koodali

Friday, July 27, 2018

గురుపూర్ణిమ..




ఓం

 గురువులకు  వందనములు.


 ********** 

mari konni vishayaalu..

కొన్ని దేవాలయాలలో ఎన్నో ఉపాలయాలు ఉంటాయి. అందరు దేవతలను ప్రత్యేకంగా ప్రార్ధించుకుంటారు కొందరు. అలా ప్రార్ధించుకోవచ్చు. 

హడావిడిగా ఉన్నప్పుడు, శ్రీమాత శ్రీపరమాత్మ
అనుకుంటే ..అందరు దేవతలను ప్రార్ధించుకున్నట్లే.. అని నాకు అనిపిస్తుంది.. లేదంటే శ్రీపరమాత్మ అని ఒక్క నామముగా కూడా అనుకోవచ్చు.

   ........ 

భయాలు, సందేహాలు, బోలెడుపనులు, బోలెడు విధివిధానాలు లేకుండా సరళంగా దైవాన్ని ఆరాధించేటప్పుడు మరింత భక్తిగా ఆరాధించుకోవచ్చు. విధివిధానాల పట్ల ధ్యాస కన్నా, దైవము పట్ల ధ్యాస ముఖ్యం .. ప్రేమతో భక్తిగా ఆరాధించుకుంటే దైవము యొక్క అనుభవాలను పొందటం కూడా తెలుస్తుంది.

సృష్టి అంతటా దైవశక్తి ఉంటుంది. ప్రతి ఆత్మలో పరమాత్మ ఉంటారంటారు. మనలో కూడా పరమాత్మ ఉంటారు. రమణమహర్షి నేను..గురించి తెలుసుకోమన్నారు.

 ఆత్మకు ఏదీ అంటదంటారు. ఇలాంటప్పుడు చెడ్డమనిషి యొక్క ఆత్మలో కూడా పరమాత్మ శక్తి ఉంటుంది కావచ్చు. అయితే, చెడ్డపనులు చేసిన వ్యక్తికి శిక్ష తప్పదు. ఆ శిక్ష వల్ల ఆ మనిషి శరీరం, మనస్సు, బుద్ధి బాధను అనుభవించినా కూడా, ఆత్మకు అంటదు.

రాయిని, రప్పను, మొక్కను, మనిషిని, దేనినైనా .. దైవముగా నమ్మి గాఢమైన భక్తితో పూజిస్తే అందులోనుండి కూడా దైవము భక్తుని అనుగ్రహిస్తారంటారు.


No comments:

Post a Comment