ఓం
ఈ రోజు శుభప్రదమైన ఈ సంవత్సరపు అమరనాధ్ యాత్ర ప్రారంభమవుతున్నది.
...................................
ఈ రోజు శుభప్రదమైన ఈ సంవత్సరపు అమరనాధ్ యాత్ర ప్రారంభమవుతున్నది.
...................................
ఈ మధ్య ఉత్తరాఖండ్ లో వచ్చిన వరదల గురించి అందరికి తెలిసిందే. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శ్రీ ధారీ దేవి ఆలయం ఉన్నదట. ధారీదేవి చార్ ధాం క్షేత్రముల పాలకురాలట.
ఉత్తరాఖండ్ లో ఎన్నో జల విద్యుత్ ప్రాజెక్ట్ లు నిర్మించారట. ఆ క్రమంలో ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టడం కోసం అడ్డుగా ఉన్నదని ధారీదేవి ఆలయంలోని మూలమూర్తిని వేరొక చోటికి తరలించాలని నిర్ణయించారట.
వరదలు వచ్చిన రోజున సాయంకాలం ధారీదేవి మూర్తిని కదిలించటానికి ప్రయత్నిస్తుండగానే ఆకాశంలో మెరుపులు వచ్చాయట. ఆ తరువాత దైవమూర్తిని అక్కడనుంచి కదిలించిన తరువాత కొద్దిసేపటికే వాన మొదలై అదేరోజు ఉధృతమై గంగమ్మ పొంగి వరదలు ఉద్ధృతంగా వచ్చాయని మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది.
ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రిందట కూడా ఒక రాజు శ్రీ ధారీ దేవి విగ్రహమూర్తిని కదిలించటానికి ప్రయత్నించినప్పుడు ఇలాగే ప్రతికూలాంశాలు కనిపించటం వల్ల ఆ రాజు విగ్రహమూర్తిని కదిలించే ప్రయత్నాన్ని మానుకున్నాడని వార్తల వల్ల తెలుస్తోంది.
ఇంత వరదలలో కూడా కేదార్ నాధ్ దేవాలయం చెక్కుచెదరకుండా ఉంది . ప్రధాన పూజారి ప్రాణాలతో బయటపడటం దైవలీల. బండరాయి ఒకటి కేదార్ నాధ్ ఆలయం ఎదురుగుండా ఉన్న నందీశ్వరుని ప్రక్కన కనిపిస్తోంది. నందీశ్వరుని మూర్తి చెక్కుచెదరలేదు. అంతా దైవం దయ.
.............................
ఈ వరదలవల్ల కొందరు భక్తులు మరణించటం వెనుక అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలేమిటో భగవంతునికే తెలియాలి.
అయితే, వరదల నుంచి బయటపడి, సరిగ్గా తిండితిప్పలు లేకపోయినా ఎందరో భక్తులు ప్రాణాలతో బయటపడటం అనేది ఎంతో గొప్ప విషయం. అంతా దైవం దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు.
బాధితులను ఆదుకున్న అందరూ ఎంతో అభినందనీయులు.
బాధితులను ఆదుకునే సమయంలో ప్రాణాలను కోల్పోయిన జవానులు మహనీయులు. వారికి నివాళులు.
....................
అడవులను నరికివేయటం, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల ఎంతో పర్యావరణ కాలుష్యం జరుగుతోంది . పవిత్రంగా భావించే గంగా నదిలోనూ విపరీతంగా కాలుష్యాలను కలుపుతున్నారు.
మానవుల స్వార్ధపూరితమైన చేష్టల వలన కొన్ని జీవజాతులు అంతరించే స్థాయికి చేరుకుంటున్నాయంటున్నారు.
పర్యావరణాన్ని అతిగా కలుషితం చేస్తే మానవులకు కూడా ప్రమాదం పొంచి ఉన్నట్లే.
.........................
శ్రీ రామాయణ మహా కావ్యాన్ని వ్రాసిన వాల్మీకి మహర్షి ... ఒక పక్షి జంటలోని ఒక పక్షి మరణిస్తే రెండవ పక్షి అనుభవించిన వేదనను చూసి ఎంతో ఆవేదనను చెందారని మనము చదువుకున్నాము.
మానవులు, పశుపక్ష్యాదులు అన్నీ భగవంతుని బిడ్డలే. ప్రపంచంలో మానవులతో సమానంగా జీవించే హక్కు పశుపక్ష్యాదులకు కూడా ఉన్నది. అయితే బలవంతులైన మానవులు బలహీనులైన ఇతర జీవులపై పెత్తనాన్ని చెలాయిస్తున్నారు.
బలవంతులైన బిడ్డలు బలహీనులైన బిడ్డలను కష్టాలు పెడుతుంటే తల్లితండ్రులు చూస్తూ ఊరుకోరు కదా !
అలాగే బలవంతులైన మానవులు తమ అంతులేని కోరికల కోసం పర్యావరణాన్ని కలుషితం చేస్తూ మూగప్రాణులకు ముప్పు కలిగిస్తుంటే జగన్మాతాపితరులు చూస్తూ ఊరుకోరు.
ఈ ప్రపంచంలో జీవించే ఇతర జీవులకు కూడా ఎన్నో హక్కులున్నాయని మానవులు గుర్తించటం మంచిది.
...............................
భారతం, రామాయణం నిజంగా జరిగినవా ? కాదా ? అని కొందరు సందేహపడుతుంటారు.
శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము గ్రంధములో రామాయణ, భారతముల గురించిన విషయాలు కూడా ఉన్నాయి.
శాటిలైట్ చిత్రాల సమాచారం ద్వారా రామాయణకాలంలో సముద్రంలో నిర్మించిన వారధి మరియు భారతకాలం నాటి ద్వారకానగర చిత్రాలు కనిపించటం మరియు కొన్ని విశ్లేషణల వల్ల రామాయణ, భారతాలు గురించి ఎన్నో విషయాలు తెలిసాయి .
దయచేసి ఈ క్రింది లింక్స్ చూడగలరు........
meeru satyaanni chebutunnappudu bhayapadakamdi
ReplyDeletesarvaaniki karta paramesvarude
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఅనురాధ గారు, మీ ఇంటర్వ్యూ కావాలి. మీ మెయిల్ ఐడి నా దగ్గర లేదు. దయచేసి lasyaramakrishna@gmail.com కి మీరు మెయిల్ పంపగలరు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDelete