శ్రీ ఆంజనేయ స్వామికి నమస్కారములు.
రామాయణము , మహా భారతము ఎంతో గొప్ప గ్రంధములు. మన పురాణములు, ఇతిహాసముల ద్వారా మనము ఎన్నోవిషయములను నేర్చుకోవచ్చును. విష్ణుమూర్తి ధరించిన అవతారముల ద్వారా సృష్టి యొక్క పరిణామక్రమము , దానియొక్క లక్షణములను కూడా తెలుసుకోవచ్చునని పెద్దలు చెబుతున్నారు.
ఉదాహరణకు మత్శ్యావతారము ...... భూమిపైన మొదటి దశ అయిన నీరు మాత్రమే ఉన్న దశకు, కూర్మావతారము ..... కూర్మము నీటిలోను, నేలమీదజీవించే జీవి కాబట్టి ,అలాంటి దశకు సంకేతముగాను ఇలా చెప్పవచ్చునట. రామాయణములో ఎన్నో సామాజికసందేశాలున్నాయి.
ఇక సీతా రాములు అంత అవతార మూర్తులైనా ఎందుకు ఇన్ని కష్టములను అనుభవించారో అనిమనకు అనిపిస్తుంది.
ఒకసారి దేవతలకు, రాక్షసులకు మద్య యుధ్ధం జరిగిందట. అప్పుడు కొంతమంది రాక్షసులు భృగుమహర్షి యొక్క భార్యను శరణు వేడారట. అప్పుడు ఆమె వారికి అభయాన్ని ఇచ్చిందట. ఆ సమయములో లోకహితంకోసం శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడు భృగు పత్నిని సం హరించి ఆ తరువాత రాక్షసులను సం హరించవలసి వచ్చింది. . .
ఆతరువాత భృగు మహర్షి భార్యను తన తపశ్శక్తితో బ్రతికించి ఆ కోపములో శ్రీ మహావిష్ణువును శపించారు. కొంతకాలంభార్యా వియోగం అనుభవించాలని. అప్పుడు విష్ణుమూర్తి త్రేతాయుగములో అది జరుగగలదని తెలియచేసారట.
ఆవిధముగా సీతాపహరణం, సీతాదేవిని అడవులకు పంపించుట ద్వారా ఆ శాపాన్ని వారు అనుభవించారు. లోక క్షేమంకొరకు సీతారాములు ఆ కష్టములను భరించారు.
అసలు రావణాసురుడు కూడా వైకుంఠములోని ద్వారపాలకులయినజయవిజయులలో ఒకరే . గొప్ప విష్ణు భక్తులు. శాపవశాత్తు వారు రావణునిగా జన్మించారు.
సీతాదేవిని రక్షించేక్రమములో రాముల వారు ఎంతోమంది రాక్షసులను సం హరించారు. అప్పుడు జరిగిన యుధ్ధం వల్లనే రావణాసునితోపాటు ఆయన అనుచరులయిన ఎంతోమంది రాక్షసులను చంపివేయగలిగారు.
సీతాదేవిని అన్వేషించే కాలంలోఎంతోమంది భక్తులను, మంచివారిని కూడా ఉధ్ధరించారు.. ఉదాహరణకు అహల్యాశాపం విషయములో .......... భవిష్యత్తులో విష్ణుమూర్తి అవతారం ధరించివచ్చిన పిమ్మట ఆమెకు శాపవిమోచనం కలుగుతుందని తెలపడం ద్వారా ఈ సంఘటనలన్నీ ముందే ఒక ప్రణాళిక ప్రకారం జరుపబడ్డాయని మనము తెలుసుకోవచ్చు. .
ఇక ...
ఆంజనేయస్వామిఆయన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా
తక్కువే . అంత గొప్ప పాత్ర ఆయనది. ఆయన ద్వారా
దాస్యభక్తి, ఇంకా ఇలాంటిఎన్నో గొప్ప విషయములు
మనము తెలుసుకోవచ్చు. గొప్ప భక్తి వల్ల భగవంతుని దయ
పొందవచ్చని శబరి పాత్ర ద్వారామనము తెలుసుకోవచ్చు.జటాయువు
ఇలా ఎన్నో గొప్ప పాత్రలు........
లోకంలో ఉండే రకరకముల వ్యక్తుల మనస్తత్వమూ, వారి ప్రవృత్తి, వాటి వల్ల జరిగే సంఘటనలు, పరిణామములు ....... ఇలా ఎన్నో మనకు తెలియని గొప్ప విషయములను పెద్దలు మనకు పురాణేతిహాసముల ద్వారా తెలియచేశారు...
.రాములవారు సీతాదేవిని అడవులకు పంపించిన తరువాత తాను రాజ్యాన్ని పాలించినా చాలా సాధారణ జీవితం గడుపుతూ సీతమ్మ వారి లాగే భోగాలు లేని సాధారణ జీవితాన్ని గడిపారు.
సీతారాములు ఆదర్శ దంపతులు. వారు అంత ధర్మమూర్తులు కాబట్టే వారి కుమారులు లవకుశులు చక్కగా రాజ్యాన్ని పాలించారు.
మరి , రావణుని సంతానం అలా అయ్యారు.
శ్రీ రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా కొంతమంది ఎంతో పరాక్రమవంతులు. వానరులు కూడా దేవాంశసంభూతులట.
సాధారణ దృష్టితో చూస్తే ఎంతో క్రూరులు, బలవంతులైన రాక్షసులు ఎక్కడ ? సామాన్య బలం కలిగిన వానరులు ఎక్కడ ?
ధర్మం అధర్మం పై విజయాన్ని సాధించిన కధ ఇది. .......
రామతత్వంరావణతత్వం పై విజయాన్ని సాధించిన కధ ఇది......
అందుకే రామాయణ పారాయణం ఎంతో శుభకరమని పెద్దలుతెలిపారు......
ఎవరికయినా జీవితములో కష్టములు వస్తే ఆత్మహత్యలకు పాల్పడటం లేక అధర్మాన్నిఆశ్రయించటం వంటి పనులు చేయకుండా, ఈ కధలను గుర్తు తెచ్చుకుని అంత గొప్పవాళ్ళే అన్ని కష్టాలుఅనుభవించారు మనమెంత అని ధైర్యము తెచ్చుకోవాలి.
వారు ధైర్య, సాహసములతో ధర్మంగా విజయాన్ని ఎలాసాధించారో మనమూ నేర్చుకోవాలి. ఎక్కడయినా, ఎప్పటికయినా ధర్మమే గెలుస్తుంది అని తెలుసుకోవచ్చు.
అంతా ఆ భగవంతుని దయ..............

దేశం యువత ఇప్పుడు నవత వైపు అడుగులేస్తోంది. సొమ్ము సుఖం తప్పించి మరేం కనపడటం లేదు. ఇందుకు ఆడా మగా తేడా లేదు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.
ReplyDeleteనిజమేనండి, మీరన్నట్లు ... దేశం యువత ఇప్పుడు నవత వైపు అడుగులేస్తోంది. సొమ్ము సుఖం తప్పించి మరేం కనపడటం లేదు. ఇందుకు ఆడా మగా తేడా లేదు.
మార్పు రావాలని ఆశించటం తప్ప ఏం చేయగలం . అనిపిస్తోంది.