koodali

Wednesday, July 10, 2013

జగన్నాధ రధయాత్ర .... పురాణేతిహాసాల గురించి కొన్ని విషయములు....

 
ఓం,
ఈ  రోజు  జగన్నాధ  రధయాత్ర......
శ్రీ జగన్నాధస్వామి వారికి, శ్రీ బలభద్ర స్వామివారికి , శ్రీ సుభద్ర అమ్మ వారికి  అనేక  నమస్కారములు....

...................
వేదములు ,పురాణేతిహాసములు  చాలా గొప్పవి. వీటి గురించి మనము అర్ధం చేసుకున్నది చాలా తక్కువ. అని నా అభిప్రాయము.

వాటిలో ఎన్నో అంతుపట్టని ఆథ్యాత్మిక విషయాలు, వైజ్ఞానిక విషయాలు, సామాజిక విషయాలు.. ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.
 

  ప్రాచీనకాలపు పెద్దలు ,  పురాణేతిహాసములలో  ఎన్నో  విషయాలను సంకేతరూపములో ఉంచి ,  భద్రంగా మనకు అందించారని  ఈనాటి పెద్దల అభిప్రాయం. వాటిని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటం మన దురదృష్టం. 

అందులోని కధలను కొంతమంది అపార్ధం చేసుకుంటున్నారు.



పురాణేతిహాసాల ద్వారా పెద్దలు , మనకు  అవసరమైన  అన్ని విషయాలను  తెలియజేసారు. 

 రావణాసురుని  లేదా దుర్యోధనుని   ఇంకా   భూమి మీద రాక్షసులను, చెడ్డ శక్తులను  సంహరించాలంటే దైవానికి   చిటికెలో  పని.

కానీ అలా చంపకుండా .....


రామాయణం, భారతం వంటి ఇతివృత్తాల ద్వారా....ఎన్నో కధలను, అందులో పాత్రధారులను కల్పించి , వారి జీవితాల ద్వారా..వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇంకా ...

ఏది ధర్మం ? ఏది అధర్మం? వంటి ఎన్నో విషయాలను,   ఎంతో  విజ్ఞానాన్ని ...పురాణేతిహాసాల ద్వారా ,  దైవం   లోకానికి అందించటం జరిగిందని  అనిపిస్తుంది.
.......

 పురాణములలో సృష్టి ఎలా జరిగింది..... ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయంట.

నవగ్రహములు  గురించి మనవారికి ఎప్పుడో తెలుసు.  గ్రహాల గురించి విషయాలు, అవి ఎన్ని యోజనముల దూరంలో ఉంటాయి..  వంటి  విషయాలను  ప్రాచీన కాలం నాటి  పెద్దలు తెలియజేసారు కదా !

 పంచాంగం ప్రకారము   రాబోయే  గ్రహణాలను  సరిగ్గా  అంచనా  వేసి,
ఏ యంత్ర  సహాయం  లేకుండానే  సంవత్సరానికి  ముందే  పండితులు చెప్పగలుగుతున్నారు  కదా ! 

 (ఇలా సరిగ్గా చెప్పగలగటం సైన్స్ కాదా ?)
...............

ఇంకా,  పురాణేతిహాసాలలోని  పాత్రల ద్వారా  పెద్దలు మనకు ...... జీవితములో మనము ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు...వంటి విషయాలను  కూడా తెలియచేశారు.

 ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకోసారి  అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తితోపాటు  బంధువులు .. ఆ వ్యక్తి  రాజు అయితే  రాజ్యంలోని  ప్రజలు  కూడా  ఎన్ని కష్టాలను  అనుభవించే   అవకాశాలున్నాయో..వంటి  విషయాల  గురించి  కూడా మనము తెలుసుకోవచ్చు.


....................................................
 దైవం యొక్క ఈ విశ్వ సృష్టిలో ఎన్నో పాలపుంతలు, గ్రహాలు, గొప్పవయిన కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్) ......... ఇలా మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి.

ఈ అనంత విశ్వంలో మన సూర్యకుటుంబం ఒక భాగం ....... అందులో మన భూమి ఒక భాగం. ఆ భూమిమీది  మానవులం మనమెంత... మన బ్రతుకెంత. .......ఆ దేవుని దయవల్ల ఏ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టకపోబట్టి ఇలా బ్రతుకుతున్నాము.


అంతా  దైవం  దయ.....

Friday, July 5, 2013

నేను కొంతకాలం క్రిందట దైవాన్ని నమ్మని నాస్తికవాదిని...


 పెద్దవాళ్ళు  ప్రసాదాన్ని  ఇచ్చినా  తీసుకోకపోవటం,     దైవం  , పురాణేతిహాసాల  గురించి   ఫ్రెండ్స్ తో  వేళాకోళంగా  మాట్లాడటం  ఇలా ..... ఉండేది  నా  ప్రవర్తన. 

  క్రమంగా  దైవం  అంటే  నమ్మకం  కలగటం మొదలయ్యింది. (  కొన్ని కారణాల  వల్ల  ) 

పురాణేతిహాసాలలోని  విషయాలను  క్రొత్త  కోణంలో  తెలుసుకుంటూ    క్రొత్తక్రొత్త   విషయాలను   తెలుసుకుంటున్న  కొద్దీ  ఆశ్చర్యంగా  అనిపించేది. 


 అయ్యో ! ఇంతకు  ముందు  వీటిని  అపార్ధం  చేసుకున్నాను  కదా  !  అనిపించేది.

పురాణేతిహాసాల  గురించి  తెలిసినంతలో  పాత టపాలలో  వ్రాశాను.  నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  ఈ  మాత్రం  వ్రాయగలుగుతున్నానంటే ,  అంతా  దైవం  దయ.

 జీవితంలో  ఎలా  ప్రవర్తిస్తే  ఎలాంటి  ఫలితాలు  ఉంటాయో  ...ఎలా  ప్రవర్తించాలో...ఎలా  ప్రవర్తించకూడదో  పురాణేతిహాసాల  ద్వారా  పెద్దలు  మనకు  తెలియజేసారు.

  రామాయణం, భారతంలోని  విషయాలలో   ఎన్నో    కోణాలు  ఉంటాయి.  పురాణేతిహాసాలను  చదువుతున్నకొద్దీ ....  క్రొత్త  విషయాలు ( అర్ధాలు )  తెలుస్తుంటాయని  పండితులు  తెలియజేశారు.

  ప్రపంచంలో  ఉండే  అన్ని  విషయాల  గురించి  ప్రస్తావన  మహాభారతంలో  ఉన్నది. 

భగవద్గీత  గురించి  ఏమని   వర్ణించగలం...  భగవద్గీత   అత్యద్భుతమైన  గీత.

ఎన్నో  శాస్త్రాలు..... వైద్యశాస్త్రం,  ఆర్ధిక  శాస్త్రం,  ఖగోళ  శాస్త్రం,  రసాయనశాస్త్రం,   యంత్ర  శాస్త్రం, మానసిక  శాస్త్రం,   న్యాయశాస్త్రం,   లోహశాస్త్రం.......ఇలా  ఎన్నో  శాస్త్రాల  ద్వారా  ఎంతో  విజ్ఞానాన్ని  ప్రాచీనులు  మనకు  అందించారు.

దురదృష్టవశాత్తు  మనలో  కొందరు   ప్రాచీన  గ్రంధాలను  సరిగ్గా  అర్ధం  చేసుకోవటం  లేదు.

అయితే,  దైవాన్ని  పురాణేతిహాసాలను  విమర్శించేవారిని  చూస్తే  జాలిపడటం  తప్ప  ఏం  చేయగలం. 

 నేను  కూడా  నాస్తికవాదిగా  ఉన్నప్పుడు  దైవం  గురించి  పెద్దవాళ్ళు  ఎంత  చెప్పినా  వినిపించుకునేదాన్ని  కాదు.

ఎవరికైనా  తెలుసుకోవలసిన  సమయం  వచ్చినప్పుడు  తెలుస్తుందేమో.....

..........................


విదేశీయుల  రాక  మరియు   దండయాత్రల   పర్యవసానంగా    భారతదేశం  నుంచి  ఎంతో  సంపద  కొల్లగొట్టబడి,   విదేశాలకు  తరలిపోయింది. 

ఎన్నో  విలువైన  ప్రాచీన  విజ్ఞాన  గ్రంధాలను  కూడా  వాళ్ళు  తమ  దేశాలకు  తరలించుకుపోగా,   ఇక్కడ  ఉన్న  వాటిలో  కొన్నింటిని   నాశనం  చేశారు. 


 ఆ  విధంగా  తరతరాల  దోపిడీలో  మనం  ఎంతో  సంపదను  కోల్పోయాము.

  మెకాలే   విద్యావిధానాన్ని   భారతదేశంలో   ప్రవేశపెట్టేముందు   ఈ  దేశం  గురించి   అన్న  మాటలు  చాలా  మందికి  తెలుసు.

 ఇండియా  ఎంతో   సిరిసంపదలతో  ఉన్నదని ,  ఇక్కడ  బిచ్చగాళ్ళు  కనపడలేదని  ...అంటూ    మరెన్నో  విషయాలను  చెప్పటం   జరిగింది. 


Sunday Posts: Lord Macaulay's Speech on Indian Education: The ...


 బ్రిటిష్ వాళ్ళు  ఇండియాకు  రాకముందు  కూడా  కొన్ని  విదేశీ  దాడులు  జరిగాయి.  అయినప్పటికి ,   మెకాలే  కాలానికి  కూడా   ఇండియాలో  అంత  సిరిసంపదలు  ఉన్నాయంటే ......


 విదేశీయులు  భారతదేశంలో  ప్రవేశించి  దాడులు  జరగకముందు  ఈ  దేశం  ఎంత  గొప్పగా ఉండేదో  కదా!

 భారతదేశం  ఆర్ధికంగా  ఇప్పుడిలా  వెనకపడి  ఉండటానికి  అనేక  కారణాలున్నాయి.  అందులో  కొన్ని...

1.  మనలో  ఎక్కువమందికి    మన  పూర్వీకులన్నా , మన  ప్రాచీన  సంస్కృతి  అన్నా,   చులకన  భావం   ఉంది....


.మనకేమీ  తెలియదని..... విదేశాల  వాళ్ళకే  అన్నీ  తెలుసు .... అనుకుంటూ  గిల్టీగా  ఫీలవుతుంటారు . 

2. మనలో  ఐకమత్యం  తక్కువ.  భారతదేశం  తరతరాలుగా  విదేశీదాడులకు   గురవుతోందంటే   ఇలాంటి    కారణాలు  ఎన్నో  ఉన్నాయి.

ఇప్పటికీ  భారతదేశం  నుంచి  సంపద  విదేశాలకు    తరలిపోతూనే  ఉన్నది. రకరకాల మార్గాలలో  మరియు   విపరీ
తమైన   మేధావుల  వలస  రూపంలో...
.........................


ఆధునిక  కాలంలో  ప్రపంచం  ఎదుర్కొంటున్న.....  నైతికవిలువల  క్షీణత,  ఆర్ధిక  సంక్షోభం,  నిరుద్యోగం,   గ్లోబల్  వార్మింగ్  వంటి  పర్యావరణ  సమస్యలు   ...

ఇలాంటి  ఎన్నో   సమస్యల నుండి  ప్రపంచం  బైటపడాలంటే  మన  పురాణేతిహాసాలు  మరియు  ప్రాచీన  విజ్ఞానం  ద్వారా  చక్కటి  పరిష్కారాలు  లభిస్తాయి.


Wednesday, July 3, 2013

పురాణేతిహాసాలు , చరిత్ర ..... గురించి కొన్ని విషయాలు.



 పురాణేతిహాసాలు  రామాయణము,  భారతము,(భగవద్గీత ) ... ద్వారా  ఎన్నో  చక్కటి  విషయాలు  తెలుస్తాయి.

మరియు   శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ  చరితామృతము  గ్రంధములో  కూడా   ఎన్నో  చక్కటి  విషయాలు  ఉన్నాయి.
....................................................


భారతం,  రామాయణం  నిజంగా  జరిగినవా ? కాదా ? అని కొందరు  సందేహపడుతుంటారు. 


 ఈ  మధ్య  శాటిలైట్  చిత్రాల సమాచారం  ద్వారా  రామాయణకాలంలో  సముద్రంలో   నిర్మించిన  వారధి  మరియు  భారతకాలం  నాటి    ద్వారకానగర  సమాచారం  లభించింది.

  పూర్వ  కాలం  నాటి  రామసేతు,  మరియు  ద్వారకా  నగర  విశేషాలు  ఇప్పటికి  ఎలా  ఉన్నాయి   ?  అని   కూడా కొందరికి  అనుమానాలు  వస్తాయి.

 మంచుయుగం  ముందటి   డైనోసార్ల  ఎముకలు,  శిలాజాలు  ఇప్పటికి    లభించటం ...... వాటి  ఆధారంగా  డైనోసార్ల  కాలం నాటి  పరిస్థితిని  శాస్త్రవేత్తలు    నిర్ణయిస్తున్నారు  కదా  ! 

 మంచుయుగం  ముందటి  డైనోసార్ల  అవశేషాలే  ఇప్పటికీ  లభిస్తున్నప్పుడు  ,   నాగరికత  ఏర్పడిన  నాటి  రామసేతు,  ద్వారకానగర    నిర్మాణాలు    చక్కగా  ఉండటంలో  ఎటువంటి  ఆశ్చర్యము   లేదు.


  విదేశాల  వారు  వారి  ప్రాచీన  కట్టడాలను  ఎంతో  జాగ్రత్తగా  రక్షించుకుంటారు.  మన  దేశం  వారికి  పురాతన కట్టడాలంటే  నిర్లక్ష్యం  ఎక్కువ.  మనం  కూడా  ప్రాచీన  కట్టడాలను  రక్షించుకోవాలి.

దయచేసి ఈ  క్రింది  లింక్స్  చూడగలరు........

Amazing facts about - Ancient India: Scientific Dating of Ramayan Era  


Science & Technology in Mahabharatha: Material evidence ...

 

The Holy Science - Wikipedia, the free encyclopedia



Rama Setu - An Engineering Marvel of 5076 BCE - YouTube


Shocking Truth of Ram Setu - YouTube

...............................................

 
పూర్వం  భూమి  అంతా  ఒకే
ఖండముగా    ఉండేదని   కొన్ని    గ్రంధాల  ద్వారా  తెలుస్తుంది. 

  ఆధునిక  పరిశోధకులు  కూడా ,   పూర్వం  భూమి  అంతా  ఒకే  ఖండముగా  కలిసి  ఉండి  ఉండవచ్చని ఒప్పుకున్నారు.  దానిని  గోండ్వానా లేండ్  అనే  పేరుతో  వ్యవహరిస్తున్నారు.

భూమి  అంతా  ఒకే  ఖండముగా  ఉన్నప్పుడు  భూమి  మీది   ప్రజలు  మరియు  నాగరికతలో  ఎంతో  సారూప్యం  ఉంటుంది.

 ఖండాలు  విడిపోయిన  తరువాత  చరిత్రకారులు    భూమిలో  త్రవ్వకాలు  జరిపితే ,  దొరికిన  చారిత్రిక  ఆధారాల  మధ్య  ఎన్నో  పోలికలు  ఉంటాయి.  అయితే,   వాటి  ఆధారంగా  చరిత్రకారులు   నిర్ణయించే  విషయాలలో  తప్పులు  వచ్చే  అవకాశం  ఉంది.

 ఎందుకంటే  ఇప్పుడు  విడివిడిగా  ఉన్న  ఖండాలు  పూర్వం   ఒకే  ఖండముగా  ఉండేవన్న  విషయం  ఇంతకుముందు  తెలియదు  కాబట్టి.
 
 ......................... 

పూర్వం భారతదేశము, ఆఫ్రికా,   ఆస్ట్రేలియా  ఖండాలతో    కలిసి ఉన్నప్పుడు    ఒక పెద్ద భూఖండముగా    ఉన్నదని , దానిని   లిమూరియా  అంటారనే  మరొక  వాదన కూడా ఉంది.
.................... ...............
డైనోసార్లు  ఉన్న  కాలంలో  మానవులు  కూడా  ఉన్నారని  తెలిసే  శిలాజాల  గుర్తులు  లభించాయని  కూడా   కొందరు   పరిశోధకులు  చెబుతున్నారు. (  ఇది  ఎంతవరకు  నిజమో  మనకు  తెలియదు. )
........................................
ఋగ్వేదంలో  ......


 ఒక  కుటుంబంలోని  వారే  భిన్నవృత్తులను  స్వీకరించినట్లు 
గ్వేదంలో  చెప్పబడిందట.  నేను  కవిని,  మా  తండ్రి  వైద్యుడు,  మా  తల్లి  ఒడ్లు  దంచేది......

.. ఏ  వృత్తి  నీచంగా  చూడబడలేదు.   చర్మకారులను,  చర్మాలను  బాగుచేసేవారిని  కూడా    సంఘములో  తక్కువ  జాతివారుగా  ఎంచలేదు........ ఇలా   చెప్పబడిందట.

  తరువాత  కాలంలో  మనుషులలో  స్వార్ధం  పెరగటం  మరియు  తెలిసితెలియనితనం  వల్ల  సమాజంలో  అంటరానితనం  మరియు  కొన్ని  మూఢాచారాలు  వ్యాప్తిలోకి  వచ్చాయని  అనిపిస్తుంది. 
......................................


ప్రస్తుతం  ఉన్న  రూపములో  ,  ప్రమాణములో రామాయణ,  మహాభారత  కావ్యములు  ఒక  వాల్మీకి,  వ్యాసరచితములు  మాత్రమే  కావని  పలువురి  అభిప్రాయము. 

ఎన్నో  సంవత్సరాలుగా  ఈ  రెండు  కావ్యములలో అనేకమంది  కవులు  తమ  రచనలను  కూడా  చేర్చి  ఉంటారని  కొందరు  భావిస్తున్నారు. .....
.........................................


ఆధునిక  విజ్ఞానం  మరియు  చరిత్రకు  సంబంధించిన  విషయాల  నిరూపణలో  ఎన్నో  అభిప్రాయభేదాలు  ఉంటుంటాయి.  


సైన్స్   గురించి శాస్త్రవేత్తల  మధ్య ...... చరిత్ర  గురించి  చరిత్రకారుల  మధ్య  ఎన్నో  అభిప్రాయభేదాలు  ఉంటుంటాయి. .

ఆర్యుల  జన్మ  స్థానం  గురించి ......స్వామి దయానంద  గారి  ప్రకారం  ఆర్యులు  టిబెట్  నుంచి  వచ్చారు.

 లోకమాన్య  బాలగంగాధర  తిలక్  గారి  అభిప్రాయం  ప్రకారం  ఆర్యులు  ఉత్తరధృవం  నుంచి  వచ్చారు.


 ఫ్రొఫెసర్  మాక్డొనల్  గారి  ప్రకారం  ఆర్యులు  డాన్యూబ్ (  యూరోప్ )  నుంచి  వచ్చారు.  

 భారతీయులు,  పర్షియా  వారు  ఒకే  ఆర్యజాతికి  చెందిన  వారని  కొందరి  అభిప్రాయం. 

ఇలా  భిన్నాభిప్రాయాలు    ఉన్నాయి. 
 ..........................................

సింధు  నాగరికత  నిర్మాతల  గురించి  కూడా  ఎన్నో  అభిప్రాయాలు  ఉన్నాయి. 
ఉదా..  శాస్త్రాధారముల  ప్రకారం  పరీక్షించగా  ఈ  నాగరికతను  భిన్నజాతులవారు  కలిసిమెలసి  నిర్మించినట్లు  తెలిసిందట.


ఏదీ  నిర్ధారణగా  తేలనందున,.....

  ఫాదర్  హీరాన్  సింధు  నగరాలను  ద్రావిడులు  నిర్మించారని  ఆన్నారు.


డా.  లక్ష్మణ్  స్వరూప్,  కాంతి  స్వరూప్   ఆర్యులే  దీనిని  నిర్మించారని  అన్నారు.

మొహంజదారో  నగరము  ఏడుపొరలుగా   ( అంతస్థులుగా  )  బయటపడిందట.  ఒక్కొక్క  పొరకు  500  సంవత్సరముల  చొప్పున దాని  కాలాన్ని  క్రీ.పూ.  3500  సంవత్సరములకు  నిర్ణయించడమైనది.
.............................................. 


భారత దేశానికి  ప్రధమముగా  వలస  వచ్చిన  ఆర్యజాతులలో  ద్రావిడులు  ఒకరని  
కొందరు  చరిత్రకారుల  అభిప్రాయము.

   కొందరు  ఆర్యులు  తమను  ద్రావిడులుగా  పిలుచుకొన్నారని  మరి కొందరు   చరిత్రకారుల  అభిప్రాయము.

ద్రావిడులు  మధ్య  ఆసియాలోని   సీధియన్స్ కు  సంబంధించిన  వారని,  ఈ  రెండు  జాతుల  మధ్య భాషాసంస్కృతులకు  సంబంధం  ఉన్నదని  డా.  కాల్డ్వెల్  అభిప్రాయపడ్డారు.
..........................................


పురాణేతిహాసాలను  గమనిస్తే   కులాలను  బట్టి   అంటరానితనం  పాటించాలని  ఏమీ  చెప్పలేదని  చక్కగా  తెలుస్తుంది.

 పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలి...అని...  ప్రాచీనుల  ఉద్దేశం  అని  తెలుస్తుంది. 

ఈ  విషయాల  గురించి  ఈ  టపాలో  వ్రాయటం  జరిగింది. 


పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాల... 
..............

వ్రాసిన విషయాలలో ఏమైనా  పొరపాట్లు ఉంటే  దయచేసి  క్షమించాలని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 
 

Monday, July 1, 2013

జవానులు మన రక్షణకోసం కష్టపడుతుంటే అభినందనలతో సరిపెట్టేయటమేనా ? ..మరియు చిత్రాలు కూడా...

 
ఉత్తరాఖండ్  వరదల  సందర్భంగా  మన  రక్షణదళాల  వారు  అందించిన  ఆపన్నహస్తం  అద్భుతం,   జవానులు  అంతటితో  ఊరుకోరు.  మళ్ళీ  దేశరక్షణ  విధులను  నిర్వర్తిస్తారు. 

 జవానులు  సరిహద్దుల  వద్ద    దేశప్రజల  రక్షణ  కోసం  బాధ్యతలను  నిర్వర్తిస్తుంటే  మనము  ప్రశాంతంగా   నిద్రపోగలుగుతున్నాము.

వాళ్ళు   మన  రక్షణ  కోసం  సరిహద్దుల  వద్ద  కాపలా  కాస్తుంటే  మనం  ఏం  చేస్తున్నాము.......  సినిమాలు,  సీరియల్స్  లోని  నటీనటుల  గురించి  చర్చలు,  ఆలోచనలతో   కులాసాగా  బ్రతుకులను  వెళ్ళదీస్తున్నాము. 

జీవితంలో  వినోదం  ఉండవలసినదే.  అయితే  వినోదం  ఇప్పుడు  వ్యసనం  స్థాయికి  వచ్చేసింది.
..................................

పాత రోజుల్లో   ఎవరైనా  ప్రముఖ  వ్యక్తులు  మరణిస్తే  రెండుమూడు రోజులు  సంతాపదినాలను  పాటించేవారు.  అప్పుడు  రేడియోలో  భక్తిగీతాలు  వంటివి  మాత్రమే  వచ్చేవి.  వినోదకార్యక్రమాలను  ప్రసారం  చేసేవారు  కాదు. 

కాలం  మారింది.  ఇప్పుడు  ఎవరు  మరణించినా  పెద్దగా  పట్టించుకోవటం  లేదు.  ఉత్తరాఖండ్ లో  ఎంతోమంది  చనిపోయారు. 


పోయినవారు పోగా,   ఉన్నవారు  దిక్కుతోచక  గగ్గోలు  పెడుతుంటే   మనలో చాలామంది   మాత్రం  యధాప్రకారం  క్రికెట్,  సినిమా,  సీరియల్   ప్రసారాలు  చూడకుండా  ఉండలేకపోయాము. ..  ( జరిగిన  విషాదానికి  బాధపడుతూనే  . )

నేను  కూడా వినోద  కార్యక్రమాలను  చూసాను. ..  ( జరిగిన  విషాదానికి  బాధపడుతూనే  . ) 

 ప్రపంచం  చాలా  మారింది.  ఇప్పటికి  మనుషుల్లో    మానవత్వం  ,  ఇతరుల  బాధలకు  స్పందించే  గుణం  ,  పాపభీతి  ఇంకా  మిగిలే  ఉన్నాయి. అయితే,  భవిష్యత్తులో  మానవ  మనస్తత్వాలు   ఎలా  ఉంటాయో  ?

.................................... 


ఇంత విషాదం   జరిగినా  మనం  మారమా ? దేశంలో  ఇంత  అవినీతి,  ఇంత  పేదరికం,  ఇన్ని మురికివీధులు, ఇంత  వెనుకబాటుతనం  ఉన్నా  అవేమీ  మనకు  పట్టవా ?

భారతీయ  రక్షణ  దళాల  వారు   ఎంతో  కష్టపడి  బాధితులను  రక్షించారు. వాళ్ళను  చూసి  మనం  ఎంతో  నేర్చుకోవాలి.  దేశం  పట్ల  మన  బాధ్యతలను  మనము  సక్రమంగా  నిర్వర్తించాలి. 


 ఇప్పుడు  దేశప్రజలు  తమ   బాధ్యతలను  సక్రమంగా  నిర్వర్తించటం  లేదా  ?
అంటే ,  నిర్వర్తిస్తుంటే  దేశంలో    ఇంత పేదరికం, ఇంత  అవినీతి,   ఇన్ని  సమస్యలు,....  ఉండవు  కదా !


బాధ్యతలను  సక్రమంగా  నిర్వర్తిస్తున్నవారికి  వందనములు . 

  ఉత్తరాఖండ్ లో  వచ్చిన  విలయంలో  జవానులు   ఎంతో  కష్టపడ్డారు.  యంత్రాలలా  పనిచేసి  వేలమందిని  స్వస్థలాలకు  చేరవేశారు.  


 వాళ్ళు  అంత  కష్టపడుతుంటే    దేశాన్ని  బాగుచేయటం  కోసం  మనం  ఎందుకు  మన  వంతు  ప్రయత్నాన్ని  చెయ్యలేం  ?
  (  బద్ధకాన్ని,  సొంత  స్వార్ధాన్ని  కొద్దిగా  తగ్గించుకుంటే   ).
..............................

 భారత  రక్షణ  దళాల  వారు  ఎన్నో  కష్టాలకు  ఓర్చి  ప్రాణాలకు  తెగించి  బాధితులను  కాపాడారు.  . ప్రజలను   రక్షించే  ప్రయత్నాలలో  కొందరు  జవానులు  ప్రాణాలను  పోగొట్టుకున్నారు.  

ప్రాణాలను  కోల్పోయిన  జవానుల  యొక్క  కుటుంబసభ్యులు  ఎంతగా  తల్లడిల్లుతారో  కదా  ! 

 మన  సంతానం  వేరే  ఊరిలో  ఉంటే  మనం  ఎంతగానో  ఆలోచిస్తాము.  ఏ  కష్టమూ  రాకూడదని  కోరుకుంటాము.  మరి  సైనికుల  తల్లితండ్రులు,  మరియు   భార్యా  బిడ్డలు  తమ  వారి రక్షణ  కోసం  ఎంతగానో  ఆలోచిస్తారు  కదా  ! 

  జవానులు    మన  రక్షణకోసం  కష్టపడుతుంటే    అభినందనలతో  సరిపెట్టేయటమేనా  ? మనం  కూడా మనకు  చేతనైనంతలో ,  మన  పరిధిలో  సక్రమంగా  బాధ్యతలను  నిర్వర్తిస్తే   దేశంలోని  సమస్యలను  పారద్రోలటం  పెద్దపనేమీ  కాదు.

ఉత్తరాఖండ్  విలయంలో  బాధితులకు  సాయాన్ని  అందించిన  ప్రతి  ఒక్కరికీ ,  (  రక్షణదళాలు, పోలీసులు,   అధికారులు,  సేవాసంస్థలు,  స్వచ్చంద సేవకులు ...) అందరికి  కృతజ్ఞతలు. 


ఇతరులను  రక్షించే  సమయంలో   ప్రాణాలను  కోల్పోయిన  మహనీయులకు  నివాళులు.
...........................................


అయితే  ,  ప్రజలలో  ఈ సమయంలో   క్రికెట్  గురించి  ఆసక్తి  లేకుండా , వరదల   గురించి   బాధ   పడే వారూ  ఉంటారు .

 పై  చిత్రాన్ని  తయారు  చేసిన వారికి  కృతజ్ఞతలు. 

ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  కృతజ్ఞతలు. 



Friday, June 28, 2013

ఉత్తరాఖండ్ లో వరదలకు ముందు శ్రీ ధారీ దేవి విగ్రహమూర్తి తరలింపు మరియు కొన్ని విషయాలు.........

ఓం
ఈ  రోజు  శుభప్రదమైన  ఈ సంవత్సరపు  అమరనాధ్  యాత్ర  ప్రారంభమవుతున్నది.

...................................
 
ఈ  మధ్య  ఉత్తరాఖండ్ లో  వచ్చిన   వరదల  గురించి  అందరికి  తెలిసిందే.  ఉత్తరాఖండ్  రాష్ట్రంలో   శ్రీ  ధారీ దేవి  ఆలయం  ఉన్నదట. ధారీదేవి  చార్ ధాం  క్షేత్రముల  పాలకురాలట.

   ఉత్తరాఖండ్ లో  ఎన్నో  జల  విద్యుత్  ప్రాజెక్ట్ లు  నిర్మించారట.  ఆ  క్రమంలో  ఒక  పవర్  ప్రాజెక్ట్  కట్టడం కోసం  అడ్డుగా  ఉన్నదని  ధారీదేవి  ఆలయంలోని   మూలమూర్తిని  వేరొక చోటికి  తరలించాలని  నిర్ణయించారట.

 వరదలు  వచ్చిన  రోజున  సాయంకాలం  ధారీదేవి  మూర్తిని  కదిలించటానికి  ప్రయత్నిస్తుండగానే  ఆకాశంలో  మెరుపులు  వచ్చాయట.  ఆ  తరువాత  దైవమూర్తిని  అక్కడనుంచి  కదిలించిన  తరువాత  కొద్దిసేపటికే  వాన  మొదలై  అదేరోజు  ఉధృతమై  గంగమ్మ  పొంగి  వరదలు  ఉద్ధృతంగా  వచ్చాయని  మీడియా  వార్తల  ద్వారా  తెలుస్తోంది.

ఇంతకుముందు  కొన్ని  సంవత్సరాల  క్రిందట  కూడా  ఒక  రాజు  శ్రీ ధారీ దేవి  విగ్రహమూర్తిని   కదిలించటానికి  ప్రయత్నించినప్పుడు  ఇలాగే  ప్రతికూలాంశాలు  కనిపించటం  వల్ల  ఆ రాజు  విగ్రహమూర్తిని  కదిలించే  ప్రయత్నాన్ని  మానుకున్నాడని  వార్తల  వల్ల  తెలుస్తోంది. 


ఇంత  వరదలలో  కూడా  కేదార్ నాధ్  దేవాలయం  చెక్కుచెదరకుండా ఉంది . ప్రధాన  పూజారి  ప్రాణాలతో  బయటపడటం  దైవలీల.
  బండరాయి  ఒకటి  కేదార్ నాధ్  ఆలయం  ఎదురుగుండా  ఉన్న  నందీశ్వరుని  ప్రక్కన  కనిపిస్తోంది.  నందీశ్వరుని మూర్తి  చెక్కుచెదరలేదు.   అంతా  దైవం  దయ.
............................. 


ఈ  వరదలవల్ల  కొందరు  భక్తులు  మరణించటం  వెనుక  అనేక  కారణాలు  ఉంటాయి.  ఆ  కారణాలేమిటో  భగవంతునికే  తెలియాలి.  


 అయితే, వరదల నుంచి  బయటపడి,  సరిగ్గా   తిండితిప్పలు  లేకపోయినా  ఎందరో  భక్తులు   ప్రాణాలతో  బయటపడటం  అనేది  ఎంతో  గొప్ప   విషయం.  అంతా  దైవం  దయ.  దైవానికి  అనేక  కృతజ్ఞతలు.

బాధితులను ఆదుకున్న  అందరూ  ఎంతో  అభినందనీయులు.


బాధితులను  ఆదుకునే  సమయంలో   ప్రాణాలను  కోల్పోయిన  జవానులు మహనీయులు.  వారికి నివాళులు.

....................

 అడవులను  నరికివేయటం,  వాతావరణ  కాలుష్యం  వంటి  కారణాల  వల్ల  ఎంతో  పర్యావరణ  కాలుష్యం  జరుగుతోంది . పవిత్రంగా భావించే గంగా నదిలోనూ  విపరీతంగా కాలుష్యాలను  కలుపుతున్నారు. 
 
మానవుల  స్వార్ధపూరితమైన  చేష్టల  వలన  కొన్ని   జీవజాతులు  అంతరించే  స్థాయికి  చేరుకుంటున్నాయంటున్నారు.
పర్యావరణాన్ని  అతిగా  కలుషితం  చేస్తే  మానవులకు  కూడా  ప్రమాదం  పొంచి  ఉన్నట్లే. 

......................... 

శ్రీ రామాయణ  మహా కావ్యాన్ని  వ్రాసిన  వాల్మీకి  మహర్షి ...   ఒక  పక్షి  జంటలోని ఒక
పక్షి మరణిస్తే రెండవ  పక్షి అనుభవించిన  వేదనను చూసి ఎంతో  ఆవేదనను  చెందారని  మనము  చదువుకున్నాము.
   
 మానవులు,  పశుపక్ష్యాదులు  అన్నీ  భగవంతుని  బిడ్డలే.   ప్రపంచంలో  మానవులతో  సమానంగా    జీవించే  హక్కు  పశుపక్ష్యాదులకు  కూడా   ఉన్నది.  అయితే  బలవంతులైన  మానవులు  బలహీనులైన  ఇతర జీవులపై  పెత్తనాన్ని  చెలాయిస్తున్నారు.

బలవంతులైన  బిడ్డలు  బలహీనులైన  బిడ్డలను  కష్టాలు  పెడుతుంటే  తల్లితండ్రులు  చూస్తూ  ఊరుకోరు  కదా  !  


అలాగే  బలవంతులైన  మానవులు  తమ  అంతులేని  కోరికల  కోసం  పర్యావరణాన్ని  కలుషితం  చేస్తూ  మూగప్రాణులకు  ముప్పు  కలిగిస్తుంటే  జగన్మాతాపితరులు  చూస్తూ  ఊరుకోరు.

ఈ  ప్రపంచంలో  జీవించే   ఇతర  జీవులకు  కూడా  ఎన్నో  హక్కులున్నాయని  మానవులు  గుర్తించటం  మంచిది.

...............................

భారతం,  రామాయణం  నిజంగా  జరిగినవా ? కాదా ? అని కొందరు  సందేహపడుతుంటారు. 

శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ  చరితామృతము  గ్రంధములో  రామాయణ, భారతముల  గురించిన  విషయాలు  కూడా  ఉన్నాయి.    


   శాటిలైట్  చిత్రాల సమాచారం  ద్వారా  రామాయణకాలంలో  సముద్రంలో   నిర్మించిన  వారధి  మరియు  భారతకాలం  నాటి    ద్వారకానగర  చిత్రాలు  కనిపించటం  మరియు  కొన్ని  విశ్లేషణల  వల్ల  రామాయణ, భారతాలు  గురించి  ఎన్నో  విషయాలు తెలిసాయి . 


దయచేసి ఈ  క్రింది  లింక్స్  చూడగలరు........

Amazing facts about - Ancient India: Scientific Dating of Ramayan Era  


Science & Technology in Mahabharatha: Material evidence ...

 

వ్రాసిన విషయాలలో ఏమైనా  పొరపాట్లు ఉంటే  దయచేసి  క్షమించాలని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

 

Wednesday, June 26, 2013

జీవులకు భూమి ఒక పరీక్షాలోకం. ..రెండవ భాగము.


 కొందరు  ఏమంటారంటే  ఈ  ప్రపంచంలో  కష్టాలు  ఎందుకు  ఉన్నాయి  ? అంటారు. 


 ఆకలి  అన్నది  లేకుంటే  ఆశలు   పుట్టే  తావేది....


చీకటి  అన్నది  రాకుంటే  వెలుగుకి  విలువే  ఉంటుందా .....

Sri Satyanarayana Swamy - YouTube....   చిత్రంలోని

Sri Satyanarayana Swamy Video Songs - Bhagwan Hey ... - YouTube.. 

ఈ  పాట  ద్వారా  మనకు  ఎన్నో  చక్కటి  విషయాలు  తెలుస్తాయి. 

.............................................

 ఐశ్వర్యవంతులు  కొందరు  అహంకారంతో  ఆర్భాటంగా  పెద్ద  ప్రదర్శనగా  యజ్ఞయాగాలు  చేస్తుంటారు. దానధర్మాలు  నిర్వహిస్తుంటారు. ఇవి అంతశ్శుద్ధి  లేని  కార్యాలు.  నిష్ఫలాలు.

ఏ  కార్యక్రమానికైనా  ద్రవ్యశుద్ధి  ప్రధానం.  ముందు  అది  చూసుకోవాలి.  ఎవరికీ  ఏ  ద్రోహమూ  చెయ్యకుండా  న్యాయంగా  సంపాదించిన  ధనం  ఉత్తమోత్తమం. ధర్మకార్యాలకు  దీనినే  వినియోగించాలి...

.అక్రమార్జనలతో  చేస్తే  విపరీతఫలాలు  వస్తాయి. పుణ్యం  రాకపోగా  పాపం  చుట్టుకుంటుంది.......

 . ఈ  విషయాలను  వ్యాసమహర్షి  జనమేజయునితో  చెప్పటం  జరిగింది. 
(  శ్రీ దేవి భాగవతము . )

 వ్యాసమహర్షి  తెలియజేసిన  విషయాలను ఆధ్యాత్మికవాదులు  సమాజంలో  బాగా  ప్రచారం  చేయాలి.   అధర్మంగా  ధనాన్ని  సంపాదించటం  తప్పు  అని  గట్టిగా  తెలియజేయాలి.......

అయితే  ప్రజలు    తాము  చేసిన  పాపాలకు  పరిహారక్రియల  గురించి  తెలుసుకోవటానికి    చూపించే  ఆసక్తిని   పాపం  చేయకుండా  ఉండటంలో  చూపిస్తే ఎంతో   బాగుంటుంది.
.................................

ఉత్తరాఖండ్ లో  వరదవిషాదాన్ని  చూస్తుంటే  ఎంతో  బాధగా  అనిపిస్తోంది.  


  కర్నూల్ వద్ద వచ్చిన వరదలలో అలంపురంలోని శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామిశ్రీ జోగుళాంబదేవి  దేవాలయము  వద్దకు కూడా  వరద నీరు   వచ్చింది. ఎంతో   బురద  కూడా  వచ్చింది. 

 కేదార్ నాధ్  దేవాలయం  వద్ద  బురద  గురించి  వింటుంటే  అలంపురంలోని  దేవాలయము లోని  శివలింగాల  వద్ద  బురద  పేరుకుపోవటం  గుర్తు  వస్తోంది.   అలంపురం  దేవాలయం  వద్ద  బురదను  శుభ్రం  చేయటానికి  ఎక్కువరోజులే  పట్టినట్లుంది. 

.......................................


 లోకంలో  పాపం  పెరిగినప్పుడు  ప్రకృతి  కన్నెర్ర  చేస్తుందంటారు. 


 ఎలాగైనా  సరే  డబ్బును  సంపాదించి  విలాసంగా  జీవించాలని  కోరుకునే  వారి  సంఖ్య  ఈ  రోజుల్లో  బాగా  పెరిగింది.

 దైవాన్ని నమ్ముతాము.  అని  చెప్పే  వాళ్ళలో  కూడా  కొందరు ,  పాపకార్యాలు  చేసి  పాపపరిహారం  కోరుకుంటారు.
 ( తాము  చేసిన  పాపాలకు  పశ్చాత్తాపం కూడా  లేకుండా. )


దేవాలయాల్లో  సిబ్బంది  కొందరు   లడ్డూలను  తక్కువ  తూకం  వేసి  విక్రయించటం  వంటి  వార్తలను  వింటున్నాము. 

 మానవులు  చేస్తున్న  పర్యావరణ కాలుష్యం  వలన  ఇతర  జీవజాతులు  అంతరించే  స్థాయికి  చేరుకుంటున్నాయి.

మానవులు  తమ   స్వార్ధం  కోసం  ఎన్నో   పశుపక్ష్యాదుల  కుటుంబాలలో  చిచ్చుబెడుతున్నారు.   మరణం  వంటివి  సంభవించి,   ఎడబాటు  సంభవించినప్పుడు   పశుపక్ష్యాదులు    కూడా   బాధను  అనుభవిస్తాయి.  అయితే  వాటి  బాధను  పైకి  చెప్పుకోలేవు.  అవి  మూగ  జీవులు  కదా  !

 బలవంతులైన  మానవులు  తమ  అంతులేని  కోరికల  కోసం  పర్యావరణాన్ని  కలుషితం  చేస్తూ  మూగప్రాణులకు  ముప్పు  కలిగిస్తుంటే  జగన్మాతాపితరులు  చూస్తూ  ఊరుకోరు.

కొన్నిచర్యల  ద్వారా  మానవులకు  హెచ్చరికలను  చేస్తారు. అప్పటికీ   మానవులు  బుద్ధి  తెచ్చుకోకపోతే  తమదైన  శైలిలో  దైవం  ప్రపంచాన్ని  రక్షించుకుంటారు.




Monday, June 24, 2013

జీవులకు భూమి ఒక పరీక్షాలోకం.

 
మనకు  అనేక  సందేహాలు  వస్తుంటాయి.  లోకంలో  కష్టాలు  ఎందుకుండాలి  ?  అన్నీ  సుఖాలే  ఉండవచ్చు  కదా  !  వంటి  ప్రశ్నలు ..చక్కటి  ఆహారం  తీసుకోవటం  మనకు  సుఖంగా  అనిపిస్తే  మన  ఆహారం  కోసం  త్యాగం  చేసే  మొక్కల  సంగతేమిటి  ?  

మొక్కలు  సుఖంగా  ఉండాలంటే  మనుషులు  కేవలం  రాలిపడిన  ఆకులను,  పండ్లను  తిని  జీవించాలి.  అందుకు  ఎందరు  సిద్ధంగా  ఉంటారు  ?

కష్టాలు లేని లోకాలూ ఉన్నాయి. అవి పొందాలంటే, అర్హత సంపాదించాలి.....

కొంతకాలం క్రిందటి వరకూ ఇలా అనిపించేది.

* సృష్టిలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా ! అవి ఎందుకు జరగాలి ? అనిపించేది. 

  అయితే , ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ లోకంలో బాధ కలిగించే విషయాలున్నాయి నిజమే.    కానీ , భూకంపాలు, సునామీలు, వంటి బాధలు , ఇతర బాధలు లేని లోకాలు కూడా ఉన్నాయి.

* " ఒక యోగి ఆత్మకధ " గ్రంధములో చెప్పబడిన , కారణలోకం.... వంటి  ఉత్తమలోకాలలో ఈ బాధలుండవు.

కానీ అక్కడికి చేరుకోవాలంటే ఈ జన్మలో సక్రమమార్గంలో జీవించాలి. అలా క్రమంగా అత్యుత్తమమైన బ్రహ్మానంద పరమపదమును పొందవచ్చు.

* మానవులు ఈ భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని దైవం యొక్క అభిప్రాయం కాదని పెద్దలు చెపుతారు.

* మానవులు సత్కర్మలను ఆచరించటం ద్వారా దైవకృపను పొంది ,బాధలు లేని ఉత్తమలోకాలను పొంది, పరమపదాన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందాలని వారి భావన.


* ఇంకా, ఏమనిపిస్తుందంటే, ఇదంతా దైవం మనకు పెట్టే పరీక్ష.

ఈ ప్రపంచమనే పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకుని పాసయిన వారికే బాధలు లేని ఉత్తమ లోకాలను పొందే అర్హత లభిస్తుంది. క్రమంగా అలా పరమపదాన్నీ పొందే అర్హత లభిస్తుంది.అనిపించింది.


లోకంలో మామూలు పరీక్షలంటేనే , ఎంతో కష్టపడి   చదవాలి. ఆటల్లో గెలవాలన్నా ఎంతో శ్రమపడి   కోచింగులు తీసుకోవాలి. ఆటల్లో తగిలే దెబ్బలకు  భయపడకుండా కష్టపడాలి.

మరి బాధలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా, పరమపదాన్ని పొందాలన్నా కొంచెమయినా  కష్టపడకుండా ఎలా .

* ఇలా అనిపించిన తరువాత నా సందేహం తీరింది.

* జీవులకు అసలు పరీక్ష........ మనసును అదుపులో పెట్టుకోవటమే.

అందుకే పెద్దలు అంటారు మనస్సును జయించితే.....ప్రపంచాన్ని
జయించినట్లే అని.


* అందుకే లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి ? అని వాటిని చూసి నిరాశ పడిపోకూడదు.

గొప్ప సుఖాలను పొందాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి మరి.

చిన్నపిల్లలు నడక నేర్చుకునే క్రమంలో ఎన్నోసార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుని ఏడుస్తారు. అది సహజం. 


నడకనేర్చుకునేటప్పుడు దెబ్బలు ఎందుకు తగలాలి ? మా అమ్మ ఎంత దయలేనిది . నేను క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నా కూడా నడకనేర్చుకోమంటోంది. అని పిల్లలు అనుకోరు కదా ! .

సైకిల్ నేర్చుకునేటప్పుడు బాలన్స్ చేతకాక ఎన్నో సార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటారు. అయినా లెక్కచేయకుండా ఉత్సాహంగా సైకిల్ నేర్చుకుంటారు.


 అంతేకానీ సైకిల్ నేర్చుకోవాలంటే దెబ్బలు ఎందుకు తగులుతాయి ? ఇది చాలా అన్యాయం, మా నాన్నకు కూడా దయలేదు, క్రిందపడుతున్నా జాలి లేకుండా సైకిల్ నేర్పిస్తున్నారు. అని పిల్లలు అనుకోరు కదా !

ఒక ఆఫీసులో ఉద్యోగస్తులను చేర్చుకోవాలన్నా వ్యక్తుల అర్హతలను పరిశీలించే ఉద్యోగంలో చేర్చుకుంటారు..... రోడ్డున పొయ్యే వారిని పిలిచి ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వరు కదా !


* అలాగే, మరి కష్టాలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా దానికి కొన్ని అర్హతలను సంపాదించాలి.

* అలాగే పరమపదాన్ని సాధించే క్రమంలో ......... జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సునామీలు, భూకంపాలూ అటువంటివే.

ఆ కష్టాలను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు. అప్పుడే బ్రహ్మానందం మనకు లభిస్తుంది.

* భూకంపాలు, రైలు ప్రమాదాలు వంటి ప్రమాదాల్లో కూడా కొందరు చెక్కుచెదరకుండా బయటపడతారు, కాలం కలిసి వస్తే అంతే మరి.


* చిన్నచీమ కూడా తాను ఎప్పుడు ఎవరి కాలిక్రింద పడి చనిపోతానో అని భయపడకుండా తన జీవితాన్ని సాగిస్తుంది.

* మనిషి కూడా ప్రతిదానికి భయపడకుండా భగవంతునిపై భారం వేసి స్వధర్మాన్ని పాటిస్తూ నిష్కామంగా జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలి.

* బాధలు లేని లోకాలను చేరాలంటే ఈ జన్మలో సక్రమమైన పద్ధతిలో జీవించాలి.

* జీవించటమో ? మరణించటమో ! కష్టమో ! సుఖమో ! అంతా భగవంతుని దయ .అనుకున్ననాడు బాధేలేదు.


* ఆ ధైర్యం రావాలన్నా దైవకృప అవసరం . అందుకే దైవకృప కోసం ప్రయత్నించాలి..

* దయచేసి  ఈ  క్రింది  లంకెను   కూడా  చదువుతారా........



* అందుకేనేమో దైవం సునామీలనూ, సుడిగాలులనూ కూడా...