దుర్గాడలో సర్పం మరణించటం ఎంతో బాధాకరం.
ఆ సర్పం అన్ని రోజులు అలా ఉండి ఎవరినీ కరవకపోవటం ఆశ్చర్యం.
కొందరు భక్తులు, సర్పం తమ వద్ద తిరుగుతున్నా భయపడకుండా కదలకుండా ఉండటం గొప్పవిషయమే..
అయితే, ఆ సర్పం తన ఇష్టానికి వెళ్ళడానికి వీలులేకుండా చుట్టూ జనం గుమిగూడి ఉన్నట్లు టీవీలో చూస్తున్నప్పుడు అనిపించింది.
జనం అలా చుట్టూ నిల్చోటం కాకుండా సర్పానికి దారి ఇస్తే బాగుండేది .
రాత్రిసమయంలో సర్పం చుట్టూ ఎవరూ లేరు.. సర్పం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళేది కదా.. అని కొందరు అన్నారు.
(నిజంగా రాత్రి సమయంలో అక్కడ ఎవరూ లేరా ? లేక రాత్రి సమయంలో సర్పానికి కొందరు జనం కాపలా ఉన్నారా ? లేదా ? అనేది తెలియదు.)
మొత్తానికి ఏం జరిగిందో ? భగవంతునికి తెలియాలి.
సర్పాలు గుడ్లను కూడా తింటాయంటారు. ఆ సర్పానికి ఆహారంగా కోడిగ్రుడ్లను ఇస్తే బాగుండేది.
( ఇచ్చారో? లేదో? తెలియదు).
ఒకరు ఏమన్నారంటే, ఆ సర్పం అలా ఆహారం లేకుండా ఎండలో తిరుగుతూ ఉంటే చనిపోయే అవకాశం ఉంది కాబట్టి, సర్పాన్ని తీసుకెళ్ళి ఆహారం తినిపించాలి అన్నారు.
అలా తీసుకెళ్ళి రక్షణచర్యలు తీసుకుంటే సర్పం మరణించకుండా ఉండేదేమో?
అలా తీసుకెళ్ళటానికి ప్రజలు ఒప్పుకున్నారో? లేదో? తెలియదు .
సర్పం మరణించటం మాత్రం బాధాకరం.
ఎంతో మంది ప్రజలు చుట్టూ ఉండి , టీవీల్లో చూస్తూ ఉండి కూడా సర్పాన్ని కాపాడలేక ... ఆ మూగజీవి అలా అయిపోయింది.
పుట్టల వద్ద, పొలాల్లో తిరుగుతూ కొన్ని సర్పాలు అప్పుడప్పుడు ప్రజలకు కనిపిస్తాయని అంటారు.
ఈ సర్పం కూడా జీవించి ఉన్నట్లయితే, ఆ పరిసరాల్లో తిరుగుతూ అప్పుడప్పుడు ప్రజలకు కనిపిస్తూ ఉండేదనిపిస్తుంది.
No comments:
Post a Comment