koodali

Wednesday, January 16, 2013

పేర్లు ఎన్నయినా దైవం ఒక్కటే........... మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు .......


గవంతుని నమ్మే వాళ్ళందరూ   తాము పూజిస్తున్న దైవం విశ్వాన్ని సృష్టించారని  నమ్ముతారు. అంటే , ప్రపంచంలో ఉన్న అందరు మానవులనీ  తాము నమ్ముతున్న దైవమే సృష్టిస్తారని నమ్ముతాము.

అలాంటప్పుడు మన ప్రక్కవాళ్ళు కూడా ఆ దైవం సృష్టించిన వాళ్ళే కదా ! వారియందు మనకు భేద భావం ఎందుకు ?

సూర్యుడు, చంద్రుడు ప్రపంచంలో ఒక్కరే.  అయితే, 


సూర్యుని కొందరు సన్ అంటారు, కొందరు సూర్యుడు అంటారు. అలాగే చంద్రుని కొందరు మూన్ అంటారు, కొందరు చంద్రుడు అంటారు.


* ఎవరు ఏ పేరుతో పిలిచినా మానవులందరికీ ' చంద్రుడు ' ఒక్కరే. మానవులందరికీ ' సూర్యుడు ' ఒక్కరే.  అలాగే
ఎవరు ఏ పేరుతో పిలిచినా మానవులందరికీ  దైవం  ఒక్కరే.
 

చంద్రుని, సూర్యుని అన్ని మతములవారు వారివారి పధ్ధతులలో పూజించుకుంటారు.


ముస్లిం మతస్తులు ,రంజాన్ పండుగ సమయాలలో చంద్రోదయానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. హిందూ మతస్తులు , పండుగ సమయాలలో, పూజలలో చంద్రునికి ఇంపార్టెన్స్ ఇస్తారు .

మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు .


అలాగే మా సూర్యుడు మాత్రమే గొప్ప.... అని కొందరు  అంటే ........ మా సన్ మాత్రమే గొప్ప.... అని కొందరు  అంటూ   వాదించుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది.

ఎందుకంటే సూర్యుడు , చంద్రుడు ఎవరికయినా ఒకటే కదా.


అలాగే మానవులందరూ ' దైవం ' ' మతం ' విషయాలలో ఎవరి ఆచారాలను వారు పాటించుకుంటూ ......ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ........... ఇతరుల మతములను గౌరవిస్తూ,  గొడవలు లేకుండా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు.


  ఏకత్వంలోనే భిన్నత్వం............భిన్నత్వంలోనే ఏకత్వం అన్న మాట..


 అంటే,   ఒకే దైవంలో అన్ని దేవుళ్ళరూపాలను   దర్శించగలగటం...........అన్ని దైవరూపాలలోనూ ఒకే దైవాన్ని దర్శించగలగటం ..అన్నమాట. 


పైన  వ్రాసిన  విషయాలలోని   కొన్ని  విషయాలు   ఇంతకు  ముందు   వేసినవే.
.............


అయితే,    మరికొన్ని  అభిప్రాయాలను  కూడా  చెప్పాలనిపించి  వ్రాస్తున్నాను.

ప్రపంచంలో ఎన్నో  రకాల  ప్రాంతాలున్నాయి.   వివిధ  రకములైన  వాతావరణపరిస్థితులున్నాయి.   వాటిని  బట్టి,  ప్రజలలో  వివిధరకములైన  ఆచారవ్యవహారాలున్నాయి.  దైవం  ఒకరే  అయినా,   ఒకే  దైవాన్ని  ఎవరి  పద్ధతిలో  వారు   భావించి,   ఆరాధించుకుంటారు.  కొందరు  నిరాకారంగా  ఆరాధిస్తే ,  కొందరు  సాకారంగా   భావించి  దైవాన్ని   ఆరాధిస్తారు. 

అన్ని మతాలలోనూ  ఎందరో  పేదవాళ్ళున్నారు.  అన్ని  మతాలవారు  ఒకరితో  ఒకరు  గొడవలు  పడటం  మాని,  తమ  మతాలలోని  పేదవారి  కష్టాలను  తీర్చగలిగే  విధంగా   చర్యలు  చేపడితే  ఎంతో బాగుంటుంది.  మానవసేవే  భగవంతుని సేవ  అని  కూడా  చెబుతున్నాయి   కదా  !  అన్ని మతాలు.
 
 
 ఏ మతం వారైనా,  మతాల పేరుతో  ...ఇతర మతస్తుల పట్ల అన్యాయంగా ప్రవర్తించటం, బాధపెట్టటం తప్పు.



6 comments:

  1. వనజవనమాలి గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  2. "పేర్లు ఎన్నయినా దైవం ఒక్కటే" - కాని దైవాన్ని చేరటానికి మనము అరాధించుకొనే రూపాన్ని బట్టి మార్గాలు వేరు అయి వుండవచ్చు కదా.

    వంశీ కృష్ణ

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నిజమేనండి. మార్గాలు వేరైనా గమ్యమొక్కటే.

      Delete
  3. మతం అంటే ఆలోచనా విధానం అని అర్ధం. దీనిని పట్టుకుని మనుషుల్ని రెచ్చకొట్టి పబ్బం గడుపుకుంటోంది రాజకీయం. అది గుర్తించలేకపోతున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మీరు చెప్పినది కూడా నిజమే.

      Delete