శ్రావణ పంచమి సందర్భంగా శుభాకాంక్షలు.
*************
ఆగష్టు 15 న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన శుభసమయం.
ఎందరో మహనీయులు ఎన్నో కష్టాలకు ఓర్చి , ఎన్నో త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం సాధించారని అందరూ గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.
..........................
ఎవరికైనా మనసు బాగోనప్పుడు ...
ధ్యానం చేయటం.. మంచి పాటలు వినటం ..మంచి పుస్తకాలు చదువుకోవటం..మంచి వ్యక్తులతో కొంతసేపు కబుర్లు చెప్పుకోవటం..పనిలో నిమగ్నమవటం..ఇలా ఎన్నో మార్గాలున్నాయి. తద్వారా మనస్సు కుదుటపడే అవకాశం ఉంది.
.........................
పని ముగించి ఖాళీగా కూర్చుంటే మళ్ళీ ఆలోచనలు విజృంభించే అవకాశమూ ఉంది. అందుకని అప్పుడప్పుడూ దైవనామ స్మరణ చేయటం అలవాటు చేసుకోవాలి. కుదిరితే కనీసం 10 నిమిషాలకు ఒకసారైనా దైవనామాన్ని స్మరించుకుంటే మంచిది.
ధర్మబద్ధంగా జీవించాలి. అయితే, కొన్నిసార్లు ...ఏది సరైన పద్ధతో ? ఏది సరైనది కాదో ? ఏం చేయాలో ? ఏం చేయకూడదో ? తెలియని గందరగోళ పరిస్థితులూ ఎదురుకావచ్చు.
అందువల్ల , సరైనవిధంగా నడిచేలా సాయం చేయమని దైవాన్ని ప్రార్ధించాలి . దైవాన్ని శరణు వేడాలి.
************
మరికొన్ని విషయాలు...
దైవభక్తి కలిగి, అవసరమైనంత వరకూ విషయాలను తెలుసుకుని, దైవాన్ని నమ్ముకుని సత్కర్మాచరణతో చక్కగా హాయిగా జీవితాన్ని గడుపుతూ దైవకృపను పొందవచ్చు.
అయితే, సరళంగా ఉండే జీవితాలను క్లిష్టంగా చేస్తున్నారు కొందరు. ఆచారవ్యవహారాల పేరిట కొందరు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. ఉదా..కొందరు రకరకాలపుకార్లను ప్రచారం చేస్తారు..ఇక, జనానికి వేలంవెర్రి భయం మొదలవుతుంది. ఇదేమిటోగాని,ఇలాంటివాటి పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు.
పాపాలు చేయకండి, చేస్తే కష్టాలు.. నష్టాలు వస్తాయని ప్రాచీనులు తెలియజేసినా కూడా, జనం పెద్దగా పట్టించుకోరు. పాపాలు చేయటానికి భయపడరు. మూఢనమ్మకాలను వెర్రిగా నమ్మి వాటి వెనుక పడతారు.
ఇవన్నీ ఎవరు ఎందుకు చెబుతున్నారో గానీ, ఇదంతా గమనిస్తే .. ఏం చేయాలో? ఏం చేయకూడదో ? తెలియక ..ప్రజలు అయోమయానికి గురయ్యే విధంగా పరిస్థితి వస్తోందా? అని కూడా సందేహాలు కలుగుతున్నాయి.
మరికొందరు చెప్పే విషయాలను గమనిస్తే, ప్రజలను గందరగోళానికి గురి చెయ్యటానికి ఎవరైనా అలా చెప్తున్నారేమో? అనికూడా సందేహంగా అనిపిస్తుంది. ఇవన్నీ పాటించలేకపోతున్నామని కొందరు వాపోతుంటారు.. అయినా, పట్టించుకోకుండా చెప్పేవారు చెబుతున్నారు..వినేవారు వింటున్నారు.
హిందువులు తమకు ఉన్న కొన్ని మూఢనమ్మకాలను వదిలించుకుంటే మంచిది. వీటివల్ల ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. వీటివల్ల కుటుంబాలలో గొడవలు కూడా వస్తున్నాయి. పాటించకపోతే ఏమవుతుందోననే భయంతో కొందరు మానసికంగా నలిగిపోతున్నారు.
హిందువులలోనే ఎన్నో భేదాభిప్రాయాలున్నాయి. కొన్నివిషయాలలో ఎవరి అభిప్రాయాలు వారివి. ఇలాంటప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో దైవానికే తెలుస్తుంది.
ఇప్పుడు కొందరు అనేకరకాల పూజల గురించి చెబుతున్నారు. పాతకాలంలో ఇన్నిరకాల పూజలు అందరికీ తెలిసేవికాదు. అందరూ ఆచరించేవారుకాదు. కొన్నిపూజలకు అనేకనియమాలుంటాయట. ఈ విషయాలగురించి కూడా అనేక అభిప్రాయభేదాలున్నాయి. ఇవన్నీ విని సామాన్యులకు ఏం చేయాలో అర్ధంకాదు. దైవమే దిక్కు.
ఇక, కొందరు కొన్నిపూజలను చెబుతుంటారు. కొందరు జంతుబలులతో చేస్తారట. కొందరు ఎండుమిరపకాయలవంటి వాటితో చేస్తారట. జంతుబలులకన్నా, ఎండుమిరపకాయల వంటివి కొంతనయమే. అయితే,ఈ విధానాలలో చాలా నియమాలుంటాయట. అవన్నీ పాటించటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.. ఇలాంటి విషయాల గురించి దైవానికే సరిగ్గా తెలుస్తుంది.
****************
ఆచారవ్యవహారాలలో ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ఎంతో విజ్ఞానం ఉంది. అయితే కొందరు వాటిని సరిగ్గా అర్ధం చేసుకోకుండా అసలు విషయాన్నే మార్చేస్తుంటారు. ఉదా..పాతకాలంలో భోగిరోజున భోగిమంటలో ఇంట్లో ఉన్న పాతచెక్కసామాన్లను కూడా పడేసేవారు. అలా పర్యావరణహితంగా పాతసామాను పర్యావరణంలో కలిసిపోయేది.
ఈరోజుల్లో కొందరు పాతటైర్లను కూడా భోగిమంటలో వేస్తున్నారు.పర్యావరణాన్నిపాడుచేస్తున్నారు. ఆచారవ్యవహారాల్లోని అసలు విషయాన్ని మార్చేస్తున్నారు.
ఇక, ఈరోజుల్లో యూట్యూబ్ ద్వారా ఎందరో ఎన్నో చిత్రవిచిత్రమైన ఆచారవ్యవహారాలను చెబుతున్నారు. ఇలాంటివి గమనించినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇలా చెబుతున్నారంటే, ఇక తరతరాలనుండి ఎందరు ఇలాగ్రంధాలలో విషయాలను మార్పులుచేర్పులు(ప్రక్షిప్తాలు) చేసి ఉంటారో? అని సందేహాలు కలుగుతాయి.
గ్రంధాలలో ఏవి పెద్దలు చెప్పినవో? ఏవి మార్పులుచేర్పులు చేసిన విషయాలో? తెలియదు. ఆచరణవిషయంలో విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అర్ధంకానప్పుడు దైవాన్ని ప్రార్ధించుకోవాలి.
No comments:
Post a Comment