నాకు తెలిసిన విషయాలు తక్కువ. బ్లాగులో ఈ మాత్రం విషయాలు వ్రాస్తున్నాను అంటే , అంతా దైవం దయ వల్లనే .
అందువల్లనే , నేను ఇంతకుముందు వ్రాసిన కొన్ని పాత టపాలలో అంతా దైవం దయ . అని వ్రాసాను. ఈ మధ్య కాలంలో అలా వ్రాయలేదు.
అందువల్ల మొన్న సోమవారం వ్రాసే టపాలో అంతా దైవం దయ . అనే వాక్యాన్ని వ్రాయాలని నాకు అనిపించింది.
అయితే సోమవారం పనివత్తిడి వల్ల కొత్త టపా వ్రాయటానికి కుదరలేదు. అందుకని పాత టపానే వేద్దామనిపించి , తెలుగు భాష వాడకం యొక్క ప్రాముఖ్యత ..... మొదలైన విషయాల గురించిన పాత టపాను పోస్ట్ చేస్తూ ..... అంతా దైవం దయ . అని వ్రాయటాన్ని మర్చిపోయాను.
టపాను పోస్ట్ చేసే ప్రయత్నంలో ఉండగా కరెంట్ పోయి వెంటనే వచ్చింది. తిరిగి కరెంట్ వచ్చిన తరువాత టపాను పోస్ట్ చేయటం కోసం ప్రయత్నిస్తుంటే , 2012 లో వ్రాసిన టపా అక్కడ మాయమై కొత్త టపాగా వచ్చింది. ( అప్పటి వ్యాఖ్యలతో సహా రావటం ఆశ్చర్యంగా ఉంది ... )
ఇంకా నయం దైవం దయ వల్ల పాతటపా మాయమై పోలేదు అని సంతోషం వేసింది . అప్పుడు అంతా దైవం దయ. అని టపాలో వ్రాయలేదన్న విషయం గుర్తొచ్చి, అంతా దైవం దయ . అని వ్రాసాను.
జరిగిన సంఘటన నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. అంతా దైవం దయ.
ఇంకొక టపా లంకె ను ఇక్కడ ఇస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు దయచేసి చదువుతారని ఆశిస్తున్నాను.
అంతా విష్ణు మాయ
ReplyDeleteఅవునండి. అంతా విష్ణు మాయ.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDelete