koodali

Wednesday, July 24, 2013

మూడు విధాలైన టెక్నాలజీ................



కొందరు ఏమంటారంటే............టెక్నాలజీని శాంతియుత ప్రయోజనాలకు కూడా వినియోగించవచ్చు కదా......... అని .......

ఉదా....కత్తిని శాంతియుత ప్రయోజనాలకూ వాడొచ్చు,......అశాంతిని కలిగించే విధంగానూ వాడొచ్చు కదా అని........ కానీ కత్తి వేరు........ అణు శక్తి వేరు........... రెండిటికి ఎంతో తేడా ఉంది.

కత్తి వల్ల కొందరినే చంపగలరు. కానీ అణుశక్తివల్ల కొద్ది సమయంలోనే కొన్ని లక్షలమందిని చంపే అవకాశం ఉంది.

ఇంకా, కొన్ని వేలసంవత్సరాల వరకూ అణుధార్మికత యొక్క దుష్ప్రభావం రాబోయే తరాలను పీడించే అవకాశం ఉంది. అణుబాంబులకు ఎంతో వినాశనాన్ని కలగచేసే శక్తి ఉంటుందట.

*  కత్తివల్ల ఎక్కువ లాభాలు....తక్కువ నష్టాలు ఉన్నాయి.
అదే అణుశక్తి వల్ల తక్కువ లాభాలు........చెప్పలేనన్ని నష్టాలు ఉన్నాయి. 


ఈ తేడాను జాగ్రత్తగా గమనించాలి.

అందువల్ల అణుశక్తిని పూర్తిగా వదిలిపెట్టటమే ఏకైక పరిష్కారం.

నా అభిప్రాయంలో......టెక్నాలజీని మూడువిధాలుగా చెప్పుకుంటే....

1.
ఈ    రకమైన టెక్నాలజీ మనకు నిత్యావసరాలకు ఉపయోగపడే టెక్నాలజీ...................

దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రాచీన కాలం వాళ్ళు తాము కష్ట పడిపనిచేసి పర్యావరణానికి ఎటువంటి హాని కలగని వస్తువులను వాడుతూ, హానిలేని పధ్ధతులను పాటించేవారు.
ఆ విధంగా వారు కూడా ఆరోగ్యంగా ఉండేవారు.


ఆ రోజుల్లో కూడా గొప్ప గొప్ప నాగరికతలు విలసిల్లాయి. అప్పట్లో కూడా ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, ఎన్నోరకాల వృత్తివిద్యలు, ఆర్ధికశాస్త్రం, గణితం ఇలా నిత్యావసరాలకు ఉపయోగపడే విజ్ఞానం వారికి తెలుసు.

ఇంకా, ప్రాచీనుల విజ్ఞానాన్ని తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పటి వాళ్ళు కలలు కంటున్న ( టెలి పోర్టేషన్ ) వంటి ఎంతో విజ్ఞానం వారికి తెలుసు.

మనిషి మాయమయి తిరిగి ప్రత్యక్షమవటం, అణిమ, గరిమ వంటి సిధ్ధులు, పరకాయప్రవేశం , టెలిపతి ఇవన్నీ నేటి శాస్త్రజ్ఞులు భౌతికశాస్త్ర పధ్ధతులలో సాధించటానికి ప్రయత్నిస్తున్నారు.

కానీ ప్రాచీనులు వీటిని దైవసహాయంతో ఆధ్యాత్మికయోగశక్తి ద్వారా సాధించారు.

కానీ ....ఇప్పటి కాలపు భౌతికశాస్త్ర టెక్నాలజీతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.



ఎక్కువగా పర్యావరణానికి హానికలగని ........... విధంగా   ఆ నాటి వారి జీవితం ఉండేది.
అంతే కానీ,   అభివృధ్ధి పేరుతో వస్తువులను విపరీతంగా ఉత్పత్తి చేసి గుట్టలుగా పోయటం వారికి అలవాటు లేదు..


ఇంకా,   వారు తమ నిత్య జీవితంలో అవసరమైన వస్తువులకు ........ ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చేవారు. ఉదా..... కత్తి చూడండి.   మనకు దీని అవసరం ఎంతో ఉంది.

పంటలు పండించటానికి , కూరగాయలను తరగటానికి, వైద్యులు శస్త్రచికిత్సలు చేయటానికి, అలాగే యుధ్ధంలోశత్రువులనుచంపటానికి ............. ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

కానీ ఒకోసారి దుర్మార్గుల చేతిలో పడితే హత్యలు లాంటివి చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి కొద్ది నష్టాలు తప్పితే ..............
దీనివల్ల పర్యావరణానికి పెద్దగా హాని లేదు.

.
ఈ రకమైన టెక్నాలజీ వల్ల నష్టాల కన్నా లాభాలే ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకోవచ్చు.

*  దుర్మార్గుల చేతిలో ఉన్న కత్తి వల్ల ..........జరిగే నష్టం కొద్దిగానే ఉంటుంది. దుర్మార్గుల చేతిలో ఉన్న అణుశక్తి వల్ల ........... జరిగే నష్టం ఎంతో ఎక్కువగా
ఉంటుంది.

అందువల్ల అణుశక్తిని పూర్తిగా వదిలిపెట్టటమే ఏకైక పరిష్కారం.

2.   ఈ   రెండో  రకమైన టెక్నాలజీ వల్ల ..... లాభమా.....నష్టమా ? అన్నది ఎవరికీ సరిగ్గా తెలియదు. దానిని మనం వాడుకునే విధానం బట్టి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చేమో !

మానవులకు కష్టాన్ని తగ్గించే యంత్రాలు, వాహనాలు, టివీలు, సినిమాలు, ఎలెక్ట్రానిక్ వస్తువులు, ఇలా చెప్పుకోవచ్చు. ఈ కోవలోకి వచ్చే వస్తువులు ఉన్నాలేకపోయినా మనిషి బ్రతకగలడు.

ఇవన్నీ మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తాయి. వీటిని తగిన పరిమితిలో వాడుకోవాలి.

మరీ ఎక్కువగా వాడితే పర్యావరణానికి ముప్పు, సహజ వనరులు ఖాళీ అయిపోవటం, రాబోయే తరాలకు సహజ వనరులు లేని ఖాళీ భూగోళాన్ని ఇవ్వటం ,.... ఇప్పుడు ఉన్నవాళ్ళకి పనిలేకపోవటం వల్ల నిరుద్యోగ సమస్య, శారీరిక శ్రమ లేకపోవటం వల్ల శరీరం బలహీనపడటం , జబ్బులు రావటం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

అందుకని ఈ టెక్నాలజీ వల్ల లాభం ఎక్కువా ? నష్టం ఎక్కువా ? అన్నది ఇతమిధ్ధంగా చెప్పలేము. అది మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది.

అయితే ఇందులో మనకు ఏది ఎంతవరకు మంచిదో, అవసరమో అంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.

3.    ఈ  మూడో  రకమైన టెక్నాలజీ వల్ల లాభాలు ఉంటాయని జనం ( ఎండమావి లాంటి ) భ్రాంతిలో మునిగిపోతారు దానివల్ల ......... అంతా నష్టమే తప్ప లాభం అస్సలు ఉండదు.


ఉదా........అణుశక్తి. దీని సంగతి ఇప్పుడు చాలామందికి తెలుసు. తాత్కాలిక ప్రయోజనాల కొరకు ఆశపడితే ........ వేలసంవత్సరాలు భూమిని పీల్చిపిప్పిచేసే దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి , అణుశక్తిని వాడటం పూర్తిగా విడిచిపెట్టెయ్యటమే ఏకైక మార్గం.

ఇలా టెక్నాలజీని వాడుకోవటంలో ....... ప్రపంచం పైన వాటి ప్రభావాన్ని బేరీజు వేసుకుని మాత్రమే ఉపయోగించుకోవాలి... ....
.......
.......................
ఇంకా నాకు ఏమనిపిస్తుందంటేనండి,......అణుశక్తి విషయంలో ప్రమాదాలను నివారించటం అసాధ్యం. ఇంకా, వైద్యరంగంలో దీని సహాయంతో చికిత్సను అందించేవారికి కూడా రేడియేషన్ ప్రభావం వల్ల మొండివ్యాదులు త్వరగా వచ్చే అవకాశముందట.

కొద్ది లాభం కోసం ఎంతో వినాశనాన్ని కలిగించే ప్రమాదం గల దాన్ని ఎవరైనా కోరుకుంటారా ? అందుకే నాకు అనిపిస్తుంది......ఈ అణుశక్తిని కనిపెట్టకుండా ఉంటే బాగుండేది అని....
 ఈ  టపా  పాతదే .  మరల    వ్యాఖ్యలతో   వేసాను.

2 comments:

  1. అణు శక్తిని జబ్బులు నయం చెయ్యటానికి ఉపయోగిస్తారు. దానిని Nuclear Medicine అంటారు. అల్లాగే లాబోరేటరీల్లో సైనైడు, వైరసుల దగ్గరనుండీ అన్నీ ఉంటాయి. అవి బయటకి వస్తే ఎందర్నైనా నాశనం చెయ్యగలవు.మనవాళ్ళు చెప్పినట్లు మనం మన పరిమితులు తెలుసుకుని జీవించాలి. ఇష్టం కదా అని కనపడినంతా తినలేము కదా కడుపు నిండిన తరువాత. అల్లాగే అన్నిట్లోనూ సంయమనం పాటిస్తే అందరికీ బాగానే ఉంటుంది.

    మీరు చెప్పినట్లు:
    అయితే ఇందులో మనకు ఏది ఎంతవరకు మంచిదో, అవసరమో అంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.
    ReplyDelete
  2. కృతజ్ఞతలండి.
    మీరు చెప్పినట్లు సైనైడ్, వైరస్ లు ఎంతోమందిని నాశనం చెయ్యగల శక్తి కలవే కావచ్చు. అంటే వాటిని చిన్నపాటి భూతాలుగా చెప్పుకోవచ్చు.

    అణుశక్తిని పెద్దభూతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైనైడ్, వైరస్ ల దుష్ప్రభావాలతో పోల్చితే ............... అణుశక్తి విషయంలో జరిగే పొరపాట్ల వల్ల ................. కలిగే దుష్ప్రభావాలు, వినాశనం ........................ ఊహకందనంత ఉంటాయట.

    వాటి ప్రభావం .........వేల సంవత్సరాలు భూమిపై ఉంటుందని చెబుతున్నారు కదండి. దానివల్ల ఎన్నో తరాల వరకు రకరకాల జబ్బులతో బాధపడే అవకాశం ఉందట.

    అలాంటి ప్రమాదాలు జరిగిన  చోట్ల ఇప్పటికీ చిన్నమొక్కలు కూడా మొలవలేదట. మొలిచినా ఆ మొక్కలలో, అక్కడి నీటిలో, గాలిలో కొన్ని వందల సంవత్సరాలు అణుధార్మికత నిండి ఉంటుందట.

    ఇలాంటి అణుశక్తిని వైద్యంకొరకు ఉపయోగించటం కూడా కొరివితో తల గోక్కోటంలా వుతుందేమో అనిపిస్తోంది. అందుకని దాన్ని ఏ విధంగానూ ఉపయోగించకుండా ఉండటమే శ్రేయస్కరమేమోనని ఒకోసారి అనిపిస్తుంది.

    నిజమే అణుశక్తిని వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. దానివల్ల జబ్బు ఉన్న సెల్స్ నాశనం అవుతాయి గానీ, ప్రక్కనున్న మంచి సెల్స్ రేడియేషన్ కు గురయ్యి దెబ్బతిని ............... మళ్ళీ వాటికి ట్రీట్మెంట్ ............. ఇలా అంతులేని కధలా సాగే అవకాశం కూడా ఒకోసారి ఉందట.

    అసలు ఈ మధ్య కాలంలో మనం వాడుతున్న వస్తువుల ద్వారా వెలువడుతున్న రేడియేషన్ వల్లనే జనానికి మొండి జబ్బులు రావటం ఎక్కువయ్యిందని అంటున్నారు .


    కొన్ని మొండి జబ్బులు ఆయుర్వేదం , హోమియో లాంటి వాటికి తగ్గటం జరుగుతోంది. ఈ రకమైన మొండిజబ్బులను తగ్గించటానికి ప్రాచీన వైద్యగ్రంధాలను శోధించితే తప్పక మంచి పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయమండి.

    అప్పటివరకూ,వేరేదారిలేక ఇప్పుడున్న విధానాలను వాడుతూనే ఉంటారేమో ప్రజలు ?

    ప్రతి సమస్యకు చక్కటి పరిష్కారముంటుందట......... శోధించగలిగితే..............( దైవానుగ్రహం తోడయితే.).


Monday, July 22, 2013

గురుపూర్ణిమ.

గురుపూర్ణిమ.

ఓం,
 ఎందరో  గురువులు.  అందరికి  అనేక  వందనములు.



Friday, July 19, 2013

షిర్డి సాయి అంటే మాకు ఎంతో ఇష్టం. మరియు కొన్ని విషయములు..

 
ఓం,
ఈ  రోజు   ఆషాఢ  ఏకాదశి  ఉత్సవాలు  జరుగుతున్నాయి.

దైవం సర్వాంతర్యామి. దైవాన్ని ఏ రూపంతోనయినా, ఏ నామంతోనయినా ఆరాధించుకోవచ్చు.
( నిరాకారంగా కూడా ఆరాధించుకోవచ్చు.)

 
 **********
పాపవిమోచన పొందుట….
మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుద్ధిని మరలించనప్పుడు , తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వార కూడ ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు…షిర్డి సాయిబాబా వారు ఇలాంటి ఎన్నో  విషయాలను తెలియజేశారు.



 ఈ రోజుల్లో ఎందరో భక్తులు విపరీతమైన కోరికలతో భక్తిమార్గాన్ని ఆశ్రయిస్తున్నారు.  కష్టాలలో ఉన్నప్పుడు లేక కొన్నిసార్లు కోరికలు కోరుకోవటం మానవనైజం.

అయితే  తమ   పిల్లలు   అదేపనిగా స్వార్ధపరమైన   కోరికలతో   విసిగిస్తే   తల్లితండ్రులకైనా   విసుగు వస్తుంది  కదా  !

కోరికలు కోరేముందు అందుకు తగ్గ అర్హతను సంపాదించుకోవాలని ఒక బోధకులు   తెలియజేశారు. 

అర్హత ఏమీ లేకుండానే   తేరగా   పెద్దపెద్ద   కోరికలు   కోరే స్వార్ధపరులైన భక్తుల సంఖ్య   ఈ  రోజుల్లో  బాగా  పెరిగిన మాట వాస్తవం.

అయితే మొదట కోరికల కోసం భక్తి మార్గాన్ని ఆశ్రయించినా క్రమంగా కోరికలను తగ్గించుకునే స్థాయికి వచ్చే అవకాశమూ ఉంది.

అంతా  దైవం  దయ.


ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  ధన్యవాదాలండి.
 
వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

..............................................
 
సాయిబాబా పుట్టుకతో ఏ మతస్తులో ఎవరికీ తెలియదు. సాయిబాబాను గత కొన్ని సంవత్సరాలుగా ఎందరో పూజిస్తున్నారు. కొందరు హిందువులు కూడా బాబా వారి గురించి ప్రజలలో ప్రచారం చేసారు. బాబావారి విధానాలు తేలికగా ఉండి హిందువులను ఆకర్షించాయి.

 
 చాలామంది హిందువులు తమ దేవతలతోపాటు బాబావారినీ ప్రార్ధించుకోవటం జరిగింది. అలాంటప్పుడు బాబాను పూజించకూడదు.. అంటే చాలామందికి ఏంచేయాలో తెలియక ఇబ్బందిగా  ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టసుఖాలలో హిందూ దేవతలతోపాటే బాబాకు కూడా తమ కష్టసుఖాలను చెప్పుకునేవారు. 

 
కొందరు హిందువులలో కూడా చాలా గొడవలున్నాయి. శైవులు, వైష్ణవుల మధ్య అనేక గొడవలు జరిగాయి. శివుడు గొప్ప అంటే కొందరు వైష్ణవులు ఒప్పుకోరు. విష్ణువు గొప్ప అంటే కొందరు శైవులు ఒప్పుకోరు. అమ్మవారు గొప్ప అంటే కొందరు ఒప్పుకోరు. 
 
 
కొందరు హిందువులు మాత్రం ..అమ్మవారు శివుడు విష్ణువు..అని తేడాలు లేకుండా చక్కగా దైవాన్ని ఆరాధించుకుంటారు.

సాయిబాబా విగ్రహం పాదాల వద్ద శివుడు, విష్ణువు వంటి దేవతల విగ్రహాలను పెట్టకూడదు. పక్కన పెట్టుకోవచ్చు. హిందూ దేవాలయాల్లో కూడా ఏ దేవత పాదాల వద్ద కూడా ఇంకో దేవతల విగ్రహాలను పెట్టకూడదు.
 
***************
 
ఈ క్రింది విషయాలను కొంతకాలం తరువాత వ్రాసి పోస్ట్ చేసానండి..2024లో..

ఆచారాలను ఎక్కువగా పాటించలేక, తప్పుగా పాటిస్తే ఏమవుతుందో అని నాకు కూడా భయంగా ఉండేది. నేను హిందూ దేవతలతోపాటు షిర్డిసాయిని పూజించాను . షిర్డి సాయికి ఎక్కువ నియమనిబంధనలు ఉండవు కాబట్టి ,సరళంగా ఉండేది.   కొత్తదేవతలను ఆరాధించమని మొదలుపెడతారు..కొంతకాలం తరువాత వద్దంటారు.

 
నాకు తెలిసినంతలో, ఇతరమతాల వాళ్ళు కొత్తగా ఎవరినీ
పూజించరు. పాతకాలం నుంచి పూజించేవారినే పూజిస్తారు. హిందువులు మాత్రం దేవతలను పెంచుకుంటూ ఉంటారు.
 
 
 ప్రతి జీవిలోను దైవం అంతర్యామిగా ఉంటారంటారు. అలాగని ప్రతిజీవికి గుడికట్టి పూజలు చేయలేరు కదా..మహిమలు గల గొప్పవారిని గొప్పవారిగా గౌరవించవచ్చు. అలాగని, గొప్పవాళ్ళందరిని దేవతలుగా గుడులు కట్టి పూజలు చెయ్యాలంటే చాలా అవుతుంది.. 
 
 
చాలామంది దేవతలు, అనేకరకాల దేవాలయాలు, అనేకరకాల పూజలు పెరిగితే..అన్నింటినీ పాటించటం కష్టం..కాబట్టి, అలా ఎందుకనుకుంటే, కొద్దిమందిని దేవతలుగా పూజించుకోవచ్చు. అందరిని ఒకే దైవశక్తిగా కూడా పూజించుకోవచ్చు.

....................
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. 
 
సాయిబాబా షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని  సాయి అని పిలిచారట. తరువాత భక్తులు రావటం పెరిగింది. షిర్డిసాయి తనకు ఆడంబరంగా పూజలు చేయటం వద్దనేవారట. అయినా భక్తులు వినరు కదా..
 
సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు. 
 
కొందరు మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత, వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ సమాజంలో ఉంటారు.
.....................
 
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.

అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.

సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే.  దైవము ఒకే శక్తి.
 ...........................
 
కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
 .....................
 
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము,  ఎక్కువ సమయం చేయలేము...అనుకుంటే, తక్కువ ఖర్చుతో, కొంత సమయంలో  పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా.. అనుకుంటున్నాను.
.......................

 
హిందువులు చాలా నియమాలను  పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
 
హిందు పెద్దలు కూడా ఈ విషయాలను గమనించాలి.  
ఈ  రోజుల్లో ఆచారవ్యవహారాలంటూ  బోలెడు నియమాలను చెబితే, పాటించలేక సరళంగా దైవపూజ చేసే మార్గాల వైపు జనం వెళ్లే అవకాశం ఉంది.

 పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా,  సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.


 ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
 
**********
 వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 
 

Thursday, July 18, 2013

మన ప్రాచీన గ్రంధాలలో ఎంతో విజ్ఞానం.........

 
మన  ప్రాచీన  గ్రంధాలలో  ఎంతో  విజ్ఞానం  మరెన్నో  విశేషాలు ఉన్నాయి  కాబట్టే  విదేశీయులు ఎన్నో  గ్రంధాలను   తమ  దేశాలకు తీసుకువెళ్ళి , సంస్కృతం  నేర్చుకుని వాటిని  పరిశోధిస్తున్నారు.
............................


  భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ఇలా అన్నారు..  


ఒక  సూత్రంలో మణులు కూర్చినట్లు  ఈ జగత్తంతా నాలో  ఇమిడి  ఉన్నది. 

శ్రీ కృష్ణ  భగవానుడు  చెప్పినట్లు  అనంతం  నుంచి  అణువు  వరకూ  జగత్తంతా ఒక  సూత్రంలో  బంధింపబడింది. దీనినే  ఆధునిక  శాస్త్రవేత్తలు  Super  String   అంటున్నారు.

.......................


భూమి  గుండ్రంగా  ఉన్నదని  వేదకాలం  నుంచే  మనకు  తెలుసు.

  గోళం  అంటే  గుండ్రనిది అని  అర్ధం కదా! భూమి  గుండ్రంగా ఉన్నదని భారతీయులకు తెలుసు.

ఋగ్వేదంలో  1.33.8  మంత్రంలో ఇలా ఉంది...

"  చక్రాణాసః పరీణహం  పృధివ్యా...

భూమి  యొక్క  వృత్తపు  అంచున  ఉన్నవారు  అని  భావం.

భూమి  తన  కక్ష్యలో  తాను  తిరుగుటకు  23  గంటల  56  నిమిషాల  4.1  సెకన్ల  కాలము   పడుతుందని  ఆనాడే  చెప్పారు. 


 ఇది  ఆధునిక  కాలగణనకు ఖచ్చితంగా సరిపోతుంది కదా!
................


పురాతనమైన  వేదవిజ్ఞానంలోనే సూర్యకిరణాలలో  ఏడురంగులున్నాయని  చక్కగా  వివరింపబడింది.

అశ్వం అంటే  కిరణం  అని  కూడా  అర్ధం. సూర్యుని  కిరణాలలో  పలురంగులు  దాగి  ఉన్నాయని  ప్రాచీనులు  తెలియజేశారు.
....................


కాంతి  వేగమును  లెక్కించిన  ప్రాచీనులు........

"యోజనానాం సహస్రం ద్వే ద్వేశతే ద్వే చ యోజనే!
ఏకేన  నిమిషార్ధేన క్రమమాణ  నమోస్తుతే  !! "



అనగా  అర  నిమిషానికి  2202  యోజనాల  దూరం  ప్రయాణించు  ఓ  కాంతికిరణమా  నీకు  నమస్కారము.  అని  భావం. 


 యోజనం=  9  మైళ్ళ  160  గజాలు. 

ఇవన్నీ  ఆధునికులు  కనుగొన్న  కాంతివేగానికి  దాదాపు  సమీపంగానే  ఉన్నవి.


(  ఇక్కడ  నేను  గ్రంధము  లోని  చాలా  వివరాలను   వ్రాయలేదు.  )

......................


గురుత్వాకర్షణ  సిద్ధాంతం........... 

సిద్ధాంత  శిరోమణి  ( భాస్కరాచార్యుడు)  అనే  గ్రంధములో  భువనకోశం  అనే అధ్యాయంలో  6వ  శ్లోకంలో  గురుత్వాకర్షణ  శక్తి  గురించి  చాలా  చక్కగా  వివరించారు.

ఆకృష్టిశక్తిశ్చ మహీతయా  యత్  స్వస్థం / గురు  స్వాభిముఖం స్వశక్త్యా
ఆకృప్యతే తత్పతతీవభాతి/ సమే  సమంతాత్ క్వ పతత్వియం  ఖే 11

భూమి  ఆకాశంలో  ఉన్న  వస్తువులను  సహజంగా  స్వశక్తితో  ..తనవైపుకు  ఆకర్షిస్తుంది.ఈ  ఆకర్షణ  వల్ల  అన్ని  వస్తువులు  భూమిపై  పడతాయి.....అని  తెలియజేశారు. 

జగద్గురువు  ఆదిశంకరుల  వారు  వారి  ప్రశ్నోపనిషత్  భాష్యంలో  అపానశక్తి  గురించి  వ్రాస్తూ...

ఒక  వస్తువును  పైకి  ఎగురవేస్తే  దానిని  భూమి  ఎట్లు  ఆకర్షిస్తుందో ..అటులనే  పైకిలాగబడే  ప్రాణశక్తిని  అపానశక్తి  కిందకు  లాగుతోంది  (  3-8  శ్లో  ) అని  చెప్పారు. 


...............

వేద  రుషులు  ఖగోళ  శాస్త్రానికి  సంబంధించిన  గణనలో....

భూమికి,  చంద్రునికి  మధ్య  దూరం,  చంద్రుని  వ్యాసానికి  108  రెట్లు  ఉందని,

భూమికి  సూర్యునికి  మధ్య  దూరం,  సూర్యుని  వ్యాసానికి  108  రెట్లు  ఉందని,


సూర్యుని  యొక్క  వ్యాసం  భూమి  వ్యాసానికి  108  రెట్లు  ఉందని  తెలియజేశారు.


ఈ వేద గణన  ఆధునిక  సాంకేతిక  విశ్వగణనలో  లభించిన  భూమికీ,  చంద్రునికీ,  భూమికీ  సూర్యునికీ  ఉన్న  దూరంతో  దాదాపు  సరిపోయింది.

.............................


ప్రపంచంలోనే  మొదటి  ఆనకట్ట  భారతదేశంలోనే  నిర్మించబడిందని  మీకు  తెలుసా !

 ఇది  కలవై  ఆనకట్ట  .తమిళనాడులో  కావేరీ  నదిపై  నిర్మించబడింది.  క్రీ.శ. 2 వ  శతాబ్దంలో  చోళరాజు  కరికాలచోళుడు  కాలంలో  నిర్మించబడిందట. 

 దీని  నిర్మాణంలో  సిమెంట్  మొదలైన  బైండింగ్  మెటీరియల్  ఏదీ  ఉపయోగించబడలేదు.

క్రీ. పూ.4వ  శతాబ్దంలోనే  నేటి  గుజరాత్  రాష్ట్రంలో  అతి  పెద్ద  సుదర్శన  జలాశయం  నిర్మించబడింది.  ఇవి  ఆనాటి  విజ్ఞానానికి  నిలిచి  ఉన్న  తార్కాణాలు.

..........................


అతి  ప్రాచీన  ఓడరేవు  లోతల్.....( సింధూ నాగరికత). 

క్రీ,పూ, 2400  సంవత్సరం  నాటికి  సింధూ నాగరికతలో  ప్రాముఖ్యం  కలిగిన  ఓడరేవు.  ఆనాటి  లోతల్  నగరం  చక్కటి  ప్రణాళికతో  నిర్మించబడింది.

దిక్సూచి...
ఇక్కడి  త్రవ్వకాలలో  షెల్ కంపాస్  లోహశాస్త్రానికి  సంబంధించిన  పరికరాలు  లభించాయి. ఇక్కడి నాగరికత  ప్రశస్తమైనది. ఓడల  విశ్రాంతికి  ప్రత్యేక  డాక్ లు  ఉండేవి. 

.......................


జె.పి  బోస్.  ఈయన  గొప్ప  శాస్త్రవేత్త.  మొక్కలు  మానవులలానే  స్పందిస్తాయి,  రోదిస్తాయి,  హర్షిస్తాయి.  అని  ప్రపంచంలో  తొలిసారిగా  నిరూపించిన  శాస్త్రవేత్త.

 ఈయన భౌతిక  శాస్త్రవేత్తే  కాకుండా వృక్షశరీరధర్మశాస్త్రం  మీద  కూడా  పరిశోధనలు  చేసి  150  పరిశోధనా  వ్యాసాలను  ప్రపంచవ్యాప్తంగా  అనేక  సభలలో  సమర్పించారు.

పరిశోధనల  కోసం  ఎన్నో  పరికరాలను  నిర్మించుకున్నారు.  వాటిలో  ముఖ్యమైనది  క్రిస్కోగ్రాఫ్. ఇది  ఒక  వస్తువును  10  మిలియన్ల  రెట్లు  పెద్దది  చేసి  చూపిస్తుంది.

.........................

.......
గణితంలో  దిట్టలు...భారతీయులు....

ప్రసిద్ధ  శాస్త్రవేత్త  ఐన్ స్టీన్  ఏమన్నారంటే, మనం  భారతీయులకు  ఎంతో  రుణపడిఉన్నాం. భారతీయులే  ప్రపంచానికి  గణితంలో  సులభంగా  లెక్కించే  దశాంశపద్ధతిని  కనుగొన్నారు.  అదే  లేకపోతే  ఎన్నో  వైజ్ఞానిక  పరిశోధనలు  సాధింపబడేవి  కాదు.  అన్నారట. 


 సున్నాను  గురించి  ప్రపంచానికి తెలియజేసింది  భారతీయులే. 

.............................


ఈ  టపాలోని  విషయాలను .. వివేకానంద  లైఫ్ స్కిల్స్  అకాడమీ , హైదరాబాద్  వారి  "భారతీయ ప్రతిభా విశేషాలు  108 నిజాలు " అనే  గ్రంధము  నుంచి  సేకరించి  వ్రాయటమైనది.  వారికి  కృతజ్ఞతలు.

ఆ  గ్రంధములోని  విషయాలను  టపాలో  వ్రాయటం  పట్ల    వారికి  ఏమైనా  అభ్యంతరం  ఉంటే  దయచేసి  తెలియజేయగలరు.

ప్రాచీన యంత్ర  శాస్త్రం, అగస్త్యుని విద్యుత్ ఉత్పత్తి విధానం , వేప, పసుపు కోసం యుద్ధాలు , తులసీ మాహాత్మ్యం ... వంటి  ఎన్నో  విశేషాలున్నాయి.  ఆసక్తి  ఉన్నవారు  
"భారతీయ ప్రతిభా విశేషాలు  108 నిజాలు " అనే గ్రంధమును  చదవగలరు.



Monday, July 15, 2013

సమాజం సజావుగా నడవాలన్నా ఎన్నో వృత్తుల వారి అవసరం ఉంది.


ఒక  సినిమా  తీయాలంటే  దాని  వెనుక  ఎందరో  వ్యక్తుల  అవసరం   ఉంటుంది.   


 కెమెరామెన్, ఎడిటర్, సంగీతాన్ని ,  కధను,  మాటలను  అందించేవారు ,   లైట్  బోయ్స్,  మేకప్  వాళ్ళు,  ఆహారాన్ని , దుస్తులను   సప్లయ్  చేసేవాళ్ళు, వాహనాలను  నడిపేవారు...ఇలా  ఎందరో  సమిష్టిగా  కృషి  చేస్తేనే  సినిమా  ప్రేక్షకుల  ముందుకొస్తుంది. 

(  సమాజం  సజావుగా  నడవాలన్నా  ఎన్నో  వృత్తుల  వారి  అవసరం  ఉంది.  )

 ఇక సినిమాకు  నిర్మాత,  దర్శకుడు ,  ఇతర  నటీనటుల  కృషి  ఎంతో  ఉంటుంది.  అయితే, ప్రేక్షకులు  ఏం  చేస్తారంటే,  


  హీరోహీరోయిన్స్  ను   మాత్రమే  ఆకాశానికి  ఎత్తేసి  గౌరవిస్తారు.   వారికే  ఎక్కువ  పారితోషికమూ  లభిస్తుంది.

  అందరి  కష్టమూ  ఒకటే .  తెర  వెనుక  పనిచేసేవారు  కూడా  ఎంతో  కష్టపడతారు.  అయినా  వారికి  హీరోహీరోయిన్స్ తో  సమానంగా  పేరు  గానీ  డబ్బు  గానీ  రాదు.
......................................

ఒక  పెద్ద  వ్యాపారసంస్థ  ఉంటుంది  అందులో  చైర్మన్   ఆఫీసుకు  రాగానే  అందరూ  నిలబడి  విష్  చేస్తారు.  ఆ  సంస్థలో  చిన్న  ఉద్యోగి  వస్తే   ఎవరూ  విష్  చేయరు.

  ఆఫీస్  సరిగ్గా  నడవాలంటే  చైర్మన్,  క్లర్క్  ఇద్దరూ  అవసరమే ,  ఇద్దరూ  రోజంతా  కష్టపడతారు.  అయితే  ఇద్దరికీ  జనం  ఇచ్చే  మర్యాదల్లో  ఎంతో  తేడా,  ఇద్దరూ  అందుకునే  జీతభత్యాల్లో  విపరీతమైన  అంతరం.

.............................

ఒక  రోడ్  ప్రక్కన  బిచ్చగాడు  అద్భుతంగా  చిత్రాలు  వేస్తాడు.  జనం  చిల్లర  నాణేలు  ఆ  చిత్రం  పై  వేసి  వెళ్తారు.


ఒక  ప్రముఖ  వ్యక్తి  వేసే  చిత్రాలకు  అంతర్జాతీయంగా  గుర్తింపు  లభిస్తుంది.  ఎన్నో  అవార్డులు  లభిస్తాయి. 


  రోడ్డు  ప్రక్కన  చిత్రాలు  వేసే  అతనికి  ఏ  గుర్తింపూ  లభించదు.  ఏ  అవార్డులూ  అతనిని  వరించవు. 
...........................

ఇలా  ప్రపంచంలో  ఎన్నో  అసమానతలు  జరుగుతున్నాయి.  


ఈ  అసమానతలకు  కులంతో  సంబంధం  లేదు.  ఇప్పుడు  డబ్బు, అధికారం ఉన్న వారిదే  రాజ్యంలా  ఉంది.

డబ్బు,
అధికారం ఉన్న వాళ్ళు శూద్ర కులానికి చెందినా అందరూ గౌరవిస్తారు.

డబ్బు, అధికారం  లేనివాళ్ళు బ్రాహ్మణకులానికి చెందినా గౌరవించటం లేదు.

అందరికీ సమానంగా హోదా, జీతభత్యాలు ఉన్నప్పుడే ఈ అసమానతలు తొలగిపోతాయి. మరి ఇలా చేయటానికి ఎందరు ఒప్పుకుంటారు?


అందరూ సమానమే అనే వారు ..... రోజంతా కష్టపడే ఒక కూలీకి, రోజంతా కష్టపడే ఒక ఉన్నత  స్థాయి ఉద్యోగికి ఒకే రకంగా హోదా, జీతభత్యాలు ఇస్తే ఒప్పుకుంటారా ?

.................................................


Saturday, July 13, 2013

పురాణేతిహాసాల గురించి మరికొన్ని అభిప్రాయాలు...

 
 జన్మల బంధం నుండి విముక్తి చెందాలంటే   యుక్తవయస్సులోనే  కుమారుడూ, భార్య, కుటుంబం బంధాలు వదలుకోవాలని కృష్ణుడు   బోధించలేదు  .

 కృష్ణుడు తో  సహా  పెద్దలు  ఏం  చెప్పారంటే,   ఒక  క్రమంలో  చతురాశ్రమ  పద్ధతిలో  చక్కగా  జీవించి  మోక్షాన్ని  పొందమన్నారు.  విద్యార్ధి  దశ,  గృహస్థ  దశ,  వానప్రస్తం,  తరువాతే  సన్యాసాశ్రమం  చెప్పారు.

చిన్న  వయస్సులోనే  శుకుల  వారు  సన్యాసాశ్రమం  స్వీకరిస్తానంటే   వ్యాసులవారు  అభ్యంతరం   చెప్పారు. 

....................

" ఒక  యోగి  ఆత్మ  కధ " గ్రంధములో  ఏం  చెప్పారంటే ,  ఈ  రోజుల్లో   అడవులకు  వెళ్ళటం  వంటివి  అందరికి  కుదరవు  .  కాబట్టి,   ఇంట్లోనే  ఉంటూ  కూడా  మోక్షాన్ని  పొందటానికి    నిష్కామయోగాన్ని  చక్కగా   అవలంబించవచ్చు..   అనే  అర్ధం  వచ్చే  విధంగా 
చెప్పారు.  
.......................................

భారతయుద్ధం   జరగటం  ద్వారా  ఎందరో  దుష్టులైన   వారి    పీడ  ప్రజలకు  వదిలింది.

భూమిపై  పాపాత్ములు  పెరిగిపోయారని  భూదేవి  దేవతల  వద్ద  మొరపెట్టుకోగా ,  మహాభారత  యుద్ధం  జరిగి ,  ఆ  యుద్ధంలో  ఎందరో  దుష్టులైన   రాజులు,  ప్రజలు    ప్రాణాలను  కోల్పోయారు.  


భూదేవి   భాదపడటానికి  ముందే,  భూమిపై  పాపాత్ములు  పెరిగిపోవటం  చూసి  భారత  యుద్ధానికి  చక్కటి   ప్రణాళిక  రచించి  అమలుచేయించిన  వారు  ఆదిపరాశక్తి.

భారతయుద్ధం  జరగకపోతే  భూమికి  పాపాత్ముల  భారం  తగ్గదు.  అందువల్ల  భారతయుద్ధం  జరగాలని  ఆ  యుద్ధంలో  ఎందరో  పాపాత్ములు  చనిపోవాలన్నదే   శ్రీ  కృష్ణునితో  సహా  దేవతల  ప్రణాలిక.  


సంధి కి  దుర్యోధనుడు,  జరాసంధుడు,  వంటి   దుష్టులైన    రాజులు  ఒప్పుకోరని  కృష్ణునికి  ముందే  తెలుసు.  
............................


సృష్టిలోని  ఏ  పదార్ధాన్ని,  శక్తిని  సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని  ఆధునిక  శాస్త్రవేత్తలు  కూడా  ఒప్పుకున్నారు.  ఆ  సూత్రం  ప్రకారం  చూసినా  జన్మలు,  పునర్జన్మలు  ఉంటాయి .  


పునర్జన్మలు  ఉన్నాయని  కొందరు  ఆధునిక  శాస్త్రజ్ఞులు  ప్రయోగాల  ద్వారా  నిరూపించారు  కూడా. 

 అయితే  కొందరు  హేతువాదులు  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పే  విషయాలలో  తమ  వాదనకు    అనుకూలమైన  వాటినే  స్వీకరిస్తారు. 
.............................

ఎంతో  పని  వత్తిడిలో  ఈ  వ్యాసాన్ని  వ్రాశాను.  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Friday, July 12, 2013

ఎవరూ తక్కువ కాదు , కులం కన్నా గుణం ప్రధానం..వంటి ఎన్నో మంచి విషయాలను తెలియజేసిన శ్రీ కృష్ణ పరమాత్ముని,భారతాన్ని,శంకరాచార్యుని విమర్శించటం సరైనది కాదు...


దయచేసి  ఈ  వ్యాసం  చివరి  వరకూ  చదువుతారని  ఆశిస్తున్నానండి.

కొందరు  ఏమంటారంటే ,  ప్రాచీన  గ్రంధాలలో  ఒకే  విషయం  ఎన్నో  విధాలుగా  ఉంటుంది.  అంటారు. 

 ఉదా..  సత్యమే  గొప్పది  కాబట్టి  అసత్యం  పలకకూడదు  అంటారు.


 అయితే,
  ఆపత్కాలంలో  అసత్యం  పలికినా   తప్పుకాదు  అంటారు. 

 ఇదంతా  మాకు  అర్ధం  కావటం  లేదు.  పెద్దలకు  సరైన  పంధా  లేదు  .  అని  కొందరు  విమర్శిస్తుంటారు.

ఆలోచించండి,   ప్రతిదానికి  అసత్యాలు  ఆడటం  వల్ల  సమాజంలో  అస్తవ్యస్థ  పరిస్థితులు  ఏర్పడుతాయి. 


ఎన్నో  ఘోరాలు,  నేరాలు  జరగటానికి  అబద్ధము  ఒక  ముఖ్యమైన  కారణం.  అందువల్ల  సత్యమే  పలకాలి.  అని  పెద్దలు  తెలియజేయటం  జరిగింది. 

అయితే,  అసత్యం  పలకటం  కొన్నిసార్లు  తప్పనిసరి  అవుతుంది. 

ఉదా...కొందరు  ఆకతాయి  కుర్రాళ్ళు   ఒక  సాధు  జంతువును  బాగా  కొడుతూ  వస్తున్నారు.  ఆ  జంతువు  అప్పటికే  బాగా  దెబ్బలు  తిని  ఆయాసంతో  వగరుస్తూ  మీ  ఇంటి  వద్దకు  వచ్చి   చెట్టు  క్రింద  దాక్కుంది.

ఆలస్యంగా   వచ్చిన   కుర్రవాళ్ళు  జంతువు   ఎటు  వెళ్ళిందని  మిమ్మల్ని  అడిగారు. అప్పుడు  మీరు  ఏం  చేస్తారు  ?

జీవితంలో  సత్యమే  పలుకవలెను...అని   ఆ  జంతువు  దాక్కున్న  ప్రదేశాన్ని  చూపించరు  కదా  !

అసత్యం  చెప్పకపోయినా , కుర్రవాళ్ళకు  యుక్తియుక్తంగా  జవాబు  చెప్పి  వాళ్ళను  అక్కడనుంచి   పంపించి  ఆ  జంతువును  రక్షించటానికే  ప్రయత్నిస్తారు  కదా !

( గ్రంధాలలోని ఒక  కధ ఆధారంగా ఈ సంఘటన వ్రాసాను.)

మనం  పలికే  సత్యం  వల్ల  నిష్కారణంగా  అమాయకుల  ప్రాణం  పోయే  పరిస్థితి  ఉన్నప్పుడు  సత్యం  పలికినా  అది  అసత్యం  పలికిన  దానితో  సమానమే  నంటారు. 


 అందువల్ల  పరిస్థితిని  విశ్లేషించుకుని   వివేకంతో  ప్రవర్తించాలన్నది  పెద్దల  అభిప్రాయం.

నిదానమే  ప్రధానం  అన్న  పెద్దలే  ఆలస్యం  అమృతం  విషం . అని  కూడా  అన్నారు.

ఇవన్నీ  చదివిన   కొందరికి  పెద్దల  మీద  కోపం  వచ్చేస్తుంది.  పెద్దలు  ఏమిటి ? గ్రంధాలలో  వాళ్ళ  ఇష్టం  వచ్చినట్లు  వ్రాశారు. 

కాసేపు  నిదానమే  ప్రధానమంటారు.  కాసేపు  ఆలస్యం  అమృతం  విషం  అంటారు.   పూర్వీకులకు  ఏమీ  తెలియదు . అని  ఇంకా  ఏమేమో  నోటికొచ్చినవన్నీ  అనేస్తారు.

పెద్దలు  చెప్పిన  దానిలో  తప్పేముంది ?  రెండూ  నిజమే.

జీవితంలో  కొన్నిసార్లు  నిదానమే  ప్రధానం . అన్నట్లు  ప్రవర్తించాలి.  కొన్నిసార్లు  ఆలస్యం  అమృతం  విషం . అన్నట్లు   త్వరగా  నిర్ణయాలు  తీసుకోవాలి.

భార్యాభర్త   కొట్లాడుకుని  న్యాయమూర్తి  వద్దకు    తీర్పు  కోసం  వస్తే  నిదానమే  ప్రధానం  అని  నిదానంగా  ఆలోచించి  తీర్పు  చెప్పాలి.   కొంచెం  సమయం  గడిస్తే  ఈ  లోగా   భార్యాభ
ర్త  మధ్య  కోపం  తగ్గి  వాళ్ళే  సర్దుకుపోయే  అవకాశం  ఉంది.

అయితే,  అగ్ని  ప్రమాదం  జరిగి  కొంపలు  అంటుకుపోతుంటే  .....నిదానమే  ప్రధానం  అన్న  సూత్రం  వర్తించదు.  ఆలస్యం  అమృతం  విషం.  అన్నట్లు  త్వరగా  నిర్ణయం  తీసుకోవాలి. 

వేదాలలో  చెప్పిన  విషయాలు   చక్కగా  అర్ధం  అవటం  కోసం  పురాణేతిహాసాలు  వెలువడ్డాయి.

పురాణేతిహాసాలను  మరింత  స్పష్టంగా  వివరించటానికి  అవధూతలు,  అవతారమూర్తులు , సద్గురువులు...ఎందరో  అవతరించి  ప్రపంచానికి  దిశానిర్దేశం  చేస్తున్నారు.

........................................

శ్రీకృష్ణుడు  తనను  విందుకు  ఆహ్వానించిన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని    తిరస్కరించి  విదురుని  ఇంట  విందును  స్వీకరించారు.  విదురుని  తల్లి  శూద్ర స్త్రీ. 


 ఈ  సంఘటన  ద్వారా   కులం  కన్నా  గుణమే  ప్రధానం  అని  లోకానికి  చాటినట్లయింది.

 శూద్రుడైన  ధర్మవ్యాధుడు  బ్రాహ్మణుడైన   పండితునికి   కర్తవ్యబోధ  చేసిన  సంఘటన  ఉంది.( భారతంలో..) 

   గొప్ప  సందేశాలున్న    మహా  భారతాన్ని,  అందులో  ముఖ్య పాత్రధారి   అయిన  శ్రీ  కృష్ణ  పరమాత్మను  విమర్శించటం  అంటే ,   విమర్శించిన  వారు   శ్రీ  కృష్ణపరమాత్మను  మరియు   ప్రాచీన  గ్రంధాలను  సరిగా  అర్ధం  చేసుకోలేదని  అర్ధం. 
...........................................

ప్రాచీన  గ్రంధాలలో  శివునికి  విష్ణువుకు  భేదం  లేదని  పెద్దలు  ఎన్నో  చోట్ల  తెలియజేయటం  జరిగింది.  


అయినా  ఎందరో  పండితులు  తరతరాలుగా  శివుడే  గొప్ప,  విష్ణువే  గొప్ప  అంటూ..    సమాజంలో    గొడవలను  సృష్టించారు.  ఆది  శంకరాచార్యుల  వారు  ఈ  భేదాలను  రూపుమాపటానికి  కృషిచేశారు.

 ఇంకా ,  మనీషాపంచకము  నాటి  సంఘటన  ద్వారా  అంటరానితనం  సరైనది  కాదని  లోకానికి  చాటి  చెప్పారు.  ఇంకా  ఎన్నో  చక్కటి  పనులను  చేశారు. 


 అంటరానితనం  తప్పని  లోకానికి  తెలియజేసిన  ఆది శంకరాచార్యుని  విమర్శించటం  సరైనది  కాదు.

 శివకేశవుల  మధ్య  భేదాలతో  కొట్టుకు చస్తున్న వారిని  ఉద్ధరించి , సమాజంలో  ప్రశాంత  వాతావరణాన్ని  ఏర్పరిచిన  ఆది శంకరాచార్యుని  విమర్శించటం  సరైనది  కాదు.

శూద్ర  వనిత  పుత్రుడైన  విదురుని  ఇంట  ఆతిధ్యం  స్వీకరించటం  ద్వారా  కులం  కన్నా  గుణం  గొప్పదని  లోకానికి  చాటిన   శ్రీ  కృష్ణుని  విమర్శించటం  సరైనది  కాదు.

ధర్మవ్యాధుని  కధ  ద్వారా  ఎవరూ  తక్కువ  వారు  కాదు ... మాంసాన్ని విక్రయించే వారు కూడా  గొప్పవారే .... అని  చాటిన  భారతాన్ని  విమర్శించటం  సరైనది  కాదు.

వ్రాసిన  విషయాలలో   పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.