ఈ సినిమాలో ఇద్దరు సోదరులు నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు.
ఈ అన్నదమ్ములు ఉపాధి కోసం పట్నం వెళ్ళి , అక్కడ ఉపాధి దొరకక బాధ పడుతుంటారు. సరైన ఉపాధి లేక వాళ్ళ బాధ వాళ్ళు పడుతుంటే , ఏం పని చేస్తున్నావు ? అంటూ ఇతరులు వాళ్ళను పదేపదే పరామర్శిస్తుంటారు .
నాకేమనిపించిందంటే , ఈ అన్నదమ్ములు పట్నంలో ఉపాధి దొరకలేదని బాధపడటం కన్నా, తాము ఉన్న పల్లెలోనే సొంత పోలంలోనో లేక కౌలుకు తీసుకున్న పోలంలోనో చక్కగా వ్యవసాయం చేసి , మంచి దిగుబడులను సాధించి , నలుగురికీ ఆదర్శంగా ఉండవచ్చు కదా ! అనిపించింది. లేకపోతే, కొందరు నిరుద్యోగులు కలిసి లోన్ తీసుకుని , వాళ్ళు చదువుకున్న చదువుకు సంబంధించిన విధంగా ఉపాధికోసం ప్రయత్నించవచ్చు. ( అయితే, లోన్ దొరకటం వంటి విషయాలు అంత తేలిక కాదు....)
................
ఈ అన్నదమ్ములు ఉపాధి కోసం పట్నం వెళ్ళి , అక్కడ ఉపాధి దొరకక బాధ పడుతుంటారు. సరైన ఉపాధి లేక వాళ్ళ బాధ వాళ్ళు పడుతుంటే , ఏం పని చేస్తున్నావు ? అంటూ ఇతరులు వాళ్ళను పదేపదే పరామర్శిస్తుంటారు .
నాకేమనిపించిందంటే , ఈ అన్నదమ్ములు పట్నంలో ఉపాధి దొరకలేదని బాధపడటం కన్నా, తాము ఉన్న పల్లెలోనే సొంత పోలంలోనో లేక కౌలుకు తీసుకున్న పోలంలోనో చక్కగా వ్యవసాయం చేసి , మంచి దిగుబడులను సాధించి , నలుగురికీ ఆదర్శంగా ఉండవచ్చు కదా ! అనిపించింది. లేకపోతే, కొందరు నిరుద్యోగులు కలిసి లోన్ తీసుకుని , వాళ్ళు చదువుకున్న చదువుకు సంబంధించిన విధంగా ఉపాధికోసం ప్రయత్నించవచ్చు. ( అయితే, లోన్ దొరకటం వంటి విషయాలు అంత తేలిక కాదు....)
................
ఈ రోజుల్లో బయట సమాజంలో కూడా ఎందరో యువకులు నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇంట్లోని తల్లితండ్రులు , అయ్యో ! ఇంకా ఉద్యోగం రాలేదా ? అంటూ బాధపడుతుంటారు.
బయట వాళ్ళు , ఏం చేస్తున్నావురా ? ఇంకా పని దొరకలేదా ? అని పరామర్శిస్తుంటారు .
ఈ బాధలు పడలేక, ఎందరో యువకులు ఏదో ఒక పట్నం చేరి గదులు అద్దెకు తీసుకుని, చిన్న ఉద్యోగం దొరికినా చాలనుకుని, సరిగ్గా తినీతినకా ఉద్యోగాన్వేషణలో తిరుగుతూ అలసిపోతుంటారు.
కొందరు తల్లితండ్రులు కూడా పిల్లలతో, ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావు ? ఎక్కడికయినా పోయి పని వెదుక్కో ... అని అంటారు..
ఇంటా, బయటా ఈ పోరు పడలేక విరక్తితో కొందరు యువకులు మత్తుపదార్ధాలకు అలవాటుపడటం, కొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు ..వంటివి చేసే అవకాశం ఉంది.
కొంత కాలం క్రిందట, కూరలను అమ్మే ఒకామె తన ఇంటి విషయాలను చెప్పింది.
వాళ్ళ కొడుకు ఇంజనీరింగ్ చదివాడట. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరకక, ఇంట్లోనే ఉన్నాడట.
ఇంట్లోనే ఖాళీగా ఉండకపోతే, ఎక్కడికయినా వెళ్ళి ఉద్యోగం సంపాదించవచ్చు కదా ! అని తల్లి అబ్బాయిని కోప్పడిందట.
కొడుకును కోప్పడినందుకు బాధపడుతూ ఆ వివరాలన్నీ నాతో చెప్పి బాధపడింది.
ఇప్పుడు ప్రపంచమంతటా నిరుద్యోగ సమస్య ఉంది. అబ్బాయి ఏం చేయగలడు ? కొన్నాళ్ళు ఇంట్లో ఉంటే తప్పేమిటి ? నెమ్మదిగా ఉద్యోగం దొరుకుతుందిలే, పిల్లవాడిని కోప్పడవద్దని నేను ఆమెను మందలించాను.
ఇవన్నీ చూస్తుంటే, పూర్వకాలంలో ఇంత నిరుద్యోగ సమస్య ఉండేదికాదేమో ? అనిపిస్తుంది.
పూర్వం పిల్లలు తమకు పరంపరగా వస్తున్న వృత్తివిద్యలలోని మెళకువలను పెద్దవాళ్ళ వద్దే నేర్చుకుని ఉపాధిని పొందేవారు.
అప్పటి వాళ్ళకు , ఇప్పటిలా చిన్నతనం నుంచి మార్కుల కోసం, తరువాత ఉద్యోగం కోసం ఇతరులమీద ఎక్కువగా ఆధారపడే అవసరం ఉండేదికాదేమో అనిపిస్తుంది.
పూర్వపు రోజుల్లో విద్య, ఉపాధి వంటివి వ్యక్తుల చేతులలో ఉండేవి. ఇప్పుడు విద్య కోసం , ఉపాధి కోసం కొన్ని సంస్థలపై ఆధారపడవలసి వస్తోంది. ఇప్పటి వాళ్ళకు ఉద్యోగభద్రత కూడా తక్కువే.
ఈ రోజుల్లో యంత్ర వినియోగం అతిగా పెరిగిపోవటం కూడా నిరుద్యోగం పెరిగిపోవటానికి ఒక ముఖ్యమైన కారణమనిపిస్తుంది.
అంటే, కొన్ని కష్టమైన పనులకు యంత్రాల వినియోగం అవసరమే కానీ, నిరుద్యోగసమస్య పెరిగిపోయేంతగా మితిమీరిన యంత్రవినియోగం అనవసరం. అనిపిస్తుంది.
అన్ని పనులను యంత్రాలే చేసేస్తే, ఇక మనుషులకు చేయటానికి పనేముంటుంది ?ఇలాంటప్పుడు నిరుద్యోగం పెరుగుతుంది.
........................................
పెద్దవాళ్ళ ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉన్న నిరుద్యోగులైన యువకులు కొందరు కలిసి నగరాల్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, కుక్కర్లో అన్నం వండుకుని , బయట నుంచి వండిన కూరలను కొనుక్కుని తింటూ కాలం గడుపుతారు. ఈ యువకులు కూడా ఉద్యోగం లేకుండా ఎక్కువకాలం గడపాలంటే తల్లితండ్రి వద్ద డబ్బు అడగటానికి సిగ్గుపడి , తినితినకా ఉద్యోగాన్వేషణలో తిరుగుతుంటారు.
ఇక తల్లితండ్రి యొక్క ఆర్ధిక పరిస్థితి సరిగ్గాలేని యువకులు చిన్న గదులను అద్దెకు తీసుకుని ఒకే ఇరుకు గదిలో 10 మంది వరకూ ఉంటూ, తినితినకా ఉద్యోగాన్వేషణలో తిరుగుతుంటారు.
ఇలా ఈ రోజుల్లో ఎందరో యువకులు నిరుద్యోగ సమస్యతో బాధలు పడుతున్నారు.
సమాజంలో నిరుద్యోగం వంటి సమస్యలకు పరిష్కారాలను సీరియస్ గా ఆలోచించి చర్యలు తీసుకునే శ్రద్ధ ,సహనం ,సమయం ఎక్కువమంది మేధావులలో కనిపించకపోవటం బాధాకరం.
అందుకే అన్నారు కులవృత్తి దైవం తో సమానం అని.
ReplyDeleteరోజు రోజు కి వృత్తుల మధ్య అసమానతలు ఎక్కువైపోతుంటే ఇంకెవరు చేస్తారు కులవృత్తి.
ఒకప్పుడు తాత నుండి తండ్రి కి, తండ్రి నుండి కొడుక్కి కొన్ని వృత్తులు, పనులు transfer అవుతూ ఉండేవి.
ఈ రోజుల్లో అవేక్కడున్నాయి.
:venkat.
* మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Delete* నిజమేనండి, తాత నుండి తండ్రి కి, తండ్రి నుండి కొడుక్కి .. విద్యలోని రహస్యాలను కూడా అందించేవారంటారు.. అలా వారి వృత్తిలో నైపుణ్యం పెరిగేది. చేతి వృత్తులు వంటి వాటిలో చక్కటి నైపుణ్యం గలవారెందరో ఆ రోజుల్లో ఉండేవారట.
* ఈ రోజుల్లో అయితే, సినిమారంగం , రాజకీయాల్లో కొందరి విషయంలో వారసత్వం కొనసాగుతోంది.
* కొందరు వైద్యులు కూడా పెద్ద ఆస్పత్రులను కట్టుకుంటారు. ఇలాంటివారు తమ తరువాత ఆ ఆసుపత్రిని నిర్వహించటానికి వీలుగా తమ పిల్లలను కూడా వైద్యులుగా చేస్తారు. ( పిల్లలకు వైద్యశాస్త్రం చదవటం ఇష్టం ఉన్నా లేకపోయినా.)
* మరికొందరు వ్యాపారస్తులు కూడా తమ తరువాత కూడా తమ వ్యాపారం చక్కగా కొనసాగటానికి వీలుగా తమ పిల్లలను అదే రంగంలోకి తీసుకువస్తారు.
* రైతులు కూడా తమ వ్యవసాయభూమిని తరువాతి తరానికి అప్పగించేవారు. అయితే, ఈ రోజుల్లో రైతులకు వ్యవసాయంలో గిట్టుబాటు ధర లభించక నష్టాలు వస్తుండటం వల్ల , వారి పిల్లలు వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాలను ఉపాధిగా ఎంచుకుంటున్నారు.
its true
ReplyDelete* మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Delete