koodali

Saturday, August 18, 2018

కొన్ని విషయములు.. గ్రంధాల ద్వారా..


 గ్రంధాల ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి... 

 శ్రీ దేవీభాగవతము గ్రంధము  (వచనము)లోని  కొన్ని విషయములు...

యమధర్మరాజు,  సావిత్రీదేవికి తెలియజేసిన  కొన్ని విషయాలు..

(సాయుజ్య-సారూప్యప్రదంగా) ద్వివిధమైన భక్తి ఒక్కటే కర్మనిర్మూలకం.అని యమధర్మరాజు తెలియజేసారు.


ఇంకా,ఎన్నో విషయాలను తెలియజేస్తూ,

 కాబట్టి దానధర్మాది శుభకర్మలను నిష్కామంగా ఆచరించి సద్గతులు పొందాలి. అని కూడా తెలియజేసారు.


యమధర్మరాజును,  సావిత్రీదేవి అడిగిన సందేహాలలో కొన్ని విషయాలు..

భూలోకంలో మరణించాక దేహం భస్మమైపోతుంది.మట్టిలో కలిసిపోతుంది.  ఆపైని ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్ళి శుభాశుభకర్మలను అనుభవించడం జరుగుతుంది?

అంతంతకాలం నరకయాతనలు అనుభవిస్తోంటే దేహం నశించకుండా ఎలా ఉంటుంది ? అసలు ఆ దేహం ఏమిటి ? అని ఎన్నో సందేహాలను అడగటం జరిగింది.

యమధర్మరాజు  సావిత్రికి  దేహస్వరూపాన్ని వివరిస్తూ..

స్థూలశరీరం పంచభూతాత్మకం.అది కృత్రిమదేహం. కనక నశ్వరం - బూడిద అయిపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాలూ పంచభూతాలలో కలిసిపోతాయి...

 అటుపైని అంగుష్ఠ ప్రమాణంలో జీవుడు మిగులుతాడు.ఇది సూక్ష్మదేహం. దీనితోనే శుభాశుభకర్మఫలాలు అనుభవిస్తాడు...

 ఇది నశించదు. శిధిలం కాదు.అగ్నిదగ్ధం కాదు.శస్త్రాస్త్రాలకు లొంగదు. తప్తద్రవ తప్తతైల  తప్తపాషాణాది  కూపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కుచెదరదు.దుఃఖాలను మాత్రం అనుభవిస్తూంటుంది. అని  ఎన్నో విషయాలను తెలియజేసారు.  

******************
జనమేజయునికి వ్యాసులవారు చెప్పగా సూతులవారు శౌనకాది మునులకు తెలియజేసిన విషయాలలో కొన్ని విషయాలు...

అనేక పూర్వజన్మలలో సంపాదించుకున్నది - సంచితకర్మ.....

దేహధారులందరూ శుభమో అశుభమో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. చెయ్యక తప్పదు..... 

సంచితకర్మల నుంచి ఏదో కొంతభాగాన్ని ఇటు తెచ్చి ప్రస్తుత( జన్మారంభంలో)-దేహారంభంలో కాలం వర్తమానకర్మకు ప్రేరణ ఇస్తుందనుకుంటాను.ఇలా ప్రారంభింపబడినదే ప్రారబ్ధకర్మ.....


 అసలు దేహారంభానికి ( జన్మించడానికి) కారణం కూడా కర్మయే. సకల ప్రాణులకూ కర్మక్షయమే జన్మనాశం...అని ఎన్నో విషయాలను తెలియజేసారు.

శ్రీదేవీభాగవతములో దేవీగీత కూడా ఉన్నది.

********
శ్రీ భగవద్గీతలో నిష్కామకర్మయోగమును శ్రీకృష్ణపరమాత్మ తెలియజేసారు.

************
 ఒక యోగి ఆత్మ కధ గ్రంధంలో కూడా .. ఎన్నో విషయాల గురించి  తెలియజేసారు.

**************
వ్రాసిన విషయాలలో అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. 




No comments:

Post a Comment