koodali

Monday, August 20, 2018

వరదల వల్ల..



చాలా ప్రాంతాల వాళ్లు వరదల వల్ల  బాధలుపడుతున్నారు. 

ఇలా జరగటం చాలా బాధాకరం.  


1 comment:

  1. దక్షిణభారతదేశంలో చాలా ప్రాంతాల వాళ్లు వరదల వల్ల బాధలుపడుతున్నారు. బాధితులను ఆదుకోవటం తక్షణచర్య.నిజమే,

    అయితే, ప్రకృతి విపత్తులు ఎక్కువవటానికి ..అడవులను విచ్చలవిడిగా నరికేయటం, పెరుగుతున్న కాలుష్యం..వంటి ఎన్నో కారణాలుంటాయి.

    ఒకప్రక్క జనం బాధతో అల్లాడుతుంటే ఇలా నీతి సూత్రాలు రాయటం బాగుండకపోవచ్చు.

    అయితే, ఇలా వరదలు రావటం, అపారనష్టం కలగటం

    దేశంలో మొదటిసారి కాదు కదా!

    ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతిసంవత్సరం ముంబయి నగరం మోకాళ్ళలోతు నీటిలో మునిగిపోతూనే ఉంది. ఉత్తరభారతదేశంలో మరికొన్ని చోట్ల కూడా వరదలు వచ్చాయి.

    హైదరాబాద్, చెన్నైలో కూడా వరదలు వచ్చాయి.

    వరదలు వంటివి వచ్చినప్పుడు లక్షల కోట్ల నష్టం వాటిల్లటం, సైన్యం వచ్చి బాధితులకు సహాయం చేయటం జరుగుతుంది.కొంతకాలానికి అందరూ అన్నీ మర్చిపోతారు.

    అంతేకానీ, పటిష్టమైన ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవటంలో మాత్రం చాలావరకూ విఫలం అవుతున్నాం.

    విపత్తులను పూర్తిగా ఆపలేం కానీ, వీలైనంతలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే జరిగే నష్టం గణనీయంగా తగ్గుతుంది.

    టన్నుల కొద్ది ప్లాస్టిక్ కవర్ల వల్ల డ్రైనేజిలు పూడిపోయి ఏటా ఎన్నో నగరాలు మునిగిపోతున్నాయి.

    మడ అడవులను,అరణ్యాలను నరకటం ఆపితే వరదల ఉధృతి తగ్గుతుంది.

    ఇంధనాలు, ఖనిజాలు కోసం భూమిని విపరీతంగా తవ్వేస్తుంటే భూమి గుల్ల అయి, భూకంపాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

    వర్షాలు వచ్చినప్పుడు వరదలతో మునిగిపోయి పోయి, అయ్యో! వరదలు ఊళ్ళను ముంచేస్తున్నాయని బాధపడతారు,

    వేసవి వచ్చేసరికి గొంతు తడుపుకోవటానికి చుక్క నీరు లేదంటూ అల్లాడిపోతారు.

    ఇక, గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో విపరీతంగా మార్పులు వస్తున్నాయి. విపత్తులు తగ్గాలంటే మనుషుల కోరికలు తగ్గాలి.

    లక్షల కోట్ల ఆస్తి నష్టం అంటే మాటలు కాదు.

    ఆర్ధిక అభివృద్ధి కోసం అడవులను నరికేసి, విపరీతంగా ఖనిజాలను తవ్వేసి అభివృద్ధి అయిపోదామనుకుంటే కలిగేది నష్టమూ, కష్టమూ తప్ప లాభం కాదు.

    ఒక్కో ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడల్లా లక్షల కోట్ల అపార ఆస్తి నష్టం కలుగుతుంటే ఇక ఆర్ధికాభివృద్ధి ఏముంటుంది?

    ఒక ప్రక్క విపరీతంగా ఆస్తి నష్టం కలుగుతుంటే, పాడైన వాటిని బాగుచేయాలంటే మళ్లీ డబ్బు కావాలి.

    ప్రకృతికి నష్టం కలిగించటం, సహజవనరులను విపరీతంగా వాడేయటం వల్ల అభివృద్ధి కలగదు.

    ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుకుంటూ, సహజవనరులను పొదుపుగా వాడుకుంటూ జీవించినప్పుడే అభివృద్ధి ఉంటుంది.


    ఇవన్నీ జరగాలంటే కేవలం ప్రభుత్వాలు మాత్రమే కానీ, అధికారులు మాత్రమే కానీ, ప్రజలు మాత్రమే కానీ ఏమీ చెయ్యలేరు.


    ప్రభుత్వం, అధికారులు, ప్రజలు కలసి బాధ్యతగా గట్టి కృషిచేస్తేనే అభివృద్ధిని సాధించగలరు.


    ఇవన్నీ ఎవరికీ తెలియని విషయాలు కాదు, అందరికీ తెలిసిన విషయాలే.

    ReplyDelete