విష్ణుమూర్తి లోకరక్షణ కొరకు ఎన్నో అవతారాలను ధరించారంటారు.
శివుడు లోకరక్షణ కొరకు హాలాహలాన్ని కంఠంలో నిలిపారని అంటారు.
ఈ విషయాలను గమనిస్తే, దైవం లోకరక్షణ కొరకు ఎన్ని చేసారో తెలుస్తుంది.
అయితే, చాలామంది మనుషులు చేస్తున్నదేమిటి ?
లోకరక్షణ మాట అటుంచి తమ స్వలాభం కోసం లోకాన్ని కష్టపెడుతున్నారు.
తమ అంతులేని కోరికల కొరకు పర్యావరణం పాడు అవుతున్నా పట్టించుకోవటం లేదు.
మనుషుల అంతులేని కోరికల కోసం ఎన్నో మూగజీవాలు బలైపోతున్నాయి.
సాటి మనుషులు పేదరికంలో మగ్గుతున్నా కూడా, తాము మాత్రం విలాసాల కోసం అంతులేని సంపదను పోగేసుకుంటున్నారు.
ఇప్పుడు సమాజాన్ని గమనించితే, చాలామంది ఎన్నో పాపాలు చేస్తూ, తాము చేసిన పాపాలను క్షమించాలని దైవాన్ని కోరుతూ, పాపప్రక్షాళన కోసం పూజలు చేస్తున్నారు.
ఎవరైనా తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి, తమ స్వార్ధాన్ని తగ్గించుకుని, ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి. అలాంటప్పుడు దైవకృపను పొందే అవకాశం ఉంది. చేసిన పాపాలకు పడే శిక్ష తగ్గే అవకాశం ఉంది.
అంతేకానీ, మళ్ళీమళ్ళీ పాపాలు చేస్తూనే తమ పాపాలను క్షమించాలని కోరుకోవటం సరైనది కాదు.
No comments:
Post a Comment