- ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ల వద్ద చదవగలరు..
- కొన్ని విషయములు......
మరికొన్ని విషయములు....
ఎవరికైనా తల్లి అయినా తండ్రి అయినా సమానమే. ఇద్దరి ఆప్యాయతా పిల్లలకు అవసరం. నవమాసాలు మోసే పద్ధతి ప్రకృతిపరంగా తండ్రికి లేకున్నా, తండ్రులు కూడా పిల్లలను ప్రాణప్రదంగా చూసుకుంటారు.
అమ్మ అంటే అంతులేని ప్రేమకు పర్యాయపదం అంటారు..
అయితే, ఈ మధ్య కాలంలో కొందరు అమ్మలు.. తమ సొంత పిల్లల్ని అందులోనూ చంటిపిల్లల్ని హింసించటం, కొన్ని కేసుల్లో చంపటం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రియునితో కలిసి పిల్లలను చంపిన తల్లి, తన మాట వినటంలేదని పిల్లల్ని చావగొట్టే తల్లులు....ఇలా వార్తలు ఉన్నాయి.
కుటుంబంలో గొడవలు భరించలేక ఆత్మహత్య చేసుకుని మరణించే తల్లులు కూడా ఉన్నారు. ఇలాంటివారిలో చంటిపిల్లలు ఉండేవారూ ఉంటారు. చనిపోవాలనుకునే వారు తమ పిల్లల గురించి తప్పక ఆలోచించాలి. సమాజంలో బాధలు తట్టుకోలేక పెద్దవారికే చనిపోవాలని అనిపించినప్పుడు, పెద్దవారు ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు ఎలా బ్రతుకుతారో? పిల్లలు ఎన్ని బాధలు పడతారో? ఆలోచించాలి కదా..
ఎన్ని బాధలున్నా కూడా ధైర్యం తెచ్చుకుని జీవిస్తూ పిల్లల్ని పెంచుకోవాలి. అంతేకానీ, తమమానాన తాము పోతే పిల్లలు ఎలా బ్రతకాలి?
పశుపక్ష్యాదులు మూగజీవులు. తమబాధల్ని ఎవరికీ చెప్పుకోలేవు. మనుషులకు కాలికి చిన్నదెబ్బ తగిలినా హాస్పిటల్ కు వెళ్లటం.. అందరూ పరామర్శించటం జరుగుతాయి.
ఎవరైనా రోడ్దు పక్కన కుక్క కాలు విరగ్గొడితే అది కుంటుకుంటూ నడవటం తప్ప, దానిని హాస్పిటల్కు తీసుకెళ్లేవారు, పరామర్శించేవారు ఎందరుంటారు? వేసవిలో మనకు దాహం వేస్తే నీరు తెచ్చుకుని త్రాగుతాము. మరి మొక్కలు అలా నడిచి వెళ్లి నీటిని త్రాగలేవు కదా.. ఎవరైనా మనుషులు నీరు పోస్తే, వర్షం వస్తే వాటి దాహం తీరుతుంది.
ఇన్ని కష్టాలు ఉన్నా కూడా పశుపక్ష్యాదులు జీవిస్తున్నాయి. మరి, మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి?
..............
తల్లి తమ పిల్లలను చిన్నతనం నుంచి జాగ్రత్తగా పెంచుకుని చక్కటి పౌరులుగా తయారుచేస్తే సమాజం ఎంతో బాగుంటుంది.
అయితే, ఈ మధ్య కొందరు స్త్రీల ఆలోచనలో తేడా వచ్చింది. డబ్బు, విలాసజీవితం, కెరీర్.. అంటే వ్యామోహం ఎక్కువయ్యింది. పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇలాంటి వారికి పుట్టడం ఆ పిల్లల దురదృష్టం.
ఎవరికుటుంబాన్ని వారు చక్కదిద్దుకుంటే సమాజం అంతా బాగుంటుంది. అంతేకానీ, ఎవరి కుటుంబాన్ని వారు సరిగ్గా పట్టించుకునే సమయం లేనప్పుడు, సమాజాన్ని ఎవరు మాత్రం ఏం బాగుచేస్తారు?
స్త్రీలు బయటకెళ్లి ఉద్యోగం చేయటం వల్ల అనేకసమస్యలు కూడా ఉన్నాయి. అమ్మాయిలు చాలామందికి చదువు, ఉద్యోగం తో సమయం సరిపోక..ఇంటిపనులు, కుటుంబాన్ని చూసుకోవటం, సర్దుబాట్లు, కుటుంబసభ్యులతో లౌక్యంగా ఉంటూ జీవించటం..వంటివి తెలియటం లేదు. మనదేశంలో కూడా విడాకులు, అనేక వివాహాలు..ఎక్కువవుతున్నాయి.
ఎవరికైనా గొడవలు రావటానికి అంతులేని కోరికలు, డబ్బు గురించి అత్యాశ, ఆర్ధిక అవసరాలు, పెద్దవారివిషయాలు, పెద్దవారి అభిప్రాయాలు, పిల్లల పెంపకం, బంధువుల విషయాలు, కుటుంబసభ్యుల రోజువారి అలవాట్లు, భార్యాభర్త అక్రమసమంబంధాలు....వంటివాటి విషయంలో భార్యాభర్తకు గొడవలు వస్తాయి.
కాలేజీలో, ఆఫీసులోవారితో ఇలాంటి విషయాలు అంతగా ఉండవు కాబట్టి గొడవలు అంతగా ఉండవు. ఆఫీసుల్లో కెరీర్ సంబంధించిన గొడవలు ఉండవచ్చు కానీ, ఆఫీసుల్లో తోటి ఉద్యోగస్తులు అప్పుడప్పుడూ మారుతుంటారు, ఇంకా వారిని భరించలేకపోతే ఆ ఉద్యోగాన్ని వదిలేయవచ్చు.
ఎన్ని ఆఫీసులు మారినా ఎక్కడయినా అలాంటివారు ఉంటారు. అందువల్ల, ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా కొంత సర్దుబాటు ఎవరికైనా అవసరమే.
కాలేజీలో,హాస్టల్స్లో, ఆఫీసుల్లో.. తోటివారితో ఉండే పరిస్థితి వేరు..కుటుంబంలో పరిస్థితి వేరేగా ఉంటుంది. బయటవారితో గొడవలు వస్తే, వారితో దూరంగా ఉండవచ్చు. కుటుంబం అంటే జీవితాంతం నిలుపుకోవలసింది కాబట్టి, ఎన్నో విషయాల్లో చాకచక్యంగా సర్దుకోవాలి. బయటవారితో ఎక్కువ విషయాలతో సంబంధం ఉండదు కాబట్టి, గొడవలు తక్కువగా ఉంటాయి. బయట చాలామంది పైపైన మంచిగా ఉంటారు. చాలామంది ఇంట్లో వాళ్ళు పైపైన మంచిగా నటించరు కాబట్టి గొడవలు వస్తాయి.
స్త్రీలకు బయటకొస్తే ఎన్నో సమస్యలుంటాయి. లైంగికవేధింపులు కూడా ఉంటాయి. కొంతకాలం క్రిందట అమ్మాయిలకు, స్త్రీలకు వేరే స్కూల్స్, కాలేజీలు ఉండేవి. ఇప్పుడు కూడా అలా ఉంటే లైంగికవేధింపుల సమస్యలు తగ్గుతాయి. స్త్రీలు కొందరు కలిసి చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు వంటి సంస్థలు ఏర్పాటు చేసుకుంటే, రాత్రి వరకు బయట ఉండకుండా సాయంకాలమే ఇంటికెళ్లిపోయేటట్లు పనివేళలు పెట్టుకోవచ్చు.
అయితే కొందరు స్త్రీలు ఏమంటున్నారంటే, ఆడవాళ్లే ఇంటిపని, పిల్లల్నిపెంచటం.. చేయాలా? మేమూ బయటకెళ్లి ఉద్యోగాలు చేస్తున్నాము కాబట్టి, మగవాళ్లు కూడా అన్నీ చేయాలంటూ వాదిస్తారు. స్త్రీలే పిల్లల్ని ఎందుకు కనాలని కూడా అంటారేమో? అలా భార్యాభర్తలు గొడవలు పడి విడాకుల వరకూ వెళ్తున్నారు. మళ్లీమళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటారు. మధ్యలో పిల్లల పరిస్థితి అయోమయం అయిపోతుంది..
పాతకాలంలో కుటుంబం కొరకు సంపాదించటం భర్త పని అయితే, ఇంట్లో ఉండి ఇల్లుచక్కదిద్దుకోవటం, పిల్లల్ని పెంచటం ఎక్కువగా భార్య పనులుగా ఉండేవి. ఈ విధానంలో స్త్రీలకు పగలు కొంత విశ్రాంతి, పురుషులకు సాయంకాలం ఇంటికొచ్చాక విశ్రాంతి ఉండేది. ఇంటి ఆహారం వల్ల కుటుంబసభ్యులందరికీ ఆరోగ్యం బాగుండేది. ఈరోజుల్లో ఇద్దరూ బయటకెళ్లి పనిచేయటం వల్ల ఎవరికీ విశ్రాంతి లభించటం లేదు. ఈ రోజుల్లో హడావిడిగా ఏదో ఇంత నోట్లోవేసుకుని పరిగెడుతున్నారు.
స్త్రీలు ఉద్యోగాలు చేయటం వచ్చాక.. మాటలు కూడారాని చంటిపిల్లల్ని క్రెచ్లో వదిలి పనికి వెళ్ళటం జరుగుతోంది.. అక్కడ పిల్లల్ని సరిగ్గా చూస్తారో.. లేదో? తెలియదు. చంటిపిల్లలకు కనీసం మాటలు వచ్చే వరకయినా వారిని దగ్గరుండి పెంచుకోవాలి. ఈ రోజుల్లో స్త్రీలు, పురుషులు అందరూ సంపాదిస్తున్నా కూడా డబ్బు చాలటం లేదంటున్నారు. ఎవరికీ ఏమీ చెప్పేటట్లు లేదు. ఎవరి కర్మ వారిది.దైవమే దిక్కు.
No comments:
Post a Comment