ఉద్యమాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది పేదప్రజలే.
ప్రజల మధ్య విభేధాలు సృష్టించటం మాని, ప్రజా సమస్యలను పరిష్కరించమని ..... తాము ఎన్నుకున్న వారిని గట్టిగా అడిగితేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప.... విడిపోవటం వల్లో కలిసి ఉండటం వల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కావు.
ప్రజలు కొన్ని విషయాలను గ్రహించాలి .... నాయకులుగా చెలామణి అవుతున్నవారు ఏం చెప్పినా గొర్రెలలాగా తలలూపుతూ వారి వెంట నడిస్తే నష్టపోయేది ప్రజలే.
స్వాతంత్ర్యం వచ్చి ఎంతోకాలమైనా, ఫ్లోరైడ్ వంటి స్థానిక సమస్యలను కూడా పరిష్కరించకుండా , ప్రజల మధ్య విభేధాలు సృష్టించి, తాము మాత్రం సొమ్మును సంపాదించుకుంటున్నవారు నాయకులు కారు. ఇలాంటివారు జాతిని విడదీసిన వారుగా చరిత్రలో నిలిచిపోతారు తప్ప , నాయకులుగా నిలవరు.
నదీ జలాల పంపిణిలో అన్యాయం జరిగిందని , తమకు న్యాయం జరగాలంటే, సాటి తెలుగువారితో విడిపోవాలంటున్నారు కొందరు తెలుగువాళ్ళు.
అయితే, ఆంధ్రప్రదేశ్ కు ఎగువ రాష్ట్రాల వాళ్ళు ఎన్నో నీటి ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మన రాష్ట్రానికి రావలసిన నీటి సరఫరా గణనీయంగా తగ్గిపోతుంది.
మరి కృష్ణా, గోదావరి నీటి పంపకం విషయంలో ఇతరరాష్ట్రాల వల్ల మనకు న్యాయం జరగలేదనుకోండి .... ఇతర రాష్ట్రాల వాళ్ళతో విడిపోలేము కాబట్టి, కొత్త దేశమే కావాలి... అని అనలేము కదా !
తెలుగువాళ్ళు తమలో తాము గొడవలు పడటంలో ఉద్ధండులే కానీ, తమ న్యాయమైన హక్కుల కోసం ఇతరులతో మాట్లాడాలంటే మాత్రం ఎందుకూ పనికిరారు.
కుటుంబం అన్నాక కుటుంబసభ్యుల మధ్య ఎక్కువతక్కువలు ఉంటాయి. అలాగే అన్ని రాష్ట్రాలలోను ప్రాంతాల మధ్య తేడాలు ఉంటాయి. అవన్నీ చాకచక్యంగా సరిదిద్దేవారే గొప్పనాయకులు. అంతేకానీ నలుగురిలో గొడవలు పడుతూ తిట్టుకునేవారు చేతకానివారు.
ఏ సమస్యలనైనా చాతుర్యంగా పరిష్కరించుకునే నేర్పు ఉంటే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి.
తమిళులను చూడండి . వాళ్ళందరూ తెలివిగా తమ రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటారు. వాళ్ళకు మనకు ఉన్నట్లు విడదీసే నాయకులు లేరు.
తమిళనాడును విభజించాలి ... అని ఎవరో అంటే వాళ్ళ నాయకుడైన చిదంబరం గారికి చాలా కోపం వచ్చిందట. తమిళనాడు ఎప్పటికి విడిపోదు అన్నారట. ఎంతైనా తమిళుల తీరే వేరు.
తెలుగు వాళ్ళేమో తమలోతాము కొట్లాడుకుని నలుగురిలో పలుచన అవుతారు. ఓట్ల కోసం ఢిల్లీవాళ్ళు తెలుగువాళ్ళను వాడుకుంటున్నారు. తరువాత మనలను చులకనగా చూస్తున్నారు.
తమలో తాము గొడవలు పడేవారిని ఎవరూ గౌరవించకపోగా చిన్నచూపు చూస్తారు. అందుకే ఎప్పుడూ తెలుగు వాళ్ళకు బడ్జెట్ లో కూడా సరైన ప్రాధాన్యత లభించటం లేదు.
ఇప్పడు తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే , మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి ....అని ఇతరులను బ్రతిమాలుకుంటున్నారు. ఇతరులేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రోజుకొక విధంగా మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.
ప్రజాసమస్యలను సరిగ్గా పరిష్కరించకుండా.... ఎన్నో వాగ్ధానాలను గ్రుమ్మరిస్తూ అరచేతిలో స్వర్గాన్ని చూపించే వారి మాటలను గొర్రెలలా నమ్మే ప్రజలున్న సమాజంలో సమస్యలు వస్తూనే ఉంటాయి.
ప్రజలు విచక్షణతో ప్రవర్తించినప్పుడు సమస్యలు పరిష్కారమవుతాయి.
>>ప్రజలు కొన్ని విషయాలను గ్రహించాలి .... నాయకులుగా చెలామణి అవుతున్నవారు ఏం చెప్పినా గొర్రెలలాగా తలలూపుతూ వారి వెంట నడిస్తే నష్టపోయేది ప్రజలే.
ReplyDeleteఉద్యమాలు చేసే వారందరూ నాయకులు చెప్పేవి విని గొర్రెల్లా పోతున్నరనుకునే మీ అవగాహనరాహిత్యానికి .... వాక్యం పూర్తీ చెయ్యనవసరం లేదనుకుంటా.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteమీరన్నట్లు ప్రజలు చైతన్యవంతులు అయినట్లయితే ....
స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాలు గడిచినా దేశంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఎందుకు ఉన్నాయి ?
ఇంత పేదరికం ఎందుకు ఉంది ?
ఇన్ని ఆర్ధిక అసమానతలు ఎందుకు ఉన్నాయి ?
swtanthrayam vachinati nundi inkaa akkade vunnam anukovadm correct kadu manam chala mundhuku poyyam kani cheyalisndhi kuda vundhi
Deleteమీ సమాధానికి కృతజ్ఞతలండి.
Deleteప్రజలందరూ చైతిన్య వంతులని నేననటం లేదు.
ఉద్యమాలు చేసే వారందరూ గొర్రెల్లా వెళ్తున్నారని అర్థం వచ్చేలా రాసారని నేను అనుకుంటున్నాను. ఒక వేల మీ ఉద్దేశం అది కాదంటే నా వాక్య కూడా అర్థం లేనిది కాబట్టి చర్చ అనవసరం.
తెలుగులో ఒక వర్గం వారు తమకు అన్యాయం జరుగుతుందని దశాబ్దాలుగా అడుగుతున్నా చిమ కుట్టినట్లు కూడా ప్రతిస్పందించని తెలుగు జాతి ఒక గొప్ప జాతి ఎలా కాగలదు? ఎడవాల్సినప్పుడు ఏడవక అంతా అయిపోయాక ఏడిస్తే ఎం లాభం?
సరి దిద్దు
Delete>ఎడవాల్సినప్పుడు ఏడవక అంతా అయిపోయాక ఏడిస్తే ఎం లాభం?
ఎడవాల్సినప్పుడు ఏడవక అంతా అయిపోయాక ఒకే ఒక్క తెలుగు జాతి వర్గం ఏడిస్తే ఎం లాభం?
ChanduSeptember 25, 2013 at 7:55 PM
Deleteswtanthrayam vachinati nundi inkaa akkade vunnam anukovadm correct kadu manam chala mundhuku poyyam kani cheyalisndhi kuda vundhi
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ వంటి దేశాలు ఎంత త్వరగా ఎదిగాయో గమనిస్తే , మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి నత్తనడకతో సమానం.
Green Star
Deleteతెలుగులో ఒక వర్గం వారు తమకు అన్యాయం జరుగుతుందని దశాబ్దాలుగా అడుగుతున్నా చిమ కుట్టినట్లు కూడా ప్రతిస్పందించని తెలుగు జాతి ఒక గొప్ప జాతి ఎలా కాగలదు?
ఎడవాల్సినప్పుడు ఏడవక అంతా అయిపోయాక ఏడిస్తే ఎం లాభం?
....................
ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు చాలా ఉన్నాయండి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను చక్కగా అభివృద్ధి చేసినట్లయితే ఇప్పుడు ఈ సమస్యలు వచ్చేవి కాదు.
తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రజలు తమ ప్రతినిధులకు ఓట్లేస్తారు.
తమ ప్రాంతము అభివృద్ధి కాలేదంటే ... ప్రజలు తాము ఓట్లేసిన నాయకులను నిలదీయాలి గానీ సాటి ప్రజలను తప్పు పట్టటం ఎందుకు ?
మనం గమనిస్తే, తెలుగులో అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది.
తెలంగాణాలో ఎన్నో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమలో ఎన్నో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తర ఆంధ్రాలో ఎన్నో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. కోస్తాలో కూడా ఎన్నో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి.
కోస్తాలో వ్యవసాయం ఎక్కువ. అక్కడ పరిశ్రమలు లేవు. ఈ రోజుల్లో వ్యవసాయం వల్ల ఎక్కువ ఆదాయం రాదన్న విషయం అందరికి తెలిసిందే. ఇలా రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలలో ఎందరో పేద ప్రజలు ఉన్నారు.
ఇక్కడ మనము గమనించవలసిన మరో విషయమేమిటంటే ,
దేశంలో ఎన్నో వెనుకబడిన ప్రాంతాల ప్రజలలో పేదరికం ఉంది అయితే , వెనుకబడిన ప్రాంతాలలోని కొందరు పెట్టుబడిదారులు బాగా ధనవంతులే. వీళ్ళే ప్రజల జీవితాలను శాసితున్నారు.
ఈ దేశంలో సంపద కొందరి వద్ద మాత్రమే ప్రోగుపడి ఉంది. ఇదే అసలు సమస్య.
మీరన్నది నిజమేనండి , సీమాంధ్ర వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు . కాబట్టే ఎడవాల్సినప్పుడు ఏడవక అంతా అయిపోయాక ఏడుస్తున్నారు.
సీమాంధ్ర వాళ్ళు ఎక్కువ తెలివి గల వాళ్ళు అయితే రాజధానిని ఇంకొకరికి వదులుకుంటారా?
సీమాంధ్ర వాళ్ళు తెలివిగలవాళ్ళు అయితే తమ నగరాలనే అభివృద్ధి చేసుకునే వారు గానీ, తమ పెట్టుబడులన్నీ తమ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో పెడతారా ?
>> ప్రజలు తాము ఓట్లేసిన నాయకులను నిలదీయాలి గానీ సాటి ప్రజలను తప్పు పట్టటం ఎందుకు ?
Deleteఅంటే మీకు సమస్యపై పూర్తీ అవగాహన లేదన్న మాట. అభివృద్ధి జరగకపోవటానికి రెండు కారణాలు 1.నాయకుల బద్ధకం 2.నిధుల లేమి. నిధుల లేమి లో మళ్ళి రెండు 1.నిజంగానే నిధులు లేవు 2.ఉన్న నిధులను ఇంకేవ్వడో పట్టుకు పోవటం. తెలంగాణా వాదుల సమస్య ఆ రెండోది, అందుకే ఆ ఎత్తుకపోయినోల్లను తప్పు పడుతున్నారు. ఎత్తుకపోలేదు అని ఆ సాటి ప్రజలు నిరూపించుకోవాలి కాని నాకేం తెల్వద్ అని తప్పించుకోజూస్తే ఇక్కడ గోడ కట్టడానికి రెడి అయ్యింది.
హైదరాబాదు నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి అనేది చట్టం అని మీకు తెలుసా అసలు? ఆ చట్టం ఎప్పుడయినా అమలయ్యిందని చెప్పగలరా? పూర్తీ అవగాహన లేకుండా మాట్లాడ వద్దని మనవి.
Deleteదేశంలో ఎన్నో వెనుకబడిన ప్రాంతాల ప్రజలలో పేదరికం ఉంది అయితే , వెనుకబడిన ప్రాంతాలలోని కొందరు పెట్టుబడిదారులు బాగా ధనవంతులే. ఈ దేశంలో సంపద కొందరి వద్ద మాత్రమే ప్రోగుపడి ఉంది. ఇదే అసలు సమస్య.
నేను వ్రాసిన పై వాక్యాన్ని నిశితంగా గమనించితే వెనుకపడిన ప్రాంతాలు అలాగే ఉండిపోవటానికి అక్కడి ధనవంతులు కూడా ఎంతో కారణం అని తెలుస్తుంది.
ఉన్న నిధులను సాటి ప్రజలు ఎత్తుకుపోయారనే విషయంలో మీరు సీమాంధ్ర ప్రజలను అపార్ధం చేసుకున్నారు. మీరు ఉండే ప్రాంతములో కూడా కూడా ఎందరో ధనవంతులు ఉన్నారు. మీరు వాళ్ళలో కొందరిని ఎందుకు అనుమానించరు ?
సాటి ప్రజలు ఎత్తుకుపోవటమే నిజమయితే, హైదరాబాద్ లా అభివృద్ధి అయిన నగరం సీమాంధ్రలో లేదు కదా !
ఇరు ప్రాంతాలలోని కొందరు పెట్టుబడిదారుల వల్ల ఇరు ప్రాంతాల పేద ప్రజలు మోసపోయారనేది వాస్తవం.
సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సీమాంధ్రలోనే పెట్టి ఉంటే , సీమాంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేది.
అయితే, సీమాంధ్ర పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులను హైదరాబాద్ లోనే పెట్టారు. అందువల్ల ఇతర నగరాలు అభివృద్ధి చెందక రాజధానికి వలసలు విపరీతంగా పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు అప్పటి తెలంగాణా వారికి విడిపోవటమే ఇష్టమయినప్పుడు ... మాకు ఉమ్మడి రాజధాని వద్దు ... అని గట్టిగా తిరస్కరించి ఉండవలసింది.
తిరస్కరించకపోగా అప్పటి పెద్దమనుషులు మాకు ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాజధాని ఇష్టమే ... అని ఒప్పుకున్నాకే రాష్ట్రం ఏర్పడింది కదా !
ఉమ్మడి రాజధానిని ఒప్పుకున్న తరువాత ఉమ్మడి బాధ్యతలు తప్పవు . ఉమ్మడి రాజధానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారూ వస్తారు కదా !
ఉమ్మడి రాజధాని ఒప్పుకున్న తరువాత కూడా హైదరాబాదు నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి ..అనే చట్టం ఉన్నది అంటే..... ?
>>ఉన్న నిధులను సాటి ప్రజలు ఎత్తుకుపోయారనే విషయంలో మీరు సీమాంధ్ర ప్రజలను అపార్ధం చేసుకున్నారు.
Deleteపలు నివేదికలు, గవర్నమెంటు ఆర్డర్లు ఈ విషయాన్ని ద్రువపరిచాక ఇంకా అపార్థం అంటే ఎలా? అందుకే ఇక వీళ్ళతో వాదించటం లేదా మాట్లాడటం వృధా అని వారి దారి వారు చూసుకుంటున్నారు. మీకు ఇది వరకే చెప్పాను హైదరాబాదు నిధులు తెలంగాణాలోనే ఖర్చు పెట్టటం అనేది చట్టం, అది అమలు చేస్తున్నారా లేదా అన్నది మీకు తెలిసినదే. ఇక్కడ నష్టపోయింది నిధులు ఒక్కటే కాదు ఉద్యోగాలు, నీళ్ళు ఇంకా మరెన్నో.
>>హైదరాబాద్ లా అభివృద్ధి అయిన నగరం సీమాంధ్రలో లేదు కదా !
అంటే ఆంధ్ర ప్రదేశ్ లేనప్పుడు హైదరాబాదు అభివృద్ధి కాని ప్రదేశామా?
>>సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సీమాంధ్రలో పెట్టి ఉంటే , సీమాంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేది.
పెట్టుబడి దారులు వారికి లాభం ఉన్న చోటనే పెడతారు, అది కూడా అర్థం చేసుకోలేక పొతే ఎలా? హైటెక్ సిటి ఏ ఏలూరు లోనే కామారెడ్డి లోనే పెడితే ఎవడొస్తాడు?
>>ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు అప్పటి తెలంగాణా వారికి విడిపోవటమే ఇష్టమయినప్పుడు
అందుకే అన్నాను విషయం పూర్తిగా తెలుసుకొని వాదన మొదలు పెట్టమని. కొన్ని ఒప్పందాల ప్రకారం తెలంగాణా వాసులు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు ఒప్పుకున్నారు, ఆ ఒప్పందాలు ప్రతిపాదించినది కూడా సిమాంద్రులే, అసలు ఆ ఒప్పందాలే లేకుంటే ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ట్రమే లేదు. ఏరు దాటే దాక ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్లు ఆ ఒప్పందాలు సీమంద్ర్హులు ఉల్లంగించారు .. సింపుల్. ... ఆ తప్పులని సరిచేసుకోవటం సంగతి వదిలేసి అసలు ఉల్లంగానలే జరగలేదని బుకాయింపు. అలాంటప్పుడు తప్పు తెలంగాణా వాలది ఎలా అవుతుంది? అసలు తెలంగాణాను కలవమని తీర్మానం చేసిందే సీమండ్రులు, తిరిగి తెలంగానవాల్లను అంటే ఎలా?
>>ఉమ్మడి రాజధాని ఒప్పుకున్న తరువాత హైదరాబాదు నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి అనే చట్టం ఉన్నది అంటే , సీమాంధ్ర వాళ్ళు ఎంత తెలివి తక్కువ వారో మరింత స్పష్టంగా తెలుస్తోంది
అర్థం అయింది కదా, మొన్నెవరో అంతా అయిపోయాక సీమంద్ర నాయకులు ప్రతిపాదిస్తున్నారు .. పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేస్తాం, ముక్య మంత్రి పదవి 15ఏళ్ళు తెలంగాణా వారికిస్తాo అంటూ ..
http://bit.ly/16sLroj
>> హైదరాబాదు నిధులు తెలంగాణాలోనే ఖర్చు పెట్టటం అనేది చట్టం, అది అమలు చేస్తున్నారా లేదా అన్నది మీకు తెలిసినదే.
Deleteఉమ్మడి రాజధాని సీమాంధ్రలో పెట్టి ఆ నిధులను సీమాంధ్రకే వినియోగించాలి అని ... అంటే మీకు ఎలా అనిపిస్తుంది ?
ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. ప్రైవేట్ ఉద్యోగాల విషయంలో స్థానికత అంతగా పాటించరు . హైదరాబాద్ లో సీమాంధ్ర వారికన్నా ఇతర రాష్ట్రాల వాళ్ళే ఎక్కువ మంది ఉపాధిని పొందుతున్నారనిపిస్తుంది.
ఇక నీళ్ల విషయం గురించి ఇంతకు ముందు వ్యాఖ్యలలో వ్రాశాను.
>>అంటే ఆంధ్ర ప్రదేశ్ లేనప్పుడు హైదరాబాదు అభివృద్ధి కాని ప్రదేశామా?
పూర్వపు హైదరాబాద్ ఇప్పటి హైదరాబాద్ ఫోటోలను ప్రక్కప్రక్క చూస్తే తేడా మీకే తెలుస్తుంది.
>> హైటెక్ సిటి ఏ ఏలూరు లోనే కామారెడ్డి లోనే పెడితే ఎవడొస్తాడు?
ఏలూరు లోనే కామారెడ్డి లోనే రాజధాని ఉంటే అన్ని అక్కడికే వెళ్తాయి.
( రాజధాని ఎక్కడ ఉంటే అక్కడికే అన్నీ వెళ్ళాలి. అనే మన వాళ్ళ సిద్ధాంతం ప్రకారం..)
>> కొన్ని ఒప్పందాల ప్రకారం తెలంగాణా వాసులు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు ఒప్పుకున్నారు, ఆ ఒప్పందాలు ప్రతిపాదించినది కూడా సిమాంద్రులే,
సీమాంధ్ర ప్రజలు అమాయకులు .. అని నేనూ ఒప్పుకుంటున్నాను.
>>ఉమ్మడి రాజధాని సీమాంధ్రలో పెట్టి ఆ నిధులను సీమాంధ్రకే వినియోగించాలి అని ... అంటే మీకు ఎలా అనిపిస్తుంది ?
Deleteనాకు నచ్చకపోతే అసలు ఒప్పందాన్నే ఒప్పుకోను, అంతే కాని ముందొక మాట తరువాత ఒక మాట చెప్పి మోసం చెయ్యను. మరి సీమండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు? ఒప్పుకున్నాకా అనుభవించాలి, మావల్ల కాదు అంటే వాళ్ళ దారి వారు చూసుకోవాలి, ఇంత చిన్న విషయం అర్థం కాకపొతే ఎలా?
>>పూర్వపు హైదరాబాద్ ఇప్పటి హైదరాబాద్ ఫోటోలను ప్రక్కప్రక్క చూస్తే తేడా మీకే తెలుస్తుంది.
అంటే మీకు ప్రశ్నే అర్థం కాలేదని అనిపిస్తుంది, ఏ కాలానికి ఆ అభివృద్ధి ఉంటుంది ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? హైదరాబాదు స్తాయి పట్టణాలు ఆని అలానే అభివృద్ధి పొందాయి, అసలేమి లేకుండా ప్రస్తుతం అంతర్జాతీయ నగరంగా విరజిల్లుటే మీ వాదన సబబుగా ఉండేది.
>>ఏలూరు లోనే కామారెడ్డి లోనే రాజధాని ఉంటే అన్ని అక్కడికే వెళ్తాయి.
అలాంటప్పుడు మరి మిగిలిన రాష్ట్రాల రాజధానులు హైదరాబాదు స్తాయిలో ఎందుకు అభివృద్ధి చెందలేదు? మీ లెక్క ప్రకారం రాజధాని ఎక్కడ ఉంటె అక్కడ అభివృద్ధి చెందాలి, అంటే మన రాజదాని హైదరాబాదు కాకుండా ఏలూరు, కామారెడ్డి అయినా ప్రస్తుతం ఆ ఊళ్లు హైదరాబాదు స్తాయిలో అభివృద్ధి చెందేవి అంటున్నరుగా? గుజరాత్ మనకంటే బాగా అభివుర్ద్ది చెందుతుంది మరి వారి రాజదాని హైదరాబాదుకు సాటి వస్తుందా ?
>>సీమాంధ్ర ప్రజలు అమాయకులు .. అని నేనూ ఒప్పుకుంటున్నాను.
తెలంగాణా వాదులకు అలా అనిపించటం లేదు, వారు మోసగాళ్ళు అని అనుకుంటున్నారు. ఇచ్చిన మాట, చేసిన ఒప్పందాలను మరిచే వారు అనుకుంటున్నారు.
"మరి కృష్ణా, గోదావరి నీటి పంపకం విషయంలో ఇతరరాష్ట్రాల వల్ల మనకు న్యాయం జరగలేదనుకోండి .... ఇతర రాష్ట్రాల వాళ్ళతో విడిపోలేము కాబట్టి, కొత్త దేశమే కావాలి... అని అనలేము కదా ! "
ReplyDeleteవాటికి ట్రిబ్యూనల్సు ఉన్నాయి. ఒకే రాష్ట్రంలో వాటాల కేటాయింపుకు ట్రిబ్యూనల్సు ఉండవు
"ఏ సమస్యలనైనా చాతుర్యంగా పరిష్కరించుకునే నేర్పు ఉంటే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి"
57 ఏళ్ళు చూసాం, తెలంగాణకు ఏమీ ఒరగలేదు. ఇదేనా చాతుర్యత? ఎవరో నవ్వుతారు కాబట్టి న్యాయమయిన కోరికలు అడగడం మానేయాలా?
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteట్రిబ్యూనల్సు సంగతి అలా ఉంచండి.
ఎగువ రాష్ట్రాల వాళ్ళు ఎన్నో ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారని మనకు అన్యాయం జరుగుతోందని నేను మాత్రమే అనటం లేదు. మన వాళ్ళు ఎందరో అంటున్నారన్న సంగతిని మీరు గమనించాలి.
..........................
నిజమేనండి, సమస్యలను పరిష్కరించుకునే చాతుర్యం మనకు లేదు కాబోలు .... అనే నేనూ బాధపడుతున్నది.
hathaya lu chese vadu kuda court thirpu tharuvathaa naku anyam jarigindhi ane antaadu , nyamo anyamo telupalisindhi court lu tribunalse
Deleteఅన్యాయం జరిగిందని మనం అనటం కాదు, అందరూ అనాలి. కోర్టుల్లో కేసులు ఒక పట్టాన తేలటం లేదంటే అవతలి వారి వాదనల్లో కూడా న్యాయం ఉందని అర్థం చేసుకోవాలి, మన టివిలు మన పత్రికలూ మనకు అనుకూలంగా అవతలి వారికి వ్యతిరేకంగా రాయటం మామూలే. నేను దగ్గరగా పరిశీలించిన కేసు బాబ్లి లో మహా రాష్ట్ర వాదనలలో న్యాయం ఉంది.
Deleteమనకు నష్టం కలిగినంత మాత్రాన ఎల్ల వేళలా అది ఎదుటివాని తప్పు కాలేదు
నిజమే మీరన్నట్లు, ట్రిబ్యునల్స్ ఉన్నమాట నిజమే.
Deleteఅవి ఉన్నా కూడా మనకు నీటివాటాలో అన్యాయం జరిగిందంటున్నారు. ఆ విషయాన్ని మనం గమనించాలి.
అన్నంత మాత్రాన అదే నిజం కావాలని రూలు లేదు కదా,
Delete"నేను మాత్రమే అనటం లేదు. మన వాళ్ళు ఎందరో అంటున్నారన్న సంగతిని మీరు గమనించాలి"
Deleteఎందరు అన్నారన్నది అప్రస్తుతం, అసంబద్దం కూడా. విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా ఎవరెన్ని అన్నా ప్రయోజనం లేదు.
ఆలమట్టి డాం అక్రమమనీ, దానివల్ల మనకు తీరని నష్టమనీ ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరిగింది. ఈ వాడను ఉన్నత న్యాయస్తానం కొట్టేసింది. అయినా తగుదునమ్మా అంటూ అవే పిడివాదనలు ట్రిబ్యూనల్ ముందు పెడితే వాళ్ళూ మొట్టికాయలు వేసారు. అలాగే బభాలీ బారేజీ గురించి కూడా రకరకాల అనవసర ప్రసంగాలు చేసారు. అదీ న్యాయస్తానంలో చెల్లలేదు.
ఈ సత్యాలను విస్మరించి ఎగువ రాష్ట్రం వాళ్ళు అన్యాయం చేస్తున్నారంటూ అవే తిరస్కిరించబడ్డ పాచిపాటలను వల్లే వేయడం సబబు కాదు, paigaa దేశ సమగ్రతకు హానికరం.
నేను నదీజలాలు, నీటి పారుదల & వ్యవసాయం అనే విషయాలపై ఏడాది పాటు అధ్యయనం యొక్క సారాంశాన్ని నా బ్లాగులో ధారావాహికంగా వేస్తున్నాను. మీరు చదివి అనుమానాలు ఉంటె స్వయంగా అధ్యయనం చేసో లేదా అడిగో తెలుసుకోవలిసిందని మనవి. అంతేతప్ప ఎవరో స్వార్తపరులు చేసిన దుష్ప్రచారానికి లోబడి మరాఠీ & కన్నడ ప్రజలతో వైషమ్యాలకు తావునివ్వకండి.
దేశ సమగ్రతకు గురించి నాకు ఎంతో శ్రద్ధ ఉంది. పొరుగుదేశాల వాళ్ళు ఈ దేశాన్ని ముక్కలుగా చూడాలని కోరుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
Deleteఇలాంటప్పుడు ఒక రాష్ట్రంలో విభజన జరిగితే మిగతా వాళ్ళు కూడా తమ రాష్ట్రాలనూ విభజించమంటారు. దీనివల్ల దేశ సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందని చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటున్నారు.
ఈ విషయం గురించి కూడా మీరు ఆలోచించండి.
నేను ఆలమట్టి గురించి మాట్లాడలేదు. మరాఠీ & కన్నడ ప్రజలతో వైషమ్యాలకు నేను ఎంత మాత్రం తావు ఇవ్వను.
Deleteఅయితే ప్రకృతి సిద్ధంగా కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రప్రదేశ్ నుంచే సముద్రంలో కలుస్తాయి. మనకు రావలసిన న్యాయమైన వాటా అడగటంలో తప్పేమీ లేదు.
ఇతర రాష్ట్రాల ఆనకట్టల వల్ల మనకు అన్యాయం జరగటం లేదని మీరంటున్నారు.
అయితే, పైన ఆనకట్టలు కడుతుంటే తెలంగాణా జిల్లాల పొలాలు నీరందక ఎండిపోతున్నాయని,
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇతర రాష్ట్రాల ఆనకట్టల వల్ల భవిష్యత్తులో మనకు అన్యాయం జరుగుతుందని .... వార్తాపత్రికలలో వార్తలు వస్తున్నాయి కదా !
అలా వచ్చిన వార్తల ఆధారంగానే నేను వ్రాశాను. అయితే, ఆ వార్తలు తప్పంటారా ?
.......................................
మరికొన్ని విషయాలు.....
ప్రకృతి సిద్ధంగా కృష్ణా, గోదావరి నదులు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. నదులు ప్రవహించే మార్గంలో ఉన్న అందరికి ఆ నీటి వాటాలో భాగం ఉంటుంది.
అయితే ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రజలకు త్రాగటానికి నీరు చాలకపోయినా పరిశ్రమల కోసం నీటిని విపరీతంగా వాడుతున్నారు.
ఎక్కడి నీరు చాలక సముద్రంలో కూడా కలవకూడదంటున్నారు.
నదుల నీరు సముద్రంలో కలవటం అనేది ప్రకృతి ధర్మం.
ప్రకృతి ధర్మాలకు అడ్దుకట్టలు వేస్తే ఉత్తరాచల్లో ఏం జరిగిందో మనందరికి తెలుసు.
ఎక్కువ ఆనకట్టలు, ఎత్తిపోతల పధకాలను ఎక్కువగా కట్టకుడదు.
Deleteప్రజల మధ్య నీటి గొడవలు రాకుండా ఉండాలంటే దేశంలోని అన్ని నదీజలాలను జాతీయం చేయాలి. అప్పుడు మీరన్నట్లు అన్ని రాష్ట్రాల వారికి గొడవలు తగ్గుతాయి. దీనికి మీరు ఒప్పుకుంటారా ?
.
.........................................
Deleteనేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మీరు చాలాసార్లు ఏమన్నారంటే, నేను ఇతరరాష్ట్రాల వాళ్ళను ఏదో అన్నాను అంటున్నారు. నాకు ఇతరరాష్ట్రాల వాళ్ళంటే చాలా గౌరవం. నేను వాళ్ళను కించపరుస్తూ ఏమీ వ్రాయలేదు కదా !
హైదరాబాద్ లో ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇతరరాష్ట్రాల వాళ్ళంటే మీకు చాలా గౌరవం కదా !
అందువల్ల హైదరాబాద్ యుటీ చేసి ఇతరరాష్ట్రాల వాళ్ళతో పంచుకోవచ్చు కదా !
హైదరాబాద్ తెలంగాణాకు మాత్రమే చెందాలని ఎందుకు ఆడుగుతున్నారు ?
హైదరాబాద్ యుటీ చేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు పంచుకుంటే మీరన్నట్ళూ దేశసమగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది కదా !
భారత దేశం ఒక యూరప్ దేశం లాంటిది, వివిధ భాషల వాలందఱు త్వరలోనే కొట్టుక చచ్చి దేశం ముక్కలవుతుంది అని మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో బ్రిటిషు, అమెరిక వారు అన్నారని అప్పట్లో వార్తలు. అప్పటి ప్రధాని భాష ప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకం. పొరుగు దేశాల వారు అలా అన్నారని భయపడి మడి కట్టుకు కూర్చుని ఉంటె సీమండ్రులు మద్రాసులోనే ఉండే వారు. అది కూడా ఆలోచించండి.
Deleteఒక్క ఆంధ్ర రాష్ట్రం(మద్రాసు నుండి) ఏర్పడటం వలన భాషా రాష్ట్రాల డిమాండ్లు వచ్చి దేశం ముక్కలయ్యింది అని వాదిస్తే మీకు ఎలా అనిపిస్తుంది ? అదన్న మాట/
>>అలా వచ్చిన వార్తల ఆధారంగానే నేను వ్రాశాను. అయితే, ఆ వార్తలు తప్పంటారా ?
Deleteవాళ్ళ వర్షన్ స్టోరి కూడా వింటే తప్పో కాదో మీకే అర్థం అవుతుంది కదా?
>>అందువల్ల హైదరాబాద్ యుటీ చేసి ఇతరరాష్ట్రాల వాళ్ళతో పంచుకోవచ్చు కదా !
యుటీ చెయ్యకుండా కూడా పంచుకోవచ్చు కదా? ఏ మీరు బెంగుళూరు, ముంబై, చెన్నై వెళ్లి ఉంటానంటే ఎవరయినా వద్దన్నారా? యుటీ చెయ్యాల్సిన అవసరం ఏముంది? ఇతర రాష్ట్రాల ప్రజలకు హైదరాబాదులో ఎలాంటి సమస్య లేదే? సమస్య ఉన్నదల్ల హైదరాబాదులో లేని సీమంద్ర ప్రజలకు మాత్రమె.
Deleteఒక్క ఆంధ్ర రాష్ట్రం(మద్రాసు నుండి) ఏర్పడటం వలన భాషా రాష్ట్రాల డిమాండ్లు వచ్చి రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందువల్ల మంచే జరిగింది.
మాతృభాషలో పాలనా వ్యవహారాలు ఉండటం వల్ల ప్రజలకు సులభంగా అర్ధమవుతుంది.
>>మాతృభాషలో పాలనా వ్యవహారాలు ఉండటం వల్ల ప్రజలకు సులభంగా అర్ధమవుతుంది.
Deleteబహుశా మీరు ఈ కాలంలో లేరనుకుంటా. ఆంధ్ర ప్రదేశ లో(దేశంలో) అత్యధిక శాతం పరిపాలన ఆంగ్లంలో జరుగుతుందని మీకు తెలియదా?
హమ్మయ్య ! ఇతర రాష్ట్రాల వాళ్ళు కట్టే ఆనకట్టల వల్ల తెలంగాణాలో పొలాలకు ఎటువంటి నీటి సమస్య లేదని మీరు చెప్పటం సంతోషకరమైన విషయమే.
Delete...................
నిజమే యూటీ చెయ్యకుండా కూడా పంచుకోవచ్చు. అయితే చాలామందికి సాటి తెలుగువాళ్ళంటే పడదు కానీ, ఇతర రాష్ట్రాల వాళ్ళంటే ఎంతో అభిమానం కదా !
సీమాంధ్ర వాళ్ళు కలిసిమెలసి ఉండరు. ఇతర రాష్ట్రాల వాళ్ళు మాతో చక్కగా కలిసిపోయారు. అంటున్నారు కదా !
మరి ఇతరరాష్ట్రాల వాళ్ళతో స్నేహబంధం మరింత ధృఢపడాలంటే హైదరాబాద్ యూటీ చేయటం ద్వారా మీ స్నేహాన్ని మరింత పెంచుకోండి.
Deleteనేను ఈ కాలంలోనే ఉన్నా. అందుకే ఎందరో ప్రజలు ఆంగ్లంలో జరుగుతున్న పరిపాలన వల్ల పడుతున్న కష్టాలను చూస్తున్నాను.
ఆంగ్లం అర్ధం కాని అత్యధిక శాతం ప్రజలు ఆంగ్లం లో ఉన్న పరిపాలనా పత్రాలు అర్ధం కాక మోసకారుల చేతుల్లో మోసపోతున్నారు.
ఎందరో పిల్లలు ఆంగ్లంలో సరిగ్గా చదవలేక చదువులో వెనుకబడుతున్నారు.
కొందరు పిల్లలు చదువులు మానేస్తున్నారు.
>>మరి ఇతరరాష్ట్రాల వాళ్ళతో స్నేహబంధం మరింత ధృఢపడాలంటే
Deleteయూటీ చేస్తే స్నేహబంధం మరింత ధృఢపడుతుందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అదే నిజమయితే తిరుపతి, వైజాగ్ లను మొదట యుటి చేసి నిరుపించగలరా?
అసలు యుటి చెయ్యాలంటే హైదరాబాదు ప్రజల ఇష్టా ఇష్టాలతో అవసరం లేదా? నాకు తెలిసినంత వరకు హైదరాబాదు ప్రజలకు యుటి చెయ్యటం ఇష్టం లేదు, ఇంకేదుకు మరి ఈ గొడవ ?
>> అందుకే ఎందరో ప్రజలు ఆంగ్లంలో జరుగుతున్న పరిపాలన వల్ల పడుతున్న కష్టాలను చూస్తున్నాను.
Deleteఅంటే భాషా ప్రాతిపదిక పై రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే పరిపాలన సులభం అవుతుందని ఆయా రాష్ట్రాలు ఏర్పడకు ముందు చేసిన వాదన పస లేనిది అని నిరూపణ అయినది, అంటే భాష ప్రాతిపదిక రాష్ట్రాల వలన అనుకున్న పలితం రాలేదు, ప్రయోగం విఫలం అయ్యింది .
మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణాలో పరిపాలన చాల వరకు ఉర్దూ లోనే జరిగేది, అది ఆంగ్లం/తెలుగులోకి మారటం వలన ఆ ప్రాంత ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు.
అంటే భాషా ప్రాతిపదిక పై రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే పరిపాలన సులభం అవుతుందని ఆయా రాష్ట్రాలు ఏర్పడకు ముందు చేసిన వాదన పస లేనిది కాదు. ,
Deleteభాష ప్రాతిపదిక రాష్ట్రాల వలన అనుకున్న పలితం ఎందుకు రాలేదంటే , భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ, పాలనా వ్యవహారాలు మొదలైనవి ఆ రాష్ట్రానికి సంబంధించిన భాషలో జరగటం లేదు ,
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఆంగ్లంలోనే వ్యవహారాలు జరుగుతున్నాయి. తెలుగులో జరగటం లేదు.
తెలుగులో జరిగినప్పుడు చక్కటి ఫలితం కనిపిస్తుంది.
Deleteహైదరాబాద్ యూటీ చేయాలన్నది నాకూ ఇష్టం లేదు.
అయితే యూటీ చేయటం గురించి నేను ఎందుకు రాశానంటే,
Jai Gottimukkala గారు వ్రాసిన కొన్ని వ్యాఖ్యల వల్ల నేను అలా వ్రాసాను.
మీకు మరింత అర్ధం కావాలంటే, పై వ్యాఖ్యలను వివరంగా చదవండి.
"అలా వచ్చిన వార్తల ఆధారంగానే నేను వ్రాశాను"
Deleteబచావత్ కేటాయింపుల ప్రకారం మహారాష్ట్రకు 560 & కర్నాటకకు 700 TMC నీళ్ళు రావాలి. 1972-2008 మధ్య 36 నీటి సంవత్సరాలలో మహారాష్ట్ర ఒకెఒకసారి తన వాటా కంటే ఎక్కువ (563.5) వాడింది. కర్నాటక ఒక్క ఏడాది కూడా తన వాటా దాటలేదు. ఈ విషయాలు వార్తలలో ఎందుకు రావో ఆలోచించండి.
"మనకు రావలసిన న్యాయమైన వాటా అడగటంలో తప్పేమీ లేదు"
నిజమే. అయితే ఇతరుల న్యాయమయిన వాటాలను కూడా గౌరవించాలి.
"ప్రకృతి ధర్మాలకు అడ్దుకట్టలు వేస్తే ఉత్తరాచల్లో ఏం జరిగిందో మనందరికి తెలుసు."
ఉత్తరాంచల్ తెలంగాణా నైసర్గిక పరిస్తితులు వేరే. అన్నిటినీ ఒకే మూసలో వేయలేము
"ప్రజల మధ్య నీటి గొడవలు రాకుండా ఉండాలంటే దేశంలోని అన్ని నదీజలాలను జాతీయం చేయాలి"
ఇప్పుడు కూడా నదులు దేశ సంపదే (publici juris). ఈ "జాతీయం" వల్ల కొత్తగా వచ్చే లాభాలు ఏమిటో ఎవరూ చెప్పలేదు
"హమ్మయ్య ! ఇతర రాష్ట్రాల వాళ్ళు కట్టే ఆనకట్టల వల్ల తెలంగాణాలో పొలాలకు ఎటువంటి నీటి సమస్య లేదని మీరు చెప్పటం సంతోషకరమైన విషయమే"
తెలంగాణకు (ఆ మాటకు వస్తే రాయలసీమకు కూడా) న్యాయమయిన వాటా వచ్చిందా అనే ప్రశ్నకు జవాబు ఇంకా రాలేదు. ఈ విషయాన్ని నా బ్లాగులో పూర్తీ వివరాలతో రాస్తున్నాను.
"అయితే చాలామందికి సాటి తెలుగువాళ్ళంటే పడదు కానీ, ఇతర రాష్ట్రాల వాళ్ళంటే ఎంతో అభిమానం కదా"
మా న్యాయమయిన హక్కులను మన్నించిన వారు ఎవరయినా సహకరిస్తాము. హక్కులను కాలరాస్తే అసమదీయుడయినా నిలదీస్తాము అనే ఆలోచనా సరళి తప్పా?
>>తెలుగులో జరిగినప్పుడు చక్కటి ఫలితం కనిపిస్తుంది.
Deleteఇంకెప్పుడు చేసేది ? అరవై ఏళ్లుగా చెయ్యనిది ఇప్పుడు చేస్తే ఏమి లాభం, ప్రస్తుతం ఇంగ్లిషు ఇంచుమించుగా యువతకు అందరికి అర్థం అవుతుంది.
ఒకే భాషకు పలు రాష్ట్ర ఉండి వారి వారి భాషల్లో పాలనా సాగించుకోవచ్చు, సొంత భాషలో పాలన చెయ్యడానికి అందరూ ఒకే రాష్ట్రంలో ఉండనవసరం లేదు.
ఉమ్మడి రాజధాని ఒప్పుకున్న తరువాత కూడా హైదరాబాదు నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి ..అనే ఒప్పందానికి ఒప్పుకున్నారంటే తెలివితక్కువ వాళ్ళే కదండి.
Deleteసీమాంధ్ర వాళ్ళు ఎక్కువ తెలివి గల వాళ్ళు అయితే రాజధానిని ఇంకొకరికి వదులుకుంటారా?
సీమాంధ్ర వాళ్ళు తెలివిగలవాళ్ళు అయితే తమ నగరాలనే అభివృద్ధి చేసుకునే వారు గానీ, తమ పెట్టుబడులన్నీ తమ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో పెడతారా ?
...............................................
ఉత్తరాఖండ్ కు తెలంగాణా కు నైసర్గిక పరిస్తితులు వేరే కావచ్చు. నా అభిప్రాయం ఏ రాష్ట్రం వాళ్ళయినా నీటిని పొదుపుగా వాడుకోవాలని నా అభిప్రాయమండి.
జాతీయం అంటే ఇక్కడ నా అభిప్రాయం .... దేశంలోని నదీ జలాలపై అన్ని రాష్ట్రాలకు వాటాలను ఇవ్వటం.
>> మా న్యాయమయిన హక్కులను మన్నించిన వారు ఎవరయినా సహకరిస్తాము. హక్కులను కాలరాస్తే అసమదీయుడయినా నిలదీస్తాము అనే ఆలోచనా సరళి తప్పా?
ఈ విషయంలో మీరు పొరపాటు పడుతున్నారని అనుకుంటున్నాను. సీమాంధ్రకు చెందిన కొందరి వల్ల మీకు నష్టం కలిగిఉండవచ్చు. అంతమాత్రాన అందరినీ విడిపోమనటం న్యాయమేనా ?
అలా అనుకుంటే తెలంగాణాకే చెందిన కొందరు పెట్టుబడిదారుల వలన అక్కడి పేదప్రజలకు అన్యాయం జరగలేదంటారా ?
ఇక్కడ నా అభిప్రాయం ఇంగ్లీష్ వల్ల ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతి బాగా పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే క్రమంగా భారతీయ సంస్కృతి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అని.
Deleteఇంగ్లీష్ బాగా నేర్చుకుని పాశ్చాత్య సంస్కృతిని సమాజంలో వ్యాప్తి చేసిన కొందరి వల్ల ఏమాత్రం ఇంగ్లిషు రానివాడు క్లబ్బుకు వెళ్ళే పరిస్థితి వచ్చిందండి.
............................
"ఏ రాష్ట్రం వాళ్ళయినా నీటిని పొదుపుగా వాడుకోవాలని నా అభిప్రాయమండి"
Deleteనిజమే ఈ విషయం గురించి నేను రాయబోతున్నాను. (ఉ. వరి బదులు ఇతర పంటలు).
"జాతీయం అంటే ఇక్కడ నా అభిప్రాయం .... దేశంలోని నదీ జలాలపై అన్ని రాష్ట్రాలకు వాటాలను ఇవ్వటం"
ఇప్పుడు ఉన్నది కూడా అదేనండీ.
"సీమాంధ్రకు చెందిన కొందరి వల్ల మీకు నష్టం కలిగిఉండవచ్చు. అంతమాత్రాన అందరినీ విడిపోమనటం న్యాయమేనా ?"
నష్టం అంటూ జరిగాక నివారణ చర్యలు అత్యంత ముఖ్యం. విడిపోవడం వల్ల కొందరికి బాధ కలిగించవచ్చు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉంటూ నష్టాన్ని పెంచుకోవడం సబబు కాదు కదండీ.
"అలా అనుకుంటే తెలంగాణాకే చెందిన కొందరు పెట్టుబడిదారుల వలన అక్కడి పేదప్రజలకు అన్యాయం జరగలేదంటారా ?"
ఉండొచ్చు కానీ అది పరిష్కారం అయ్యేంతవరకు ఇతర నష్టాన్ని భర్తీ చేసుకుందాం
"జాతిని విడదీసిన వారుగా"
ReplyDeleteమాది తెలుగు జాతి కాదు మొర్రో అంటే వినరే? పైగా తోటి భారతీయులతో గొడవ పదాలని ఉర్రూతలు ఎందుకు?
మీరు తెలుగువారు కాదా ? అయితే ఈ విషయంలో మీకింత ఆసక్తి అనవసరమేమో..
Deleteనాకు తోటి భారతీయులంటే చాలా గౌరవం. వారితో గొడవలు పడాలని నాకేమీ లేదు.
అయితే, తెలుగువారు తోటి తెలుగువారితో గొడవలు పడాలని మాత్రమే ఎందుకు ఉర్రూతలూగుతున్నారనేదే అర్ధం కావటం లేదు.
ఇంకా, తెలుగువారు తమలోతాము గొడవపడి , తమ భవిష్యత్తును ఇతరుల చేతిలో పెట్టటము కూడా నాకు బాధను కలిగిస్తోంది.
mummatiki madhi telugu jathi kadu maa basha matrame telugu . memu godavalu padali ani anukovadam ledu oka admistrative block kavalani aduguthunnam maa participation vunde ... adhi kudaradu ani meeru antunnaru kanukane ee gharshanaa
Delete"మీరు తెలుగువారు కాదా"
Deleteనేను తెలుగు వాడినా కాదా అనే ప్రశ్న అనవసరం అనుకుంటా. ఒక భాషకు ఒక జాతి ఉండాలనే సిద్దాంతాన్ని మామీద రుద్దడం భావ్యమా? తెలంగాణాలో అన్ని భాషలు మాట్లాడే వారు అందరూ సమానమే అనే భావనతో ఉన్నారు. భాష పేరుతొ తెలుగు వారు, తెలుగేతరులు అని విభజించ వద్దని ప్రార్తన.
"నాకు తోటి భారతీయులంటే చాలా గౌరవం"
కర్నాటక, మహారాష్ట్ర రైతుల న్యాయమయిన నీటి వాటా గురించి, దాని మీద "తెలుగు" నాయకులు చేసిన రాద్దాంతం గురించి పైన రాసాను
"తెలుగువారు తోటి తెలుగువారితో గొడవలు"
ఇకపోతే తెలంగాణా వారికి "తెలుగు వారితో" గొడవలు లేవు. న్యాయమయిన వాటా అడగడం కూడా గొడవ ఎలా అవుతుంది?
"తమ భవిష్యత్తును ఇతరుల చేతిలో పెట్టటము"
ఆ "ఇతరులు" ఎవరు, భారతీయులు కారా? కేంద్రప్రభుత్వం తెలంగాణా ప్రజల న్యాయమయిన కోరికను మన్నించడం "ఇతరుల జోక్యం" ఎలా అవుతుంది?
మద్రాసు నుండి విడిపోవటానికి, ఆ తరువాత తెలంగాణతో కలవటానికి ఆ 'ఇతరులపై' నే ఆధారపద్దామని అంత సునాసయంగా మరిచితే ఎలా? మా భాష, మా జాతి అనుకుంటూ ఉన్మాదం తలకెక్కితే అది దేశ సమిక్యతకె ప్రమాదం.
Deleteచరిత్ర చూస్తే చాలా ఉంటుంది..
Deleteఅప్పటి రాజుల కాలంలో , భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు తమిళనాడులో మధురై తంజావూరు వంటి ప్రాంతాల అభివృద్ధిలో కూడా తెలుగు నాయక రాజుల పాత్ర ఎంతో ఉంది. అప్పటి తెలుగు వాళ్ళు ఎందరో ఇప్పటి తమిళనాడులో సెటిల్ అయి ఉన్నారు. ఉదా..వైగో, విజయకాంత్, కరుణానిధి వంటి వారి పూర్వీకులు తెలుగువాళ్ళేనట. ఇక మదరాసులో తెలుగు వారి పాత్ర గురించి చాలా మందికి తెలుసు.
మా భాష, మా జాతి అనుకుంటూ ఉన్మాదం ఉండకూడదు నిజమే. అయితే , మన భాష, మన సంస్కృతి అనే అభిమానం లేక మాతృభాషను వదిలి ఇంగ్లీష్ భాషే నేర్చుకుంటే తరతరాల సంస్కృతి మరుగున పడిపోతుంది.
>>మాతృభాషను వదిలి ఇంగ్లీష్ భాషే నేర్చుకుంటే తరతరాల సంస్కృతి మరుగున పడిపోతుంది.
Deleteపోనివ్వండి, ఇష్టం ఉన్నవాళ్ళే తమ సంస్కృతీ భాషనూ రక్షించుకుంటారు, అంతే కాని ఈ బలవంతం ఎందుకు?
పూర్వం సంస్కృతం ఒక్కటే భాష అనే వారు, దాని నుండే ఎన్నో భాషలు పుట్టాయి అంటారు. అలా కొత్త భాషలు పుట్టేటప్పుడు అయ్యో మా సంస్కృత భాష/జాతి నాశనం అవుతుంది అని ఏడిచి ఉంటె ఇన్ని భాషలు పుట్టేవా? కాలంతో పాటు మార్పులు అంగీకరించాలి, ముందుకు పోవాలి.
ఇంగ్లిషు అంటే మోజు అని మీరు అనుకోవచ్చు, కాని అది చాలామందికి అన్నం పెడుతున్న అవసరం అని కూడా అర్థం చేసుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురవ్వవు.
Deleteసంస్కృతం ఎక్కడికీ పోలేదండి. ఇప్పటికీ నిలిచే ఉంది. ఎన్నో కావ్యాలు , మంత్రాలు సంస్కృతంలోనే ఉన్నాయి కదా !
తెలుగు వంటి భాషల వల్ల మన సంస్కృతి, ఆచారవ్యవహారాలు అలాగే నిలిచిఉన్నాయి.
ఇంగ్లీష్ వల్ల మన సంస్కృతి, మాయమైపోయే పరిస్థితి వచ్చింది.
తరతరాల సంస్కృతి నాశనమైనా ఫరవాలేదు చాలామంది అన్నం తినటమే ముఖ్యం అనుకుంటే ఏం చెప్పగలం ?
సంస్కృతం ఒక్కటే ఉన్న రోజుల్లో ఉన్న సంస్కృతీ, ఇప్పుడు ఉన్న సంస్కృతీ ఒక్కటే అని మీరు అనుకుంటే ఇక వాదన అనవసరం.
Deleteఎన్నో కావ్యాలు, మంత్రాలు ఉన్ననూ ఎంత మందికి అర్థం అవుతున్నాయి? 0.1% కూడా ఉండరు, ఈ భాషలు లేనప్పుడు సంస్కృతం పరిస్తితి అది కాదు కదా?
ఇంగ్లిష్ మాట్లాడినంత మాత్రానా ఇక్కడ ఎవ్వరూ ఇంట్లో హిందుత్వాన్ని వదిలి క్రైస్తవం పుచ్చుకోవటం లేదు, అలానే తెల్లవాడు తెలుగులో మాట్లాడటం మొదలు పెట్టినంత మాత్రాన హిందుత్వం పుచ్చుకోడు, మాట్లాడే భాష మారినంత మాత్రాన సంస్కృతీ మారాదు. అలా మారేది ఉంటె విదేశాలకు వెళ్ళి అక్కడే దశాబ్దాలుగా ఉన్న వారు చాలామంది ఇంగ్లీషులోనే మాట్లాడినాను తమ సంస్కృతీ కాపాడుకుంటూనే ఉన్నారు.
మార్పు అనేది కాల చక్రంతో వస్తుంది, మార్పు ఒప్పుకోకపోతే అసలు తెలుగు భాషనే లేదు, ఈ సమస్యనే లేదు.
అయినా మీరు విషయాన్ని పక్క దారి పట్టించినట్లున్నారు. మన చర్చ ఇది కాదు. సంస్కృతీ సాంప్రదాయం, భాష గురించి మరింత చర్చించాలంటే మరో టపా వెయ్యండి, అక్కడ చర్చించుకోవచ్చు.
Deleteసంస్కృతానికి ఆదరణ తగ్గిపోవటం మన దురదృష్టం. అసలు సంస్కృతం మన దేశ భాష అయి ఉంటే ఎంతో బాగుండేది. జర్మనీలో కూడా కొందరు తమ ఇళ్ళలో సంస్కృతం మాట్లాడుకుంటారట.
మాట్లాడే భాష మారినంత మాత్రాన సంస్కృతీ తప్పకుండా మారుతుంది. దశాబ్దాలకు మారకపోయినా క్రమంగా రెండు మూడు తరాల తర్వాత సంస్కృతి తప్పకుండా మారుతుంది. మనదేశంలో చూడండి ఇంగ్లీష్ చదువుల వల్ల పాశ్చాత్య సంస్కృతి బాగా పెరిగింది కదా !
విషయాన్ని నేను పక్కదారి పట్టించలేదండి. అజ్ఞాత పేరుతో ఎవరో పక్కదారి పట్టించారు. మీరు కూడా దీని గురించి వ్యాఖ్యానిస్తున్నారు కదా ! భాష గురించి నేను పాత టపాలలో వివరంగా వ్రాశాను.
పాశ్చాత్య సంస్కృతి ఇంగ్లిషు మాట్లాడటం వల్లనే వచ్చింది అంటే మీ అవగాహన తప్పే అని నా అభిప్రాయం. ఏమాత్రం ఇంగ్లిషు రానివాడు క్లబ్బుకు వెళ్ళే వారు ఉన్నారు, ఇంగ్ల్హిష్ తప్ప మరే భాష రానివాడు (ముఖ్యమంత్రి కిరణ్ ) భారత సంస్కృతిని పాటిస్తున్న వారు ఉన్నారు. చెడు వ్యసనాలక్ భాషకు సంబంధం లేదు.
Deleteedupugottu, abhaddaalatho, visham, vidwesham kalisina telabanlu are in the class of LTTE or Tailban, but can not be called telugu
ReplyDeletesreerama
మీరు సీమాంధ్ర వాళ్ళు అనుకుంటున్నాను.
Deleteమీరు sreerama అని వ్రాయటం బాగుంది. కృతజ్ఞతలండి.
అయితే , తోటి తెలుగువాళ్ళయిన తెలంగాణా వారి పట్ల మీరు వాడిన పద జాలం వంటివి దయచేసి ఇక్కడ వ్రాయవద్దని కోరుకుంటున్నానండి.
mee drustilo telugu varu ante telanga vallu kuda vunnaranukuntaa memu ayethe prasthutham kendrham doranitho maa ఆత్మగౌరవాnike mi samasya ledu
ReplyDelete
Deleteమొదట మీరు కేంద్రం సహాయంతో ఎగువ రాష్ట్రాల వాళ్ళు ఆనకట్టలు కట్టకుండా ఆపించవచ్చుకదా !
వాళ్ళు తమ వాటాలోంచే కట్టుకున్నారండీ. న్యాయస్తానాలు నిర్ధారించిన ఈ వాస్తవాన్ని ఒప్పుకోవడం అందరికీ శ్రేయస్కరం.
Delete
Deleteమీరేమో పొరుగు రాష్ట్రాలతో మనకు నీటి సమస్యలు లేవని అంటున్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర, ఒడీసా నుంచి ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్నాము. అనే వార్తలు ఈ రోజు పేపర్లో వచ్చాయి కదా !
మీరు కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా పేపర్లు చదవలేదని అనుకుంటాను. అక్కడి వార్తలు మీరు చదివిన వార్తలకు భిన్నంగా ఉంటాయి మరి దేనిని నమ్ముదాం? అంతెందుకు జగన్ కేసుల విషయంలో సాక్షి కథనానికి ఆంధ్రజ్యోతి వార్తలకు పొంతే ఉండదు.
Delete'Telugu' anedi Jaati kaadu.... Bhaasha.
ReplyDeleteJaati anedi 'Bhoomi'ki leda, 'Jaateeya bhaavana' ku sambandhinchindi. Kaabatti manadi 'Bharata Jaati'.
Svaarthamto tama pabbam gadupukovaalanukone vaallu kotta kotta perlato 'Jaati' ani puttinchi, palusaarlu ade ani,ani, nijamani bhramimpa chestaaru. Telugu Jaati.. Urudu Jaati... Samskruta Jaati.... ivannee nonsense!!!
నిజమే! ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అమెరికా దేశాలలోని ప్రజలంతా ఇంగ్లిషే మాట్లాడుతారు. వాళ్ళందరినీ ఒక జాతి అనవచ్చా? వాళ్ళందరినీ "ఇంగ్లిష్ జాతి" అంటే ప్రపంచం నవ్విపోతుంది. ఫూలిష్ ... !
ReplyDelete
ReplyDeleteఅజ్ఞాతలందరికి కృతజ్ఞతలండి.
ప్రజలకు మాతృభాష అని ఉంటుంది.
ఉదా..తెలుగువారు ఇంగ్లీషులో మాట్లాడినా కూడా తెలుగువారి మాతృభాష తెలుగు. వారిని తెలుగు వారు అనే అంటారు గానీ, ఇంగ్లీష్ జాతి వాళ్ళు అనరు.
అలాగే ఆస్ట్రేలియాలో కొందరు ఇం గ్లీష్ మాట్లాడినా వాళ్ళను ఇంగ్లీష్ జాతి అనరు. వాళ్ళను ఆస్ట్రేలియన్స్ అనే అంటారు. అయినా అస్ట్రేలియాలో 400 భాషలు ఉన్నాయట.
ఇక ఇంగ్లండ్, వారి మాతృభాష ఇంగ్లీషే కాబట్టి వాళ్ళను ఇంగ్లీష్ వాళ్ళు అంటాము.
అమెరికా అనేక జాతుల వాళ్ళు వలస వచ్చిన దేశం. అక్కడకు ముందు వలస వచ్చిన వారిలో ఎక్కువమంది ఇంగ్లాండ్ వాళ్ళు.
అమెరికా వాళ్ళను ఇంగ్లీష్ వాళ్ళు అనము. అమెరికన్స్ అనే అంటాము కదా !
@ anrd
ReplyDeleteade nenu cheppedi. jaati anedi bhoomi leda desheeyamaina jaateeya bhaavana batti untundi. kaani bhaashanu batti kaadu. rendu praantaalanu oka raashtramga vileenam cheyyaalanna duraashato 20 va sataabhi poorvaarthamlo andhrulu srushtinchina asambaddha bhaavana - "telugu jaati".
జాతి అనేది దేశాన్ని బట్టి ఉన్నా కూడా .... ఇంకా ముఖ్యంగా భాషను బట్టి కూడా ఉంటుంది.
Deleteఉదా..మనము భారతీయులమే .
అయినా , భారత దేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళను తెలుగు జాతి అంటారు.
కన్నడం మాట్లాడే వాళ్ళను కన్నడిగులు అంటారు.
తమిళం మాట్లాడే వాళ్ళను తమిళులు అంటారు.
ఆంధ్రలో ఉన్న తెలుగేతరులు రెండో తరగతి పౌరులుగా బతకాలా? వారు తెలుగులో వారు కానంత మాత్రాన ఆంధ్రులు కాకుండా పోతారా? జాతి వేరే భాష వేరే.
Deleteమీరు టాపిక్ వేరే విధంగా డైవర్ట్ చేస్తున్నారు.
Deleteఆంధ్రలో ఉన్న తెలుగేతరులు రెండో తరగతి పౌరులుగా బతకాలని నేను ఎక్కడా అనలేదు.
మనం మాట్లాడుకుంటున్నది జాతి అనేది మాతృ భాష నుంచి కూడా వస్తుంది అని.
అమెరికా వెళ్ళిన తెలుగువాళ్ళు తాము భారతీయులం, తెలుగువాళ్ళం అని చెప్పుకుంటారు కదా !
తెలుగు వారందరూ ఒక జాతి అయితే ఆంధ్రలో ఉండే వారిలో స్వజాతీయులు & పరజాతీయులు అని రెండు బృందాలు ఏర్పడతాయి కాదంటారా? ఈ ప్రశ్న అడగడం టాపిక్ డైవర్టు కాదని మనవి.
Delete
Deleteతెలుగు మాతృభాషగా ఉండేవారిని తెలుగుజాతి అంటారని నా అభిప్రాయమని మనవి చేస్తున్నాను.
ఆంధ్రలో ఉండే వారిలో...అంటే వేరే అర్ధం వస్తుంది.
ఉదా.. తమిళులు ఆంధ్రలో ఉన్నా కూడా వారి మాతృ భాష తమిళం కాబట్టి తాము తమిళులము అనే చెప్పుకుంటారు. తమిళులు అమెరికాలో ఉన్నా కూడా తాము తమిళులమనే చెప్పుకుంటారు.
విడిపోవటానికి మీరు న్యామయిన కారణాలే చెప్తున్నా విడిపోవటం అనేది న్యాయంగా జరగటం లేదు, యెందుకని?
ReplyDeleteమీ న్యామయిన వాదనలతో అందరినీ ఒప్పించి ఒక బహిరంగమయిన రాజకీయ సమీకరణల తో కాకుండా కవ్హరా గారు నిన్ననే చెప్పినట్టుగా కొందరితో టచ్లో ఉండటం వల్లనూ, తెరాసని కాంగ్రెసులో కలిపేస్తాననే దిక్కుమాలిన ఒప్పందాలతోనూ సాధించుకోవాల్సీన్ దుస్తితిలో ఉన్నారు మీరు . తొమ్మిదేళ్ళ తర్వాత కూదా లక్ష అమందిని హైదరబాదుకి తీసుకు రావడానికి నువ్వింతమందిని నువ్వింతమందిని తీసుకురా, నేనింతమందిని తీసుకొస్తానని జనాన్ని వాటాలు పంచుతున్నాడు ఉద్యమనేత. యెందుకని?
రాష్త్ర ఆదాయంలో 40 శాతం ఆదాయాన్ని తెచ్చుకుంటున్న హైదరాబాదుని - తిన్నగా అది కావాలని అడిగితే విడిపోవటానికి యేకాభిప్రాయం అక్కరలేదని చెబుతున్న్నాయనే అంతర్జాతీయ న్యాయసూత్రాలు కూడా ముఖం మీద నవ్వుతాయి గాబట్టి - కిట్టించుకోవటానికి ప్రత్యేక రాష్ట్రోద్యమాన్ని మొదలు పెట్టిన మీరు పులుగడిగిన ముత్యాలా?
మీకు మీరు అప్పుడెప్పుదో జరిగాయని చెబుతున్న అన్యాయాల్తో యే సంబధమూ లేని సీమాంధ్రులని చల్ల మజ్జిగ లాంటి చెత్త మాటలతో తిట్టి ఆ అన్యాయాలకి కారణమైన కాంగ్రెసుతో - మీ నాయకుడికి అక్కద టచ్ విరగబడుతున్న సమయం లోనే ఇక్కడ అసెంబ్లీలో కికురె ఒక్క రూపాయి కూడా ఇవ్వను పొమ్మన్నా ఆత్మాభిమానం కూడా లేకుండా సర్దుకుపోయారు - ఇంకా అంటకాగటం సబబేనా?
మీకెవడు అన్యాయం చేశాడో పేరు చెప్పి తిడితే మేనూ ఒప్పుకుంటాం. కానీ అలా పేరు లేకుండా ఆంధ్రోళ్ళు అట్టాంటోళ్ళూ ఇట్టాంటోళ్ళూ అనటం న్యాయమేనా?
ayya anyaam chesevadu nenu eppudu anyam chesthunna ani oppukodu vadu oppukuntene mathrame neeku nyaam chestha andam murkathvam
Deleteనా ప్రశ్నకి ఇది కాదు జవాబు. ఒకడు మీకు అన్యాయం చేస్తున్నాదని రూఢిగా తెలిస్తే సాక్ష్యాధారాలు చూపించాల్సిన బాధ్యత మీదే.ఆ నేరం కోర్టుల పరిధిలో కొచ్చేదయితే కోర్టు పోలీసు శాఖకి అప్పగిస్తుంది ఆ పనిని. అలా కానప్పుడు ఆ బాధ్యత మీదే. అసలు వాడు ఒప్పుకోడు కాబట్టి కిక్కురు మనకుండా పడివుండే వేరే వాళ్ళని తిడతారా?
Deletekendhramu ane court dhaggari ke poyee memu nyaama thechukunnam anna ( malli cheputhunna vinu anyam cesevadni neevu anyamu chesthunavu ante vadu veenadu ) ... inkaa anyaam chesevadiki neerupinchalisin avasaram ledu rasta adayamulo 40 shatham vundhi antunnavau idhi kotha ga achindhi kadu bayya 1956 nundi idhe konasaguthundhi apudeppodo anyalu jarguthavlevanaa adhi ippdu kuda jarguthunnave మీకెవడు అన్యాయం చేశాడో పేరు చెప్పి తిడితే మేనూ ఒప్పుకుంటాం. కానీ అలా పేరు లేకుండా ఆంధ్రోళ్ళు అట్టాంటోళ్ళూ ఇట్టాంటోళ్ళూ అనటం న్యాయమేనా? idhi correct kadu eee vishaymulo nenu kuda ekibavisthanu
Deleteఒప్పందాలు జరిగినది తెలంగాణకు, సీమంద్రకు. ఒప్పందాల అమలులో ఉల్లంగనలు జరిగితే ఒక ప్రాంత్రం ఇంకో ప్రాంతాన్ని నిలదియోచ్చు, మహా రాస్త్రతో బాబ్లి గొడవ జరిగితే 'మహా రాష్ట్ర దుర్మార్గం' అంటాం, అంటే బాబ్లి కి సంబంధం లేని మహా రాష్ట్ర ప్రజలు కూడా అందులో వస్తారు, రాజకీయ పరిభాష అర్థం చేసుకోకపోతే మీకు చెప్పేది ఇంకేమి లేదు/
Delete>> రూఢిగా తెలిస్తే సాక్ష్యాధారాలు చూపించాల్సిన బాధ్యత మీదే.
Deleteఅయితే గిరగ్లాని కమిటి రిపోర్ట్ ఒక సరి చదువుకోండి, సరిపోతుంది. లేదా తెలంగాణా వాళ్లకు ఒక పది సంవత్సరాలు అధికారం ఇవ్వండి అన్ని బయటకు వస్తాయి.
@gree star good reply
Deleteమీరు శ్రీక్రృష్ణ కమిటీ రెపోర్టు మీద చర్చకి ఒప్పుకుంటే నేను గిర్గ్లాని రెపోర్టు చదువుతాను.
Deleteతప్పకుండా, చర్చకు భయపడేది ఏముంది?
Deleteఅయితే ఇక్కడ విచారించే విషయం ఏమిటంటే, మీరు గిర్గ్లాని రిపోర్టు చదవనేలేదు కాని తెలంగాణకు అన్యాయమే జరగలేదని వాదన మొదలు పెట్టారు.
గిర్గ్లాని రిపోర్టు కు ముందు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, వివిధ కమిటీలు, GO లు అన్ని చదివితే ... శ్రీ కృష్ణ కమిటి రిపోర్టు లో డొల్ల తనాలు మీకే అర్థం అవుతాయి, చర్చనే అవసరం లేదనుకుంటారు
"పూర్వపు హైదరాబాద్ ఇప్పటి హైదరాబాద్ ఫోటోలను ప్రక్కప్రక్క చూస్తే తేడా మీకే తెలుస్తుంది"
ReplyDeleteపూర్వపు హైదరాబాదు ఫోటోలను అదే కాలానికి చెందిన మదరాసు ఫోటోలకు పోల్చి చూడండి. తేడా కనిపిస్తే అప్పుడు చర్చిద్దాం. లేకపోతె 1957 నాటి పాట "ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం" వినండి. అప్పుడు మీకే తెలుస్తుంది.
ఇప్పటి హైదరాబాద్ లో , ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి.
Deleteఎన్నో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఉన్నాయి.
ఇవన్నీ పూర్వపు హైదరాబాద్ లో లేవు కదండి.
మదరాసు బెంగుళూరు పూణే నగరాలు కూడా అంతే కదండీ. ఆయా నగరాలకు వచ్చినట్టే హైదరాబాదుకు కూడా పెట్టుబడులు వచ్చాయి. నిజానికి 1956లొ దేశంలో ఐదో స్తానంలో ఉన్న హైదరాబాదు ఈనాడు ఆరో స్తానానికి పడింది.
Delete1956 నాటికి హైదరాబాదుకు దరిదాపుల్లలో లేని విశాఖ, బెజవాడ నగరాలు బాగానే పెరిగాయి. ఇప్పటికీ హైదరాబాదు కంటే చాలా వెనకాల ఉన్నా, అంతరం బాగా తగ్గింది.
"అలాగే అన్ని రాష్ట్రాలలోను ప్రాంతాల మధ్య తేడాలు ఉంటాయి" అని మీరే అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో మహానగరాలు లేనట్టే, ఆంధ్రలో కూడా లేవు. అనేక రాష్ట్రాలలో తీరప్రాంతం లేనట్టే తెలంగాణాలో కూడా లేదు. ఈ నిజాన్ని ఒప్పుకోవడం హైదరాబాదుపై కలలు కనడం కంటే మంచిది.
అయితే, మదరాసు బెంగుళూరు పూణే వాళ్ళు మా నగరాలు పూర్వమే అభివృద్ధి చెందాయి. అని చెప్పుకోవటం లేదు.
Deleteచేపుకోరు, ఎందుకంటే భారత స్వతంత్రం వచ్చినప్పుడు అవి అంతగా అభివృద్ధి చెంది లేవు కాబట్టి.
Deleteపూర్వపు హైదరాబాద్లో అభివృద్ధి గురించి , అప్పటి తెలుగువాళ్ళ పరిస్థితి గురించి , .... అప్పుడు ఉద్యమాలను చేసిన తెలుగు వాళ్ళను అడగండి చెబుతారు..
Deleteవల్లభభాయ్ పటేల్ గారు , ఎన్నో రాష్ట్రాలకు చెందిన మన వీర సైనికులు లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. హైదరాబాద్ తెలంగాణాలో కాదు... వేరే దేశంలో ఉండేది.
>> హైదరాబాద్ తెలంగాణాలో కాదు... వేరే దేశంలో ఉండేది.
Deleteఉండేదని ఎలా చెప్పగలరు?
అంటే భారత సైన్యం హైదరాబాదును ఆక్రమించినది సీమంద్రకు అప్పజేప్పతానికే లేక హైదరాబాదు ప్రజలకు స్వతంత్రం ఇచ్చి ఇండియా లో కలపతానికా?
వీలయితే మొదటి SRC సదవండి, హైదరాబాదు/తెలంగాణా ఆర్ధిక పరిస్తితి ఎలా బాగుందో, ఆంధ్ర రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి ఎలా కూలిపోవటానికి సిద్దంగా ఉందొ చాలా చక్కగా రాసారు. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా నిలబడటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం తెలంగాణాను కలపటం అని కుడా రాసారు.
"అయితే, మదరాసు బెంగుళూరు పూణే వాళ్ళు మా నగరాలు పూర్వమే అభివృద్ధి చెందాయి. అని చెప్పుకోవటం లేదు"
Deleteమేమూ ఇన్నాళ్ళు చెప్పుకోలేదు. అయితే ఈ మధ్యన "మేమే హైదరాబాదును అభివృద్ధి చేసాము. అంతకు ముందు ఏమీ లేదు" అని కొందరు స్వార్తపరులు ప్రచారం చేయడముతో బాటు సామాన్య ఆంద్ర ప్రజానీకం అమాయకంగా (గుడ్డిగా) నమ్మడం జరుగుతుంది. కతోరమయిన వాస్తవాలను గుర్తు చేయాల్సిన అవసరం అందుకే వచ్చింది .
Deleteమీరు ఏం చెప్పినా , ఇప్పటి హైదరాబాద్ లో , ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి.
ఎన్నో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఉమ్మడి రాజధానిగా ఉండబట్తే వచ్చాయి.
ఇవన్నీ పూర్వపు హైదరాబాద్ లో లేవు కదండి. అది అభివృద్ధి అని ఎలా అంటారు ?
మీరు చెబుతున్నవేవీ ఆకాలంలో దేశంలోనే లేవు. ఎ కాలానికి ఆ కాలంతోనే పోల్చాలాలి కదండీ.
Deleteఎ సంస్థ ఎక్కడ స్తాపించాలో అనే నిర్ణయం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక రాష్ట్రానికి రాజధాని అవడం అనేది ముఖ్యం కాదు. Please compare 1956 with 1956, not with 2013.
ఉ. పూణే, సూరత్, కాన్పూర్, ఇండోర్, కోచిన్, విశాఖ నగరాలు రాజధానులు కావు అయినా అభివృద్ధి చెందాయి. భోపాల్, లక్నో, త్రివేండ్రం నగరాలు రాజదానులే కానీ అంతగా ఎదగలేదు.
నేను పోల్చటం లేదండి.
Deleteహైదరాబాద్ పూర్వమే అభివృద్ధి చెందింది అంటూ.... 1956 నాటి అభివృద్ధిని 2013 తో పోలుస్తున్నారు కొందరు.
.......................
విశాఖ కూడా ఎక్కువ అభివృద్ధి చెందలేదండి. అందుకే అక్కడి యువత విద్య మరియు ఉపాధి కోసం హైదరాబాద్ వస్తుంటారు.
నా అభిప్రాయం ఏమిటంటే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందితే ఇతరప్రాంతాలకు వలసలు తగ్గుతాయు. అప్పుడు ప్రజల మధ్య గొడవలు తగ్గుతాయి.
..........................
గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ ... వాళ్ళు తెలివిగా తమ రాష్ట్రాల లోని ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారు.
తెలుగువాళ్ళేమో రాజధాని మాత్రమే ఎక్కువ అభివృద్ధి అయ్యేలా చేసుకుని ఇప్పుడు తీరికగా బాధపడుతున్నారు.
ReplyDeleteపూర్వపు హైదరాబాదు , అక్కడి ప్రజల పరిస్థితి అంత బాగుంటే అప్పటి ప్రజలు నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటాలు చేశారో అర్ధం కావటం లేదు.
అప్పటి హైదరాబాద్ ను తెలంగాణా అని కాకుండా , హైదరాబాద్ సంస్థానం అనే ప్రత్యేక రాజ్యంగా ఉండేదంటారు. ఈ సంస్థానంలో ఇప్పటి కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని భాగాలు కూడా కలిసి ఉండేవట.
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఏర్పడిన కొత్తలో ఆంధ్ర ప్రాంతాల నుంచి ఉద్యోగస్తులను రప్పించారని కొందరు అంటారు. ఎందుకంటే అప్పటి హైదరాబాద్ ప్రాంతంలో పరిస్థితి వల్ల అక్కడ ఎక్కువ మందికి ఇంగ్లీష్ వంటి చదువులు చదవటానికి అవకాశం ఉండేది కాదట.
ఆంధ్ర ప్రాంతము బ్రిటిష్ వారి పాలనలో ఉండేది కాబట్టి , అక్కడ ఇంగ్లీష్ వంటి చదువులు చదువుకున్నవారు ఎక్కువగా ఉండేవారట.
మీరన్నట్లు అప్పటి ఆంధ్ర ప్రాంతం ఆర్ధిక పరిస్తితి కూలిపోవటానికి సిద్దంగా ఉంది. అనుకున్నా కూడా .....అప్పటి ఆంధ్ర వాళ్ళు రాజధానిని తమ ప్రాంతానికి రావాలని, తద్వారా తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకోకుండా, హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా ఒప్పుకున్నారు.
ఇంకా, హైదరాబాదు నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి ... అని కూడా ఒప్పందాలు చేసారు.
ఇవన్నీ గమనిస్తే ఎన్నో విషయాలు అర్ధమవుతాయి.
amdariki కృతజ్ఞతలండి.
>> హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా ఒప్పుకున్నారు.
Deleteహైదరాబాదును రాజధాని చెయ్యమని తెలంగాణా వాళ్ళు డిమాండు చెయ్యలేదే, అసలు ప్రతిపాదిన్చిందే సీమండ్రులు కదా?
>>అక్కడి ప్రజల పరిస్థితి అంత బాగుంటే
ఎవరన్నారు అంతా బాగుందని? అందుకే పూర్తిగా విషయం తెలుసుకొని అప్పుడు చర్చ చెయ్యమని. నిజాం పాలన అంతం అయినాక, ఆంద్ర ప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాదు ఒక రాష్ట్రంగా కొన్ని సంవత్సరాలు ఉన్నది, అప్పటి పరిస్తితులు సరిగ్గా అర్థం చేసుకోవటానికి మొదటి SRC రిపోర్టు చదవమని అందుకే సలహా ఇచ్చాను.
>>హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఏర్పడిన కొత్తలో ఆంధ్ర ప్రాంతాల నుంచి ఉద్యోగస్తులను రప్పించారని కొందరు అంటారు.
హహహ, అదండీ మీ విషయ పరిజ్ఞానం. హైదరాబాదు ఉమ్మడి రాజధాని ఏర్పడినప్పుడు కాదు, నిజాం లోన్గిపోయినప్పుడు. అలా వచ్చిన వారు కూడా తాత్కాలిక ప్రాతిపదికనే, వచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో, కేంద్ర ఉద్యోగుల విషయంలో తెలంగాణా వాదులకు ఎలాంటి సమస్య ఎన్నడూ లేదు.
ఉమ్మడి రాజధాని గా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ వెంటనే చట్ట విరుద్దంగా 25౦౦౦ పైగా సీమంద్ర నుండి వచ్చిన ఉద్యోగులను తెలంగాణా వారు కనుక్కొని గొడవ చేస్తే వెనక్కి పంపటానికి GO36 వచ్చింది, అది కూడా అమలు అయ్యిందో లేదో దేవునికెరుక. అలా చట్ట ఉల్లంగనాలు రాష్ట్రం ఏర్పదినప్ప్పటి నుండే మొదలయ్యాయి, తప్పులన్నీ సీమండ్రులు చేసి అమాయకులుగా నటించటం వారికే చెల్లింది.
>> హైదరాబాదు నిధులు తెలంగాణకే ఖర్చు పెట్టాలి ... అని కూడా ఒప్పందాలు చేసారు.
ఒప్పందం చేస్తే ఆ మాట మీద నిలబడాలి కదా? మాట మీద నిలబడని మనిషిని ఏమనాలి?
>>ఇవన్నీ గమనిస్తే ఎన్నో విషయాలు అర్ధమవుతాయి.
కదా!! ఒప్పందాలా ఉల్లంఘనలలో సీమండ్రులు ఘనులని కూడా అర్థం అయ్యింది కదా!! సంతోషం
*.ఉమ్మడి రాజధాని సీమాంధ్రలో పెట్టి ఆ నిధులను సీమాంధ్రకే వినియోగించాలి అని ... అంటే మీకు ఎలా అనిపిస్తుంది ?
Delete* నాకు నచ్చకపోతే అసలు ఒప్పందాన్నే ఒప్పుకోను, అంతే కాని ముందొక మాట తరువాత ఒక మాట చెప్పి మోసం చెయ్యను. మరి సీమండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు? ఒప్పుకున్నాకా అనుభవించాలి, మావల్ల కాదు అంటే వాళ్ళ దారి వారు చూసుకోవాలి, ఇంత చిన్న విషయం అర్థం కాకపొతే ఎలా?
* హైదరాబాదును రాజధాని చెయ్యమని తెలంగాణా వాళ్ళు డిమాండు చెయ్యలేదే, అసలు ప్రతిపాదిన్చిందే సీమండ్రులు కదా?
*....పై వ్యాఖ్యలు చదివితే మనకు ఏం తెలుస్తుందంటే, సీమాంధ్రులు తెలివితక్కువగా ఒప్పందాలను చేసుకున్నారని తెలుస్తుంది.
తమకు నష్టం కలిగించే ఒప్పందాలను అమలుచేయలేక ఉల్లంఘించారు.
తెలివితక్కువ ఒప్పందాలను చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు.
"పూర్వపు హైదరాబాదు , అక్కడి ప్రజల పరిస్థితి అంత బాగుంటే అప్పటి ప్రజలు నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటాలు చేశారో అర్ధం కావటం లేదు"
Deleteఇంగ్లీషు వారు చక్కగా రైళ్ళు, రోడ్డులు, డెల్టా అనికట్టలు, కాలువలు వగైరాలు కట్టడంతో బాటు డిల్లీ, బొంబాయి, కలకత్తా, మదరాసు లాంటి నగరాలను ఎంతో అభివృద్ధి చేసినా మనం స్వాతంత్ర్యం కావాలని అడిగాము. ఇదీ అంతేనండీ
"తెలివితక్కువ ఒప్పందాలను చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు"
అమలు చేయలేనివి (లేదా చేసే ఉద్దేశ్యం లేనివి) ఒప్పుకోవడం వల్ల ఎన్నో ఏళ్ళు బ్రహ్మాండంగా లాభపడ్డారు. ఒప్పుకోకపోతే ఇది కూడా దొరికేది కాదు. ఇది నాణానికి రెండో వైపు.
ఇకపోతే తెలంగాణా వారు అడిగినవి గొంతెమ్మ కోరికలు కావని గమనించ ప్రార్తన. ఆంధ్రతో కలవకపోతే తమకు ఏవి దక్కేవో వాటిలో *కొన్ని మాత్రమె* అడిగారు.
>>తెలివితక్కువ ఒప్పందాలను చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు.
Deleteసరిపోయింది కదా, ఇంకా వాదనలెందుకు, ఎవడి సామాను వాడు సర్దుకొని ఎవని దారిలో వాడు పొతే ఈ గొడవలు ఎందుకు ఉంటాయి?
>>తమకు నష్టం కలిగించే ఒప్పందాలను అమలుచేయలేక ఉల్లంఘించారు.
ఎవ్వని ప్రాంతంలో వారు మాత్రమె ఉద్యోగాలు చేసుకోవాలి అనేది కూడా సీమంద్రులకు నష్టం కలిగించేదా? మాట్లాడేడి మీకయినా అర్థం అవుతుందా?
>>సరిపోయింది కదా, ఇంకా వాదనలెందుకు, ఎవడి సామాను వాడు సర్దుకొని ఎవని దారిలో వాడు పొతే ఈ గొడవలు ఎందుకు ఉంటాయి?
Deleteఎలా సరిపోతుంది. ఉమ్మడి రాజధానిని ఒప్పుకుని అందరి సహకారంతో అభివృద్ధి జరిగిన తరువాత వెళ్లి పొమ్మంటే న్యాయంగా ఉందా ?
>>ఎవ్వని ప్రాంతంలో వారు మాత్రమె ఉద్యోగాలు చేసుకోవాలి అనేది కూడా సీమంద్రులకు నష్టం కలిగించేదా? మాట్లాడేడి మీకయినా అర్థం అవుతుందా?
ఎవ్వని ప్రాంతంలో వారు మాత్రమె ఉద్యోగాలు చేసుకోవాలి అనేది .... నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. మీరు నేను వ్రాసిన పాత టపాలు చదవలేదు కాబోలు.
సీమాంధ్ర వాళ్ళు హైదరాబాద్ రాకుండా వారి నగరాలను అభివృద్ధి చేసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా నేను ఇంతకు ముందే రాశాను.
సీమాంధ్ర లో ఆందోళనలవల్ల అక్కడి పౌరజీవనం అస్తవ్యస్తమైపోతున్నది,పేదవాడు ఈతిబాధలతో అలమటిస్తున్నాడు!దీనితో మీరు సాధించేదేమీ లేదు!హైదరాబాద్ రాజధానిగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు మీరు ఆపలేరు!వెయ్యి మందికి పైన యువత ఆత్మబలిదానాల వల్ల,దశాబ్దాల పోరాటాల వల్ల తెలంగాణా ఏర్పడుతున్నది!బుడిబుడి దీర్ఘాలు తీసి,కృత్రిమ ఆందోళనలు చేస్తే తెలంగాణా ఎంతమాత్రం ఆగదు!మొదటి నుంచి తెలంగాణా వారికి అన్యాయం జరుగుతున్నది!తెలంగాణా ప్రజలు మూగ జీవులు!మూగవారి నాయకుడు కేసీఆర్!ఎన్నో ధక్కామోక్కీలు తిని ఎత్తుపల్లాలు చూసి,ఎదురుగాలులను ఎదురుకొని ఏటికి ఎదురీత ఈదాడు!రాజకీయంలో రాటుదేలాడు!చాణక్యం నేర్చాడు!ఒడ్డుకు చేరుకుంటున్న సందర్భంలో సీమాంధ్రులు సమైక్యాంధ్ర నాటకాలాడి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని వృధాప్రయాస పడుతున్నారు!లోగడ ఎన్ని రాష్ట్రాలు ఏర్పడలేదు!తెలుగు వారికి రెండు రాష్ట్రాలుంటే తప్పా!?
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteపై వ్యాఖ్యలన్నీ చదివే ఉంటారు.
ఈ విషయంలో నా అభిప్రాయం ...
సీమాంధ్ర వారి పొరపాట్లూ ఉన్నాయి. తెలంగాణా వారి పొరపాట్లూ ఉన్నాయి.
....................
ఇప్పటి పరిస్థితిని చూస్తే , మళ్ళీ మళ్ళీ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే, తెలుగు వాళ్ళకు రెండు రాష్ట్రాలు కాదు. నాలుగు లేక అయిదు రాష్ట్రాలు చేస్తే సరిపోతుందా ? అనే సందేహం వస్తోంది.
ప్రస్తుతానికి రెండు చాలు. ఆంధ్రుల ఆలోచనాసరళి మారకపోతే ముందు రాయలసీమ, తరువాత ఉత్తరాంధ్రలోనూ గొడవలు వస్తాయి.
Delete>>తెలంగాణా వారి పొరపాట్లూ ఉన్నాయి.
Deleteఏవిటవి ? సీమండ్రులను నమ్మటమా?
>> ప్రస్తుతానికి రెండు చాలు. ఆంధ్రుల ఆలోచనాసరళి మారకపోతే ముందు రాయలసీమ, తరువాత ఉత్తరాంధ్రలోనూ గొడవలు వస్తాయి.
Deleteతెలంగాణా మళ్లీ విడిపోకుండా చూడండి.
సాటి సీమాంధ్రులు వచ్చి హైదరాబాదులో ( ఉమ్మడి రాజధాని కాబట్టి ) ఉద్యోగాలు, వ్యాపారులు చేసి ఆస్తులు సంపాదించుకుంటే తప్పు అంటున్నారు.
Deleteతెలంగాణా వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ఆస్తులు సంపాదించుకుంటున్నారు. మరి అలా ఎందుకు వెళ్తున్నారు ?
>>తెలంగాణా మళ్లీ విడిపోకుండా చూడండి.
Deleteతెలంగాణలో సమస్య వచ్చినప్పుడు ఆలోచిద్దాం కాని ప్రస్తుతం ఆల్రేడి రగులుతున్న రాయలసీమ, ఉత్తరాంధ్ర సంగతులు చూడండి, వీరు కూడా కోస్తాంద్ర తో కలసి ఉండము అని అడపా దడపా అంటున్నారు. ఆ ఏదో అంటున్నారు పెద్ద విషయం కాదులే అని నిర్లక్ష్యం చేస్తే త్వరలో తెలంగాణా లాంటి సమస్యనే ఎదుర్కొంటారు.
>>సాటి సీమాంధ్రులు వచ్చి హైదరాబాదులో ( ఉమ్మడి రాజధాని కాబట్టి ) ఉద్యోగాలు, వ్యాపారులు చేసి ఆస్తులు సంపాదించుకుంటే తప్పు అంటున్నారు.
ReplyDeleteఎవరన్నారు అలా? నాకు తెలిసి అన్నది అక్రమంగా చట్ట విరుద్దంగా హైదరాబాదులో ఉద్యోగాలు పొందిన వారిని గురించి
>> ఎవరన్నారు అలా?
Deleteఅనేవారు అంటున్నారు లెండి.
ఇక సీమాంధ్ర వాళ్ళు మరియు తెలంగాణా వాళ్ళు కలిసుంటారా ? విడిపోతారా ? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
ప్రతి ఎల్లయ్య మల్లయ్య లు మాట్లాడింది పట్టుకు వేలాడితే అలాంటి ఎల్లయ్య మల్లయ్యలు సీమంద్రలో కోకొల్లలు.
Delete>>ఎలా సరిపోతుంది. ఉమ్మడి రాజధానిని ఒప్పుకుని అందరి సహకారంతో అభివృద్ధి జరిగిన తరువాత వెళ్లి పొమ్మంటే న్యాయంగా ఉందా ?
ReplyDeleteఒప్పందాలు ఒప్పుకొని వాటిని ఉల్లంగించటం న్యాయంగా ఉందా? ఒప్పందాల పునాదులుగా ఏర్పడ్డ రాష్ట్రం అవే ఒప్పందాలు అమలు కాకపొతే ఆ రాష్ట్రం కూడా రద్దు అయినట్లే. సమక్యం అయినా కూడా చట్ట బద్దంగా హైదరాబాదు నుండి సీమంద్రులకు దమ్మిడి రాదు.
>>మీరు నేను వ్రాసిన పాత టపాలు చదవలేదు కాబోలు.
చదవలేదు, మరి సీమంద్రులు ఎందుకు తెలంగాణా ఉద్యోగాలను కూడా కాజేయ్యటం ? ఆ అన్యాయానికి ఏ శిక్ష విదిమ్పబడాలి వాళ్లకు?
>>సీమాంధ్ర వాళ్ళు హైదరాబాద్ రాకుండా వారి నగరాలను అభివృద్ధి చేసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా నేను ఇంతకు ముందే రాశాను.
ఎప్పటికయినా తెలిసి వచ్చింది కాబట్టి సీమండ్రులు వారి వారి నగరాలు అభివృద్ధి చేసుకుంటే భావ్యిష్యట్టు అయినా బాగుంటుంది.
ఇదంతా సీమండ్రులు చేసుకున్నదే, ఒప్పందాల పై నిలబడి ఉంటె ఇప్పుడు ఇలా వేల్లగోట్టబడే వారు కాదు. చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదు/
>> ఇవన్నీ ఉమ్మడి రాజధానిగా ఉండబట్తే వచ్చాయి.
అంటే సీమండ్రులు మద్రాసులో ఉంటె అవి అక్కడికి వెళ్లేవా? లేదంటే సీమండ్రులు ఆంధ్ర రాష్ట్రం గా ఉంటె అవి కర్నూలుకు పొయ్యేవా? ప్రవేటు కంపినిలు వారికి లాభంగా ఉండే చోట పెడతారు అంతే కాని సీమండ్రులు ఉన్నారని ఎవ్వడు చూడడు. హైదరాబాదు లో ఎయిర్పోర్ట్, రోడ్డు రవాణా, రైల్వే లతో దేశంలోనే అన్ని ప్రాంతాలతో బాగా కలపబడి ఉంది, అంతే కాక మరే రాష్ట్రానికి లేనన్ని ప్రభుత్వ భూములు హైదరాబాదులో ప్రభుత్వానికి ఉండటం కూడా కలిసొచ్చింది.
సీమాన్ద్రులకు హైదరాబాదులో ఉన్న ప్రభుత్వ రంగ సంస్తల విషయమే నిజమయిన సమస్య అయితే దైర్యంగా వాటి కోసం పోరాడాలి అంతే కాని పిరికి వారిలా 'సమైక్యం' ఏంటి?
Deleteఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నిధులు మొత్తం తెలంగాణాకే ఇవ్వాలనే ఒప్పందం న్యాయమైనదంటారా ?
ఉమ్మడి రాజధాని రద్దయితే అక్కడ ఏర్పడిన ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలను, కూడా ఇచ్చేస్తారా ?
ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వాళ్ళు వల్ల అక్కడి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని భావిస్తున్నారట. అలా ఆలోచిస్తే ఉపాధి కోసం ఇక నుంచీ ఇతరదేశాలకు, రాష్ట్రాలకు ఎవరూ వెళ్ళకూడదు.
నీటి వసతి సరిగ్గా లేని హైదరాబాద్ , మద్రాస్ వంటివే రాజధానులుగా ఉన్నప్పుడు నీటివసతి ఉండి, ఎయిర్పోర్ట్, రోడ్డు రవాణా, రైల్వే లతో దేశంలోనే అన్ని ప్రాంతాలతో బాగా కలపబడి ఉండే ప్రాంతాలు సీమాంధ్రలో కూడా ఉన్నాయి.
మరే రాష్ట్రానికి లేనన్ని ప్రభుత్వ భూములు హైదరాబాదులో ఉన్నాయని మీరే అంటారు. మళ్ళీ హైదరాబాదులో భూములన్నీ సీమాంధ్ర వాళ్ళు తీసేసుకున్నారు అనీ అంటారు.
ReplyDelete* కొందరు సీమాంధ్రుల వల్ల తెలంగాణా వారికి నష్టం జరిగి ఉండవచ్చు. కాదని నేను అనటం లేదు. అందుకని రాష్ట్రమే విడిపోవాలనటం బాధగా ఉంది.
* తెలంగాణాలో తెలంగాణాకు చెందిన పేదవారి పొట్టకొట్టి డబ్బు సంపాదించిన తెలంగాణా వారు లేరంటారా ?
* మాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోను బంధువులు, స్నేహితులు ఉన్నారు.
* కొంతకాలం క్రిందట తెలంగాణా విడిపోయే సూచనగా ప్రకటన వచ్చినప్పుడు నేను చాలా ఏడ్చాను. నేను హైదరాబాద్ కోసం ఏడవలేదు. అయ్యో ! మన తెలుగు రాష్ట్రం విడిపోతొంది కదా ! అనే బాధతో ఏడ్చాను.
* రాష్ట్రం విడిపోతుందంటే బాధపడే వారెందరో సీమాంధ్రలో ఉన్నారు. వీరందరూ తెలంగాణా సొమ్ము కోసం ఏడవటం లేదు. అయ్యో ! మన తెలుగు రాష్ట్రం విడిపోతుందేమో...అని బాధపడుతున్నారు.
* దురదృష్టం ఏమిటంటే , సీమాంధ్ర వాళ్లు సమైఖ్యం అంటుంటే , తెలంగాణా ప్రజలను దోచుకోవటానికే సమైఖ్యం అంటున్నారనే భావన తెలంగాణా ప్రజలలో బలంగా ఏర్పడింది.....ఇలా భావించేవారిని ఏ విధంగా నమ్మించగలం ?
* ఇదంతా తెలుగు వారి దురదృష్టం. ఇక ముందు ఏం జరగాలని ఉందో కాలమే నిర్ణయిస్తుంది.
@anrd ... the way you conducted the discussion is intellectual and commendable.
ReplyDeleteసర్ ! మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ఈ మాత్రం వ్రాయగలిగానంటే , అంతా దైవం దయ వల్ల మరియు మీ వంటి శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్లనండి.