కొందరు ఏమంటారంటే ఈ ప్రపంచంలో కష్టాలు ఎందుకు ఉన్నాయి ? అంటారు.
ఆకలి అన్నది లేకుంటే ఆశలు పుట్టే తావేది....
చీకటి అన్నది రాకుంటే వెలుగుకి విలువే ఉంటుందా .....
Sri Satyanarayana Swamy - YouTube.... ఈ చిత్రంలోని
Sri Satyanarayana Swamy Video Songs - Bhagwan Hey ... - YouTube..
ఈ పాట ద్వారా మనకు ఎన్నో చక్కటి విషయాలు తెలుస్తాయి.
.............................................
ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద ప్రదర్శనగా యజ్ఞయాగాలు చేస్తుంటారు. దానధర్మాలు నిర్వహిస్తుంటారు. ఇవి అంతశ్శుద్ధి లేని కార్యాలు. నిష్ఫలాలు.
ఏ కార్యక్రమానికైనా ద్రవ్యశుద్ధి ప్రధానం. ముందు అది చూసుకోవాలి. ఎవరికీ ఏ ద్రోహమూ చెయ్యకుండా న్యాయంగా సంపాదించిన ధనం ఉత్తమోత్తమం. ధర్మకార్యాలకు దీనినే వినియోగించాలి... .అక్రమార్జనలతో చేస్తే విపరీతఫలాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది.......
. ఈ విషయాలను వ్యాసమహర్షి జనమేజయునితో చెప్పటం జరిగింది.
( శ్రీ దేవి భాగవతము . )
వ్యాసమహర్షి తెలియజేసిన విషయాలను ఆధ్యాత్మికవాదులు సమాజంలో బాగా ప్రచారం చేయాలి. అధర్మంగా ధనాన్ని సంపాదించటం తప్పు అని గట్టిగా తెలియజేయాలి.......
అయితే ప్రజలు తాము చేసిన పాపాలకు పరిహారక్రియల గురించి తెలుసుకోవటానికి చూపించే ఆసక్తిని పాపం చేయకుండా ఉండటంలో చూపిస్తే ఎంతో బాగుంటుంది.
.................................
ఉత్తరాఖండ్ లో వరదవిషాదాన్ని చూస్తుంటే ఎంతో బాధగా అనిపిస్తోంది.
కర్నూల్ వద్ద వచ్చిన వరదలలో అలంపురంలోని శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామిశ్రీ జోగుళాంబదేవి దేవాలయము వద్దకు కూడా వరద నీరు వచ్చింది. ఎంతో బురద కూడా వచ్చింది.
కేదార్ నాధ్ దేవాలయం వద్ద బురద గురించి వింటుంటే అలంపురంలోని దేవాలయము లోని శివలింగాల వద్ద బురద పేరుకుపోవటం గుర్తు వస్తోంది. అలంపురం దేవాలయం వద్ద బురదను శుభ్రం చేయటానికి ఎక్కువరోజులే పట్టినట్లుంది.
.......................................
లోకంలో పాపం పెరిగినప్పుడు ప్రకృతి కన్నెర్ర చేస్తుందంటారు.
ఎలాగైనా సరే డబ్బును సంపాదించి విలాసంగా జీవించాలని కోరుకునే వారి సంఖ్య ఈ రోజుల్లో బాగా పెరిగింది.
దైవాన్ని నమ్ముతాము. అని చెప్పే వాళ్ళలో కూడా కొందరు , పాపకార్యాలు చేసి పాపపరిహారం కోరుకుంటారు.
( తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపం కూడా లేకుండా. )
దేవాలయాల్లో సిబ్బంది కొందరు లడ్డూలను తక్కువ తూకం వేసి విక్రయించటం వంటి వార్తలను వింటున్నాము.
మానవులు చేస్తున్న పర్యావరణ కాలుష్యం వలన ఇతర జీవజాతులు అంతరించే స్థాయికి చేరుకుంటున్నాయి.
మానవులు తమ స్వార్ధం కోసం ఎన్నో పశుపక్ష్యాదుల కుటుంబాలలో చిచ్చుబెడుతున్నారు. మరణం వంటివి సంభవించి, ఎడబాటు సంభవించినప్పుడు పశుపక్ష్యాదులు కూడా బాధను అనుభవిస్తాయి. అయితే వాటి బాధను పైకి చెప్పుకోలేవు. అవి మూగ జీవులు కదా !
బలవంతులైన మానవులు తమ అంతులేని కోరికల కోసం పర్యావరణాన్ని కలుషితం చేస్తూ మూగప్రాణులకు ముప్పు కలిగిస్తుంటే జగన్మాతాపితరులు చూస్తూ ఊరుకోరు.
కొన్నిచర్యల ద్వారా మానవులకు హెచ్చరికలను చేస్తారు. అప్పటికీ మానవులు బుద్ధి తెచ్చుకోకపోతే తమదైన శైలిలో దైవం ప్రపంచాన్ని రక్షించుకుంటారు.
No comments:
Post a Comment