ఈ రోజు శ్రావణ సోమవారం మరియు గోదాదేవి జయంతి సందర్భంగా శుభాకాంక్షలండి.
*********************
ఒక విషయాన్ని వ్రాయాలనుకుంటున్నాను .
ఈ మధ్య ఒక పత్రికలో.. దైవం గురించి శ్రీ రామకృష్ణపరమహంస వారు చెప్పిన విషయం గురించి ప్రచురించారు.
ఎన్ని పేర్లతో పిలుచుకున్నా దైవం ఒకరే అని, నీటిని కొందరు నీరు అంటారు, కొందరు వాటర్ అంటారు, కొందరు పానీ అంటారు..అయినా నీరు ఒక్కటే అయినట్లు దైవశక్తి ఒకరే అని.. వారు చెప్పటం గురించి పత్రికలో చదివాను.
ఈ విషయం చదివిన తరువాత నాకు ఆశ్చర్యం మరియు గాభరా కలిగింది.
నేను, పాత టపాలలో .. ఎన్ని పేర్లతో పిలిచినా దైవం ఒక్కరే ..అని వ్రాసి, ఇలాంటి ఉదాహరణలు వ్రాయటం జరిగింది.
నేను టపాలో పై విషయాలను వ్రాసినప్పుడు, శ్రీ రామకృష్ణపరమహంస గారు పైన చెప్పిన విషయాలను చదివినట్లుగా గుర్తులేదు.
గుర్తు ఉంటే , నేను సొంతంగా వ్రాసినట్లు కాకుండా, రామకృష్ణపరమహంస గారు ఇలా చెప్పారని వ్రాయటం జరిగేది.
*************
ఇవన్నీ ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే,
నేను కొన్ని సంవత్సరాల క్రితమే రామకృష్ణపరమహంస గారి గురించి పుస్తకాలలో చదివాను.
అలా చదివినప్పుడు ఎప్పుడైనా దేవుని గురించి వారు చెప్పిన విషయాలను చదివి ఉండవచ్చు,
పైకి ఆ విషయాలను మర్చిపోయినా, నా అంతరంగంలో అవి గుర్తుండిపోయాయేమో? వాటినే నేను టపాలలో వ్రాసానేమో ? అని ఒక ఆలోచన వచ్చింది.
అయితే టపాలో ఆ విషయాలను వ్రాసినప్పుడు అవి రామకృష్ణుల వారు చెప్పిన విషయాలని తెలియరాలేదు.
తెలిస్తే వారు చెప్పినట్లుగానే ఆ విషయాన్ని టపాలో వ్రాయటం జరిగేది.
అంతేకానీ, రామకృష్ణుల వారు చెప్పిన విషయాలను నా సొంత ఆలోచనలుగా వ్రాయాలన్నంత దుస్సాహసం నాకు లేదు.
ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది మాత్రం ఇదే.
ఏం జరిగిందో భగవంతునికి తెలియాలి.
*******
రామకృష్ణపరమహంస వారు ఎంతో గొప్పవారు, వారు అవతారమూర్తులు. నేను హైదరాబాద్లో రామకృష్ణ మఠానికి చాలాసార్లు వెళ్ళాను.
రామకృష్ణపరమహంస వారికి శారదామాతకు, వివేకానందుల వారికి నా వందనములు.
No comments:
Post a Comment