రాష్ట్రంలో తెలుగును అభివృద్ధి చేయటానికి చర్యలు తీసుకుంటున్నట్లు
అనిపిస్తోంది. తెలుగు అభివృద్ధికి కృషిచేస్తున్న అందరికి
కృతజ్ఞతలండి.
........... .........
ఈ క్రింద వ్రాసిన టపా 2012 ఫిబ్రవరిలో వ్రాసినది . ఈ రోజు ఈ పాత టపా యొక్క లంకె ఇవ్వాలనుకుని ఇచ్చి పోస్ట్ చేస్తుంటే మధ్యలో కరెంట్ పోయింది. మళ్ళీ వెంటనే వచ్చింది.
నాకు కంప్యూటర్ గురించి ఎక్కువగా తెలియదు. కరెంట్ పోయి వచ్చిన తరువాత నేను ఏదేదో మార్పులు చేర్పులు చేసేసరికి పాతటపా 2012 వద్ద మాయమైపోయి వ్యాఖ్యలతో సహా ఇక్కడికి వచ్చి పడింది.
* టపా మాయమయి పోకుండా ఉన్నందుకు భగవంతునికి అనేక ధన్యవాదములు. అంతా దైవం దయ.
....................................
ఈ బ్లాగును ప్రోత్సహిస్తున్న అందరికి అనేక ధన్యవాదాలండి.
1. అక్షరాస్యత పెరగాలంటే.......
కొందరికి గణితంలో చాలా ప్రతిభ ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ అంటే అంత శ్రద్ధ ఉండదు. మరి కొందరికి కొన్ని విషయాల్లో ప్రతిభ ఉంటుంది . మరి కొన్ని విషయాల్లో అంత శ్రద్ధ ఉండదు. ఇలా వ్యక్తుల్లో తెలివితేటలు రకరకాలుగా ఉంటాయి.
కానీ, ఎక్కువ శాతం విద్యార్ధులు ఇంగ్లీష్ వంటి భాషలో విద్యాభ్యాసం విషయంలో మాత్రం ఇబ్బందిగానే భావిస్తారు.వారికి అర్ధం కాని విషయాల గురించి ట్యూషన్స్ చెప్పించుకునే అవకాశాలు లేని వారెందరో ఉన్నారు.
అలా భాష అర్ధం కాక ఫెయిల్ అవుతూ .. కొంతకాలానికి చదువును మధ్యలోనే మానేసిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటప్పుడు దేశంలో అక్షరాస్యత ఎలా పెరుగుతుంది ?
2. మాతృభాషలో విద్య వల్ల వృత్తిఉద్యోగాలలో రాణిస్తారు....
మాతృభాషలో విద్యను అభ్యసించటం వల్ల భవిష్యత్తులో వృత్తిఉద్యోగాలలో రాణిస్తారు.. సరిగ్గా అర్ధం కాని పరాయి భాషలో బట్టీపట్టి చదివి పాసైన విద్యార్ధులు భవిష్యత్తులో వృత్తిఉద్యోగాల్లో ప్రతిభను చూపించలేరు.
3. మాతృభాషలో విద్య అంటే సరళంగా ఉండాలి.......
అయితే మాతృభాషలో విద్య అంటే విద్యార్ధులకు సులభంగా అర్ధమయ్యే విధంగా సరళంగా ఉండాలి. అంతేకానీ గ్రాంధికమైన పదాలతో కష్టంగా ఉంటే విద్యార్ధులు తెలుగు కంటే ఇంగ్లీషే తేలిక . అని భావించే ప్రమాదముంది. ఇప్పుడు ఇలా కొందరు భావిస్తున్నారు కూడా.
........... .........
ఈ క్రింద వ్రాసిన టపా 2012 ఫిబ్రవరిలో వ్రాసినది . ఈ రోజు ఈ పాత టపా యొక్క లంకె ఇవ్వాలనుకుని ఇచ్చి పోస్ట్ చేస్తుంటే మధ్యలో కరెంట్ పోయింది. మళ్ళీ వెంటనే వచ్చింది.
నాకు కంప్యూటర్ గురించి ఎక్కువగా తెలియదు. కరెంట్ పోయి వచ్చిన తరువాత నేను ఏదేదో మార్పులు చేర్పులు చేసేసరికి పాతటపా 2012 వద్ద మాయమైపోయి వ్యాఖ్యలతో సహా ఇక్కడికి వచ్చి పడింది.
* టపా మాయమయి పోకుండా ఉన్నందుకు భగవంతునికి అనేక ధన్యవాదములు. అంతా దైవం దయ.
....................................
ఈ బ్లాగును ప్రోత్సహిస్తున్న అందరికి అనేక ధన్యవాదాలండి.
1. అక్షరాస్యత పెరగాలంటే.......
కొందరికి గణితంలో చాలా ప్రతిభ ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ అంటే అంత శ్రద్ధ ఉండదు. మరి కొందరికి కొన్ని విషయాల్లో ప్రతిభ ఉంటుంది . మరి కొన్ని విషయాల్లో అంత శ్రద్ధ ఉండదు. ఇలా వ్యక్తుల్లో తెలివితేటలు రకరకాలుగా ఉంటాయి.
కానీ, ఎక్కువ శాతం విద్యార్ధులు ఇంగ్లీష్ వంటి భాషలో విద్యాభ్యాసం విషయంలో మాత్రం ఇబ్బందిగానే భావిస్తారు.వారికి అర్ధం కాని విషయాల గురించి ట్యూషన్స్ చెప్పించుకునే అవకాశాలు లేని వారెందరో ఉన్నారు.
అలా భాష అర్ధం కాక ఫెయిల్ అవుతూ .. కొంతకాలానికి చదువును మధ్యలోనే మానేసిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటప్పుడు దేశంలో అక్షరాస్యత ఎలా పెరుగుతుంది ?
2. మాతృభాషలో విద్య వల్ల వృత్తిఉద్యోగాలలో రాణిస్తారు....
మాతృభాషలో విద్యను అభ్యసించటం వల్ల భవిష్యత్తులో వృత్తిఉద్యోగాలలో రాణిస్తారు.. సరిగ్గా అర్ధం కాని పరాయి భాషలో బట్టీపట్టి చదివి పాసైన విద్యార్ధులు భవిష్యత్తులో వృత్తిఉద్యోగాల్లో ప్రతిభను చూపించలేరు.
3. మాతృభాషలో విద్య అంటే సరళంగా ఉండాలి.......
అయితే మాతృభాషలో విద్య అంటే విద్యార్ధులకు సులభంగా అర్ధమయ్యే విధంగా సరళంగా ఉండాలి. అంతేకానీ గ్రాంధికమైన పదాలతో కష్టంగా ఉంటే విద్యార్ధులు తెలుగు కంటే ఇంగ్లీషే తేలిక . అని భావించే ప్రమాదముంది. ఇప్పుడు ఇలా కొందరు భావిస్తున్నారు కూడా.
ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల మనకు ఇష్టం లేకపోయినా ఇంగ్లీష్ పదాలను వాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకని తెలుగు వాడకంలో అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడినా తప్పు పట్టకూడదు.
పెద్దవాళ్ళు కొంచెం(చూసీచూడనట్లు)తేలికగా ఉంటేనే, పిల్లలు తెలుగు నేర్చుకోవటానికి ముందుకు వస్తారు. ఉదా..ఒక తెలుగుమీడియం విద్యార్ధికి పరీక్షల సమయంలో ఆఫీస్ అన్న పదానికి కార్యాలయం అన్న తెలుగుపదం తెలియక .. ఆఫీస్ అని వ్రాసాడనుకోండి.
ఠాట్ ! అని ఇంగ్లీష్ పదం వాడినందుకు ఒక మార్కు తీసివెయ్యటం వంటివి చెయ్యకూడదు.
ఉదా.. ఆఫీస్ ( కార్యాలయం ) .. అని ఇలా అలవాటు చేస్తూ ఉంటే కొంతకాలానికి తెలుగు పదాలు అందరికీ అలవాటు అవుతాయి.
4. మా చిన్నప్పుడు ....నేను చిన్నప్పుడు తెలుగు మిడియంలో చదివినా కూడా మాకు ఇంగ్లీష్,హిందీ(కొందరికి సంస్కృతం) సబ్జక్ట్స్ కూడా ఉండేవి. ఇప్పుడు కూడా అలా బోధించవచ్చు. మరీ ఎక్కువ సబ్జెక్ట్స్ అయిపోతాయి . అనుకుంటే ....
..తెలుగుమీడియంలో చదువు +ఇంగ్లీష్ లేక హిందీలను.(లింక్ లాంగ్వేజ్ గా) బోధించవచ్చు. అప్పుడు మాతృభాషలో తేలికగా విద్యను నేర్చుకుంటాము. ఇతర భాషలవాళ్ళతో మాట్లాడటానికి లింక్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది.
సంస్కృతం ఎంతో గొప్ప భాష. ఆ భాష ఒక్కటి చాలు విద్య నేర్చుకోవటానికి., లింక్ లాంగ్వేజీ ఇలా .... అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది.
5. మాతృభాషలో విద్య + లింక్ లాంగ్వేజ్......
అయితే మన దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక భాషలు ఉండటం వల్ల , అందరి మధ్యన ఒక లింక్ లాంగ్వేజ్ ఉండవలసిన అవసరం ఉంది. అందుకని మాతృభాషలో శాస్త్రవిషయాలను నేర్చుకుంటూ + ఏదైనా లింక్ లాంగ్వేజ్ ను కూడా ఒక సబ్జెక్ట్ గా బోధించాలి.
అంటే తెలుగులో గణితం, సైన్స్, సోషల్ వంటివి నేర్చుకుంటే ఆ విషయాలు చక్కగా అర్ధమవుతాయి + సంస్కృతం లేక ఇంగ్లీష్ లేక హిందీని లింక్ లాంగ్వేజ్ గా నేర్చుకుంటే ఇతర భాషల వాళ్ళతో మాట్లాడటానికి బాగుంటుంది.
6. తెలుగు భాషలో యాసలు.........
ఒకే భాషలో కూడా ఎన్నో రకాల యాసలు ఉంటాయి. ఉదా..ఒక వ్యక్తి యొక్క బంధువుల కుటుంబాల్లో చూసినప్పుడు , పల్లెలలో నివసించే బంధువుల భాష స్వచ్చంగా ఉంటుంది. పట్టణాల్లో ఇంగ్లీష్ చదువులు చదివిన బంధువుల భాష యొక్క యాస ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంది.
7. ఏ ఆఫీసుకు వెళ్ళినా మనకు తెలియని భాషే.......
మన రాష్ట్రమే అయినా చాలా ఆఫీసులలో మనకు తెలియని భాషే. ఇదంతా చూస్తే మనం ఇతరదేశాల్లో ఉన్నామా ? అనిపిస్తుంది.
ఇతర భాషలలో కార్యకలాపాలు జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఉదా..ఇంగ్లీష్ అంతగా రాని వ్యక్తి ఏదైనా పనిమీద ఆఫీసుకి వెళ్తే ఆఫీసుల్లో రాతకోతలు, వ్యవహారాలన్నీ ఆంగ్లభాషలో జరిగినప్పుడు అతనికి అర్ధం కాదు కదా !
చట్టం గురించి తెలుసుకోవాలంటే , ఆ వివరాలు ఇతర భాషలో ఉంటే చట్టం, విధివిధానాలు గురించి సరిగ్గా అర్ధం కాదు కదా !
ఇంకా, మాతృభాషలో వ్యవహారాలు నిర్వహించటం వల్ల , ప్రజలకు ఆఫీసు నిర్వహణ సులభంగా ఉంటుంది. పనులు కూడా త్వరగా అయ్యే అవకాశముంది.
ఇంగ్లీష్ సరిగ్గా అర్ధం కాని వ్యక్తికి ఇంగ్లీషులో పత్రాలు పంపటం వల్ల అందులోని విషయాలు అతనికి అర్ధం కాక, ఇతరులతో చదివించుకోవటానికి ఇష్టం లేక ఇబ్బందిపడటం జరుగుతుంది.
( భాష రాని వ్యక్తిని ఇతరులు మోసం చేసే అవకాశం కూడా ఉంది. )
ఇలా ఎందరో నిత్యజీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా మన భాషలో మనం పనులు చేసుకోలేని పరిస్థితులు ఉండటం అనేది ఎంతో బాధాకరం.
8.కార్యాలయాల పత్రాలు .... ఆ రాష్ట్రపు మాతృభాష + లింక్ లాంగ్వేజ్ ( హిందీ లేక ఇంగ్లీష్ ) లలో ఉన్నప్పుడు.....కొంతకాలం క్రిందటి మనీయార్డర్ ఫాంస్ ఒక వైపు ఇంగ్లీషులో,ఒక వైపు హిందీలో ముద్రించబడేవి.
ఇప్పుడు కూడా కార్యాలయాల కార్యకలాపాలను , వారు విడుదల చేసే పత్రాలను ఆ రాష్ట్రపు మాతృభాష + లింక్ లాంగ్వేజ్ ( హిందీ లేక ఇంగ్లీష్ ) లలో ఉన్నప్పుడు అందరికి సౌకర్యంగా ఉంటుంది.
9.బదిలీల వల్ల ................
ఇక బదిలీల వల్ల దేశమంతా తిరిగేవారికి ఇంగ్లీష్ మీడియం లేక హిందీ మీడియంలో చదువు + విద్యార్ధి యొక్కమాతృభాషను ఒక తప్పనిసరి సబ్జక్ట్ గా(ఉదా..తెలుగు)ను నేర్పించాలి.
అసలు ఈ బదిలీల వల్ల కూడా పిల్లలు మాతృభాషకు దూరమవుతున్నారు. భాషలు నెమ్మదిగా అంతరిస్తున్నాయి.
ఏ రాష్ట్రం వాళ్ళని ఆ రాష్ట్రంలోనే బదిలీలు చెయ్యవచ్చు లేక బదిలీలు చేసే వాళ్ళే సెంట్రల్ స్కూల్స్ ఎక్కువగా నెలకొల్పి , తమ ఉద్యోగస్థుల పిల్లలకు మాతృభాషలో విద్యాభ్యాసానికి ఏర్పాట్లు చెయ్యాలి.
ఉదా..కేంద్రీయ విద్యాలయాలలో అన్ని భాషల ఉపాధ్యాయులను నియమించాలి.(కనీసము ౧౪ భాషలు)లేదా బదిలీలను ఆపేయాలి.
( స్థానికులనే ఉద్యోగాల్లో తీసుకోవటం ఎన్నో విధాలుగా మంచిది. )
అలా కాకుండా ఉద్యోగస్థులను దేశమంతా తిప్పటం వల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువ. ఉదా..ఒక బ్యాంక్ ఉద్యోగికి బ్యాంకులో బిజినెస్ పెరగాలంటే అతను అక్కడి స్థానికులతో వారి భాషలోనే మాట్లాడవలసివస్తుంది.
కానీ ఆ ఉద్యోగి స్థానిక భాష నేర్చుకునే సమయానికిఅతన్ని ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తారు. దీనివల్ల ఉద్యోగికి , బ్యాంకుకి కూడా నష్టం తప్ప లాభమేమీ ఉండదు.
ఇవన్నీ గమనిస్తే ..... వ్యవస్థ అంతా అనేక రంగాల్లో గజిబిజి అయిపోయింది అనిపిస్తుంది.
ఒక రాష్ట్రంలో వేరే భాషకు సంబంధించిన వారు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు, వారి మాతృభాషలో కూడా విద్యాభ్యాసానికి పాఠశాలలను ఏర్పాటు చెయ్యాలి.
మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల మేధస్సు పెరుగుతుందని తెలిసిన వారు చెబుతున్నారు. ఎందుకంటే చదివే సబ్జక్ట్ సులభంగా అర్ధమవుతుంది కదా ! ఇంకా చాలా సమయం కలిసివస్తుంది కూడా .
మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్ధుల పై ఎంతో భారం తగ్గుతుంది.
అర్ధం కాని భాషతో కుస్తీ పట్టటం, బట్టీపట్టి పరీక్షలు పాసవటం వంటివి కూడా తగ్గుతాయి. ఏమైనా మాతృభాషను మరిచిపోవటం అన్నది మహాపరాధం.
ప్రపంచీకరణ అంటే .. తర తరాల నుంచి వస్తున్న ఎంతో విలువైన మన భాషా సంస్కృతులను త్యాగం చెయ్యటం ఎంత మాత్రమూ కాదు.
చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఇవన్నీ అమలు చేయటం అంత కష్టం ఏమీ కాదు.
బాగా రాసారు. మీరు చెప్పినట్టుగా భారతీయ భాషలలో విద్యాబోధన చేయడానికి పెద్ద అడ్డంకి ఆఫీసులలో ఆంగ్లం వాడడమే.
ReplyDeleteఅయితే మరో రెండు సమస్యలు ఉన్నాయి. ఇతర దేశాలతో వ్యాపారం (export/import, software etc.) చేస్తున్నప్పుడు ఇంగ్లీషు రాకపోతే చాలా కష్టం. మీరు చెప్పినట్టు హిందీ "లేదా" ఇంగ్లీషు కాక ఆ రెండు భాషలను "కూడా" పిల్లలకు నేర్పితే ఈ సమస్య కొంత తగ్గుతుంది.
ఇంతకంటే జటిలమయిన సమస్య ఇంకొకటి ఉంది. భారతీయ భాషలలో ఆధునిక పదజాలం తక్కువ. లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆర్ధిక శాస్త్రం, వైద్యం, business management మొదలయిన రంగాలలో తరుచూ వాడే పదాలకు (technical terms) తెలుగులో కానీ మరే ఇతర భారతీయ భాషలో కానీ సరయిన పదాలు లేవు.
ప్రతిసారి ఆంగ్ల పదాలే వాడడం ఎబ్బెట్టుగా ఉంటుంది. పైగా పాఠంలో అరవయి డెబ్బయి శాతం ఆంగ్ల పదాలు ఉంటె దాన్ని తెలుగు పాఠం అనలేము కదా.
మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న తెలుగు పుస్తకాలలోని భాషే కష్టంగా (ఉ. కార్యాలయం) ఉన్నప్పుడు, ఇతర విషయాలను తెలుగులో బోధించేటప్పుడు పదాల ఎంపిక బాలేకపోతే పిల్లలకు చదువు వొంత పట్టదు.
ఈ సమస్యపై మీరు ఒక పరిష్కారం చూపించగలరని నా నమ్మకం.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నిన్న రాత్రే మీ వ్యాఖ్యను చూశాను జవాబివ్వటం ఆలస్యమయినందుకు క్షమించండి.
DeleteJai Gottimukkala.....ఇతర దేశాలతో వ్యాపారం (export/import, software etc.) చేస్తున్నప్పుడు ఇంగ్లీషు రాకపోతే చాలా కష్టం.
anrd .... ఇతరదేశాలతో వ్యాపారం చేసే వాళ్ళ శాతం సమాజంలో తక్కువగా ఉంటుంది. ఆ కొద్దిమంది కోసం అందరూ ఇంగ్లీష్ మీడియంలో విద్యాభ్యాసం చేస్తూ కష్టపడటం అనవసరం అనిపిస్తుందండి. ....అయినా ఇతరులతో మాట్లాడటానికి లింక్ లాంగ్వేజ్ ఎలాగూ నేర్చుకుంటారు కదా !
ఈ రోజుల్లో కొందరు తెలుగు కంటే ఇంగ్లీష్ తేలిక అని అపోహ పడుతున్నారు. ఎవరికైనా నేర్చుకోవటం మొదలుపెడితే మాతృభాషే తేలికగా వస్తుంది. ఇంగ్లీష్ కూడా కష్టమైన భాషే. కొన్ని ఉదాహరణలు చూస్తే.........
ఉదా....HOMONYMS ,
....ఉదా.....
host ( n ) ; person who entertains guests . ( ఆతిధ్యమిచ్చువాడు. )....
Eg; He acted as host as the dinner party.
host ( n ) ; great number of ....
Eg; He has hosts of friends .
....................................................
HOMOPHONES.
appraise ; estimate ( మదింపు చేయు. )
Eg ; It is rather difficult to appraise one's worth.
appraise ; inform ( తెలియజేయు . )
Eg ;The Minister appraised of the situation..
....................................
Multiple functions...
( ఒకే మాటను పలు రకములుగా ఉపయోగించుట. ).
Example .... .
1. Birds fly in the sky. ( verb ) ( ఎగురుట. )
2. There is a fly in the milk. ( noun ) .( ఈగ. ).
3. He is a fly customer. ( Adj ) .( చురుకైన. ).
( పైన వ్రాసిన గ్రామర్ ఒక పుస్తకంలో చూసి వ్రాసానండి. నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు. )
నేను రామకృష్ణ మఠంలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే సమయంలో నాకు అనేక సందేహాలు వచ్చేవి. ( మొహమాటం వల్ల అన్నీ అడగలేదు .) ఉదా.. .... Ask, Say, Told .......వీటిని ఎలా ? ఎప్పుడు ఉపయోగించాలి ? అని అడిగినప్పుడు ....
మా సార్ ఏం చెప్పారంటే....( ఇప్పుడు నాకు గుర్తు ఉన్నంతలో )
Ask.....IMPERATIVE.
Say........STATEMENT.
Told.....INFORMATION.
( పైన చెప్పిన సందర్భాలలో ఉపయోగిస్తారట. చాలా కాలం క్రితం చదివాను. ఇప్పుడు అంతగా గుర్తు లేవండి. )
ఇవన్నీ చూస్తుంటే ఇంగ్లీష్ కష్టం అనే నా అభిప్రాయం. అందుకని మాతృభాషలో విద్యాభ్యాసమే మేలు. + లింక్ లాంగ్వేజ్ ఉంటుంది కదా ! ఇతరులతో మాట్లాడటానికి అది సరిపోతుంది అనిపిస్తుంది........
Jai Gottimukkala....ఇంతకంటే జటిలమయిన సమస్య ఇంకొకటి ఉంది. భారతీయ భాషలలో ఆధునిక పదజాలం తక్కువ. లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆర్ధిక శాస్త్రం, వైద్యం, business management మొదలయిన రంగాలలో తరుచూ వాడే పదాలకు (technical terms) తెలుగులో కానీ మరే ఇతర భారతీయ భాషలో కానీ సరయిన పదాలు లేవు.
Deleteప్రతిసారి ఆంగ్ల పదాలే వాడడం ఎబ్బెట్టుగా ఉంటుంది. పైగా పాఠంలో అరవయి డెబ్బయి శాతం ఆంగ్ల పదాలు ఉంటె దాన్ని తెలుగు పాఠం అనలేము కదా.
మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న తెలుగు పుస్తకాలలోని భాషే కష్టంగా (ఉ. కార్యాలయం) ఉన్నప్పుడు, ఇతర విషయాలను తెలుగులో బోధించేటప్పుడు పదాల ఎంపిక బాలేకపోతే పిల్లలకు చదువు వొంత పట్టదు.
anrd.....ఈ క్రింద వ్రాసినవి అర్ధశాస్త్రానికి సంబంధించిన తెలుగు మీడియం పుస్తంలోని విషయాలండి. వారు ఎలా వ్రాసారారో ఉదాహరణకు ఇక్కడ ఇస్తున్నానండి..
A.) ... కాలాన్ని బట్టి మార్కెట్టు వర్గీకరణ .. ( very shorT period )
B ).. స్వల్పకాలిక మార్కెట్.... ( short period )
C). ... దీర్ఘకాలిక మార్కెట్ .. ( long period )
A) అతి స్వల్పకాలిక మార్కెట్టు ; వస్తువు సప్లైని ఏ మాత్రం మార్చడానికి వీలులేని మార్కెట్టును అతి స్వల్పకాలిక మార్కెట్టు అంటారు. అందువల్ల ధర నిర్ణయంలో డిమాండు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
పై ఉదాహరణను చూస్తే తెలుగుమీడియం పుస్తకంలో కూడా ఇంగ్లీష్ పదాలు అక్కడక్కడా ఉపయోగిస్తూ విషయాన్ని విద్యార్ధులకు బోధిస్తున్నారు.
మాతృభాషలో క్రొత్త పదాలు నేర్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. అందువల్ల సబ్జక్ట్ చదవటానికి ఎక్కువ సమయం మిగులుతుంది.
ఇంగ్లీష్ వంటి పరాయి భాషల్లో విద్యాభ్యాసం చేసినప్పుడు సబ్జక్ట్ నేర్చుకోవటం.. + .పరాయి భాషలో పదాలు నేర్చుకోవటం ....... అనే రెండు కష్టాలు ఒక్కసారే ఎదురవుతాయి.
బైపిసీ తెలుగు మీడియంలో చదివి డాక్టర్స్ అయిన వాళ్ళెందరో ఉన్నారు.
మాతృభాషలో చదవటం వల్ల మేధస్సు మరింత చురుకుగా పనిచేస్తుందని విజ్ఞులు చెబుతున్నారు..
Jai Gottimukkala.గారూ మీకు , మరియు నా బ్లాగులో వ్యాఖ్యలు వ్రాస్తున్న అందరికీ అనేక ధన్యవాదాలు .
Deleteమీలాంటి వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోవటం ద్వారా నాలాంటివాళ్ళం ఎన్నో నేర్చుకుంటామండి.
మీ అభిప్రాయాలు చెప్పటం వల్ల నా అభిప్రాయాలను మరింత బాగా చెప్పటానికి వీలయ్యింది. అందుకు కృతజ్ఞతలండి.
చాలా బాగా వ్రాసారు.
ReplyDeleteమీ ఆలోచనతో పూర్తిగా ఏకీభవిస్తాను.
అసలు అన్ని భాషలకు మూలం "సంస్కృతం". మన దేశం మీద ఎన్ని దండయాత్రలు జరుగుతున్నా తిరిగి మళ్ళీ మనమందరం కలసి వాళ్ళను త్రిప్పి కొడుతున్నాము. అప్పుడు బ్రిటీషు వాళ్ళు మాక్స్ ముల్లర్ ను పంపి మనమందరము తిరిగి ఒకటిగా ఉండగలగడానికి కారణాలు కనుక్కోమన్నారు. భారత దేశమనేది ఒక పుస్తకం లాంటిది, అందులోని పుటలనీ "సంస్కృతి" అనే ధారంతో కట్టి వేయబడింది కనుక ఆ సంస్కృతి అనే ధారాన్ని తెంపితే చాలు భారత దేశం పతనమవుతుంది అన్నాడు. ఈ సంస్కృతి కి మూలమయినది "సంస్కృతం". అది మన మాతృ భాష. అందరూ "సంస్కృతం" లోనే సంభాషించుకునే వారు. అన్ని గ్రంధాలు ఈ "సంస్కృతం" లోనే వ్రాయబడ్డాయి. ఎప్పుడయితే ఈ "సంస్కృతం" భాషను మనకు దూరం చేసారో అప్పటినుండి మన సాహిత్య, సాంస్కృతిక, శాస్త్రీయ, వైజ్ఞానిక మొదలగు విద్యా సంపద పోగొట్టుకోవటమే గాక, అవి అర్ధం కాని భాష అని మనమే హేళనచేసే స్థికి ఎదిగాము.
నా ఆలోచనను వ్యక్తపరుచుకునేందుకు అవకాశమిచ్చిన మీకు నా ధన్యవాదములు.
DSR Murthy
sriramdavuluru.blogspot.com
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నిన్న రాత్రే మీ వ్యాఖ్యను చూశాను జవాబివ్వటం ఆలస్యమయినందుకు క్షమించండి.
Deleteనా ఆలోచనను వ్యక్తపరుచుకునేందుకు అవకాశమిచ్చిన మీకు నా ధన్యవాదములు.
DSR Murthy
సార్ ! నా బ్లాగులో వ్యాఖ్యలు వ్రాస్తున్న అందరికీ నేనే అనేక ధన్యవాదాలు చెప్పవలసి ఉంటుందండి. అది నా బాధ్యత.
మీలాంటి వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోవటం ద్వారా నాలాంటివాళ్ళం ఎన్నో నేర్చుకుంటామండి.
భాష గురించి మీరు వ్రాసిన విషయాలు చాలా చక్కగా చెప్పారండి.
ఎప్పుడయితే ఈ "సంస్కృతం" భాషను మనకు దూరం చేసారో అప్పటినుండి మన సాహిత్య, సాంస్కృతిక, శాస్త్రీయ, వైజ్ఞానిక మొదలగు విద్యా సంపద పోగొట్టుకోవటమే గాక, అవి అర్ధం కాని భాష అని మనమే హేళనచేసే స్థికి ఎదిగాము.
Delete......చక్కగా చెప్పారండి.
భారతీయ భాషలు అభివృద్ధి చెందాలి. ప్రభుత్వాలు ఆ పని చెయ్యటం లేదు. బతుకు తెరువుకు భారతీయ భాష ఉపయోగ పడటం లేదు. ఇదీ అసలు విషాదం.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. ఈ రోజు ఉదయమే మీ వ్యాఖ్యను చూశాను జవాబివ్వటం ఆలస్యమయినందుకు క్షమించండి.
Deleteసార్ ! నా బ్లాగులో వ్యాఖ్యలు వ్రాస్తున్న అందరికీ నేనే అనేక ధన్యవాదాలు చెప్పవలసి ఉంటుందండి. అది నా బాధ్యత.
మీలాంటి వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోవటం ద్వారా నాలాంటివాళ్ళం ఎన్నో నేర్చుకుంటామండి.
భాష గురించి మీరు వ్రాసిన విషయాలు చాలా చక్కగా చెప్పారండి..
@kastephale:
Deleteఒక్క విద్య తప్ప మిగిలిన అన్నిరంగాలలో భారతీయ భాషలు దూసుకు పోతున్నాయి. మన భాషల మనుగడ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదనుకుంటా.
వేలాది సంవత్సరాలు తీవ్రమయిన అణచివేతకు గురయిన హీబ్రూ భాష తిరిగి పునర్వైభవం సాధించింది. భారతీయ భాషలు కూడా ఏ మాత్రం తీసిపోవని నా నమ్మకం.
ప్రభుత్వాలు ఆ పని చెయ్యటం లేదు. బతుకు తెరువుకు భారతీయ భాష ఉపయోగ పడటం లేదు. ఇదీ అసలు విషాదం.
Delete....చక్కగా చెప్పారండి..
anrd గారూ, ఇంగ్లీషు భాష కష్టమని మీరు చెప్పిన మాట నూటికి నూరు పాళ్ళు నిజం. ఇంగ్లీషు మీడియుంలో చదువుకున్న వారికి కూడా చాలా మందికి ఆ భాష సరిగ్గా రాదు.
ReplyDeleteతెలుగులో మనసులో అలోచించి ఆ మాటలను ఇంగ్లీషు లోకి తర్జుమా చేసే వాళ్ళే ఎక్కువ. ఎంతో మంది "why because"(ఎందుకంటే), "what you are telling" (మీరెమంటున్నారు) లాంటి భాషతో ఆంగ్లాన్ని ఖూనీ చేయడం మనం రోజూ చూస్తుంటాము.
ఒక భాషలో ఆలోచించగలగడం (ability to think in a language) ఆ భాష మీద పట్టు చూపిస్తుంది: అయితే ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది.
మీరు చూపించిన ఉదాహరణలు బాగానే ఉన్నాయి కానీ ఇంకా చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందనుకుంటా. ఇది అప్పుడప్పుడూ చేపట్టే ప్రక్రియలా కాక ఒక సంఘటిత కార్యక్రమంలా చేస్తే బాగుంటుంది. సరళమయిన పదజాలంతో కూడిన నిఘంటువు(లు) తయారు చేస్తే బాగుంటుంది. ఉ. "ద్రవ్యోల్బణం" అనే పదం నా మట్టుకు నాకు అనుచితంగా తోస్తుంది.
మీరు ఈ టపా కొరకు ఎంచుకున్న విషయం, అలాగే దాని మీద మీ సూచనలు చెప్పిన పద్దతి మెచ్చుకోవాల్సిందే. పండితులుగా చలామణీ అవుతూ ఆచరణ సాధ్యం కాని సలహాలు ఇచ్చే పెద్దలు మీ టపా చదివితే వారికి జ్యానోదయం కాగలదు.
సరళమయిన పదజాలంతో కూడిన నిఘంటువు(లు) తయారు చేస్తే బాగుంటుంది.....
Delete....చక్కగా చెప్పారండి..
చాలా చాలా బాగా రాశారు.తెలుగులో ఆధునిక పదజాలాన్ని పెంపొందించుకోవాలి.తెలుగు దూసుకుపోవాలి!చురుకుదనం పెరగాలి,తెలుగు పునర్వైభవం సాధించాలి.మాతృభాష బాగా వచ్చినవావాడు ఏ భాషయినా అవలీలగా నేర్చుకోవచ్చు.మాతృభాషే సరిగా రానివాడికి చావగొట్టి చెవులు మూసినా పరభాష రాదుగాక రాదుగాక రాదు అన్నారు ఆనాడు పానుగంటివారు!
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఅవునండి, తెలుగు పునర్వైభవం సాధించాలి.