koodali

Monday, September 16, 2013

తెలుగు వాళ్ళు .......


ప్పడు  తెలుగువాళ్ళంటే .... మనలో  మనమే  తిట్టుకుని,  కొట్టుకునే  వాళ్ళంగా    ప్రపంచమంతటా   చాలామందికి  పరిచయమే  కానీ,   ఒకప్పుడు , 

శాతవాహనులు, పల్లవులు,  విజయనగర  పాలకులు,  కాకతీయులు ,  ....  వంటి  ఎందరో  రాజుల  వల్ల   తెలుగు  వారి  గొప్పదనం  ఎందరికో తెలుసు. 
.........................

తెలుగు వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. ఈ దేశ రాజకీయ, ఆర్ధిక, ఇంకా ఎన్నో రంగాల్లో వాళ్ళు ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నారు. 

 మనం ఇతరులకు చెప్పే స్థాయిలో ఉండాలేకానీ ,  ఇతరులతో చెప్పించుకునే స్థాయికి పడిపోరాదు.

ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం యొక్క ప్రభావం దేశం పైన ఎంతో ఉంటుంది.


ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఎంతో గొప్పదిగా ఉండాలి. ఆవేశముతో కాకుండా ఆలోచించి విజ్ఞతగా నిర్ణయాన్ని తీసుకోవలసిన సమయమిది.

మనం ఎంతో తెలివిగలవాళ్ళమేకానీ, మన భాషను, సంస్కృతిని అంతగా గౌరవించని బలహీనత ఒకటి మనకు ఉంది. ఉదా........ఇద్దరు తెలుగువాళ్ళు ఎదురుపడితే ఇతర భాషలో మాట్లాడుకుంటారు.


ఇక్కడ ఒక కధ........ 


పీతలను ఇతర  ప్రాంతాలకు ఎగుమతి చేసే వ్యాపారి ఒకరు ఉన్నారు. ఆయన దగ్గర  పనిచేసేవారు ఒకసారి   పీతలు ఉన్న  పెట్టెలను  లారీలో ఎక్కిస్తున్నారట. 

 అందులో కొన్ని పెట్టెలకు మూతలు వేసి లేవట.

ఆ వ్యాపారి కంగారుపడి పనివాళ్ళతో అదేమిటి  ?  మూతలు వెయ్యకపోతే అవి పైకి  పారిపోతాయి కదా !  అని కోప్పడితే వాళ్ళేమన్నారంటే,


అవి తెలుగు పీతలు సార్  ! ఒకటి పైకి రావటానికి ప్రయత్నించినా ఇంకొకటి వెంటనే క్రిందకు లాగేస్తుంది. అందుకే మూతలు పెట్టలేదు.

 అవి పైకి వెళ్ళి తప్పించుకుంటాయన్న భయం వద్దు. అన్నారట. మన గురించి   ప్రపంచానికి  ఇలా   తెలుసుకదా !

రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో ?



2 comments:

  1. అవి తెలుగు పీతలు సార్ ! ఒకటి పైకి రావటానికి ప్రయత్నించినా ఇంకొకటి వెంటనే క్రిందకు లాగేస్తుంది. అందుకే మూతలు పెట్టలేదు.
    So true

    ReplyDelete
  2. నిజమేనండి, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.

    ReplyDelete