అవసరం ఉండదు.

( ఆధునిక టెక్నాలజీని ఇలాంటి ఉపయోగకరమైన విషయాల కొరకు ఉపయోగిస్తే ఎంతో మంచిది...... ఇలాంటివి కనిపెట్టే వారు ఎంతో గొప్పవారు.)
....................

అయితే, ఎంతయినా సహజమైన అవయవమే గొప్పది. తెచ్చిపెట్టుకున్నవి సహజమైన అవయవాల వలె ఉండవు.

 తెచ్చిపెట్టుకున్న  అవయవాలతో  ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 

అయితే , అనారోగ్యం వల్ల అవయవాలు పాడై.. ఇక వేరే దారిలేనప్పుడు  తెచ్చిపెట్టుకున్న అవయవాలు  అవసరమే.

అందువల్ల..ఎవరైనా  అనారోగ్యం రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం. 

ఆరోగ్యమే మహా భాగ్యమని  పెద్దలు తెలియజేసారు కదా!



Monday, December 7, 2015

ఓం..

 ఓం..
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వందనములు.

బ్రహ్మదేవునికి వందనములు.
విష్ణుదేవునికి వందనములు.
ఓం నమఃశివాయ.
........................

Friday, December 4, 2015

అప్పుడు ..ఇప్పుడు .. కొన్ని విషయాలు ...

 
 
ఈ మధ్య కాలంలో  కిడ్నీ, కాన్సర్, లివర్..వంటి వ్యాధులు అధికమవటానికి అనేక కారణాలున్నాయి. 
................

పాతకాలంలో పంటలు పండటానికి సహజ ఎరువులను మాత్రమే వాడేవారు. 

ఇప్పుడు రసాయన ఎరువులను వాడుతున్నారు.
............

 ఇంట్లో గిన్నెలు శుభ్రపరచటానికి మట్టి, బూడిద, సున్నిపిండి, కుంకుడురసం వంటివి వాడేవారు. ఈ పదార్ధాలు పొరపాటున గిన్నెలపై మిగిలిఉండి ఆహారంతోపాటు శరీరంలో ప్రవేశించినా కూడా హాని ఏమీ జరగదు. 

ఇప్పటి రోజుల్లో పాత్రలు శుభ్రం చేయటానికి రసాయనాలు కలిసిన వాటిని ఉపయోగిస్తున్నాం. 

పాత్రలను ఎంత శుభ్రం చేస్తున్నా చాలాసార్లు ఆ అవశేషాలు పాత్రపైనే మిగిలిఉంటున్నాయి. 

ఆ పాత్ర ద్వారా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ రసాయనాలు కూడా శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంది.
........................

పాతకాలంలో మట్టి, రాగి.. వంటి  పాత్రలను ఎక్కువగా వాడేవారు. 

ఈ రోజుల్లో మట్టి కూడా కలుషితం అవుతోంది కాబట్టి మట్టితో  పాత్రలు తయారుచేసినా ఉపయోగం లేదనిపిస్తోంది.

ఈ రోజుల్లో ఏవేవో కోటింగులు వేసిన పాత్రలను వాడుతున్నారు. ఇలాంటి పాత్రలలో  ఆహారాన్ని  ఎక్కువ వేడివద్ద వండకూడదట.
  ......................

 పాతకాలంలో  త్రాగటానికి, ఆహారాన్ని వండటానికి  చెరువులలో నీటిని వాడేవారు. చాలా ఇళ్ళల్లో నూయి కూడా ఉండేది. ఆ నీరు స్వచ్చంగా ఉండేది. 

ఈ రోజుల్లో అయితే కొన్ని పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్ధాలతో కూడిన నీటిని నదులలో, చెరువులలో కలిపేస్తున్నారు. 

రసాయన వ్యర్ధాలను  పనికట్టుకుని చెరువులలో, నదులలో కలపకపోయినా  వర్షాలు వచ్చినప్పుడు ఈ రసాయనా వ్యర్ధాలు వర్షపు నీటితో పాటు వచ్చి  చెరువులలో, నదులలో కలిసే అవకాశం కూడా ఉంది.

 త్రాగటానికి, ఆహారాన్ని తయారుచేయటానికి కలుషితమైన నీటిని వాడటం వల్ల శరీరభాగాలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.
........................

పాత రోజులలో   ఇంటి శుభ్రతకు  ఆవుపేడ , మట్టి వంటివి వాడేవారు . ఆ రోజుల్లో  బాత్రూమ్స్  ఇంట్లో కాకుండా ఇంటికి కొంచెం బయట ఉండేవి .

 సింధు నాగరికత రోజుల్లోనే ఇళ్ళ నుండి  నీరు  బయటకు పోవటానికి  చక్కటి నీటిపారుదల వ్యవస్థ ఉన్నట్లు త్రవ్వకాల ద్వారా తెలిసింది. 


ఈ రోజుల్లో  ఇంటి  శుభ్రతకు ఎన్నో ఆసిడ్లను వాడుతున్నాము.

 ఈ రసాయనాలు ఇంటినుంచి డ్రైనేజ్లోకి వెళ్లి భూమిలో ఇంకటం, చెరువులలోనూ, నదులలోనూ కలవటం జరుగుతుంది. ఇందువల్ల  భూమి, నీరు కలుషితం అవుతోంది.
........................

 ఇక కొన్ని పరిశ్రమల వల్ల గాలి కూడా కలుషితం అవుతోంది. 
..................

కంప్యూటర్స్, ఏసీలు, ఫ్రిజులు..వంటి ఆధునిక పరికరాల  వాడకం  వల్ల ఓజోన్ పొర  పలుచబడుతోందని అంటున్నారు.

 ఓజోన్ పొర పలచబడితే అనేక దుష్పరిణామాలు కలుగుతాయంటున్నారు. 
......................
ఎన్నో విధాలుగా  గాలి, నీరు, భూమి..కలుషితం అవుతున్న ఈ రోజుల్లో  వ్యాధులు పెరగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
...........................

ఆధునికులు టెక్నాలజీకి బందీలయిపోయారు.

 టెక్నాలజీని ఎంత వరకూ అవసరమో అంతవరకే వాడుకుంటే కొన్ని దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చు. 
......................

Images for sindhu drainage system



Wednesday, December 2, 2015

అభివృద్ధి చెందుతున్న వాతావరణ వైపరీత్యాలు, వ్యాధులు...

 
 
కొన్ని రోజుల క్రితం మా ఇంటికి తెలిసిన వాళ్ళు ( ఫ్రెండ్స్) వచ్చి వెళ్లారు.

వాళ్ళ 6 సంవత్సరాల అబ్బాయికి కిడ్నీ వ్యాధి వచ్చింది. మా ఊరిలో వైద్యుల వద్ద చూపించుకోవటానికి వచ్చారు. 

అంత చిన్న బాబుకు కిడ్నీ వ్యాధి రావటం ఏమిటో ? చాలా బాధనిపించింది. 

రక్త పరీక్ష చేయించుకునేటప్పుడు బాబు భయంతోనూ, నొప్పితోనూ  బాగా ఏడ్చాడని చెబుతుంటే ఎంతో బాధనిపించింది.

 పాతకాలంలో కాన్సర్..  వంటి వ్యాధుల గురించి  అరుదుగా వినేవాళ్ళం.

ఈ రోజుల్లో  ఎందరో చిన్నపిల్లలు కూడా  కిడ్నీ, కాన్సర్  వంటి  వ్యాధుల బారిన పడుతున్నట్లు వింటున్నాం.

ఆధునిక కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, రసాయన పురుగుమందులతో పెంచుతున్న ఆహారధాన్యాలు, శుభ్రత కోసం ఇంట్లో విరివిగా వాడే రసాయనాలు భూమిలో, నీటిలో కలవటం ... వంటి అనేక కారణాల వల్ల ... 

 అభివృద్ధి పేరుతో గాలిని, నీటినీ కలుషితం చేయటం...వంటి అనేక కారణాల వల్ల  కిడ్నీ వ్యాధులు, కాన్సర్లు, లివర్ పాడవటం..వంటి అనేక వ్యాధులు పెరుగుతున్నాయి. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు.


ఎంతసేపూ టెక్నాలజీ పెరగటం గురించి, డబ్బు సంపాదించటం గురించి, ఇతరగ్రహాలపైకి వెళ్ళటం ..వంటి విషయాల గురించి తాపత్రయపడుతున్నారే గానీ ,  సమాజంలో పెరుగుతున్న వ్యాధుల విజృంభణ, పర్యావరణ కాలుష్యం వల్ల కలుగుతున్న విపరీతమైన వాతావరణ మార్పులు వంటి సమస్యల గురించి పెద్దగా దృష్టి పెట్టడం లేదు.


 పర్యావరణ పరిరక్షణ  గురించి అప్పుడప్పుడు కొన్ని సమావేశాలు జరిపి చర్చించుకోవటంతోనే సరిపెట్టుకుంటే తరువాత చింతించవలసి వస్తుంది.

ఈ సమస్యలను అశ్రద్ధ చేస్తే జీవుల మనుగడకే ప్రమాదం కదా!


Monday, November 30, 2015

ఓం..


లింగాష్టకం.

1..బ్రహ్మమురారి సురార్చితలింగం
....నిర్మల భాసితశోభితలింగమ్ 
జన్మజదుఃఖవినాశకలింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

2..దేవముని ప్రవరార్చితలింగం
....కామదహనకరుణాకరలింగమ్ 
రావణదర్పవినాశకలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

3..సర్వసుగంధసులేపితలింగం
....బుద్ధివివర్ధనకారణలింగమ్ 
సిద్ధసురాసురవందితలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

4..కనకమహామణిభూషితలింగం
....ఫణిపతివేష్టిత శోభితలింగమ్ 
దక్షసుయజ్ఞవినాశనలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

5..కుంకుమచందన లేపితలింగం
....పంకజహారసుశోభితలింగమ్
సంచితపాపవినాశక  లింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

6..దేవగణార్చితసేవితలింగం
....భావైర్భక్తిభిరేవ  చ లింగమ్
దినకరకోటి ప్రభాకరలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

7..అష్టదళో పరివేష్టితలింగం
....సర్వసముద్భవకారణలింగమ్ 
అష్టదరిద్ర వినాశనలింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

8..సురగురు సురవర పూజితలింగం
....సురవనపుష్పసదార్చితలింగమ్ 
పరమపదం పరమాత్మక లింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

లింగాష్టక  మిదం పుణ్యం
....యఃపఠే చ్చివసన్నిధౌ
శివలోక  మవాప్నోతి
....శివేన  సహ  మోదతే.

గౌరీస్తుతి 

నానాయోగిమునీంద్ర హృద్యనిలయాం
నానార్ధసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం
నారాయణేనార్చితామ్
 నాదబ్రహ్మమయీం  పరాత్పరాం
నానార్ధతత్వాత్మికాం
మీనాక్షీం  ప్రణతోస్మి  సంతత మహం
కారుణ్యవారాన్నిధిమ్ .


 వ్రాసిన విషయాలలో ఏమైనా  అచ్చుతప్పులు  వంటివి ఉంటే ,  దయచేసి  క్షమించమని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.




Saturday, November 28, 2015

రావణవధ వధ జరగటంలో తప్పేమిటి ?


రావణవధ గురించి బ్లాగులలో కొందరి అభిప్రాయాలను చదివిన తరువాత నా అభిప్రాయాలను వ్రాయాలనిపించి వ్రాస్తున్నాను.
...............

1. కొందరి అభిప్రాయాలు.. రాక్షసులు చెడుకు ప్రతీకలు, దేవతలు మంచికి ప్రతీకలు అనడం... దేవతలు ఎంత తందనాలాడినా ఒకే, రాక్షసులు ఎంత నిష్టగా వున్నా లాభం లేదు... వారు చెడ్డవారే అని అర్థం చెప్పడం కాదూ?

a. నా అభిప్రాయం..రాక్షసులు చెడుకు ప్రతీకలు, దేవతలు మంచికి ప్రతీకలు అనేది సరైనదే.

అయితే,  రాక్షసులలో ప్రహ్లాదుడు వంటి మంచివారు కూడా ఉన్నారు.
....................

2. రాక్షసులు ఎంత నిష్టగా వున్నా లాభం లేదు... వారు చెడ్డవారే అని అర్థం చెప్పడం కాదూ?

a. రాక్షసులు ఎంత నిష్టగా వున్నా లాభం లేదు... వారు చెడ్డవారే  అని  ఎవరూ  చెప్పలేదు . 

రాక్షస జాతిలో  జన్మించినా  కూడా  ప్రహ్లాదుని    గొప్పవాడనే  అంటారు .   ప్రహ్లాదుని  చెడ్డవాడని ఎవరూ  అనరు కదా! 
...................


3. క్షాత్ర ధర్మం అనుసరించి... బలం వుంది కాబట్టి త్రిలోకాలను జయించడం తప్పే అయితే ఆ కాలం నాటి క్షత్రియులందరు చేసిందీ తప్పే కదా? ఇందులో రావణుడు మాత్రమే చేసిన తప్పేమిటీ? దేవతలను జయించడమా?


a.రావణుడు  అనవసరంగా ఎన్నో యుద్ధాలు  చేసి ఎందరినో చంపేసాడు..   రావణుడిని చంపటంలో మాత్రం తప్పేమిటి ?
................

4.ఇక పోతే సీతను కిడ్నాప్ చేయడం లాంటి నేరాలు కూడా ఆ కాలంలో పరిపాటే! మంచివాళ్ళోహో అని ప్రచారం చేసే దేవతల్లో కూడా ఇంద్రుడు ఎన్ని రంకు పనులు చెయ్యలేదు? కిడ్నాప్‌లు కూడా చేశాడుగా?

a.సీతను కిడ్నాప్ చేయడం లాంటి నేరాలు కూడా ఆ కాలంలో పరిపాటే! అనటంలో  రావణుడు  స్త్రీలను కిడ్నాప్ చేయటం తప్పు కాదని మీ అభిప్రాయంలా అనిపిస్తోంది. 

ఇక,  ఇంద్రుడు తాను చేసిన కొన్ని పనుల వల్ల  ఎన్నో కష్టాలు అనుభవించటం జరిగింది. ఇలాంటి సంఘటనల ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే..

 ఎంత గొప్పవాళ్ళైనా సరే ( దేవతలైనా సరే ) తాము చేసిన పనులకు తగ్గ ఫలితాలను అనుభవిస్తారని తెలుసుకోవచ్చు.
......................

ఇక , రావణుడు  ఎందరో స్త్రీలను చెరబట్టాడు.

రావణుడి గురించిన మరికొన్ని విషయాలు......( ఈ విషయాలు అంతర్జాలంలో చదివి రాసాను..) 

రావణుడు రసికతకు, స్త్రీల కొరకై ఎంతకైనా తెగించేవాడుగా పేరు గాంచాడు. ఇతనికి ఎంతోమంది భార్యలు. వారిలో ముఖ్యమైనది మయసురుడి కూతురు, మరియు అప్సరస అయినటువంటి మండోదరి. మండోదరి తెలివితేటలకు, అందానికి పెట్టింది పేరు. ఉన్న భార్యలు చాలక రావణుడు తను గెలిచిన దేశాలనుండి ఎంతోమంది మహిళలను తెచ్చి తన అంతఃపురంలో ఉంచాడు. 

వాసుకి పాలిస్తున్న పాతాళ లోకానికి వెళ్ళి తక్షకుని భార్యను అపహరించి తన భార్యగా చేసుకొంటాడు.

తనను నిరసించిన యువతిని కైవసం చేసుకోవటానికి రావణుడు ఎంతకైనా తెగించేవాడు. ఇలాంటి రెండు ఘటనల కారణంగానే రామాయణ మహాకావ్యం ఉద్భవించిందని చెప్పవచ్చు. 

మొదటిది సన్యాసినియైన వేదవతిని బలాత్కరించ బూనడం. వేదవతి విష్ణువును చేపట్టడానికి కఠోరమైన తపస్సు చేయసాగింది. కుటీరానికి వచ్చిన రావణుడు ఆమెను కామించాడు. కాని ఆమె అతన్ని ఎదిరించింది. 

కాని రావణుడు బలాత్కారంగా ఆమెను చెరపట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడామె అతని చావుకి తానే కారణమౌతానని ప్రవచించి, మంటలను ప్రజ్వరిల్లజేసి అందులో బూడిదై పోయింది.

 తర్వాత ఆమే సీత గా పుట్టి, విష్ణువుకి(రాముడి రూపంలో) భార్యగా మారి, రావణుడి చావుకి కారణమైంది.

 రెండోది అప్సరస రంభతో రావణుడి వ్యవహారం. రావణుడు రంభను మోహించి బలవంతం చేయబోతాడు. అప్పుడు రంభ తనకు కుబేరుడి కొడుకుతో వివాహం నిశ్చయమైనందున తాను రావణుడికి కుమార్తె సమానురాలనని, కామకలాపాలకు సరికాదని చెపుతుంది. కానీ రావణుడు వినకుండా బలవంతం చేయబోతాడు.

 దాంతో కోపించిన కుబేరుడి కొడుకు, ఇకముందు ఏ స్త్రీనైనా బలవంతపెడితే అతని పది తలలు రాలిపోతాయని శపిస్తాడు. ఈ శాపమే రావణుడి చెరలో ఉన్న కాలంలో సీతను కాపాడిందని చెప్పబడుతుంది.


రావణుడు కైలాసపర్వతం వైపు వెళ్ళి తన సోదరుడైన కుబేరుని యుద్ధంలో జయించి పుష్పకవిమానాన్ని కాంచనలంకకు తెచ్చుకొన్నాడు.

ఉత్తరభారతంలో ఉన్న చైత్రవనాన్ని ధ్వంసం చేశాడు. స్వర్గానికి వెళ్ళి నందనవనాన్ని ధ్వంసం చేశాడు.

సూర్యచంద్రులను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని వారి గమనాన్ని నిరోధిస్తాడు.

పూర్తి కావస్తున్న యజ్ఞయాగాదులను ధ్వంసం చేయడం అంటే అత్యంత ప్రీతి. యజ్ఞాలలో ఇచ్చే సోమరసాన్ని ఇంద్రుడు సంగ్రహించకుండా తానే స్వీకరించి, యజ్ఞఫలాన్ని నాశనం చేస్తాడు.
............

( ఇలాంటి రావణుడిని చంపటంలో తప్పేమీ లేదు. చంపకుండా వదిలితేనే తప్పు.)



Wednesday, November 25, 2015

ఓం..


కార్తీక పౌర్ణమి... తిరువణ్ణామలై  మహాదీపోత్సవం ఒకే రోజు వచ్చిన విశేషమైన రోజు ఇది.
................

లింగాష్టకం.

1..బ్రహ్మమురారి సురార్చితలింగం
....నిర్మల భాసితశోభితలింగమ్ 
జన్మజదుఃఖవినాశకలింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

2..దేవముని ప్రవరార్చితలింగం
....కామదహనకరుణాకరలింగమ్ 
రావణదర్పవినాశకలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

3..సర్వసుగంధసులేపితలింగం
....బుద్ధివివర్ధన కారణలింగమ్ 
సిద్ధసురాసురవందితలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

4..కనకమహామణిభూషితలింగం
....ఫణిపతివేష్టిత శోభితలింగమ్ 
దక్షసుయజ్ఞవినాశనలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

5..కుంకుమచందన లేపితలింగం
....పంకజహారసుశోభితలింగమ్
సంచితపాపవినాశక  లింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

6..దేవగణార్చితసేవితలింగం
....భావైర్భక్తిభిరేవ  చ లింగమ్
దినకరకోటి ప్రభాకరలింగం
....తత్ప్రణమామి సదాశివలింగమ్

7..అష్టదళో పరివేష్టితలింగం
....సర్వసముద్భవకారణలింగమ్ 
అష్టదరిద్ర వినాశనలింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

8..సురగురు సురవర పూజితలింగం
....సురవనపుష్పసదార్చితలింగమ్ 
పరమపదం పరమాత్మక లింగం
....తత్ప్రణమామి  సదాశివలింగమ్

లింగాష్టక  మిదం పుణ్యం
....యఃపఠే చ్చివసన్నిధౌ
శివలోక  మవాప్నోతి
....శివేన  సహ  మోదతే.

గౌరీస్తుతి 

నానాయోగిమునీంద్ర హృద్యనిలయాం
నానార్ధసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం
నారాయణేనార్చితామ్
 నాదబ్రహ్మమయీం  పరాత్పరాం
నానార్ధతత్వాత్మికాం
మీనాక్షీం  ప్రణతోస్మి  సంతత మహం
కారుణ్యవారాన్నిధిమ్ .


 వ్రాసిన విషయాలలో ఏమైనా  అచ్చుతప్పులు  వంటివి ఉంటే ,  దయచేసి  క్షమించమని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.