రావణవధ గురించి బ్లాగులలో కొందరి అభిప్రాయాలను చదివిన తరువాత నా అభిప్రాయాలను వ్రాయాలనిపించి వ్రాస్తున్నాను.
...............
1. కొందరి అభిప్రాయాలు.. రాక్షసులు చెడుకు ప్రతీకలు, దేవతలు మంచికి ప్రతీకలు అనడం... దేవతలు ఎంత తందనాలాడినా ఒకే, రాక్షసులు ఎంత నిష్టగా వున్నా లాభం లేదు... వారు చెడ్డవారే అని అర్థం చెప్పడం కాదూ?
a. నా అభిప్రాయం..రాక్షసులు చెడుకు ప్రతీకలు, దేవతలు మంచికి ప్రతీకలు అనేది సరైనదే.
అయితే, రాక్షసులలో ప్రహ్లాదుడు వంటి మంచివారు కూడా ఉన్నారు.
....................
2. రాక్షసులు ఎంత నిష్టగా వున్నా లాభం లేదు... వారు చెడ్డవారే అని అర్థం చెప్పడం కాదూ?
రాక్షస జాతిలో జన్మించినా కూడా ప్రహ్లాదుని గొప్పవాడనే అంటారు . ప్రహ్లాదుని చెడ్డవాడని ఎవరూ అనరు కదా!
...................
3. క్షాత్ర ధర్మం అనుసరించి... బలం వుంది కాబట్టి త్రిలోకాలను జయించడం తప్పే అయితే ఆ కాలం నాటి క్షత్రియులందరు చేసిందీ తప్పే కదా? ఇందులో రావణుడు మాత్రమే చేసిన తప్పేమిటీ? దేవతలను జయించడమా?
a.రావణుడు అనవసరంగా ఎన్నో యుద్ధాలు చేసి ఎందరినో చంపేసాడు.. రావణుడిని చంపటంలో మాత్రం తప్పేమిటి ?
................
4.ఇక పోతే సీతను కిడ్నాప్ చేయడం లాంటి నేరాలు కూడా ఆ కాలంలో పరిపాటే! మంచివాళ్ళోహో అని ప్రచారం చేసే దేవతల్లో కూడా ఇంద్రుడు ఎన్ని రంకు పనులు చెయ్యలేదు? కిడ్నాప్‌లు కూడా చేశాడుగా?
a.సీతను కిడ్నాప్ చేయడం లాంటి నేరాలు కూడా ఆ కాలంలో పరిపాటే! అనటంలో రావణుడు స్త్రీలను కిడ్నాప్ చేయటం తప్పు కాదని మీ అభిప్రాయంలా అనిపిస్తోంది.
ఇక, ఇంద్రుడు తాను చేసిన కొన్ని పనుల వల్ల ఎన్నో కష్టాలు అనుభవించటం జరిగింది. ఇలాంటి సంఘటనల ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే..
ఎంత గొప్పవాళ్ళైనా సరే ( దేవతలైనా సరే ) తాము చేసిన పనులకు తగ్గ ఫలితాలను అనుభవిస్తారని తెలుసుకోవచ్చు.
......................
ఇక , రావణుడు ఎందరో స్త్రీలను చెరబట్టాడు.
రావణుడి గురించిన మరికొన్ని విషయాలు......( ఈ విషయాలు అంతర్జాలంలో చదివి రాసాను..)
రావణుడు రసికతకు, స్త్రీల కొరకై ఎంతకైనా తెగించేవాడుగా పేరు గాంచాడు. ఇతనికి ఎంతోమంది భార్యలు. వారిలో ముఖ్యమైనది మయసురుడి కూతురు, మరియు అప్సరస అయినటువంటి మండోదరి. మండోదరి తెలివితేటలకు, అందానికి పెట్టింది పేరు. ఉన్న భార్యలు చాలక రావణుడు తను గెలిచిన దేశాలనుండి ఎంతోమంది మహిళలను తెచ్చి తన అంతఃపురంలో ఉంచాడు.
వాసుకి పాలిస్తున్న పాతాళ లోకానికి వెళ్ళి తక్షకుని భార్యను అపహరించి తన భార్యగా చేసుకొంటాడు.
తనను నిరసించిన యువతిని కైవసం చేసుకోవటానికి రావణుడు ఎంతకైనా తెగించేవాడు. ఇలాంటి రెండు ఘటనల కారణంగానే రామాయణ మహాకావ్యం ఉద్భవించిందని చెప్పవచ్చు.
మొదటిది సన్యాసినియైన వేదవతిని బలాత్కరించ బూనడం. వేదవతి విష్ణువును చేపట్టడానికి కఠోరమైన తపస్సు చేయసాగింది. కుటీరానికి వచ్చిన రావణుడు ఆమెను కామించాడు. కాని ఆమె అతన్ని ఎదిరించింది.
కాని రావణుడు బలాత్కారంగా ఆమెను చెరపట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడామె అతని చావుకి తానే కారణమౌతానని ప్రవచించి, మంటలను ప్రజ్వరిల్లజేసి అందులో బూడిదై పోయింది.
తర్వాత ఆమే సీత గా పుట్టి, విష్ణువుకి(రాముడి రూపంలో) భార్యగా మారి, రావణుడి చావుకి కారణమైంది.
రెండోది అప్సరస రంభతో రావణుడి వ్యవహారం. రావణుడు రంభను మోహించి బలవంతం చేయబోతాడు. అప్పుడు రంభ తనకు కుబేరుడి కొడుకుతో వివాహం నిశ్చయమైనందున తాను రావణుడికి కుమార్తె సమానురాలనని, కామకలాపాలకు సరికాదని చెపుతుంది. కానీ రావణుడు వినకుండా బలవంతం చేయబోతాడు.
దాంతో కోపించిన కుబేరుడి కొడుకు, ఇకముందు ఏ స్త్రీనైనా బలవంతపెడితే అతని పది తలలు రాలిపోతాయని శపిస్తాడు. ఈ శాపమే రావణుడి చెరలో ఉన్న కాలంలో సీతను కాపాడిందని చెప్పబడుతుంది.
రావణుడు కైలాసపర్వతం వైపు వెళ్ళి తన సోదరుడైన కుబేరుని యుద్ధంలో జయించి పుష్పకవిమానాన్ని కాంచనలంకకు తెచ్చుకొన్నాడు.
ఉత్తరభారతంలో ఉన్న చైత్రవనాన్ని ధ్వంసం చేశాడు. స్వర్గానికి వెళ్ళి నందనవనాన్ని ధ్వంసం చేశాడు.
సూర్యచంద్రులను రెండు చేతులతో గట్టిగా పట్టుకొని వారి గమనాన్ని నిరోధిస్తాడు.
పూర్తి కావస్తున్న యజ్ఞయాగాదులను ధ్వంసం చేయడం అంటే అత్యంత ప్రీతి. యజ్ఞాలలో ఇచ్చే సోమరసాన్ని ఇంద్రుడు సంగ్రహించకుండా తానే స్వీకరించి, యజ్ఞఫలాన్ని నాశనం చేస్తాడు.
............
( ఇలాంటి రావణుడిని చంపటంలో తప్పేమీ లేదు. చంపకుండా వదిలితేనే తప్పు.)
Your posts and comments are not appearing in Malika.
ReplyDeletecheck it.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.
ReplyDeleteమాలికలో నా బ్లాగ్ రాకపోవటానికి కారణమేమిటో నాకు తెలియదండి.
పురాణేతిహాసాలను గమనించితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ధర్మాన్ని పాటించే విషయంలో దేవతలకు, రాక్షసులకు మధ్య ఎటువంటి పక్షపాతమూ లేదని తెలుస్తుంది.
ReplyDeleteఎన్నో అకృత్యాలు చేసినందువల్ల రావణుడికి శిక్ష పడింది. అంతటి పౌలస్త్య బ్రహ్మ మనుమడు అయినా కూడా రావణుడికి శిక్ష తప్పలేదు.
ఇవన్నీ గమనిస్తే ఏం తెలుస్తుందంటే, ఎంత వారైనా సరే వారు చేసిన కర్మకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారని తెలుసుకోవచ్చు.
వాళ్ళువేసిన మరి కొన్ని ప్రశ్నలు ->
ReplyDeleteవారి అభిప్రాయం..పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే పదిమంది రాక్షసులను చంపినవాడిని ఏమని పిలవాలి ?
నా అభిప్రాయం..పదిమంది మనుష్యులను చంపినవాడు రాక్షసుడైతే... పదిమంది రాక్షసులను చంపినవాడిని దేవుడని పిలవాలి.
.............
వాళ్ళ అభిప్రాయం..మనిషిని కానీ మరి ఎవరినైనా కానీ ప్రాణ,మానహాని తలపెట్టినపుడు చంపారంటే అర్ధం ఉంది.ముందుగా ప్లాన్ వేసుకుని చంపితే దేవుడా ?
నా అభిప్రాయం.. రావణాసురుడు ఎన్నో అకృత్యాలు చేశాడు. సీతాదేవిని అపహరించాడు. సీతను రామునికి అప్పజెప్పమని యుద్ధానికి ముందే విభీషణుడు మొదలగువారు చెప్పటం జరిగింది. యుద్ధాన్ని నివారించే దిశగా ఎన్నో అవకాశాలు వచ్చినా రావణుడు వినిపించుకోలేదు. అందుకు తగ్గ శిక్షను అనుభవించటం జరిగింది.
...........
వాళ్ళ అభిప్రాయం..ధర్మాన్ని రక్షించాలంటే ఒకరిని ఒకరు చంపుకోవలిసిందేనా ?
నా అభిప్రాయం..తప్పులు చేస్తున్న వారిని సరైన దారిలోకి తీసుకురావటానికి ఎన్నో అవకాశాలను ఇస్తారు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా సమాజానికి హాని చేస్తూనే ఉండేవారిని శిక్షించక ఏం చేయాలి ?
.............
వాళ్ళ అభిప్రాయం..చెడు మీద మంచి విజయం సాధించాలంటే యుద్ధం తప్పదని మీరు బోధిస్తున్నట్లైతే అలీన ఉద్యమమెందుకు ?అణు ఒప్పందాలెందుకు ?
నా అభిప్రాయం..ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు కదా! అధికార దాహం, ధనదాహం, కీర్తి కండూతి, స్త్రీ లోలత్వం , స్వార్ధం వంటి అనేక స్వార్ధకారణాల వల్ల కొందరు సమాజంలో సాటివారిని బాధలుపెడుతుంటారు.
మంచి మాటల వల్ల కొందరిలో మంచి మార్పు వస్తుంది. కొందరిలో మంచిమార్పు రాదు. మంచిగా మారని వారి వల్ల యుద్ధాలు అనివార్యమవుతాయి.
వాళ్ళ అభిప్రాయం..ఒకే నేరం చేసినపుడు అందరికీ ఒకే శిక్ష కదా వుండవలసింది?
Deleteనా అభిప్రాయం.. ఒక్కో విషయం వెనుక అనేక కోణాలు ఉంటాయి. పూర్వాపరాలను పరిశీలించి ధర్మాధర్మాలు తెలుసుకోవలసి ఉంటుంది. అంతేకానీ అన్నింటినీ ఒకే గాటన కట్టకూడదు.
రాక్షసులలో చాలామంది ఏం చేస్తారంటే.. దేవతలను జయించే శక్తిని పొందటానికి తీవ్ర తపస్సులు చేసి , అలా పొందిన వర ప్రభావంతో దేవతలను, రుషులను, మానవులను పీడించటం చేస్తుంటారు.
హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచివేయగా... విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ధరించి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు.
తనకు మరణం లేదని విర్ర వీగుతూ దేవతలను, ఋషులను అనేక విధముల బాదిస్తున్న హిరణ్య కశిపుని తప్పుపట్టకుండా ఇంద్రుని, విష్ణుమూర్తిని తప్పుపట్టడం ఏమిటి ?
.........
ఇక, అహల్య విషయంలో ఇంద్రుడిని గౌతముడు శపించగా ఇంద్రుడు ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు.
ఇవన్నీ గమనిస్తే .. ఎవరుచేసిన కర్మను వారు అనుభవించే విషయంలో దేవతలకు, రాక్షసులకు మధ్య పక్షపాతం ఏమీ లేదని తెలుస్తుంది.
ReplyDeleteహిరణ్యకశిపుని విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడ కొంత చదవగలరు.( ఈ విషయాలు అంత్ర్జాలం నుండి సేకరించినవి.)
హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతడిని ఏం వరం కావాలో కోరుకొమ్మని అంటాడు. దాంతో రాక్షస రాజు తనకు ఇంటగాని , బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని చంప బడకుండుటకు వరము కావాలని కోరుతాడు. బ్రహ్మ ఆ వరానిస్తాడు.
అప్పటి నుండి హిరణ్య కశిపుడు తనకు తిరుగు లేదని, తనకు మరణము లేదని విర్ర వీగుతు దేవతలను, ఋషులను అనేక విధముల బాదింప సాగెను. హిరణ్య కశిపుని బాధలను భరింప లేక దేవతలందరు శ్రీ హరికి మొర పెట్టుకోగా విషయమును గ్రహించిన శ్రీ హరి వారికి అభయమిస్తాడు.
హిరణ్య కశిపుడు రాక్ష రాజు. అతని భార్య లీలావతి. రాక్షసులకు దేవతలకు ఎల్లప్పుడు యుద్దాలు జరుగు తుండేవి. రాక్షసుల శత్రువైన ఇంద్రుడు గర్భవతియైన హిరణ్య కశిపుని భార్యను ఎత్తుకొని వెళతాడు. ఆమె గర్బములోనున్న వాడిని చంపడానికి. ఇది చూచిన నారదుడు ఇంద్రున్ని వారించి ఆమె గర్భములో పుట్ట బోయే వాడు దేవతలకు మిత్రుడౌతాడని నచ్చజెప్పి ఆమెను తన ఆశ్రమములో సేద దీర్చుతాడు. నారదుడు ఆమెకు విష్ణు భక్తి మాటలు నేర్పి, ఆమె గర్భములో వున్న ప్రహ్లదునికి విష్ణు గీతములు బోధించి అతడిని విష్ణు భక్తునిగ తీర్చి దిద్ది అమెను, భర్థ హిరణ్య కశిపుని ఇంట విడిచి పెట్టెను. కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది.ఆ శిశువుకు ప్రహ్లదుడని నామ కరణము చేస్తారు.
హరిభక్తుడైన ప్రహ్లాదుని ఎన్నో బాధలకు గురిచేసాడు హిరణ్యకశిపుడు. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించవలసి వచ్చింది.
Deleteబా గా వ్రాశారు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఅంతా దైవం దయ.