koodali

Wednesday, September 11, 2013

భారతదేశం పేదదేశం కాదు. భారతీయులే ( కొందరు ) పేదవారు...


.దేవాలయాలలో  భక్తులు  సమర్పించిన  బంగారం  గురించి  ఆరాలు  తీస్తున్నారని  ఈ  మధ్య  వార్తలు  వచ్చాయి.   ఎందుకో  ? తెలియదు.

...............................

ఈ  దేశంలో  ఎంతో  సంపద  ఉంది  కాబట్టే  విదేశీయులు  ఎందరో  ఇక్కడ  వ్యాపారం  చేయటానికి   ఆసక్తిని  చూపించారు,   చూపిస్తున్నారు.

........................................

ఈ  దేశంలో  విస్తారమైన  వనరులు   ఉన్నాయి.  అపారమైన  సూర్యరశ్మి  ఉంది.    గలగల  పారే  నదీనదాలు  ఉన్నాయి.  చక్కటి  వాతావరణం  ఉంది.

 ఇన్ని  ఉన్నా  కూడా   దేశంలో  ఇంకా   పేదరికం  ఉందంటే    ప్రజల  చేతగానితనం  వల్లనే.


స్వాతంత్ర్యం  వచ్చి  ఎంతో  కాలం  గడిచినా  కూడా   ఎక్కడిసమస్యలు  అక్కడే  ఉన్నాయి.


కొందరు  ప్రజలలో  స్వార్ధం ,  బద్ధకం,  అత్యాశ  వంటి  దుర్లక్షణాలు  పెరగటం ,   నైతికవిలువలు  తగ్గిపోవటం  వల్ల    దేశంలో  ఎన్నో  సమస్యలు  వస్తున్నాయి.


  పేదరికం  పెరిగిపోవటానికి   అనేక  కారణాలున్నాయి.   సంపద  కొందరి  వద్ద  మాత్రమే   ప్రొగుపడటం   అనేది   పేదరికం  పెరిగిపోవటానికి    ఒక  ముఖ్య  కారణం.
 

సంపద  కొద్దిమంది  వద్ద  మాత్రమే  ఉండకుండా ,   అందరి  వద్దా  ఉన్నప్పుడు    సమాజంలో  పేదరికం   తగ్గుతుంది.

 ఈ  దేశంలో    ఎందరో  ధనికులు    ఉన్నారు.   కొందరు  ధనికులు  సంపదను  విదేశాలకు  తరలించి  దాచుకుంటున్నారు. 


అలా  దాచిన  లక్షల
కోట్ల   సంపదను    తిరిగి  తెచ్చే  ప్రయత్నాలు  చేస్తే  దేశంలోని   ఆర్ధిక  సమస్యలు  చాలావరకు  పరిష్కారం  అవుతాయి  కదా  !   

 దేవాలయాల  సొమ్ము  గురించి  ఆరాలు  దేనికి  ?  దానిని  కూడా ......చేయటానికా ?
.....................................


కొద్దిమంది  వద్ద  మాత్రమే  సంపద  ప్రోగుపడుతుంటే ,  దేశం  నుంచి  సంపద  తరలివెళ్తుంటే ,  అవినీతి
  వ్యవహారాలకు  అడ్డుకట్ట  వేయకుంటే....  ఎన్ని  ప్రయత్నాలు  చేసినా    ఆర్ధిక  సమస్యలు  పరిష్కారం  కావటం  అసాధ్యం.
..........................................


ఇతరులను  మోసం  చేసి   కూడబెట్టిన  సొమ్ముతో   అన్నీ  కష్టాలే.  బ్రతికి  ఉన్నంతకాలం  ఆ  సంపదను  కూడబెట్టడానికి,  దాచటానికి  ఎంతో  కష్టపడాలి.  చచ్చిన  తరువాత   కూడా నరకబాధలను  అనుభవించాలి.  


తిరిగి    ఎక్కడో  పుడతారు.    క్రితం  జన్మలో  చేసిన  పాపాలకు  ఫలితంగా   కష్టాలను  అనుభవించాలి.  అప్పుడు  క్రితం  జన్మలో  కూడబెట్టిన  సొమ్ము  ఆదుకోదు  కదా  !


అధర్మబద్ధంగా  జీవించటం  వల్ల   తాత్కాలిక   సుఖాలు   వచ్చినా  కూడా    తరువాత   ఎన్నో    కష్టాలు   వచ్చే  అవకాశం  ఉంది.


ధర్మబద్ధంగా    జీవించటానికి   ప్రయత్నిస్తే   తాత్కాలిక  కష్టాలు  వచ్చినా  కూడా  శాశ్వతమైన  సుఖాలు  దక్కుతాయి.


ఇవన్నీ  భారతీయులకు  తెలియని  విషయాలు  కాదు.  ఆధునిక    జీవితాలలోని  ఆకర్షణలకు  లొంగిపోయి   అశ్రద్ధచేస్తున్నారు.




5 comments:

  1. నాటి గజనీ నుంచి నేటి పాలకులవరకు అందరూ దేవాలయాల సొమ్ము దోచుకుంటున్నవారే!

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి,
    కొందరు స్వదేశీయులు కూడా దేశ సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తున్నారు. ఇవన్నీ ఎంతో బాధను కలిగించే అంశాలు.

    ReplyDelete
  3. Annee nijaale...kaani okka maata

    INDIA IS NOT POOR COUNTRY ...POORLY
    MANAGED COUNTRY

    kaadantaaraa...?

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి,
    INDIA IS NOT POOR COUNTRY ...POORLY
    MANAGED COUNTRY.

    అయితే మనది ప్రజాస్వామ్య దేశం. అంటే ఇక్కడ ప్రజలే ప్రభువులు ?

    అందువల్ల దేశాన్ని బాగుచేయటానికి అందరూ కృషిచేయాలి.

    ReplyDelete
  5. Nijame...maname prabhuvulam. Mari 45 rojulugaa road meeda ghoshilluthunnaa ee prabhuvulni evaruu pattinchukoremi? Veella peruthoti delhi lo andalam ekkina aa prabhuvula matemiti? kachara lati oka durmargudu dorathanam chesthe anduku thala voggina prabhuvula sangathi? kodandaram reddy laati neechaathineechudu pillalaki prjaswamyam gurinchi chepthe? ...mussolini lati sonia democracy ani gonthu chinchukunte? Oka gujarathi, oka bihari, oka kashmiri oka aravathambi kalisi teluguthallini maanabhangam chesthe..? Telugu vaallanthaa kalisi veellaki nirbhaya chattam amalu chesi ...ade siksha vesthe.........appudu manam prajaswamyam lo vunnamani vennu thattukundam.

    ReplyDelete