సృష్టి ఎలా ప్రారంభమయ్యింది ? అనే ప్రశ్నకు , దైవం వల్ల ప్రారంభమయ్యింది. . అని ఆస్తికులు ఖచ్చితమైన సమాధానం చెప్పగలరు.
సృష్టి ఎలా ప్రారంభమయ్యింది ? అనే ప్రశ్నకు , నాస్తికులు సరైన , హేతుబద్ధమైన జవాబు చెప్పలేరు.
క్రితం ఆదివారం ఈ .. టీవీలో..
ఆండాళ్ అమ్మవారి చరిత్ర ( శ్రీ గోదాదేవి శ్రీ రంగనాధుల కల్యాణం ) ప్రసారమయ్యింది.
ఆ కధలో, ఒక రాజుగారు నాస్తికులు.
ఆ రాజు , ఆస్తికులను , దైవం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు.
సృష్టికర్త అయిన దైవాని కంటే ముందు ఏమున్నది ? అనే అర్ధం వచ్చేటట్లు ప్రశ్న అడుగుతారు.
అప్పుడు , ఆండాళ్ మాతకు తండ్రి అయిన విష్ణుచిత్తుల వారు రాజుతో , ఒకటి అనే అంకెకు ముందు ఉన్న అంకె పేరు చెప్పమంటారు.
అప్పుడు రాజు చెప్పలేకపోతారు. ( ఒకటి అనే అంకెకు ముందు ఏ అంకె లేదు కదా ! )
విష్ణుచిత్తుల వారు చెప్పిన విషయములో ఎన్నో విషయములు ఉండి ఉంటాయి. అవన్నీ నాలాంటి సామాన్యులకు అర్ధం కాకపోయినా ....నాకు తోచినంతలో కొన్ని అభిప్రాయాలు...
ఒకటి అనే అంకెకు ముందు ఏ అంకె లేదు. అలాగే,
దైవాన్ని ఎవరూ సృష్టించనవసరం లేదు. దైవం నిత్యం. దైవానికి ఆది అంతమూ లేదు. అని చెప్పటం విష్ణుచిత్తుల వారి అభిప్రాయం కావచ్చు . అనిపిస్తోంది .
...............................
సంఖ్యలలో ఆఖరి సంఖ్య ఏది ? అనే ప్రశ్నకు కూడా మనకు జవాబు తెలియదు.
ఎందుకంటే, సంఖ్యలను అలా లెక్కవేసుకుంటూ వెళ్తే ఒకదానితరువాత ఒకటి అంతం లేకుండా అలా వస్తూనే ఉంటాయి కదా !
............................
దైవానికి ఆది, అంతమూ అనేవి లేవు . అని కూడా మనకు తెలుస్తుంది.
ఆది, అంతమూ లేక అంతటా వ్యాపించి ఉన్న శక్తినే దైవమని ఆరాధిస్తారు. ఆస్తికులు.
............................
అసలు ప్రతిదానికి ఆది , అంతమూ ఉంటుందని , ఉండాలని మనం ఎందుకు అభిప్రాయపడాలి ?
సృష్టిలో మనకు తెలిసిన విజ్ఞానం సముద్రంలో నీటిబొట్టంత అయితే, మనకు తెలియని విజ్ఞానం సముద్రమంత, ఇంకా ఎక్కువ కూడా.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
...............................
రామకృష్ణపరమహంస శారదాదేవిల శిష్యులైన వివేకానందుని జయంతి , జనవరి 12 న .
గోదారంగనాధుల కల్యాణం, జనవరి 13 న. ( భోగి పండుగ).
సంక్రాంతి, అయ్యప్ప స్వామి మకరజ్యోతి దర్శనం ..జనవరి 14 న.
అందరికి శుభాకాంక్షలు.
good
ReplyDelete