ఏ మతమైనా దైవం అందరికీ దైవమే.
ఇంతకు ముందు టపాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలని వ్రాసాను. ఇలా వ్రాయటం తప్పే.
అలా వ్రాసినందుకు దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
విన్నకోట నరసింహా రావు గారు వ్రాసిన వ్యాఖ్యను చదివిన తరువాత నేను వ్రాసిన తప్పు తెలిసింది.
ఏసుక్రీస్తు సమాధి నుండి పునరుత్థానం చెందిన రోజు గుడ్ ఫ్రైడే కావచ్చు..అని అనుకున్నాను. అందుకే శుభాకాంక్షలు అని వ్రాసాను.
మరిన్ని వివరముల కొరకు అంతర్జాలంలో చదివితే, ఏసు ప్రభువును శిలువ వేయటం జరిగిన రోజు శుక్రవారం అని, సమాధి నుండి పునరుత్థానం జరిగిన రోజు ఈస్టర్ ఆదివారం అని తెలుస్తోంది.. .
.కొన్నిదేశాలలో గుడ్ ఫ్రైడే ను వేరే పేర్లతో కూడా పిలుస్తారని తెలుస్తోంది.
ఉదా.."Big Friday" అని కూడా అనవచ్చేమో? అనిపిస్తోంది.( నాకు అర్ధమయినంతలో..)..
ఏసు క్రీస్తును శిలువ వేయటం అత్యంత బాధాకరమైన సంఘటన. మరి అలాంటి రోజును గుడ్ ఫ్రైడే అని అనటం సరిగ్గా అనిపించటం లేదు.
ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడే అని కాకుండా వేరే పేరుతో అనటం సరైనదనిపిస్తోంది.
వ్రాసిన విషయాలలో ఏమైనా అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment