థాయ్ లాండ్ గుహలో చిక్కుకున్నవారు సురక్షితంగా రావటం ఎంతో అద్భుతమైన విషయం.
చీకట్లో, ఆహారం లభించని స్థితిలో,
ఎవరైనా రక్షిస్తారనే ఆశ అంతగా లేని పరిస్థితిలో, ఆ పిల్లలు అంత ధైర్యంగా ఉండటం ఎంతో గొప్ప విషయం.
వాళ్ల కోచ్ ధ్యానం నేర్పించటం వల్ల , పిల్లలు ధ్యానం తో శక్తిని పొందారని అంటున్నారు.
సహాయకబృందంలో ఒక వ్యక్తి మరణించటం బాధాకరం.
ఆ సంఘటన తరువాత, గుహలో ఎక్కువ ఆక్సిజన్ సిలిండర్లు అమర్చారట.
పిల్లలను రక్షించడానికి వెళ్లిన సహాయక బృందంలోని ఒక వ్యక్తి ఆక్సిజన్ అందక మృతి చెందినప్పుడు...
అలాంటి పరిస్థితిని ఆ పిల్లలు ఎలా తట్టుకున్నారో ఆశ్చర్యంగా ఉంది.
మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చేసిన ప్రార్ధనలు ఫలించాయి.
ప్రపంచంలో ఎన్నో దేశాలనుంచి వచ్చి సహాయాన్ని అందించినవారు గొప్పవారు.
వాన పెరగకపోవటం కూడా కలిసివచ్చింది.
టెక్నాలజీ చాలా సహాయపడింది.
మొత్తానికి ఒక అద్భుతం జరిగింది.
No comments:
Post a Comment