Saturday, April 17, 2010
నేను ఇప్పుడు tranfersవల్ల రకరకాల రాష్ట్రములు తిరిగే మాలాంటి వారి కష్టాలూ గురించి రాయాలనుకుంటున్నాను అండి.
కొన్నాళ్ళ క్రితం తెలుగు ప్రజలు నలుగురు కలిస్తే మామూలుగా మీది ఏ ఊరు ?ఇలా కుశల ప్రశ్నలు వేసుకునేవారు. కాని ఇప్పుడు ఏ ఊరు అంటే దిక్కులు చూడాల్సిన పరిస్తితి. ఏ ఊరు అని చెపితే ఏమి కొంప మునుగుతుందో ఎవరికి తెలుసు మరి.
పూర్వము native place అనేది ఎలా ఉండేదంటే అప్పుడు ప్రజలు వ్యవసాయము, వ్యాపారము వల్ల ఒకే ప్రాంతములో ఉండిపోయెవారు. మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వల్ల ఆఫీస్ వాళ్ళ ఎక్కడకు పంపితే అక్కడకు వెళ్ళాల్సిన పరిస్తితి.
మేము ఇలా తిరుగుతూ ఉండటము వల్ల మా పిల్లలకు మా సొంత ఊరు అంటే పెద్దగా తెలియదు. ఎప్పుడయినా వెళ్ళ్తుంటాము అంతే. పిల్లలకు వాళ్ళు పెరిగిన చదువుకున్న ప్రాంతము తోనే attachment ఉంటుంది .
మేము మా పై అధికారులతో మాకు వేరే రాష్ట్రము వద్దు భాష కూడా రాదు , కావాలంటే మా రాష్ట్రము లోనే వేరే ఊరు వెయ్యండి మహాప్రభూ...... అన్నా కూడా వారు వినరు ,
మాఖర్మ ప్రకారము ఏ ముంబయొ వేశారంటే ఇక మాపని అంతే................ వెళ్ళకపోతే వీళ్ళు ఊరుకోరు, వెళ్తే అక్కడ వాళ్ళు మీరు ఎవరు? మమ్మల్ని దోచుకోవటానికి వచ్చారా లేక మా సంస్క్రుతి పాడు అయిపోతుంది మీ వల్ల అని వాళ్ళూ చావగొడతారు.............
ఏమిచెయ్యాలి ? అని ,ఆఖరికి సొంత ఊరు వెళ్తే అక్కడ పెద్దగా ఏమీ తెలియదు. మా లాంటి
వారికి నేటివిటీ కి భాష ఒక్కటే ఆధారమేమో. ఇంకొ 50 సంవత్సరములలో ఇంగ్లీష్
పుణ్ణ్యమా అని అది కూడా ఉండదులెండి. లేదంటే మా పెద్దవాళ్ళ ప్రాంతమే
మాప్రాంతమని( బేస్) అనుకొవాలి.
అసలు బిజినెస్సు పెరగాలంటే ఏ ఆఫీస్ వాళ్ళకయినా మంచిగా ఆప్రాంత ప్రజలతో వాళ్ళ భాషలో మాట్లాడాలి. ఉదాహరణకి బ్యాంక్స్ అనుకోండి,అక్క్డకు వచ్చేవారికి అందరికి ఇంగ్లీష్ రాదు కదా. ఇంకా బ్యాంక్ ఏమి అభివ్రుధ్ధి అవుతుంది.వీళ్ళుఅక్కడి భాష చచ్చీచెడీ నేర్చుకునేసరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంటాయి.
నేను ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే జనము మద్య ఈ గొడవలు ఉండవేమోనని.కాని ట్రాన్స్ఫర్స్ వల్ల మంచి కూడా ఉందండోయ్.అన్నీ ప్రాంతాల వారి మద్య స్నేహము పెరుగుతుంది.మేము అది వరకు ఆంధ్రాలో ఉన్నప్పుడు పేపర్స్ లో మన ప్రాజెక్టులు తమిళనాడు తన్నుకు పోయింది, కర్నాటక కాకిలా ఎత్తుకుపోయింది ఇలాంటి వార్తలు చదివి,ఇంత అన్యాయమా అనిపించేది. ఇప్పుడు ఏమి అనిపిస్తుందంటే వాళ్ళ తప్పేముంది. మనకి తెలివిగా చేతరాదు..వాళ్ళ భాష అన్నా వాళ్ళకి చాలా గౌరవము.మనకి ఇంగ్లీష్ అంటేనే ఇష్టము కదా మరి.మనము వాళ్ళ దగ్గర చాలానేర్చుకోవాలి.
అసలు బిజినెస్సు పెరగాలంటే ఏ ఆఫీస్ వాళ్ళకయినా మంచిగా ఆప్రాంత ప్రజలతో వాళ్ళ భాషలో మాట్లాడాలి. ఉదాహరణకి బ్యాంక్స్ అనుకోండి,అక్క్డకు వచ్చేవారికి అందరికి ఇంగ్లీష్ రాదు కదా. ఇంకా బ్యాంక్ ఏమి అభివ్రుధ్ధి అవుతుంది.వీళ్ళుఅక్కడి భాష చచ్చీచెడీ నేర్చుకునేసరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంటాయి.
నేను ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే జనము మద్య ఈ గొడవలు ఉండవేమోనని.కాని ట్రాన్స్ఫర్స్ వల్ల మంచి కూడా ఉందండోయ్.అన్నీ ప్రాంతాల వారి మద్య స్నేహము పెరుగుతుంది.మేము అది వరకు ఆంధ్రాలో ఉన్నప్పుడు పేపర్స్ లో మన ప్రాజెక్టులు తమిళనాడు తన్నుకు పోయింది, కర్నాటక కాకిలా ఎత్తుకుపోయింది ఇలాంటి వార్తలు చదివి,ఇంత అన్యాయమా అనిపించేది. ఇప్పుడు ఏమి అనిపిస్తుందంటే వాళ్ళ తప్పేముంది. మనకి తెలివిగా చేతరాదు..వాళ్ళ భాష అన్నా వాళ్ళకి చాలా గౌరవము.మనకి ఇంగ్లీష్ అంటేనే ఇష్టము కదా మరి.మనము వాళ్ళ దగ్గర చాలానేర్చుకోవాలి.
మనకు ఏ ప్రాంతము ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రాంతముతో అటాచ్మెంట్ పెరుగుతుంది. వాళ్ళతో friendship మనపిల్లలకు చదువు చేప్పే టీచర్స్, వీటన్నింటితో అనుభంధము ఏర్పడుతుంది. ఇక భగవంతుని ఆలయాలు ఎక్కడ ఉన్నా అవి అందరివీ కదా... మన జీవితములో మనము ఎక్కడ ఉంటే ఆ ప్రాంతము కూడా ఒక భాగము కదా మరి.
ఈ విధముగా ఒక ప్రాంతము ప్రజలు వేరే ప్రాంతము వెళ్ళటము వల్ల కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు.స్నేహము పెరగా వచ్చు....ఈ వెళ్ళటము ఒక లిమిట్ దాటితే అపార్ధాలూ పెరగవచ్చు. ఏది ఏమయినా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటే ఈ గొడవలు రావు. కాని అదేదో సామెత చెప్పిన్నట్లు అన్ని ప్రాంతములు సమానముగా అభివ్రుద్ది చేసేవారే కనపడుటలేదు....అదే జరిగితే ప్రజలు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే హాయిగా ఉంటారు. వేరే చోటకి ఎందుకు వెళ్తారు?
సరే ఆఖరికి మా తెలుగు గాలి, మా తెలుగు మట్టి, మాతెలుగు తిండి, మాతెలుగు స్వర్గం అనుకుంటూ ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ ఏమి అడుగుతున్నారంటే.... మీది ఏ ప్రాంతము రాయలసీమనా, కోస్తానా, తెలంగాణానా, ఉత్తరాంధ్రానా........?
ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉంటుందో విడిపోతుందో నాకు తెలియదు గాని , మనము ఇలా ఒకరినొకరు తిట్టుకోవటము చాలా భాధగా ఉందండి...ఇలా తిట్టుకోకుండా గౌరవముగా సమస్య సాల్వ్ అయ్యే మార్గమే లేదా......మిగతా రాష్ట్రముల వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారేమోనని.........
నేను కూడ ఇరవయ్యేళ్ళుగా ప్రవాసాంధ్రుడినే.
ReplyDeleteఏ రాష్ట్రంలో ఉన్నా, పరాయి ప్రాంతంలో ఉన్నట్టే ఉండేది.
కాని ఒక్క ఢిల్లీలో మాత్రం అలా ఉండేది కాదు.
ఢిల్లీ అందరిదీ కదా!
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీరు అన్నది నిజమేనండి.
తరువాతి టపాలో రాయమన్నారు కాబట్టి అక్కడ రాయల్సినది ఇక్కడ రాస్తున్నాను. ముందస్తు కృతఙ్ఞతలు.
ReplyDelete>>సీమాంధ్రకు చెందిన కొందరి వల్ల మీకు నష్టం కలిగిఉండవచ్చు. అంతమాత్రాన అందరినీ విడిపోమనటం న్యాయమేనా ?
ఆ 'కొందరిని' కట్టడి చేసే అధికారం సీమండ్రుల దగ్గరే ఉంది, కట్టడి చెయ్యమని తెలంగాణా వాళ్ళు పదే పదే అడిగారు కూడా. అలాంటి వారిని సీమంద్ర నాయకత్వం కట్టిడి చెయ్యకపోతే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? రాజు తప్పు చేస్తే ప్రజలంతా శిక్ష అనుభవిస్తారని తెలియదా?
>>ఉమ్మడి రాజధాని రద్దయితే అక్కడ ఏర్పడిన ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలను, కూడా ఇచ్చేస్తారా ?
అది సీమండ్రులు కేంద్ర ప్రభుత్వానికి వెయ్యవలసిన ప్రశ్న, తెలంగాణా వాదులకు కాదు. అలాగే ఉమ్మడి రాజధాని రద్దయితే ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణా నష్టపోయిన(నిధులు, ఉద్యోగాలు, ప్రాజెక్టులు, వనరులు, నీళ్ళు) వన్నిసీమంద్ర తిరిగి ఇవ్వగలదా?
>>నీటివసతి ఉండి, ఎయిర్పోర్ట్, రోడ్డు రవాణా, రైల్వే లతో దేశంలోనే అన్ని ప్రాంతాలతో బాగా కలపబడి ఉండే ప్రాంతాలు సీమాంధ్రలో కూడా ఉన్నాయి.
అయితే మరి కర్నూలు రాజధానిగా, డేరాలలో పాలన ఎందుకు చేసారు? మీరు ఈ రోజు ఆ నగరాలను చూసి ఇలా మాట్లాడుతున్నారు, ఆనాటి పరిస్తితి తెలుసుకోవాలంటే ఆనాటి పత్రికలూ, ముఖ్యంగా మొదటి SRC చదివితే అప్పటి ఆంధ్ర దుస్తితి మీకే అర్థం అవుతుంది, హైదరాబాదుకు నీటి వసతి ఇప్పుడు సరిగ్గా లేదు, ఒప్పుకుంటాను, కాని ఒక ఇరవై సంవత్సరాలకు పూర్వం చూస్తే బ్రమ్హాన్డమయిన నీటి వసతి, వరదలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, పూర్తీ చరిత్ర తెలియక పొతే మీ ఆలోచనలు ఇలా తప్పుగానే ఉంటాయి.
>>మరే రాష్ట్రానికి లేనన్ని ప్రభుత్వ భూములు హైదరాబాదులో ఉన్నాయని మీరే అంటారు. మళ్ళీ హైదరాబాదులో భూములన్నీ సీమాంధ్ర వాళ్ళు తీసేసుకున్నారు అనీ అంటారు.
న్యాయంగా సంపాదించటానికి, అస్మదీయులకు అప్పనంగా రాసివ్వడానికి తేడా లేదంటారా ?
>>ఇలా తిట్టుకోకుండా గౌరవముగా సమస్య సాల్వ్ అయ్యే మార్గమే లేదా
ReplyDeleteమీ సలహా చెప్పగలరా ?
ReplyDeleteమీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలండి. కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా జవాబు వ్రాస్తున్నందుకు దయచేసి క్షమించండి.
..............................
సీమాంధ్ర నష్టపోయిన అనేక ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలను గురించి కూడా ఆలోచించాలి కదా !
ఉమ్మడి రాజధానిని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేయటం వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి.
....................................
హైదరాబాద్ నీటి వసతి అప్పటి తక్కువ మంది జనాభాకు మాత్రమే సరిపోతుంది.
ఇక హైదరాబాదులో వరదలు రావటమంటే.... నీటివసతి సరిగ్గా లేని ప్రాంతాలలో కూడా కొన్నిసార్లు వరదలు వస్తాయండి.
ఉదా...మద్రాస్, కర్నూలు నీటి వసతి సరిగ్గా లేని ప్రాంతాలే. అయినా కొన్నిసార్లు మద్రాసులో , కర్నూలులో కూడా వరదలు వచ్చాయి. వరదలు వచ్చినంత మాత్రాన నీటి వసతి ఉండే ప్రాంతాలు అనుకోకూడదు.
.....................................
రాజధాని ఏర్పడిన ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని అందరికి తెలుసు. అయినా విశాలాంధ్ర కోసం రాజధానిని వదులుకున్నారంటే ఎంతో గొప్పవిషయం. విశాలాంధ్ర కోసం రాజధానిని వదులుకున్న వారిని దోపిడీదారులు అనటం ధర్మం కాదు కదా !
................................
అధర్మంగా ఆస్తులను సంపాదించే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళయినా అధర్మపరులే. పేదవారి పొట్టకొట్టి అధర్మంగా ఆస్తులను కూడబెట్టేవాళ్ళు తెలంగాణాలో లేరంటారా ?
.......................
రాజధానిలో భూములు తీసుకునే విషయంలో సీమాంధ్ర వాళ్ళు మాత్రమే కాదు. ఇంకా ఎందరో ఉన్నారు. వీళ్ళందరను ఏమనకుండా కేవలం సీమాంధ్ర వాళ్ళనే తప్పు అంటున్నారు కదా ! కొందరు విదేశీయులు కూడా వ్యాపారం కోసం భూములను తీసుకుంటున్నారు.
....................................
ఇప్పటి సంగతి అలా ఉంచితే , ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొత్తలో హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచి ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో మూడు ఉప రాజధానులను ఏర్పాటు చేసి అభివృధ్ధి చేసి ఉంటే ఎంతో బాగుండేదనిపిస్తుంది.
ఉదా.... హైదరాబాదులో ఉమ్మడి రాజధాని ఉంటే.... విశాఖలో , కర్నూలులో , విజయవాడలో మూడు ఉపరాజధానులు .
అప్పుడు అన్ని ప్రాంతాలలోను ఉపాధి అవకాశాలు పెరిగి హైదరాబాదుకు సీమాంధ్ర వాళ్లు ఎక్కువగా వచ్చేవారు కాదు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాలోని ప్రకాశం జిల్లా వంటి ప్రాంతాలు ఎంతో వెనుకబడ్డాయి. తెలంగాణాలో కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. తెలంగాణాలో కూడా ఎన్నో వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి.
ఇప్పటికయినా అన్ని ప్రాంతాలను చక్కగా అభివృద్ధి చేయాలి .
>>సీమాంధ్ర నష్టపోయిన అనేక ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలను గురించి కూడా ఆలోచించాలి కదా !
ReplyDeleteదానికి ఎవరు కారణం? ఒప్పుకున్నా ఒప్పందాలపై నిలబడితే ఈ పరిస్తితి ఉండేది కాదు కదా, తప్పు చేసినప్పుడు నష్టం తప్పదు కదా?
>>ఇక హైదరాబాదులో వరదలు రావటమంటే.... నీటివసతి సరిగ్గా లేని ప్రాంతాలలో కూడా కొన్నిసార్లు వరదలు వస్తాయండి.
అంటే దానర్థం మీకు మూసి నది చరిత్ర, దాని వరదలు, లంగర్ హౌస్ చరిత్ర తెలియదనుకుంటా. తెలుసుకుంటే బాగుంటుంది.
>>హైదరాబాద్ నీటి వసతి అప్పటి తక్కువ మంది జనాభాకు మాత్రమే సరిపోతుంది.
ప్రపంచంలో ఎక్కడయినా అదే పరిస్తితి. అభివృద్ధి, జనాబా ప్రకారంగా నీటి వసతిని కూడా అబివృద్ది చెయ్యబడుతుంది. అది హైదరాబాదులో సరిగా జరగనందు వల్ల ఈ దుస్తితి.
>>అయినా విశాలాంధ్ర కోసం రాజధానిని వదులుకున్నారంటే ఎంతో గొప్పవిషయం.
వదులుకున్నారని మీరు అంటున్నారు. రాజధాని నిర్మించుకోలేక హైదరాబాదుకు వచ్చారు అని చరిత్ర, ఆనాటి కమిటి రిపోర్టులు మరియు వార్త పత్రికలూ చెపుతున్నాయి. గత్యంతరం లేకనే రాజధాని కోసం రావలసి వచ్చి తెలంగాణా వాసుల వ్యతిరేకతను ఎదుర్కోవటానికి అలాంటి ఒప్పందాలు సీమంద్రులే ప్రతిపాదించి ఒప్పుకొని మరి వచ్చారు. హైదరాబాదును రాజధానిగా చేస్తేనే మేము కలుస్తాం అని తెలంగాణా వాళ్ళు ఏనాడు డిమాండు చెయ్యలేదు.
మేము ఉద్యోగాలు, నీళ్ళు, ప్రాజెక్టులు, నిధుల గురించి మాట్లాడుతున్నాము. మీరు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. రెండు సంబంధం లేని విషయాలు.
>>తెలంగాణాలో కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
కాదనను, అయితే యాబై సంవత్సరాలకు, ఈ రోజుకు అభివృద్దిని పోల్చి చూస్తే ... ప్రపంచంలో ఆ స్తాయి నగరాలు అలానే అభివృద్ధి చెందాయి.
హైదరాబాదు నిధులు తెలంగాణాలోనే ఖర్చు పెట్టటం ...వంటి ఒప్పందాలను అమలు చేయటం కష్టం. ఉమ్మడి రాజధాని సీమాంధ్రలో పెట్టి ఆ నిధులను సీమాంధ్రకే వినియోగించాలి అని ... అంటే మీకు ఎలా అనిపిస్తుంది ? అని క్రితం టపాలో చర్చ జరిగింది కదండి.
ReplyDeleteఇలాంటి ఒప్పందాలను ఎందుకు ఒప్పుకున్నారో అర్ధం కాదు. బహుశా తెలుగు వాళ్ళందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలని అలా ఒప్పుకుని ఉంటారు.
...............................
అభివృద్ధి, జనాబా ప్రకారంగా నీటి వసతిని కూడా అబివృద్ది చెయ్యబడుతుంది. అని మీరంటున్నారు. నదీ తీరాల వద్దకే ప్రజలు వెళ్తారని, నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాల వద్దే నాగరికత విలసిల్లిందని చరిత్ర ద్వారా అర్ధమవుతుంది.
అయితే నా అభిప్రాయం ఏమిటంటే, పారిశ్రామీకరణ లేని పూర్వకాలంలో ఒకే దగ్గర జనాభా ఉన్నా కూడా సమస్యలు ఉండేవి కాదు. పారిశ్రామీకరణ పెరిగిన ఈ రోజుల్లో బోలెడు డబ్బు ఖర్చు పెట్టి ఎత్తిపోతల పధకాలతో నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలకు నీటి వసతి కల్పించినా కూడా అనేక సమస్యలు వస్తాయి.
అందువల్ల నీటి వసతి ఉన్న ప్రాంతాలు, నీటి వసతి ఎక్కువగా లేని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. . ....అభివృద్ధి అన్ని ప్రాంతాలలోనూ జరగటమే మంచిది. అప్పుడే వలసలు తగ్గి గొడవలు తగ్గుతాయి.
............................................
తెలంగాణాతో కలిస్తే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందవనే ఉద్దేశంతో కొందరు ఆంధ్ర వారు....జై ఆంధ్ర ఉద్యమాలు కూడా చేశారు.
సీమాంధ్రులు రాజధాని నిర్మించుకోలేక హైదరాబాదుకు వచ్చారు .....అనేది నిజం కాదని అందరికి తెలుసు.
తెలంగాణా మరియు ఆంధ్ర కలవటం గురించి కొందరు ఏమంటారంటే ..... విశాలాంధ్ర రాజధానిగా హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిన తరువాత.... తెలంగాణా విడిపోతే తెలంగాణాకు మంచిదని కొందరి అభిప్రాయమని కూడా అంటారు.
సీమాంధ్రులు అనేక రంగాలలో అభివృద్ధిని సాధించారు. రాజధానిని ప్రత్యేకంగా నిర్మించుకోలేదంటే అందుకు కారణాలున్నాయి. తెలుగు వారందరికి హైదరాబాద్ రాజధానిగా ఉంది కదా ! అనే అభిప్రాయం వలన వేరేగా నిర్మించుకోలేదు.
........................................
ఉద్యోగాలు, నీళ్ళు, ప్రాజెక్టులు, నిధులు కూడా ఆస్తులే. ఉపాధిని అందించే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా ఆస్తులే. .....రెండూ సంబంధం ఉన్న విషయాలేనండి.
ప్రపంచంలో అనేక నగరాలు అభివృద్ధి చెందాయి. అనే విషయం నిజమే కావచ్చు. అయితే ఆ నగరాల విషయంలో విభిన్న ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు వచ్చి ఉండవు. వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది.
Green Star గారు మీకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమనం ఇప్పటికే ఎన్నో విషయాలను చర్చించాము.
తెలుగువాళ్ళందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను.
ప్రస్తుతానికి .. ఈ చర్చను కొంతకాలం కొనసాగించకూడదని భావిస్తున్నాను.
>>వంటి ఒప్పందాలను అమలు చేయటం కష్టం.
ReplyDeleteఅటువంటప్పుడు ఒప్పందాలు చెయ్యకూడదు, చేసి ఉల్లంగిస్తే విశ్వసనియత దెబ్బతింటుంది. ఇప్పుడు అదే జరిగింది
>> నదీ తీరాల వద్దకే ప్రజలు వెళ్తారని, నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాల వద్దే నాగరికత విలసిల్లిందని చరిత్ర ద్వారా అర్ధమవుతుంది.
హైదరాబాదు మూసి నది గురించి తెలుసుకోమని అందుకే అడిగాను మిమ్మల్ని. ఇక నది తీరాలలో నాగరిక విలసిల్లిందని చరిత్ర, కాకపొతే శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందినా ఈరోజుల్లో ఆ లాజిక్ పెద్దగా పనిచెయ్యదు, ఉదాహరణకు దుబాయ్.
>> సీమాంధ్రులు రాజధాని నిర్మించుకోలేక హైదరాబాదుకు వచ్చారు .....అనేది నిజం కాదని అందరికి తెలుసు.
అందుకే మిమ్మలిని ఆ రోజుల్లోనే వార్త పత్రికలూ చదవమని చెప్పాను, ఆ పత్రికల్లో సారాంశం ఉన్న లింకులు ఇదివరకే మీకు ఇచ్చాను. ఇక ఫజల్ కమిటి రిపోర్ట్ కూడా ఆంధ్ర రాష్ట్రం రాజధాని నిర్మాణంలో ఎదురుకుంటున్న సమస్యలు చక్కగా వివరించింది. చరిత్రను కాదని, మీ వాదనకు రుజువులు చూపకుండా మీరు చెప్పిందే నిజమనుకుంటే అది మీ ఇష్టం.
>>సీమాంధ్రులు అనేక రంగాలలో అభివృద్ధిని సాధించారు.
అది వారికున్న నీటి వసతి, ఆ పంటల మిగులు నిధులు, రాజకీయ ఆదిక్య బలం లాంటివి చాలా కలసి వచ్చాయి. తెలంగాణాలో నీటి వసతి ఏర్పాటు చేస్తే అదే అభివృద్ధి తెలంగాణా వాసులు కూడా పొంది ఉండే వారు.
>>రాజధానిని ప్రత్యేకంగా నిర్మించుకోలేదంటే అందుకు కారణాలున్నాయి.
తెలంగాణాను కలుపుకోవడానికి ముక్య కారణాలలో హైదరాబాదును పొందటం అనేది ఒక కారణమని మొదటి SRC స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మీరు కాదంటే చరిత్ర మారదు.
>>తెలంగాణా విడిపోతే తెలంగాణాకు మంచిదని కొందరి అభిప్రాయమని కూడా అంటారు.
ఇదేమి కొత్తగా వచ్చినది కాదు, పదే పదే ముందుకు వస్తున్నా డిమాండే. ఒప్పందాలు తప్పనేలేదు అని సీమండ్రులు చెప్పగలిగితే ఇప్పుడు ఈ విభజన అన్యాయం అని వాదించే అవకాశం ఉండేది.
>> ఈ చర్చను కొంతకాలం కొనసాగించకూడదని భావిస్తున్నాను.
ధన్యవాదాలు, శుభం.
వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
Deleteదుబాయ్ ప్రాంతంలో ఎక్కువ నీళ్ళు లేకపోయినా చమురు ఎక్కువగా ఉంది కాబట్టి అలా వచ్చిన ఆదాయంతో వారు ఐశ్వర్యవంతులయ్యారు.
సీమాంధ్ర ప్రాంతంలో నీరూ ఉంది చమురూ ఉంది అయినా సీమాంధ్ర అంతగా అభివృద్ధి చెందలేదంటే అందుకు కారణం... సీమాంధ్ర వాళ్ళు దోపిడీదారులు కాదు, ఇతరులే వాళ్ళను దోపిడీ చేస్తున్నారని అర్ధం.
సీమాంధ్ర వాళ్ళు దోచుకునే వారే అయితే తమ ప్రాంతంలోని గ్యాస్ ఇతర ప్రాంతాల అవసరాలకు తరలిపోతుంటే చూస్తూ ఊరుకోరు కదా !
( అయితే, ఇంధన మరియు విద్యుత్ అవసరాల కొరకు చమురు, గ్యాస్ వంటివి కాకుండా సోలార్ వనరులనే ఉపయోగించుకుంటే మంచిదని నా అభిప్రాయం.)
>>అయితే తమ ప్రాంతంలోని గ్యాస్ ఇతర ప్రాంతాల అవసరాలకు తరలిపోతుంటే చూస్తూ ఊరుకోరు కదా !
ReplyDeleteచమురు పై మీ అవగాహన తప్పు. చమురు ఏ ప్రాంతంలో ఉన్ననూ దానిపై సర్వ హక్కులు కేంద్రానివే కాని ప్రాంతానివి కాదు.
సీమంద్ర ప్రాంతాన్ని ఇతరులు ఎవరయినా దోపిడీ చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఎందుకు ఆలస్యం?
ReplyDeleteచమురు ఏ ప్రాంతంలో ఉన్ననూ దానిపై సర్వ హక్కులు కేంద్రానివే కాని ప్రాంతానివి కాదు. అనే విషయం నాకు తెలుసండి.
ఇక్కడ నా అభిప్రాయం ఏమిటంటేనండి, సీమాంధ్రులు తమ ప్రాంత అభివృద్ధి గురించి కూడా పెద్దగా పట్టించుకోరు ..... అని నా అభిప్రాయం. అయినా వారిని దోపిడీదారులు అనటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇలాంటి ఉదాహరణల వల్ల మనకు ఏం తెలుస్తుందంటే , తెలుగు వాళ్ళు తమలో తాము గొడవలు పడటమే కానీ, తమ హక్కుల విషయంలో ఇతరులతో మాట్లాడలేరు. అందుకే దేశంలో తెలుగు వారి అభిప్రాయాలకు ఎక్కువ ప్రాముఖ్యత లభించటం లేదు అనిపిస్తుంది.