koodali

Monday, September 23, 2013

రామాయణ,భారతములు ముందే ఒక ప్రణాళిక ప్రకారం ..మరి కొన్ని విషయాలు....


రామాయణ,భారతములు ముందే ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయని  ఇంతకుముందు  చెప్పుకున్నాము.  మహా భారతము విషయంలో అది ఎలా జరిగిందంటే . .. ( క్లుప్తంగా. )

ఒకప్పుడు భూదేవి , భూమిపై పాపాత్ములు పెరిగిపోతున్నారని తాను ఆ భారాన్ని భరించలేకపోతున్నానని బాధపడినప్పుడు ........... దేవతలు మరియు భూదేవి ...... ఆదిపరాశక్తిని వేడుకోవటం జరిగింది.

అప్పుడు అమ్మవారు ......... దేవతలు భూమిపై జన్మిస్తారని , తరువాత జరిగే యుద్ధం వల్ల పాపాత్ములు ఎందరో మరణించి భూభారం తగ్గుతుందని చెప్పటం జరిగింది.

శ్రీకృష్ణ జననం గురించి ,  పాండవుల జననం గురించి ఇంకా , ఫలానా దేవతలు ఫలానా విధంగా జన్మ ఎత్తవలసి ఉంటుందని కూడా అమ్మవారు చెప్పటం జరిగింది.

ఆ విధంగా దేవతలకు భవిష్యత్తులో జరగబోయేది ముందే తెలుసు.

అలా దేవతలను నిమిత్తమాత్రులుగా చేసి అమ్మవారు అంతా నడిపించారు.


ఆదిపరాశక్తి అయిన పరమాత్మ తలచుకుంటే పాపాత్ములను చిటికెలో సంహరించగలరు.

కానీ, దేవతలు నిమిత్తమాత్రులుగా అమ్మవారు నడిపించిన చరిత్ర ఎన్నో కధలు, ఉపకధలతో రసవత్తరంగా నడిచింది.


ఆ విధంగా , పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా  లోకానికి ఎన్నో గొప్ప విషయాలు అందించబడ్డాయి.


సామాన్యులమైన మనము పురాణేతిహాసాలలోని ధర్మాలను అపార్ధం చేసుకోకుండా చక్కగా అర్ధం చేసుకొని జీవితాలను తీర్చిదిద్దుకోవాలి.

.........................

పురాణేతిహాసాలలోని  పాత్రలు  చేసినట్లుగా  అనిపిస్తున్న    పొరపాట్ల    ద్వారా  కూడా  మనము  ఎన్నో  విషయాలను  నేర్చుకోవచ్చు. 

..................................

పురాణేతిహాసాలలో    కొన్ని  విషయాలలో ,   ఒకే  విషయం    గురించి  రెండు  విధాలుగా  చెప్పినట్లుగా   కూడా   మనకు  అనిపిస్తుంది.

ఉదా...ఆలస్యం  అమృతం  విషం  ...అని  తెలియజేసిన  పెద్దలే ,  నిదానమే  ప్రధానం  ....అని  కూడా  తెలియజేశారు.  


 ఇదేమిటి  ?  పెద్దలు  ఒకే  విషయాన్ని  రెండు  విధాలుగా  తెలియజేశారు . అనిపిస్తుంది  కొందరికి. 

 
  కొన్ని  విషయాలలో  నిదానమే  ప్రధానం.   ఉదా...ఆవేశం  లేక  కోపం  కలిగినప్పుడు  త్వరపడకుండా  నిదానంగా  ఆలోచించాలి కదా  ! 



మరికొన్ని  విషయాలలో   ఆలస్యం  పనికిరాదు.
   ఉదా....ఇల్లు  తగలబడిపోతుంటే  నిదానమే  ప్రధానం . అని  తీరికగా  కూర్చోకూడదు  కదా  !   

 ఇలా పెద్దలు  ఎన్నో  చక్కటి  విషయాలను  మనకు  తెలియజేసారు.  మనం  పరిస్థితిని  బట్టి  విచక్షణతో  ఆలోచించి  నిర్ణయం  తీసుకోవాలి. 

................................

 కొన్నిసార్లు,  ఒకే  గ్రంధములో  కూడా  ఒకే  సంఘటన  రెండు  విధాలుగా  జరిగినట్లుగా  మనకు  అనిపించే  అవకాశం  ఉంది.  ఇలాంటప్పుడు  ఏ  విషయాన్ని  నమ్మాలి ?  అని  మనకు సందేహం  వస్తుంది. 

ఇక్కడ   మనం  ఒక  విషయాన్ని  గుర్తుంచుకోవాలి.  పెద్దలు   ఎంతో  తెలివిగలవారు.  వారు  ఏం  చేసినా   ఎన్నో   కోణాలలో  ఆలోచించి    ఒక  పద్ధతి   మరియు   ప్రణాళిక   ప్రకారం  చేస్తుంటారు. 


  ఆ  విషయాలలోని  అంతరార్ధాలు    మనకు  తెలియవలసినప్పుడు  తప్పక  తెలుస్తాయి.

  ఆలోచిస్తే  పురాణేతిహాసాలలోని  అంతరార్ధాలు   మనకు  చక్కగా  అవగతమవుతాయి.  


 సరిగ్గా   అర్ధం  చేసుకోనప్పుడు  అపార్ధాలు  అగుపిస్తాయి. 

 అవి  అర్ధం  అయినప్పుడు   మనకున్న  సందేహాలు  తొలగి   అద్భుతంగా  అనిపిస్తాయి.  

అంతా  దైవం  దయ.



No comments:

Post a Comment