koodali

Thursday, August 16, 2018

వ్యాధుల వల్ల ...


వాజపేయి గారు  గొప్పవ్యక్తి . వారు మరణించారని  తెలిసింది. 

వారికి   ఉత్తమగతులు  కలగాలని   కోరుకుంటున్నాను. 

**************

వారు  కిడ్నీ వ్యాధితో  బాధ పడ్డారని వార్తల ద్వారా తెలుస్తోంది. 

ఈ మధ్య కిడ్నీ వ్యాధి చాలామందిలో వస్తోంది.

ఈ వ్యాధి రావటానికి అనేక కారణాలుంటాయట.

కొన్ని కారణాలు.... కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవటం.

 బీపీ, సుగర్ వంటి వ్యాధుల వల్ల,

ఎక్కువగా మందుల  వాడకం..

 ****************

కొందరు పేదలు,  కలుషితమైన ఆహారం, నీరు తీసుకునే అవకాశం ఉంది.

 మరి..  మంచి ఆహారం, శుద్ధిచేసిన నీరు అందుబాటులో ఉన్నవారు కూడా వ్యాధుల బారిన పడటం ఆశ్చర్యం.


బహుశా ,రసాయన పురుగుమందులతో  పండించిన ఆహారపదార్ధాలు, రసాయనాలతో శుద్ధి చేసిన నీరు కూడా హానికరమా ? అనే సందేహం కలుగుతోంది.


జీవితంలో ఒత్తిడి పెరగటం వలన బీపీ వంటి వ్యాధులు వస్తాయి.

 సూర్యరశ్మి అంతగా తగలకుండా గదుల్లో గడపటం వంటి కారణాల వల్ల కూడా సుగర్ వ్యాధి వచ్చే అవకాశముందంటున్నారు.


 చిన్నాచితకా అనారోగ్యాల కారణంగా ఎక్కువగా మందులు వాడటం వల్ల  కూడా కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉందట.

****************

ఎవరైనా, వయస్సు మీదపడిన  తరువాత మరణించటం సహజం. 

 అంతేకాని,  వ్యాధుల వల్ల వ్యక్తులు చనిపోవటం బాధాకరం.


 వ్యాధి రాకుంటే వాజపేయి గారు రాజకీయాల్లో చాలాకాలం చురుగ్గా పాల్గొనేవారు.


ఇకనుంచయినా, దేశంలో  వ్యాధులు పెరగకుండా   అందరూ జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాలు తగ్గుతాయి.



3 comments:

  1. ఈ టపాలో ఇంతకుముందు.. వాజ్ పేయి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. అని వ్రాయటం జరిగింది.

    అయితే, శర్మగారి కష్టేఫలే బ్లాగులో.. కొన్ని విషయాలను చదివాను.

    ఎవరికైనా శ్రద్ధాంజలి తెలియజేసేటప్పుడు, వారి ఆత్మకు శాంతి కలగాలి..అని అనటం సరికాదని చదివాను.

    (ఆత్మ భగవంతుని ప్రతి రూపం, దానికి అశాంతి లేదు.అందుచేత మనం వారి ఆత్మ పరమాత్మలో లీనం కావాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామనే అనాలి..అని వ్రాసి, మరికొన్ని విషయాలను కూడా వారు తెలియజేసారు.)

    పై విషయాలను చదివిన తరువాత.. నిజమే కదా..అనిపించి, ఇంతకుముందు వ్రాసిన వాక్యాన్ని తీసివేసి వేరేవిధంగా వ్రాసాను.

    సరైన విషయాన్ని తెలియజేసినందుకు శర్మగారికి ధన్యవాదాలండి.

    ReplyDelete

  2. ఆత్మకు నాశనం లేదని భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణపరమాత్మ తెలియజేసారు.

    **************
    మరణానంతరం కొందరికి మోక్షం లభిస్తుంది. అంటే, జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది.

    వ్యక్తులు మరణించినా కూడా ఆత్మలకు నాశనం ఉండదు కానీ, ఆ ఆత్మల తాలూకు జీవులు తాము చేసిన కర్మల ప్రకారం స్వర్గనరకాలలో సుఖదుఃఖాలను అనుభవిస్తారు.

    కొందరు జీవులు స్వర్గలోకంలో శాంతిగా ఉంటారు. కొందరు జీవులు నరకలోకంలో కష్టాల వల్ల అశాంతిగా ఉంటారు.

    ************
    జీవించి ఉన్నప్పుడు....వ్యక్తికి ఆత్మతో పాటు భౌతికశరీరం ఉంటుంది.

    జీవితంలో సుఖదుఃఖాలు కలిగినప్పుడు ..ఆ ఆత్మ తాలూకు వ్యక్తి సుఖదుఃఖాలను అనుభవిస్తారు.

    **************
    మరణం తరువాత.... ఆత్మ మరియు సూక్ష్మ శరీరం ఉంటుంది కానీ, భౌతికశరీరం ఉండదు.

    ఆ ఆత్మ తాలూకు జీవి గతంలో తాను చేసిన కర్మల ప్రకారం స్వర్గనరకాలలో సుఖదుఃఖాలను అనుభవిస్తారు.

    ************
    శర్మ గారు తెలియజేసినట్లు, మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని అనటం సరైనది కాదు.

    మరణించిన వారి ఆత్మ పరమాత్మలో లీనం కావాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామనే అనాలి.

    లేక మరణించిన వారికి సద్గతులు కలగాలని అనటం ..సరైనదని నాకు అనిపిస్తున్నది.

    ReplyDelete

  3. మనలో చాలామంది ఆత్మ అనే పదాన్ని రకరకాలుగా వాడతాం....

    ఉదా..
    ఆత్మ రక్షణ కొరకు కలరిపయట్టు కానీ, కరాటే కానీ నేర్చుకోవాలి.

    మంచి భోజనం వల్ల ఆత్మారాముడు శాంతించాడు.

    ఇక్కడ ఆత్మ అనే పదానికి బదులు ప్రాణం, మనస్సు అనే పదాలు వాడటం సరైనదనిపిస్తుంది.

    ఉదా..
    ప్రాణ రక్షణ కొరకు కలరిపయట్టు కానీ, కరాటే కానీ నేర్చుకోవాలి.

    మంచి భోజనం వల్ల ప్రాణం మరియు మనస్సు శాంతించాయి.

    ReplyDelete