koodali

Monday, January 28, 2013

హోదాను బట్టి మాత్రమే గౌరవమా....


*  ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
....................... 


కొన్ని  సంవత్సరాల  క్రిందట  జరిగిన  విషయమిది. 

 ఒక  భాషను  నేర్చుకోవాలని  భావించి , ఒక  గొప్ప   సంస్థలో   జాయిన్  అయ్యాను. 

(  అయితే, కొద్దికాలం  మాత్రమే  వెళ్ళాను. పూర్తిగా  నేర్చుకోలేదండి.)

  కొత్తగా చేరిన  విద్యార్ధినీ  విద్యార్ధులకు  అక్కడి  హాల్ లో  పరిచయ  సభను  నిర్వహించారు. ఉపాధ్యాయులను , ఇతర   స్టాఫ్ ను   స్టూడెంట్స్ కు  పరిచయం  చేస్తున్నారు. 


 ఒక్కొక్కరు   స్టేజ్  మీదకు  వచ్చి  తమ  గురించిన  వివరాలను  చెబుతున్నారు.  ఒక్కొక్కరి  పరిచయాలు  జరుగుతుంటే  నూతనంగా  చేరిన   స్టూడెంట్స్  చప్పట్లు  కొడుతున్నారు.  


ఇలా  అక్కడి  స్టాఫ్ ను  స్టూడెంట్స్ కు  పరిచయం  చేస్తూ,  అక్కడి  వాచ్ మన్ ను  కూడా   స్టేజ్  పైకి  పిలిచి   అతని  పేరు  చెప్పి  పరిచయం  చేసారు. 

(  ఈ  సంస్థ  చాలా  గొప్పది.  ఇక్కడ  పేద,  ధనిక  అనే తారతమ్యం లేదు. ) 


అప్పటి  వరకు  ప్రతి  ఒక్కరి  పరిచయానికి  క్లాప్స్  కొట్టిన  స్టూడెంట్స్ , వాచ్ మన్  యొక్క   పరిచయం   తరువాత   క్లాప్స్  కొట్టలేదు.  నిశ్శబ్దంగా  ఊరుకున్నారు. 



 నేను  క్లాప్స్  కొట్టబోయి  ఆగిపోయాను.  అంతా  నిశ్శబ్దంగా  ఉన్నప్పుడు ,  నేను   చప్పట్లు  కొడితే  బాగుండదేమోననే  సంశయంతో  ఆగిపోయాను.  


అయితే,  తరువాత  చాలాకాలం  ఈ  విషయం  నన్ను  ఆలోచింపజేసింది.


  ఎవరు  క్లాప్స్  కొట్టకపోయినా  , నేను  క్లాప్స్  కొట్టి  ఉండవలసింది. అనిపించింది. 


అందరికి  క్లాప్స్  చేసి,  వాచ్ మన్  పరిచయం  అప్పుడు    క్లాప్స్  కొట్టకపోవటం  వల్ల ,  ఆ  వాచ్ మన్  ఎంత  చిన్నతనంగా  ఫీలయ్యారో  కదా  !  అనిపించింది. 

(  బహుశా  నా  లాగే   మిగతా  స్టూడెంట్స్  కూడా   క్లాప్స్  కొట్టబోయి  సంశయంతో   ఊరుకున్నారేమో ? తెలియదు...)


  సమాజంలో  పెద్ద  స్థాయిలో  ఉన్నవారిని,  చిన్న  స్థాయిలో  ఉన్నవారిని  చూసే  విధానంలో  ఎంతో  భేదం  ఉంటోంది.  ఇది  ఎందుకో  అర్ధం  కాదు. 



 డబ్బు,  చదువు,  హోదా, ...... ఎక్కువగా   ఉన్నవారిని  ఎక్కువగా  గౌరవిస్తున్నాం.  ఇవి  తక్కువగా  ఉన్నవారంటే  చిన్నచూపు  చూస్తున్నాం. 


ఇలా  కాకుండా ,  తక్కువ  డబ్బు,  తక్కువ  చదువు,  తక్కువ  హోదా .... ఉన్నవారిని  కూడా    గౌరవించటమనేది  సరైన  పద్ధతి. 

అందరినీ  సమానంగా  గౌరవించాలి.  చిన్న  వృత్తి,  గొప్ప  వృత్తి  అనే  భేదాలు  ఉండవు. న్యాయంగా  చేసే  ఏ వృత్తి  అయినా  గొప్పదే. 

డబ్బు,  చదువు,  హోదాలను  బట్టి  కాకుండా ,  వ్యక్తుల  యొక్క    వ్యక్తిత్వాలను  బట్టి  వారిని  గౌరవించటమనేది  మంచి  పద్ధతి.



10 comments:

  1. Ikkada mee topic ki sambandhinchina inko vishayam cheptanu. Manalo chalamandi evaina function attend chesepudu aa pilichina vari hodani batti gift kontu untam. Dabbunna vari function ki tahatu lekapoyina khareedaina gift, peda varinti chavuka gift tesukeltam. Kanee nijaniki aa goppinti variki mana gift oka lekkaloki kuda radu. Ade gift pedavariki iste varu danni ento apurupamga padi kalalu dachukuntaru. Nenu chala kalam ee tappu chesanu. Konnella kritam jarigina oka sangathana valla kallu teruchukunnayi.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి , ధనవంతులకు తీసుకెళ్ళే గిఫ్ట్ వారికి ఒక లెక్కలోకి కూడా రాదు. అదే గిఫ్ట్ పేదవారికి ఇస్తే ఎంతో ఉపయోగపడుతుంది.

      Delete
  2. అయ్యో! బంధువులలోనే ఉందండీ ఈ తేడా.కలిగిన బంధువులొస్తే కార్యక్రమానికి, మనతో మాట్లాడుతున్న వారు, మనతో ఒక మాట కూడా చెప్పకుండా వారి వెనక వెళ్ళిపోయి, మన ముఖం కూడా చూడని సంఘటనలు నాకే జరిగాయి. మనవాళ్ళుత్త.....గిరీశం చాలా అలోచించే అన్నాడండీ.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి బంధువుల మధ్య కూడా హోదాలను బట్టి గౌరవించటం జరుగుతోంది. బంధువులు కూడా ఇలా ప్రవర్తించటం ఎంతో బాధాకరమైన విషయం.




      Delete
  3. ఇది సహజమే కదా! పిల్లలకు 'బాగా చదువుకొని ఏ ఇంజినీరో, డాక్టరో అవ్వాలి' అని చెబుతారు; బాగా చదువుకొని 'వాచ్‌మాన్' కమ్మని చెప్పరు కదా!

    సమాజంలో ప్రతిదానికీ ఒక విలువ ఉంటుంది. MBBS చదువుకోవడం గొప్పే కావచ్చు కానీ అదే MBBS చదివిన వ్యక్తికి - MS, MD, FRCS, Ph.D. పట్టాలు ఉన్న డాక్టర్లు పాల్గొంటున్న కాన్ఫరెన్స్‌లో తనను తాను 'ఉత్తి MBBS' అని చెప్పుకోవడం నామోషీయే కదా!

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి . పెద్దవాళ్ళు పిల్లలకు 'బాగా చదువుకొని ఏ ఇంజినీరో, డాక్టరో అవ్వాలి' అని చెబుతారు;

      అయితే, ఎంత ప్రయత్నించినా , పరిస్థితులు కలిసిరాక, అవకాశాలు అనుకూలించక తక్కువ హోదాలో ఉన్నప్పుడు నామోషిగా ఫీలవ్వటం కన్నా, ఉన్నంతలో జీవితాన్ని చక్కగా గడపటమే మంచిది.

      పేదవాళ్ళలో కూడా ఉన్నంతలో తృప్తిగా , సంతోషంగా జీవించేవాళ్ళున్నారు. ధనం, చదువు, హోదా ఉన్నవాళ్ళలో కూడా ఎప్పుడూ ఏదో దిగులుతో కుమిలిపోయేవాళ్ళూ ఉంటారు.

      Ph.D. చదివిన వారికి కూడా అంతటితో తృప్తి ఉండకపోవచ్చు. వారు తమకన్నా ఎక్కువ ధనం, అధికారం ఉన్న ఇతరులను చూసి నామోషిగా ఫీలవుతారు.

      ఇతరులతో పోల్చుకుని బాధపడటం మొదలుపెడితే దానికి అంతం అనేది ఉండదండి.

      ఈ రోజుల్లో , చిన్నపిల్లల మధ్య చదువుల పోటీ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు టార్గెట్ల పోటీ, దేశాల మధ్య ఆయుధ పోటీ ...... ఈ పోలికలు, పోటీల పరుగుపందేల వల్ల అందరికి మనశ్శాంతి కరువవుతోంది. మనశ్శాంతి కోసమే కదా. అందరూ ఆరాటపడేది.

      అభివృద్ధి కోసం , పోలికలు, పోటీలు కొంతవరకు అవసరమే కానీ, మితిమీరితే నష్టాలే.
      ........................................

      ఎక్కువ డబ్బు, చదువు, హోదా ఉంటే , ఎక్కువ సుఖసంతోషాలు కలుగుతాయని చాలామంది భావిస్తారు. అయితే, సుఖసంతోషాలన్నవి డబ్బు..........ద్వారా లభించేవి కావు.

      రావణాసురుడు ధనం , పాండిత్యం , అధికారం ఉన్నవాడే. అయినా అతనికి మనశ్శాంతి లేదు. అతనికి ఉన్న ధనం , పాండిత్యం , అధికారం...... వంటివేమీ అతని వంశనాశనాన్ని ఆపలేకపోయాయి.
      .................................................

      సత్ప్రవర్తన ద్వారా దైవానుగ్రహం పొందినవారికే సుఖసంతోషాలు లభిస్తాయి ......అనే సత్యం తెలుసుకున్న వ్యక్తులు దైవానుగ్రహం కోసం తాపత్రయపడతారు.

      డబ్బు, చదువు, అధికారం ఉన్నంత మాత్రాన దైవానుగ్రహం లభించదు. ఇవేమీ లేని సామాన్యులెందరో దైవానుగ్రహాన్ని పొందగలిగారు.

      దైవానుగ్రహం పొందటానికి గల అర్హతలు నిర్మలమైన భక్తి, సత్ప్రవర్తన. ఇలాంటి మహాభక్తుల కధలెన్నింటినో పెద్దలు తెలియజేసారు. ఇలాంటి మహనీయులకు ఎక్కువగా డబ్బు, చదువు, అధికారం వంటివి లేకపోయినా సమాజం వారిని గొప్పవాళ్ళుగా గుర్తించి, గౌరవించింది.

      జీవితంలో సుఖసంతోషాలను పొందాలంటే , సత్ప్రవర్తన ద్వారా దైవానుగ్రహాన్ని పొందాలి. దైవానుగ్రహాన్ని పొందిన వారికి అన్నీ లభిస్తాయి అనిపించిందండి.

      Delete
  4. ఇతరులతో పోల్చుకుని బాధపడటం మొదలుపెడితే దానికి అంతం అనేది ఉండదండి.
    ------------------------------------------------------
    anrd గారు ఎంత చక్కగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసాను. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.

      Delete
  5. మంచి విషయాన్ని చెప్పారు anrd గారు. మన మనసులలో అనాదిగా నాటుకుపోయిన సంశయత్వం ఇలా వేధిస్తుంది. సమానత్వం అందరిపట్ల చూపాల్సిన అవసరాన్ని తెలియజెప్పారు.. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసాను. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి.

      Delete